సైన్స్ & టెక్నాలజీ మే 2013
చర్మ కణాల నుంచి తొలి దశ పిండాలుశాస్త్రవేత్తలు మానవ చర్మ కణాలను ప్రారంభ దశలో ఉండే పిండాలుగా వృద్ధి చేశారు. అమెరికాలోని ఒరెగాన్ నేషనల్ ప్రిమేట్ రీసెర్చ్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ప్రారంభ దశలోని పిండాలను ఉపయోగించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక కణజాల కణాలను తయారుచేయడానికి వీలవుతుంది. మానవ క్లోనింగ్ పరిశోధనలో ఇదో మైలురాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అతిసారానికి స్వదేశీ టీకారొటా వైరస్ డయేరియా (అతిసారం)కు భారత శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘ద రొటావాక్‘ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను మే 14న ఢిల్లీలో విడుదల చేశారు. ఏడాది లోపు చిన్నారులకు ఈ టీకాను వేయడం ద్వారా వ్యాధి తీవ్రతను 56 శాతం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకాను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందని, టీకా అభివృద్ధిలో పాలుపంచుకున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. భారత్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదం పొందితే ఈ టీకా రూ.54కు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో రొటా వైరస్ టీకాల ధరలు ఒక్కో డోసుకు సుమారు రూ.1000 ఉంది.
నౌకాదళంలోకి బోయింగ్ పీ81 విమానంజలాంతర్గామి విధ్వంసక లాంగ్ రేంజ్ విమానం.. బోయింగ్ పీ81 ని తమిళనాడులోని అరక్కోణం నావల్ ఎయిర్ స్టేషన్ రాజాలీలో మే 15న నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. బోయింగ్ 737-800 (ఎన్‌జీ)ని నౌకాదళ అవసరాలకు అనువుగా పీ81 ఎయిర్‌క్రాఫ్ట్‌గా అమెరికా నౌకాదళం ఆధునికీకరించింది. ఈ విమానంలో జలాంతర్గాములను ధ్వంసం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది.
నౌకాదళంలోకి మిగ్ 29కే యుద్ధ విమానంకొత్త తరం యుద్ధ విమానం ‘మిగ్ 29కే’ భారత నౌకాదళంలోకి చేరింది. మే 11న పనాజీలో నౌకాదళ వైమానిక కేంద్రం ఐఎన్‌ఎస్ హంస వద్ద రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమక్షంలో నౌకాదళంలోకి ప్రవేశించింది. ఈ ఏడాది జలప్రవేశం చేయనున్న విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య (అడ్మిరల్ గోర్ష్‌కోవ్)తో మిగ్ 29కే విమానాలను అనుసంధానిస్తారు. ‘బ్లాక్ పాంథర్స్’గా కూడా పిలిచే మిగ్29కే విమానాలను నేవీలో అధికారికంగా ‘ఐఎన్‌ఏఎస్ 303’గా పేర్కొంటారు.
గస్తీ నౌక ‘రాణి అవంతిబాయి‘ ప్రారంభం
గస్తీనౌక ‘రాణి అవంతిబాయి‘ను విశాఖపట్నంలో మే 9న కోస్ట్‌గార్డ్ అధికారులు ప్రారంభించారు. దీంతో తీరప్రాంత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైంది. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ నిర్మిస్తున్న ఐదు గస్తీ నౌకల్లో అవంతిబాయి రెండోది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉన్న ఈ నౌక పొడవు 50 మీటర్లు. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్‌గఢ్ మహారాణిగా 1851-57 మధ్యకాలంలో అవంతిబాయి వెలుగొందారు. ఆమె బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి వీరవనితగా కీర్తిగడించారు.
చెనా కమ్యూనికేషన్ ఉపగ్రహంచైనా జాంగ్‌జింగ్-11 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మే 2న క్సిచాంగ్ శాటిలైల్ లాంచ్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

No comments:
Post a Comment