అవార్డులు జనవరి 2014
పద్మ అవార్డులు
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో రెండు పద్మవిభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర). ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వివరాలు: పద్మభూషణ్- దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్). పద్మశ్రీ- మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్), డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్), డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) , రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ), డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ), ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య). పద్మభూషణ్ అవార్డు లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది. ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్‌ఆర్‌ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది.
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (2013) విజేతల వివరాలు: ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్); ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్‌లీలా రామ్‌లీలా); ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్); జీవితసాఫల్య అవార్డు: తనూజ; ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్‌హీ హో-ఆషిఖీ-2); ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా); ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్ మిల్కా భాగ్)
ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌బాబుకు అశోకచక్రఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్ ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాద్‌బాబుకు 65వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరణానంతరం అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అశోకచక్రతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసాద్‌బాబు తండ్రి కె.వెంకటరమణకు అందించారు. 2013 ఏప్రిల్ 16న ఆంధ్ర-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రసాద్‌బాబుతో పాటు 9 మంది మావోయిస్టులు మరణించారు.
బయోకాన్ ఎండీ కిరణ్ షాకు ఆథ్‌మర్ గోల్డ్ మెడల్బయోకాన్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుందార్‌షా 2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపిక య్యారు. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అత్యున్నత అవార్డును అందజేస్తుంది.
సి.ఎస్.ఎస్.ఎస్‌కు జాతీయ మత సామరస్య అవార్డుముంబైలోని ‘ సెంటర్ ఫర్‌స్టడీ ఆఫ్ సొసైటీఅండ్ సెక్యులరిజమ్’ (సి.ఎస్.ఎస్.ఎస్) సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్యఅవార్డుకు ఎంపికైంది. వ్యక్తులకేటగిరీలో ఢిల్లీకి చెందిన మొహిందర్ సింగ్, కేరళకు చెందిన ఎన్.రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. డాక్టర్ మొహిందర్‌సింగ్ మైనారిటీ విద్యాసంస్థల జాతీయకమిషన్ సభ్యులు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రముఖ విద్యావేత్త, గాంధేయవాది. కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖకు చెందిన మతసామరస్య జాతీయ ఫౌండేషన్ 1996లో జాతీయ మతసామరస్య అవార్డులనుఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు వ్యక్తులకైతే రూ. 5లక్షలు, సంస్థలకైతే రూ. 10 లక్షలు బహుకరిస్తారు. సి.ఎస్.ఎస్.ఎస్.ను ముంబేలో 1996లో ఏర్పాటు చేశారు.
పాక్ బాలుడికి అంతర్జాతీయ సాహస అవార్డుతన ప్రాణాలొడ్డి పాఠశాలలోని వేల మంది విద్యార్థులను కాపాడిన 14 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఐత్‌జాజ్ హసన్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంతర్జాతీయ సాహస అవార్డును ప్రకటించింది. అలాగే పాక్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన సితారా ఎ సుజాత్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.జనవరి 6న పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్యా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో మానవబాంబుతో ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని హసన్ అడ్డుకున్నాడు. ఆ పేలుడులో ఇద్దరూ చనిపోయారు.
ఆర్టీసీకి మూడు జాతీయ పురస్కారాలు ఏపీఎస్‌ఆర్టీసీకి మూడు పురస్కారాలు లభించాయి. అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్),అర్బన్ సర్వీసుల్లో అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్), భద్రత అంశాల్లో అతి తక్కువ ప్రమాదాలు కలిగి ఉండటంతో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) న్యూఢిల్లీ నుంచి పురస్కారాలు దక్కించుకుంది. ఇంధన పొదుపులో ఇప్పటికి 39వసారి ఆర్టీసీ అవార్డును గెలుచుకుంది.
జాన్ ఐపేకు భారత్‌గౌరవ్ పురస్కారంబహ్రెయిన్‌లో ఉన్న ప్రవాస భారతీయుడు జాన్‌ఐపే (63) ప్రతిష్ఠాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ప్రకటించింది. నాలుగుదశాబ్దాల పాటు బహ్రెయిన్‌లో నివశిస్తున్న ఐపే...14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తీరుకు ఈ అవార్డు వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును మదర్‌థెరిసా, క్రికెటర్ గవాస్కర్, నటులు షమ్మీకపూర్, రాజేశ్‌ఖన్నా, దేవానంద్ అందుకున్నారు.
ఖేమ్కాకు డామేహుడ్ అవార్డు భారతసంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఆశాఖేమ్కా బ్రిటన్ ప్రతిష్టాత్మక డామే కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ (డి.బి.ఇ-డామేహుడ్) అవార్డుకు ఎంపికయ్యారు. 1917 లో బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో జన్మించిన ఆశాఖేమ్కా 1975లో బ్రిటన్ వెళ్లారు. టీవీలో బోధన కార్య క్రమాలు చేపట్టిన ఆమె-అక్కడి యువతకు విద్య, ఉపాధి, శిక్షణను అందిస్తున్నారు. బ్రిటన్‌లోని 33 కళాశాలలను భారత్‌లోని కళాశాలలతో అనుసంధానించి ఇరుదేశాలకు చెందిన విద్యార్థులలో నైపుణ్యాల అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు. కాగా 83 ఏళ్ల తర్వాత ఈ అవార్డు భారత సంతతికి దక్కింది. ఇంతకుముందు 1931లో మహారాణి లక్ష్మీదేవి భాయ్ సాహిబాకు ఈ గౌరవం లభించింది.

No comments:
Post a Comment