AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

అవార్డులు అక్టోబరు 2013

అవార్డులు అక్టోబరు 2013
జెన్‌కో ఎండీ విజయానంద్‌కు ఇండియన్ పవర్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) మేనేజింగ్ డెరైక్టర్ కె.విజయానంద్‌కు ఇండియన్ పవర్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో చూపిన ప్రతిభకుగాను ఆయన 2013 ఉత్తమ సీఈఓగా ఎంపికయ్యారు. ‘ఇండియన్ పవర్’ అవార్డులను ఏటా కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్ సంస్థ ప్రకటిస్తుంది.

అమెరికన్లకు అర్థ శాస్త్రంలో నోబెల్ఆస్తుల ధరలపై అవగాహన కలిగించే విధానాన్ని రూపొందించినందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్‌లకు అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈజెన్ ఫామా, పీటర్స్ హాన్సన్‌లు షికాగో యూనివర్సిటీలో, రాబర్ట్ షిల్లర్ యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. షేర్లు, బాండ్ల ధరల తీరు రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అనే విషయాన్ని అనుభవపూర్వకంగా, విశ్లేషణ ద్వారా అంచనా వేయవచ్చని వారు ప్రతిపాదించారు. షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు వంటివాటి రూపంలో పొదుపు చేయాలనేది వ్యక్తుల అంచనాలపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఎలీనర్ కాటన్‌కు బుకర్ ప్రై జ్న్యూజిలాండ్‌కు చెందిన ఎలీనర్ కాటన్ (28)కు 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రై జ్ లభించింది. ఈ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు కాటన్. ఆమె రాసిన ‘ద లూమినరీస్’ అనే నవలకు ఈ బహుమతి లభించింది. 19వ శతాబ్దిలో సాగిన బంగారం అన్వేషణ ఇతివత్తంతో కూడిన మర్డర్ మిస్టరీ నవల ఇది. బహుమతి కింద 50 వేల పౌండ్లు లభిస్తాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి నవల ‘ద ల్యోలాండ్’ చివరి వరకు పోటీపడ్డా బహుమతి లభించలేదు. ఈ బహుమతిని కామన్‌వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన వారి ఆంగ్ల రచనలకు మాత్రమే అందిస్తారు.

భారతీయ యువతికి కామన్‌వెల్త్ యూత్ అవార్డుభారత్‌లో పర్యావరణ మార్పు సమస్య నివారణకు కషిచేస్తున్న భారత మహిళ ప్రీతీ రాజగోపాలన్(23) ఈ ఏడాది కామన్‌వెల్త్ యూత్ అవార్డును గెలుపొందారు. అక్టోబర్ 12న లండన్‌లోని కామన్‌వెల్త్ ప్రధాన కార్యాలయంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద 5000 పౌండ్లు లభిస్తాయి. పర్యావరణ మార్పుపై స్థానిక సమాజాలు, ప్రభుత్వాలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించి మిత్రులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. భారత్‌లో 200 పాఠశాలలు, 40 విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆమె శిక్షణ అందిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆమె ప్రాజెక్టుకు నిధులు అందిస్తోంది.

నోబెల్‌ బహుమతులు-2013శాంతి: ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాల నిర్మూలనకు వృషి చేస్తున్న ఆర్గనైజేషన్‌ ఫర్‌ ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ కెమికల్‌ వెపన్స్‌ (ఓపీసీడబ్ల్యూ)కు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఈ సంస్థ సిరియా సంక్షోభంలో బాగా ప్రాచుర్యం పొందింది. సిరియాలో ఆగస్టులో సైన్యం సరిన్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో 1400 మంది మరణించారు. దీంతో ఐక్యరాజ్యసమితి తోడ్పాటుతో సిరియాలో రసాయన ఆయుధాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఓపీసీడబ్ల్యూ చేపట్టింది. ఐక్యరాజ్యసమితి మద్దతుతో స్వతంత్రంగా వ్యవహరించే ఈ సంస్థ 1997లో ఏర్పడింది. హేగ్‌ కేంద్రంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 1993 జనవరి 13న కుదిరిన రసాయన ఆయుధాల నిర్మూలన ఒప్పందాన్ని అమలుచేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఏర్పడినప్పటి నుంచి 86 దేశాల్లో 57000 టన్నుల రసాయన ఆయుధాలను ఓపీసీడబ్ల్యూ ధ్వంసం చేసింది. ఇది విధించిన రసాయన ఆయుధాల నిషేధంలో 189 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 1901 నుంచి 2013 వరకు నోబెల్‌ శాంతి బహుమతిని 94 సార్లు 125 మందికి బహూకరించారు. ఈ బహుమతి వంద మంది వ్యక్తులకు, 25 సంస్థలకు దక్కింది. 2012 శాంతి బహుమతి యూరోపియన్‌ యూనియన్‌కు లభించింది.

ఫిజిక్స్‌: భౌతిక శాస్ర్తానికిచ్చే నోబెల్‌ బహుమతి దైవకణం (హిగ్స్‌బోసాన్‌)పై కీలక పరిశోధనలు చేసినందుకు బ్రిటన్‌కు చెందిన పీటర్‌ హిగ్స్‌ (84), బెల్జియంకు చెందిన ఫ్రాంకోయిస్‌ ఎంగ్లెర్ట్‌ (80)లకు లభించింది. ఎడిన్‌బరో యూనివర్సిటీలో పీటర్‌హిగ్స్‌, యూనివర్సిటీ లిబర్‌ డీ బ్రక్సెల్స్‌లో ఎంగ్లెర్ట్‌ గౌరవ ప్రొఫెసర్లుగా ఉన్నారు. వీరు విశ్వంలో అన్ని రకాల పదార్థాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తుందని భావిస్తున్న దైవ కణంపై 1964లో కీలక పరిశోధనలు చేశారు. ఈ కణం వల్ల స్వల్ప రేణువు నుంచి గ్రహాలు, నక్షత్రాల వరకు సమస్త పదార్థానికి ద్రవ్యరాశి చేరుతోందని తెలిపారు. దీనినే హిగ్స్‌బోసన్‌ అని పిలిచారు. హిగ్స్‌ అంటే విశ్వంలో అదశ్యంగా ఉన్న క్షేత్రం కాగా, బోసాన్‌ అంటే అన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే కణం. స్విట్జర్లాండ్‌లోని సెర్న్‌ ప్రయోగశాల శాస్తవ్రేత్తలు 2012లో లార్జ్‌ హాడ్రాన్‌ కొల్లయిడర్‌ ప్రయోగం ద్వారా దైవ కణం ఉనికి నిజమేనని తెలిపారు.

రసాయన శాస్త్రం: అమెరికా శాస్తవ్రేత్తలు మార్టిన్‌ కార్‌ప్లస్‌ (83), మైకేల్‌ లెవిట్‌ (66), ఆరీ వార్షెల్‌ (72)లకు రసాయనశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. అతి క్లిష్టమైన రసాయన ప్రక్రియలను అణు స్థాయిలో వివరించేందుకు ఉపయోగపడే కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ను రూపొందించినందుకు వారికి ఈ బహుమతి దక్కింది. వీరు నిత్య జీవితంలో కీలకమైన రసాయన ప్రక్రియలకు కంప్యూటర్‌ అనుకరణలు రూపొందించారని, వాటి సాయంతో అన్ని రకాల ప్రక్రియలను అత్యంత సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకోవడానికి, వాటి చర్యల క్రమాన్ని ఊహించడానికి వీలైందని నోబెల్‌ బహుమతి జ్యూరీ తెలిపింది. వీరి ఆవిష్కరణ వల్ల ఔషధ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించేందుకు, మనిషి శరీరంలో జరిగే రసాయన మార్పును బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. 1960, 70లలో వీరు ఈ పరిశోధనలు నిర్వహించారు.

సాహిత్యం: కెనడా రచయిత్రి ఆలిస్‌ మన్రో (82)కు నోబెల్‌ సాహిత్య బహుమతి దక్కింది. కెనడియన్‌ చెహోవ్‌గా పిలిచే మన్రో తన కథా రచనల్లో సమకాలీన పరిస్థితులను, మానవ సంబంధాలను మేళవించి పాఠకులకు అందించారు. ఆమె కథల్లోని పాత్రలు ఎదుర్కొనే సంఘటనలు, మనస్తత్వాల విశ్లేషణలు, వాటి ద్వారా మానవీయ కోణాలను తెలిపే తీరు మహోన్నతంగా ఉంటాయని నోబెల్‌ కమిటీ తెలిపింది. ఆమె రాసిన డాన్స్‌ ఆఫ్‌ ది హ్యాపీ షేడ్స్‌ అనే 1968 నాటి కథా సంపుటి ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. 2009లో మ్యాన్‌బుకర్‌ బహుమతి దక్కింది. ఆలిస్‌ మన్రో సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొందిన 13వ మహిళ. కెనడాకు చెందిన తొలి మహిళ కూడా. 

మలాలాకు ఈయూ సఖరోవ్‌ ప్రై జ్‌పాకిస్థాన్‌ విద్యాహక్కుల ప్రచారకర్త మలాలా యూసుఫ్‌జా (16)కు ప్రతిష్టాత్మకమైన సఖరోవ్‌ మానవహక్కుల బహుమతి అందుకుంది. అక్టోబర్‌ 10న యూరోపియన్‌ పార్లమెంట్‌లో ఈ అవార్డును బహూకరించారు. మలాలా 2013 నోబెల్‌ శాంతి బహుమతికి కూడా నామినేట్‌ అయింది. ఆమె తాలిబన్‌ దాడిలో గాయపడి కోలుకున్నప్పటి నుంచి పిల్లలు బడికెళ్లడం హక్కుగా చేపట్టే కార్యక్రమాల ప్రపంచ రాయబారిగా మారారు.

వరుణ్‌ అరోరాకు ఐక్యరాజ్యసమితి అవార్డుభారత యువ పారిశ్రామిక వేత్త అరుణ్‌ అరోరాకు ఐక్యరాజ్యసమితి అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి సహకారంతో ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) యంగ్‌ ఇన్నోవేటర్స్‌ కాంపిటీషన్‌ నిర్వహించింది. ఈ పోటీలో 88 దేశాల నుంచి 600 మంది పాల్గొనగా వారిలో 10 మందిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ పదిమందిలో వరుణ్‌ అరోరా ఒకరు. ఆయన పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠ్యాంశాలన్నింటిని ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కరిక్యులంను సష్టించారు.

శివేంద్ర సింగ్‌కు బీమల్‌రాయ్‌ అవార్డుచిత్ర దర్శకుడు శివేంద్ర సింగ్‌ దుంగార్పూర్‌కు 2013 సంవత్సరానికి బీమల్‌రాయ్‌ మెమోరియల్‌ ఎమర్జింగ్‌ టాలెంట్‌ అవార్డు దక్కింది. ఆయన చిత్రించిన డాక్యుమెంటరీ ‘సెల్యులాయిడ్‌ మ్యాన్‌’కు ఈ అవార్డు లభించింది. ఈ డాక్యుమెంటరీని 2012లో ప్రముఖచిత్ర ఆర్చివిస్ట్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్చివ్‌ ఆఫ్‌ ఇండియా స్థాపకుడు పి.కె.నాయర్‌ జీవితంపై తీశారు. 150 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా 47 చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ అవార్డును బీమల్‌రాయ్‌ మెమోరియల్‌ సొసైటీ 1997 నుంచి అందిస్తోంది. గతంలో రీతుపర్ణోఘోష్‌, అషుతోష్‌ గోవారికర్‌, సుజిత్‌ సర్కార్‌, సబీహా సుమీర్‌, విక్రమాదిత్య మొత్వానే వంటివారికి బహూకరించారు. 

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌వైద్యశాస్త్రంలో చేసిన కషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్తవ్రేత్తలు ఉమ్మడిగా ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్‌ రోత్‌మాన్‌, రాండీ షెక్‌మాన్‌తోపాటు జర్మనీ సంతతి శాస్తవ్రేత్త థామస్‌ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్‌ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్తవ్రేత్తలు అందుకోనున్నారు. డిసెంబర్‌ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు. 
సైనా నెహ్వాల్‌కు ‘స్పోర్ట్స్‌ ఇలస్ట్రేటెడ్‌’ పత్రిక అవార్డుభారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్‌ పత్రిక ‘స్పోర్ట్స్‌ ఇలస్ట్రేటెడ్‌’ అవార్డు లభించింది. 2012 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణిగా ఆ పత్రిక సైనాను ఎంపిక చేసింది. ఈ అవార్డు రావడం ఆమెకు ఇది రెండోసారి. 2009లో అవార్డు ప్రారంభించినప్పుడు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్‌ చంద్‌ (క్రికెట్‌), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్‌ కోహ్లి (క్రికెట్‌) ఎంపికయ్యారు. రాహుల్‌ ద్రావిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది.

కరణ్‌ థాపర్‌కు ఐపీఐ పురస్కారంసమకాలీన అంశాలపై, వివిధ రంగాల్లో ప్రముఖులతో టీవీ ఇంటర్వ్యూలు నిర్వహించడంలో పేరొందిన కరణ్‌ థాపర్‌ ‘ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐ)-ఇండియా అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ జర్నలిజం ఫర్‌ 2013’కు ఎంపికయ్యారు. సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ చానల్‌లో ‘డెవిల్స్‌ అడ్వొకేట్‌’ కార్యక్రమం ద్వారా 2012లో ప్రజా సంబంధిత అంశాలపై విధాన నిర్ణేతలను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా వాటిపై దష్టి సారించేలా కషి చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐపీఐ-ఇండియా శాఖ అక్టోబర్‌ 7న తెలిపింది. 

No comments:

Post a Comment