AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు డిసెంబరు 2012

అవార్డులు డిసెంబరు 2012
ప్రతిభా రేకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
ప్రముఖ ఒరియా నవలా రచయిత్రి, విద్యావేత్త ప్రతిభా రే.. 2011 సంవత్సరానికి ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.7 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. 1943లో జన్మించిన రే ఈ పురస్కారాన్ని అందుకోబోయే 47వ రచయిత్రి. ఈమె 20కి పైగా నవలలు, మరెన్నో యాత్రా కథనాలు, చిన్న కథలు, కవితలు, వ్యాసాలు రచించారు. 

శ్రీనివాసన్‌కు అమెరికా టెక్నాలజీ అవార్డుఅమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇన్నోవేషన్’ అవార్డుకు భారత అమెరికన్ రంగస్వామి శ్రీనివాసన్ ఎంపికైయ్యారు. శ్రీనివాసన్ 1981లో అతి నీలలోహిత ఎక్సెమల్ లేజర్‌ను అభివద్ధి చేశారు. ఇది లాసిక్ శస్త్రచికిత్సలకు తోడ్పడుతుంది.

షాహబ్ గనేమ్‌కు ఠాగూర్ శాంతి బహుమతియుఏఈకి చెందిన ప్రముఖ కవి షాహబ్ గనేమ్‌కు ఠాగూర్ శాంతి బహుమతి లభించింది. కవిత్వం, శాంతి, ప్రేమలతో మానవ అవగాహనను అభివద్ధి చేసినందుకుగాను గనేమ్‌ను ఈ పురస్కారం దక్కింది. ఈయన భారతీయ కవిత్వాన్ని అరబిక్ బాషలోకి అనువదించారు. ఈ ఏడాది మే 6న కోల్‌కతాలో గనేమ్‌కు ఈ అవార్డును బహూకరిస్తారు.

ఈ పురస్కారాన్ని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదినోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

ఇళయరాజాకు సంగీత నాటక అకాడమీ అవార్డుప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు మరో తొమ్మిది మందికి 2012 సంవత్సరానికి సంగీత అకాడమీ అవార్డు లభించింది. సంగీతం, నత్యం, రంగస్థల రంగాల్లో మొత్తం 36 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అవార్డు కింద లక్ష నగదు, తామ్రపత్రం బహూకరిస్తారు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌నకు ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారు. వారు వాయిద్య కళాకారుడు టీహెచ్ వినాయకరమ్, నాటక రచయిత రతన్ థియామ్, వయోలిన్ కళాకారుడు ఎన్. రాజం ఉన్నారు. వీరికి రూ. 3 లక్షలు బహూకరిస్తారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రమే అకాడమీ ఫెలోషిప్ పొందారు.

హాకింగ్‌కు రూ.16.5 కోట్ల పురస్కారంప్రపంచంలోనే అత్యంత విలువైన సైన్స్ ‘యూరీ మిల్నర్ ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రెజ్ ఫౌండేషన్’పురస్కారం ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు దక్కింది. అవార్డు కింద ఆయనకు 30 లక్షల డాలర్లు (దాదాపు 16.5 కోట్ల రూపాయలు) మొత్తం లభించనుంది. విశ్వ రహస్యాలను తెలుసుకోవటానికి కషి చేస్తున్న లార్జ్ హాడ్రాన్ కొలైడార్ (ఎల్‌హెచ్‌సీ)కి చెందిన ఏడుగురు శాస్త్రవేత్తలకు కూడా ఈ పురస్కారం లభించింది. కష్ణ బిలాల నుంచి రేడియో ధార్మికత విడుదలవుతోందని కనుగొనటమే కాకుండా క్వాంటం గురుత్వశక్తి, తొలి నాళ్ల విశ్వంపై చేసిన పరిశోధనలకుగాను హాకింగ్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. యూరీ మిల్నర్ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. భౌతికశాస్త్రంలో చేస్తున్న పీహెచ్‌డీని మధ్యలో వదిలేసి.. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థల్లో పెట్టుడులు పెట్టి పెద్ద ఎత్తున సంపాదించాడు. సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించటం కోసం తన పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవార్డులు అందజేస్తున్నాడు.

గ్రామీ జీవిత సాఫల్య పురస్కారం: ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు దివంగత పండిట్ రవిశంకర్‌కు ‘గ్రామీ జీవిత సాఫల్య అవార్డు’ లభించింది. 2013కి గాను మరణానంతరం ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన తొలి భారతీయుడు రవిశంకరే కావడం విశేషం.

ముల్కనూర్ డెయిరీకి జాతీయ అవార్డుకరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా స్వకృషి డెయిరీకి ఉత్తమ జాతీయ సహకార సంఘం అవార్డు లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డును ప్రదానం చేశారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) స్వర్ణోత్సవ ఏడాది సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతిభ సహకార సంస్థలకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో భాగంగానే ముల్కనూర్‌తోపాటు రాంపూర్ గావ్ పంచాయత్ సమాబే సమితి లిమిటెడ్ (అసోం), సమర్థ్ సహకారీ సఖర్ కార్ఖానా లిమిటెడ్ (మహారాష్ట్ర) లకు పురస్కారాలు అందజేశారు.

తాన్‌సేన్ సమ్మాన్’ పురస్కారాలుప్రతిష్టాత్మక ‘జాతీయ తాన్‌సేన్ సమ్మాన్’ పురస్కారానికి ప్రముఖ గాయక ద్వయం రాజన్, సాజన్ మిశ్రాలు ఎంపికయ్యారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సేవ చేసినందుకుగానూ 2011-12కు వారికి ఈ పురస్కారం లభించింది.

భారతీయులకు రోలెక్స్ పురస్కారాలుప్రతిష్టాత్మక రోలెక్స్ అంతర్జాతీయ పురస్కారాలకు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదుగురు ఈ గౌరవానికి అర్హత సాధించగా.. మన దేశం నుంచి పర్యావరణవేత్త అరుణ్ కృష్ణమూర్తి, ఇంజనీర్ సుమిత్ దగార్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు 900 మంది విద్యార్థులతో కలిసి చెన్నైలోని కిల్కత్తలై సరస్సు బాగుకు చేస్తున్న కృషికిగాను అరుణ్‌కు ఈ పురస్కారం దక్కింది.

శ్రీలంక తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనాశ్రీలంకకు చెందిన తొలి ఉపగ్రహాన్ని చైనా నవంబర్ 27న ప్రయోగించింది. సూపర్‌శాట్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రభుత్వ సంస్థ గ్రేట్ వాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్.. జీచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించింది. ఈ ప్రయోగంలో శ్రీలంక ప్రభుత్వం పాల్పంచుకోలేదు.

ఐరాసలో పాలస్తీనాకు పరిశీలక హోదాఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని పరిశీలక దేశం హోదా పాలస్తీనాకు దక్కింది. ఈ హోదాను కల్పించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఈ సర్వసభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకుగాను భారత్ సహా 138 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, కెనడా, చెక్ రిపబ్లిక్ సహా తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. బ్రిటన్ సహా 41 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. పాలస్తీనా స్థాయి పెరగటం వల్ల.. హత్యాకాండ, యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం వంటి సంస్థల సేవలు ఇకపై ఆ దేశానికి అందుబాటులోకి వస్తాయి. ‘పాలస్తీనా స్ప్రింగ్’ పేరుతో పాలస్తీనాను గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా అథారిటీ 2011లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. 2011 నవంబర్‌లో యునెస్కో లో పాలస్తీనాకు సభ్యత్వం లభించింది.

భారతీయ అమెరికన్‌కు కీలక పదవిభారత సంతతికి చెందిన అంధుడైన అమెరికన్ సచిన్‌దేవ్ పవిత్రన్‌కు ఒబామా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. అమెరికాలో వికలాంగులకు సేవలందించే స్వతంత్ర సంస్థ ఆర్కిటెక్చరల్, ట్రాన్స్‌పోర్టేషన్ బారియర్స్ కంప్లయన్స్ బోర్డులో సచిన్‌దేవ్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.

No comments:

Post a Comment