AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients ఫిలింఫేర్ అవార్డులు

ఫిలింఫేర్ అవార్డులు

హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్)లో నటీనటులు, దర్శకులు, సాంకేతిక బృందాలను ప్రోత్సహించేందుకు 'ది టైమ్స్ గ్రూప్' ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ప్రతి ఏడాది హిందీలో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డులను తొలిసారిగా 21 మార్చి, 1954లో ముంబయిలోని మెట్రో థియేటర్లో ప్రదానం చేశారు. తాజాగా 2014సంవత్సరానికి గాను 60వ ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

60 వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు 
ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (హైదర్)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (క్వీన్)
ఉత్తమ చిత్రం : క్వీన్ 
ఉత్తమ దర్శకుడు : వికాస్ భల్ (క్వీన్)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : అభిషేక్ వెర్మన్ (2 స్టేట్స్)
ఉత్తమ తొలి చిత్ర నటుడు : ఫవాద్ అఫ్జల్ ఖాన్ (ఖూబ్సూరత్)
ఉత్తమ తొలి చిత్ర నటి : కృతి సనన్ (హీరోపంతి)
విమర్శకులు ఎంపిక చేసిన ఉత్తమ చిత్రం : ఆంఖో దేఖీ
విమర్శకులు ఎంపిక చేసిన ఉత్తమ నటుడు : సంజయ్ మిశ్రా (ఆంఖో దేఖీ)
విమర్శకులు ఎంపిక చేసిన ఉత్తమ నటి : ఆలియా భట్ (హైవే)
జీవిత సాఫల్య పురస్కారం : కామినీ కౌషల్
ఉత్తమ సంభాషణలు : అభిజత్ జోషి, రాజ్కుమార్ హిరానీ (పీకే)
ఉత్తమ కథనం (స్క్రీన్ ప్లే) : అభిజత్ జోషి, రాజ్కుమార్ హిరానీ (పీకే)
ఉత్తమ కథ : రజత్ కపూర్ (ఆంఖో దేఖీ)
ఉత్తమ సహాయ నటుడు : కే కే మీనన్ (హైదర్)
ఉత్తమ సహాయ నటి : టబు (హైదర్)
ఉత్తమ గేయ రచయిత : రష్మీసింగ్ (ముస్కురానే - సిటీ లైట్స్)
ఉత్తమ సంగీత దర్శకుడు : శంకర్ ఎహసాన్ లాయ్ (2 స్టేట్స్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : అంకిత్ తివారీ (గలియాన్ - ఏక్ విలన్)
ఉత్తమ నేపథ్య గాయని : కనికా కపూర్ (బేబీ డాల్ - రాగిణి ఎమ్మెమెస్ 2)
ఉత్తమ నేపథ్య సంగీతం : అమిత్ త్రివేది (క్వీన్)
ఉత్తమ ఛాయాగ్రహణం : బాబీ సింగ్, సిద్ధార్థ్ దివాన్ (క్వీన్)
ఉత్తమ ఎడిటింగ్ అవార్డు : అభిజిత్ కోకటే, అనురాగ్ కశ్యప్ (క్వీన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు : డాలీ అహ్లువాలియా (హైదర్)


No comments:

Post a Comment