AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2014

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2014
మరుగుజ్జు ఆస్టరాయిడ్ సిరీస్‌పై నీటిఆవిరి ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదవులతోన్నట్లు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు.   సిరీస్ సూర్యుడికి దగ్గరవుతున్నప్పుడు వేడెక్కి నీటి ఆవిరి విడుదలకావడాన్ని ఈఎస్‌ఏ శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలి స్కోప్ సహాయంతో కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు సిరీస్. దీని పరిమాణం 950 కి.మీ. ఆస్టరాయిడ్‌కు ఎక్కువ, గ్రహానికి తక్కువ కావడంతో దీన్ని మరుగుజ్జు గ్రహంగా వ్యవహరిస్తున్నారు. ఆస్టరాయిడ్ బెల్టులో వస్తువుపై నీటిని కనుగొనడం ఇదే తొలిసారి.
ఖనిజ వనరులను గుర్తించే గరుడ వసుధభూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ గరుడ వసుధను బెంగళూరులో జనవరి 22న కేంద్ర గనుల శాఖమంత్రి దిన్హా పటేల్ జాతికి అంకితం చేశారు. ఇది అత్యాధునిక సెన్సార్‌లతో పనిచేస్తుంది. ఈ హెలికాప్టర్‌ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వినియోగిస్తుంది. ధృవ్ తరహాకు చెందిన ఈ హెలికాప్టర్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) రూపొందించింది. 

 

భూమిలాంటి గ్రహం
భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహాన్ని గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. కెప్లర్ వ్యోమనౌక ద్వారా కనుగొన్న ఈ గ్రహానికి కెఓఐ-314గా పేరు పెట్టారు. హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడిన ఈ గ్రహం భూమికి సమానమైన ద్రవ్యరాశితోనూ, భూమి కన్నా 60 శాగతం అధిక వ్యాసంతోనూ ఉంది. 104 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఈ గ్రహంలో జీవం ఉనికి ఉండటానికి అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.


జీఎస్‌ఎల్‌వీ డి-5 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ వెహికల్ (జి.ఎస్.ఎల్.వి)-డి5 ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్‌వీ-డి5 ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని జనవరి 5న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించింది.1982 కిలోల బరువు గల జీశాట్-14 అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది టెలికాస్టింగ్, కమ్యూ నికేషన్ల కోసం 12 సంవత్సరాల పాటు సేవలందిస్తుంది. ఇందులో 12 ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. దేశీయంగా రూ పొందించిన క్రయోజెనిక్ ఇంజన్‌తో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ఇంజన్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. తొలిసారి 2010 ఏప్రిల్‌లో భారత క్రయోజెనిక్‌తో చేపట్టిన జీఎస్‌ఎల్‌వి-డి3 ప్రయోగం విఫలమైంది. ప్రస్తుత ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజెనిక్ ఇంజన్ గల అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా దేశాల సరసన భారత్ చేరింది.
  • జీఎస్‌ఎల్‌వీ-డి5 బరువు 414.75 టన్నులు. ఎత్తు 49.13 మీటర్లు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజెనిక్ అనే మూడు దశలు ఉన్నాయి.మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని,మూడోదైన క్రయోజెనిక్ దశలో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ వాడారు. క్రయోజెనిక్ ఇంజన్ అత్యంత శీతల ఇంధనంతో పని చేస్తుంది. సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. 2 వేల టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
  • ఇది ఎనిమిదో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం. తొలిసారి జీఎస్‌ఎల్‌వీ ద్వారా 2001 ఏప్రిల్ 18న చేపట్టిన జీశాట్-1 ప్రయోగం విజయవంతమైంది. తరువాత చేపట్టిన వాటిలో మూడు ప్రయోగాలు విఫలమయ్యాయి. నాలుగు విజయ వంతమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో రష్యా నుంచి పొందిన క్రయోజెనిక్ ఇంజిన్లు ఉపయోగించారు.
తొలిదశ గగన్‌కు డీజీసీఏ ధ్రువీకరణభారత గగనతలంపై ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈమేరకు ప్రతిష్ఠాత్మక నావిగేషన్.. గగన్ తొలిదశకు డీజీసీఏ నుంచి జనవరి మొదటివారంలో ధ్రువీకరణ లభించింది. దీంతో ఈ వ్యవస్థ కలిగిఉన్న అమెరికా, ఐరోపా, జపాన్ దేశాల జాబితాలో భారత్ చేరింది.

No comments:

Post a Comment