AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు
చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి, విశేష కృషిచేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులతో పాటు ఇతర అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. వాటిలో రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్.టి.ఆర్. జాతీయ చలనచిత్ర అవార్డు, బి.ఎన్.రెడ్డి అవార్డు, అక్కినేని నాగేశ్వరావు జాతీయ అవార్డులు ముఖ్యమైనవి. జాతీయ స్థాయిలో, అన్ని ప్రాంతీయ భాషల్లో చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి అందిస్తారు.

ఎన్.టి.ఆర్. జాతీయ చలనచిత్ర అవార్డు: జాతీయ చలనచిత్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. చలనచిత్ర రంగంలో అసాధారణ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు మీదుగా రాష్ర్ట ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయలు బహుకరిస్తారు. ప్రథమ గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు. నంది అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగానే దీనిని అందచేస్తారు.

అవార్డు గ్రహీతలు:
సంవత్సరంగ్రహీత
1996అక్కినేని నాగేశ్వర రావు
1997దిలిప్ కుమార్
1998శివాజీ గణేషన్
1999లతా మంగేష్కర్
2000భానుమతి రామకృష్ణ
2001రిషికేష్ ముఖర్జీ
2002డా.రాజ్‌కుమార్
2003ఘట్టమనేని కృష్ణ
2004ఇళయరాజా
2005నూతన్ ప్రసాద్, అంబరీష్
2006వహీదా రెహ్మాన్
2007దాసరి నారాయణ రావు
2008జమున
2009బి. సరోజాదేవి
2010శారద
2011అమితాబ్ బచ్చన్
2012ద్వారకిష్, మాలశ్రీ
2013మనోజ్ దాస్

రఘుపతి వెంకయ్య అవార్డు: తెలుగు చలనచిత్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. చిత్ర పరిశ్రమలో మార్గదర్శకుడు రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీదుగా రాష్ర్ట ప్రభుత్వం 1980లో ఈ అవార్డును ప్రవేశపెట్టింది. అవార్డు కింద ఒక బంగారు నంది, బంగారు పతకం రూ. 50,000 నగదును బహుకరిస్తారు. దీనిని కూడా నంది అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగానే అందచేస్తారు. మొదటి అవార్డు గ్రహీత ఎల్.వి. ప్రసాద్.

అవార్డు గ్రహీతలు:
సంవత్సరంగ్రహీత
1980ఎల్.వి. ప్రసాద్
1981పి.పుల్లయ్య(దర్శకుడు, నిర్మాత)
1982బి.ఎ.సుబ్బారావు(నిర్మాత)
1983ఎం.ఎ.రహమాన్
1984కొసరాజు రాఘవయ్య చౌదరి
1985భానుమతి(నటి, నిర్మాత, గాయకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత)
1986బాపు - రమణ
1987బి.నాగిరెడ్డి(నిర్మాత)
1988డి.వి.ఎస్. రాజు
1989అక్కినేని నాగేశ్వర రావు
1990దాసరి నారాయణ రావు(నటుడు, నిర్మాత, దర్శకుడు)
1991కె.విశ్వనాథ్(దర్శకుడు, నటుడు)
1992ఎస్.రాజేశ్వర రావు
1993దుక్కిపాటి మధుసూదన రావు(నిర్మాత)
1994అంజలీ దేవి(నటి)
1995కె.ఎస్.ప్రకాశరావు
1996ఇంతూరి వెంకటేశ్వర రావు
1997బి.మధుసూదనరావు
1998గుమ్మడి
1999శాంతకుమారి
2000టి.ఎల్.కాంతారావు
2001అల్లు రామలింగయ్య
2002పి.సుశీల(నేపథ్య గాయని)
2003వి.బి.రాజేంద్ర ప్రసాద్
2004కృష్ణవేణి
2005ఎం.ఎస్.రెడ్డి(నిర్మాత, దర్శకుడు, రచయిత)
2006డి.రామనాయుడు
2007తమ్మారెడ్డి కృష్ణమూర్తి
2008విజయనిర్మల(నటి, నిర్మాత, దర్శకురాలు)
2009కె.రాఘవ(నిర్మాత)
2010ఎం.బాలయ్య(నటుడు, నిర్మాత, దర్శకుడు)
2011కైకాల సత్యనారాయణ

అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా రాష్ర్ట ప్రభుత్వం ఈ అవార్డును నెలకొల్పింది. జాతీయ చలనచిత్ర రంగానికి విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు బహుకరిస్తారు. తాజాగా 2011 సంవత్సరానికి బాలీవుడ్ నటి హేమమాలినికి ఈ అవార్డు బహుకరించారు.

అవార్డు గ్రహీతలు:
సంవత్సరంగ్రహీత
2005దేవానంద్(హిందీ నటుడు)
2006షబానా అజ్మీ(నటి, సామాజికి కార్యకర్త)
2007అంజలీ దేవి(నటి, నిర్మాత)
2008వైజయంతిమాల(నటి, నృత్యకారిణి)
2009లతా మంగేష్కర్(గాయని)
2010కె. బాలచందర్(రచయిత, దర్శకుడు, నిర్మాత)
2011హేమమాలిని(నటి, నిర్మాత, దర్శకురాలు, నృత్యకారిణి)
2012శ్యామ్ బెనగల్ (బాలీవుడ్ దర్శకుడు, రచయిత)
2013శ్రీదేవి (నటి)
2014అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు)


No comments:

Post a Comment