AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients జాతీయ అవార్డులు 2016

జాతీయ అవార్డులు 2016

ఏ పోటీ పరీక్ష అయినా అవార్డులకు సంబంధించి 3 - 6 ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి. కాబట్టి 2016లో ప్రదానం చేసిన ముఖ్యమైన అవార్డుల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
పద్మ అవార్డులు
2016 సంవత్సరానికి భారత ప్రభుత్వం 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో 19 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, ప్రవాస భారతీయులు/భారత సంతతికి చెందినవారు ఉన్నారు. 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 83 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.

పద్మ విభూషణ్ గ్రహీతలు
యామినీ కృష్ణమూర్తి(కళలు-శాస్త్రీయ నృత్యం), గిరిజా దేవి(కళలు-శాస్త్రీయ గాత్ర సంగీతం), విశ్వనాథన్ శాంత(అంకాలజిస్ట్), రజినీకాంత్ (సినిమా), రామోజీరావు(సాహిత్యం, జర్నలిజం), శ్రీశ్రీ రవిశంకర్(ఆధ్యాత్మికం), జగ్‌మోహన్(ప్రజా సంబంధాలు), వి.కె.ఆత్రే (సైన్‌‌స అండ్ ఇంజనీరింగ్), అవినాష్ దీక్షిత్ (సాహిత్యం-యూఎస్‌ఏ), ధీరూబాయ్ అంబానీ (వాణిజ్యం, మరణానంతరం)

పద్మభూషణ్ లభించిన కొంతమంది ప్రముఖులు
సైనా నెహ్వాల్(క్రీడలు-బ్యాడ్మింటన్) సానియా మీర్జా(క్రీడలు- టెన్నిస్), అనుపమ్ ఖేర్(సినిమా), ఉదిత్ నారాయణ్(నేపథ్య గానం), వినోద్ రాయ్(సివిల్ సర్వీస్), యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

(సాహిత్యం), డి.నాగేశ్వర్‌రెడ్డి(వైద్యం, గ్యాస్ట్రోఎంటరాలజీ), ఇందూ జైన్(వాణిజ్యం), పల్లోంజి షాపూర్‌జీ మిస్త్రీ(వాణిజ్యం-ఐర్లాండ్), రాబర్‌‌ట బ్లాక్‌విల్ (ప్రజా సంబంధాలు-యూఎస్‌ఏ), స్వామి దయానంద సరస్వతి (ఆధ్యాత్మికం, మరణానంతరం)

పద్మశ్రీ పొందిన కొంత మంది ప్రముఖులు
అజయ్ దేవ్‌గన్ (సినిమా), ప్రియాంకా చోప్రా (సినిమా), ఎస్.ఎస్.రాజమౌళి (సినిమా), మధుర్ బండార్కర్(సినిమా), కె.లక్ష్మాగౌడ్ (కళలు, చిత్రలేఖనం), మన్నం గోపీచంద్ (వైద్యం), ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే (వైద్యం), సుభాష్ పాలేకర్ (వ్యవసాయం), సునీతా కృష్ణన్ (సామాజిక సేవ), మధు పండిట్ దాస (సామాజిక సేవ), టి.వి.నారాయణ (సామాజిక సేవ), దీపికా కుమారి (క్రీడలు-ఆర్చరీ), సుశీల్ దోషి(క్రీడలు -క్రికెట్ కామెంటరీ), దిలీప్ సంఘ్వీ (వాణిజ్యం), సయీద్ జాఫ్రే (సినిమా, మరణానంతరం), అజయ్ బంగ (వాణిజ్యం, యూఎస్‌ఏ), వై.నాయుడమ్మ (వైద్యం).

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను 2016 జనవరి 15న ముంబైలో ప్రదానం చేశారు. బాజీరావ్ మస్తానీ చిత్రం అత్యధికంగా తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుంది.
ఉత్తమ నటుడు-రణ్‌వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటి-దీపికా పదుకొనే (పీకూ)
ఉత్తమ చిత్రం-బాజీరావ్ మస్తానీ
ఉత్తమ దర్శకుడు-సంజయ్‌లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు- మౌష్మీ ఛటర్జీ
యష్ చోప్రా స్మారక అవార్డు
2016 జనవరి 25న యశ్‌చోప్రా మెమోరియల్ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటి రేఖకు ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రదానం చేయడం ఇది మూడోసారి.

భీమ్‌సేన్ జోషి అవార్డు
2015-16 సంవత్సరానికి ప్రతిష్టాత్మక భారతరత్న పండిట్ భీమ్‌సేన్ జోషి శాస్త్రీయ సంగీత పురస్కారాన్ని ప్రముఖ సారంగి వాద్యకారుడు పండిట్ రామ్ నారాయణ్‌కు ప్రదానం చేశారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డును 2015 సంవత్సరానికి అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్‌కు ప్రదానం చేశారు. ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్న 47వ వ్యక్తి. మనోజ్‌కుమార్.. ఉపకార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి వంటి దేశభక్తి సినిమాల్లో నటించారు.

జాతీయ చలనచిత్ర అవార్డులు
63వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను 2016 మే 3న ప్రదానం చేశారు. హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీకి అత్యధికంగా ఏడు అవార్డులు లభించాయి. అమితాబ్ బచ్చన్‌కు ఉత్తమ నటుడి పురస్కారం నాలుగోసారి దక్కింది.
ఉత్తమ చిత్రం-బాహుబలి: ది బిగినింగ్
ఉత్తమ దర్శకుడు-సంజయ్‌లీలా బన్సాలీ - బాజీరావ్ మస్తానీ
ఉత్తమ నటుడు - అమితాబ్ బచ్చన్ (పీకూ-హిందీ)
ఉత్తమ నటి - కంగనా రనౌత్ (తను వెడ్‌‌స మను రిటర్‌‌న్స-హిందీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - (భజరంగీ భాయిజాన్-హిందీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి ఇచ్చే ఇందిరా గాంధీ అవార్డు - నీరజ్, ఘేవన్ (మసాన్-హిందీ)
ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం(నర్గీస్ దత్ అవార్డు) నానక్‌షా ఫకీర్ (పంజాబీ)
సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం- నిర్లాయకం (మలయాళం)
ఉత్తమ బాలల చిత్రం - (దురంతో-హిందీ)
ఉత్తమ హిందీ చిత్రం- దమ్‌లగాకే ైహైసా
ఉత్తమ తెలుగు చిత్రం - కంచె
ఐఫా అవార్డులు 2016
17వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం 2016 జూన్ 25న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగింది. బాజీరావ్ మస్తానీ అత్యధికంగా 13 అవార్డులను గెలుచుకుంది.
ఉత్తమ చిత్రం-భజరంగీ భాయిజాన్
ఉత్తమ దర్శకుడు-సంజయ్‌లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటుడు-రణ్‌వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటి-దీపికా పదుకొనే (పీకూ)
ఐఫా అవార్డు ఫర్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ - (ప్రియాంక చోప్రా)
ఇతర అవార్డులు
చమేలీ దేవి జైన్ అవార్డు: పత్రికా రంగంలో ప్రతిష్టాత్మక చమేలీ దేవి జైన్ అవార్డును 2015-16కు ప్రియాంక కకోద్కర్, రక్షకుమార్‌లకు సంయుక్తంగా లభించింది. 
స్కోచ్ అవార్డు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు 2016 మార్చి 18న స్కోచ్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
మిస్ ఇండియా-2016: ప్రియదర్శిని ఛటర్జీ ఏప్రిల్ 9న మిస్ ఇండియాగా ఎంపికైంది.
జి.డి. బిర్లా అవార్డు: శాస్త్రీయ పరిశోధనలో అద్భుత ప్రతిభ చూపినందుకు ఇచ్చే జి.డి. బిర్లా అవార్డును 2015 సంవత్సరానికి ఐఐటీ కాన్పూర్ అధ్యాపకుడు సంజయ్ మిట్టల్‌కు ప్రదానం చేశారు.
ఎన్.రామచంద్రన్ అవార్డు: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఎన్.రామచంద్రన్ స్మారక అవార్డును 2016 జూన్‌లో తిరువనంతపురంలో ప్రదానం చేశారు.
హృదయనాథ్ మంగేష్కర్ అవార్డు: చెస్ దిగ్గజం, విశ్వనాథన్ ఆనంద్‌కు హృదయ్‌నాథ్ మంగేష్కర్ అవార్డు 2016 ఏప్రిల్‌లో లభించింది. ఈ పురస్కారాన్ని స్వీకరించిన తొలి క్రీడాకారుడు ఆనంద్.
అశోక్ చక్ర: ధైర్యసాహసాలకిచ్చే అశోక్‌చక్ర పురస్కారం హవల్దార్ హంగ్‌పన్ దాదాకు (మరణానంతరం) లభించింది. 2016 ఆగస్టు 15న ప్రదానం చేశారు. 
బంగ బిభూషణ్ అవార్డు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016కు బంగ బిభూషణ్ అవార్డును ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు ప్రకటించింది. 
టి.ఎన్.చతుర్వేది అవార్డు: లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్‌కు టి.ఎన్. చతుర్వేది పురస్కారాన్ని 2016 అక్టోబర్‌లో ప్రదానం చేశారు. 
రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డు: ప్రముఖ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత గాయని శుభా ముద్గల్ 23వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డును 2016 ఆగస్టు 20న అందుకున్నారు. ఈ పురస్కారాన్ని భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జన్మదినాన (ఆగస్టు 20న-సద్భావన దివస్) ప్రదానం చేశారు.
మాతృభూమి లిటరరీ అవార్డు: ప్రముఖ మలయాళ రచయిత సి.రాధాకృష్ణన్‌కు 2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక మాతృభూమి లిటరరీ అవార్డు దక్కింది.
సరస్వతీ సమ్మాన్: 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని పద్మా సచ్‌దేవ్‌కు ప్రదానం చేశారు. డోగ్రి భాషలో ఆమె రాసిన ఆత్మకథ చిట్-చెటికి ఈ అవార్డు లభించింది. సరస్వతీ సమ్మాన్‌ను ఏటా కె.కె. బిర్లా ఫౌండేషన్ అందజేస్తోంది.
వ్యాస్ సమ్మాన్: 2015 సంవత్సరానికి ప్రముఖ హిందీ రచయిత్రి సునీతా జైన్.. వ్యాస్ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. క్షమ అనే హిందీ రచనకు అమెకు ఈ అవార్డు లభించింది. కె.కె. బిర్ల్లా ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏటా హిందీ రచయితలకు అందజేస్తోంది. 
జ్ఞాన్‌పీఠ్ అవార్డు: 2015కు జ్ఞాన్‌పీఠ్ సాహిత్య పురస్కారాన్ని గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి 2016 జూలై 11న ప్రదానం చేశారు. ఆయన 51వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.
యువ పురస్కార్: 2016 సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (తెలుగు).. ప్రముఖ జర్నలిస్ట్ చైతన్య పింగళికి లభించింది.ఆమె రచించిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఆమె ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య
మనవరాలు. బాల సాహిత్య పురస్కార్.. స్వర్ణ పుష్పాలు అనే కవితా సంపుటికి అలపర్తి వెంకట సుబ్బారావుకు లభించింది.
దాశరథి కృష్ణమాచార్య అవార్డు: దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని 2016కు ప్రముఖ కవి జె.బాపురెడ్డికి బహూకరించారు. బాపురెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి.
మూర్తీ దేవి పురస్కారం: భారతీయ జ్ఞాన్‌పీఠ్ అందించే మూర్తీ దేవి అవార్డు 2015కు తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్‌కు లభించింది. ఆయన రాసిన అనంత జీవనం అనే పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఆయన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్‌‌సలర్.

క్రీడా పురస్కారాలు
2016 సంవత్సరానికి క్రీడా పురస్కారాలను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 29న విజేతలకు అందజేశారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతిని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర పురస్కారాన్ని తొలి సారిగా నలుగురికి ప్రదానం చేశారు. పి.వి. సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మాలిక్(రెజ్లింగ్), దీపా కర్మాకర్(జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్) భారత్‌లో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్త్న్రను అందుకున్నారు. 15 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు లభించింది. వారు అజింక్య రహానే(క్రికెట్), రజల్ చౌహాన్(ఆర్చరీ), లలిత బాబర్(అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి(బిలియర్‌‌డ్స/ స్నూకర్), శివ్ థాపా(బాక్సింగ్), సుబ్రత్ పౌల్(ఫుట్‌బాల్), రాణి(హాకీ), వి.ఆర్.రఘునాథ్ (హాకీ), గురుప్రీత్‌సింగ్(షూటింగ్), అపూర్వీ చందేలా(షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగత్(రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్‌మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్‌సింగ్ (రెజ్లింగ్-డెఫ్).

ద్రోణాచార్య అవార్డు:
అత్యున్నత కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డు ఆరుగురికి లభించింది. వారు.. నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్‌శర్మ(క్రికెట్), బిశ్వేశ్వర నంది (జిమ్నాస్టిక్స్), ఎస్.ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్ లైఫ్ టైం), మహాబీర్ సింగ్ (రెజ్లింగ్-లైఫ్ టైం), జీవితకాల పురస్కారమైన ధ్యాన్‌చంద్ అవార్డును సత్తి గీత (అథ్ల్లెటిక్స్), సిల్వనస్ డంగ్ డంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షెర్కే (రోయింగ్)లకు ప్రదానం చేశారు.


No comments:

Post a Comment