AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు నవంబరు 2012

అవార్డులు నవంబరు 2012
నారంగ్‌కు మూర్తి దేవి అవార్డుప్రముఖ ఉర్దూ రచయిత గోపీచంద్ నారంగ్‌కు 2010 మూర్తి దేవి అవార్డు లభించింది. నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, నారంగ్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.

లైబీరియా అధ్యక్షురాలికి ఇందిరా బహుమతిసామాజిక అశాంతి, అంతర్యుద్ధంతో తల్లడిల్లిన లైబీరియాలో శాంతి, ప్రజాస్వామ్యాలను పునరుద్ధరించి మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ దేశాధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. లైబీరియాలో శాంతి, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, భద్రతలను తిరిగి గాడిన పెట్టి, ఆఫ్రికా మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నందుకు ఆమెను ఈ ఏడాదికి గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ నవంబర్ 19న వెల్లడించింది. సిర్లీఫ్ ఆఫ్రికా ఖండంలో ఒక దేశాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు 1986లో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఇందిరా గాంధీ జన్మదినమైన నవంబర్ 19న ప్రకటిస్తారు. 2011లో ఈ అవార్డును సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు ఎలా బట్‌కు అందజేశారు. 

మాధవ్ చవాన్‌కు ‘వైజ్’ అవార్డుపేదలకు అతి తక్కువ ఖర్చుతో విద్యనందించి ముంబై మురికివాడల్లో విద్యా కుసుమాలు పూయించిన భారతీయ విద్యావేత్త, స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ సహ వ్యవస్థాపకుడైన మాధవ్ చవాన్‌కు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE- The World Innovation Summit for Education)' అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని విద్యారంగంలో నోబెల్ బహుమతితో సమానంగా భావిస్తారు. ఖతర్ రాజధాని దోహలో జరిగిన నాలుగో వైజ్ సదస్సు సందర్భంగా చవాన్‌కు ఈ అవార్డును అందజేశారు. పురస్కారం కింద సుమారు రూ.2.74 కోట్ల నగదుతోపాటు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. అమెరికాలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అనంతరం చవాన్ 1986లో భారత్‌కు తిరిగి వచ్చి ముంబై యూనివర్సిటీలో రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. మురికివాడల్లో చిన్నారుల దుస్థితిని చూసి చలించిపోయారు. చదువే దీనికి నివారణగా భావించి వారిలో విద్యావ్యాప్తి కోసం శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించారు. యునిసెఫ్‌తోపాటు ప్రభుత్వ సహకారం తీసుకుని దేవాలయాలు, కార్యాలయాల వద్ద స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో విద్యాబోధన నిర్వహించారు.

గాయ్రత్రికి క్వోటో ప్రైజ్ప్రముఖ సాహితీ విమర్శకురాలు, విద్యావేత్త గాయత్రి చక్రవర్తి స్వివాక్‌కు ప్రతిష్టాత్మకమైన క్వోటో ప్రైజ్‌ను నవంబర్ 10న టోక్యోలో ప్రదానం చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గాయత్రికి ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ విభాగంలో ఈ అవార్డు దక్కింది. అమెరికా కంప్యూటర్ శాస్త్రవేత్త ఇవాన్ సూథర్లాండ్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ విభాగంలో, జపాన్ మాలిక్యులర్ బయోలజిస్ట్ యోషి నోరి ఒసుమికి బేసిక్ సెన్సైస్‌లో అవార్డు లభించింది.

భారత్ ఫోర్జ్ కళ్యాణికి జర్మనీ పురస్కారంభారత్ ఫోర్జ్ సీఎండీ, బాబా ఎన్. కళ్యాణికి జర్మనీ అత్యున్నత పురస్కారం ‘క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్’ లభించింది. ముంబైలో నవంబర్ 8న జరిగిన ఒక కార్యక్రమంలో జర్మనీ రాయబారి మైకేల్ స్టీనర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. జర్మనీలో వ్యాపార కార్యకలాపాల ఏర్పాటుకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి జర్మనీ యూనివర్శిటీలకు ఇతోధిక సహకారం అందించినందుకుగాను కళ్యాణికి ఈ పురస్కారం దక్కింది. 

ఇండియా టుడే అవార్డులు
ప్రముఖ ప్రచురణ సంస్థ ఇండియా టుడే నవంబర్ 1న ప్రతి ఏటా అందజేసే వార్షిక అవార్డుల జాబితాను ప్రకటించింది. ఇందులో పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక పురోగతి సాధించిన రాష్ట్రంగా గుజరాత్ వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఈ ఘనత దక్కించుకుంది. గడిచిన ఏడాది కాలంలో సాధించిన పురోగతి ఆధారంగా, ఇండికస్ అనలైటిక్స్ అనే సంస్థతో కలిసి ఇండియాటుడే ఈ అవార్డులను ప్రకటించింది. వ్యవసాయం, ప్రాథమిక విద్య, వినియోగదారుల మార్కెట్, ప్రాథమిక ఆరోగ్యం, పరిపాలన, మౌలిక వసతులు, పెట్టుబడులు, స్థూల ఆర్థిక వ్యవస్థ అనే ఎనిమిది విభాగాల్లో సాధించిన పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 

ఢిల్లీ మెట్రోకు జపాన్ పురస్కారంఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)కు జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అవార్డు లభించింది. మానవ వనరుల అభివృద్ధి, భారత్-జపాన్ మధ్య సంబంధాల మెరుగుకు చేసిన కృషికిగాను డీఎంఆర్‌సీకి ఈ పురస్కారం దక్కింది.

ఐశ్వర్యారాయ్‌కు ఫ్రాన్స్ పురస్కారంముంబైలో నవంబర్ 1న జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫ్రాన్స్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ను స్వీకరించారు.

పీపుల్స్ హీరోగా సూపర్ 30 ఆనంద్నిరుపేద విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఉచితంగా శిక్షణ ఇస్తున్న సూపర్-30 ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌ను పీపుల్ మ్యాగజీన్ పీపుల్స్ హీరోగా గుర్తించింది. టైమ్ మేగజీన్ గ్రూప్‌నకు చెందిన పీపుల్స్ మ్యాగజీన్ తాజా సంచికలో ఆనంద్‌పై పూర్తి స్థాయి కథనం ప్రచురించింది. ఈ పత్రిక సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను పీపుల్స్ హీరోగా గుర్తించడం పరిపాటి. విద్యా రంగానికి చెందిన వ్యక్తికి ఈ హోదా కల్పించడం ఇదే మొదటి సారి.

రుచిర్ శర్మకు టాటా సాహిత్య అవార్డున్యూయార్క్‌కు చెందిన బ్యాంకర్ రుచిర్ శర్మకు ‘టాటా లిటరేచర్ ఫస్ట్ బుక్’ అవార్డును నవంబర్ 4న బహూకరించారు. ఆయన రాసిన ‘బ్రేక్ అవుట్ నేషన్స్: ఇన్ పర్స్యూట్ ఆఫ్ దినెక్ట్స్ ఎకనాబిక్ మిరాకిల్స్’ నవలకుగాను ఈ పురస్కారం దక్కింది.

జగ్జీవన్ రామ్‌కు బంగ్లా పురస్కారంభారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్‌కు మరణానంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ హానర్’ అవార్డును ప్రకటించింది. 1971 బంగ్లా విముక్తి యుద్ధం సందర్భంగా ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. అప్పుడు ఆయన భారత రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా మోహన్ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) బోర్డులో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా డాక్టర్ రాకేశ్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత్‌తోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లకు కూడా బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేశ్ గతంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పని చేశారు.

No comments:

Post a Comment