AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

సైన్స్ & టెక్నాలజీ Science & Technology పృథ్వీ-2 క్షిపణి విజయవంతం

పృథ్వీ-2 క్షిపణి విజయవంతం

పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ఫిబ్రవరి 19, 2015 ఉదయం 9.20 నిమిషాలకు రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ మిస్సైల్ 350 కి.మీ.ల దూరంలోని (ఉపరితలం ఉంచి ఉపరితలంలోని) లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. 500 నుంచి 1000 కిలోల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ద్రవ ఇంధనంతో పనిచేసే మిస్సైల్ డబుల్ ఇంజిన్‌తో లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. స్టాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంమైందని ఐటీఆర్ డెరెక్టర్ ఎంవీకేవీ. ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్‌డీఓ) పర్యవేక్షించింది. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పృథ్వీ-2 క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. పృథ్వీ-2 క్షిపణిని చివరిసారిగా నవంబరు 14, 2014న విజయవంతంగా ప్రయోగించారు.

భారతదేశ ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి డీఆర్‌డీఓ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది. ఐజీఎమ్‌డీపీ (ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)లో భాగంగా 1983లో క్షిపణుల తయారీకి శ్రీకారం చుట్టింది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన తొలి క్షిపణి పృథ్వీ. అణు ఆయుధాలను మోసుకెళ్లగలగడం ఈ క్షిపణుల ప్రత్యేకత. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే భారత త్రివిధ దళాల అమ్ముల పొదిలో చేరాయి.
 
క్షిపణి పేరుఅణ్వస్త్ర సామర్థ్యంబరువులక్ష్యం ఛేదించే దూరం
1. పృథ్వీ-1:1000 కిలోలు4,400150 కి.మీ.
2. పృథ్వీ-2:1000 కిలోలు4,600350 కి.మీ.
3. పృథ్వీ-3:1000 కిలోలు5,600350 కి.మీ.


No comments:

Post a Comment