2016 నోబెల్ విజేతలు
2016కు గాను నోబెల్ బహుమతులను 6 రంగాల్లో (మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, శాంతి, సాహిత్యం) స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.ఈ బహుమతుల ప్రదానోత్సవం అవార్డుల సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న స్టాక్ హోంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విజేతలకు నగదు పుస్కారం, గోల్డ్ మెడల్, డిప్లొమాను అందజేస్తారు. శాంతి పురస్కార ప్రదానం మాత్రం అదే రోజు నార్వేలోని ఓస్లోలో జరుగుతుంది.
2016 నోబెల్ బహుమతి విజేతలు
వైద్యశాస్త్రం
కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ (ఆటోఫేజీ) గురించి చేసిన అధ్యయనానికి గాను జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీ(71) వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. తాజాగా ఒషుమీ గెలుచుకున్న నోబెల్ జపాన్‌కి 23వ నోబెల్. వైద్య రంగంలో 6వది.
ఆటోఫేజీ అంటే?
మానవ శరీర కణాలు తమ లోపలి భాగాలు పాడైతే వాటిని కణంలోనే ఉండే లైసోసోమ్ అనే రీసైక్లింగ్ విభాగానికి పంపి నాశనం చేస్తాయి. దీనినే ‘ఆటోఫేజీ’(ఆటో-స్వయంగా, ఫేజియన్-తినేయడం) అంటారు. ఈ ప్రక్రియలో లోపం వల్ల వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్‌సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
భౌతిక శాస్త్రం
భౌతిక శాస్త్రం
పదార్థానికి ఉండే అసాధారణ స్థితిగతులపై పరిశోధన చేసినందుకుగాను ముగ్గురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్‌లకు సంయుక్తంగా భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ దక్కింది.
టోపాలజీ..
అంతరిక్షం, పదార్థాల భౌతిక ధర్మాలు, బహిర్గత ఒత్తిడికి గురై ఆకారంలో మార్పులు జరిగి పూర్వ స్థితికి చేరుకునే లక్షణం వంటి అంశాలపై చేసే అధ్యయనమే టోపాలజీ. ఈ తరహా ఒత్తిడికి గురి చేసిప్పుడు, (లేదా శక్తిని ప్రయోగించినప్పుడు) ఆ పదార్థం స్థితిగతుల్లో వచ్చే అసాధారణ మార్పులను వారు సిద్ధాంతపరంగా నిరూపించారు.
రసాయన శాస్త్రం
రసాయన శాస్త్రం
అణువుల స్థాయిలో పనిచేసే యంత్రాల (మాలిక్యులర్ మెషీన్స్)ను అభివృద్ధి చేసినందుకు జీన్ పియర్ సావేజ్(ఫ్రాన్స్), జె ఫ్రేజర్ స్టోడార్ట్(బ్రిటన్), బెర్నాండ్ ఫెరింగా(నెదర్లాండ్స్) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు 2016 రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది.\
మాలిక్యులర్ మెషీన్స్ అంటే?
అణువుల స్థాయిలో అత్యంత సూక్ష్మంగా రూపొందించినవే మాలిక్యులర్ మెషీన్స్(అణు యంత్రాలు). వీటికి శక్తిని అందిస్తే మోటార్ల తరహాలో తిరిగి తమకన్నా ఎన్నో రెట్లు పెద్దవైన వాటినీ కదిలిస్తాయి. సూక్ష్మమైన రోబోట్లను రూపొందించడానికి, కృత్రిమ అవయవాల రూపకల్పనకు కూడా ఈ మాలిక్యులర్ మెషీన్స్ ఉపయోగపడతాయి.
ఆర్థిక శాస్త్రం
ఆర్థిక శాస్త్రం
ఓలివర్, హోమ్‌స్ట్రామ్‌కు ఆర్థిక నోబెల్
‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ ప్రముఖ ఆర్థికవేత్తలు ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్‌లాండ్)లు 2016 ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కారాలను ఇది సూచిస్తుంది.
శాంతి
‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ ప్రముఖ ఆర్థికవేత్తలు ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్‌లాండ్)లు 2016 ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కారాలను ఇది సూచిస్తుంది.
శాంతి
2016 నోబెల్ శాంతి పురస్కారానికి కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ ఎంపికయ్యారు. దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం వల్ల 2,60,000 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది గల్లంతయ్యారు. వామపక్ష గెరిల్లా గ్రూపులు, రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు, డ్రగ్ ముఠాల మధ్య దాడులతో దేశం అల్లకల్లోలంగా మారింది. 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
సాహిత్యం
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం వల్ల 2,60,000 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది గల్లంతయ్యారు. వామపక్ష గెరిల్లా గ్రూపులు, రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు, డ్రగ్ ముఠాల మధ్య దాడులతో దేశం అల్లకల్లోలంగా మారింది. 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
సాహిత్యం
అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలన్ (75) ను 2016 నోబెల్ సాహిత్య అవార్డు వరించింది. సాహిత్యం విభాగంలో సంగీతకారుడు లేదా గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన రాసిన ‘బ్లోరుుంగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ఈ పాటలకు డిలన్‌కు 2008లో పులిట్జర్ ప్రైజ్ కూడా దక్కింది. ‘అనదర్ సైడ్ ఆఫ్ బాబ్ డిలన్’, ‘బ్రింగింగ్ ఇట్ ఆల్ బ్యాక్ హోమ్’, ‘హైవే 61 రీవిజిటెడ్’ వంటి ఆల్బమ్స్‌తో డిలన్ ప్రసిద్ధి చెందారు.
No comments:
Post a Comment