AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు సెప్టెంబరు 2012

అవార్డులు సెప్టెంబరు 2012
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 69వ వె నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను సెప్టెంబర్ 8న ప్రదానం చేశారు. వివరాలు.. 
ఉత్తమ చిత్రం (గోల్డెన్ లైన్ ప్రైజ్): ‘పీటా’, దర్శకత్వం కిమ్ కి డుక్ (దక్షిణ కొరియా) 
ఉత్తమ దర్శకుడు (సిల్వర్ లైన్): పౌల్ థామస్ అండెర్సన్ (చిత్రం: ది మాస్టర్)
ఉత్తమ నటుడు: జాక్విన్ పోయినిక్స్, ఫిలప్ సేమౌర్ 
ఉత్తమ నటి: హదాస్ యారోన్ (ఇజ్రాయెల్)
 
రాష్ట్రానికి అక్షరాస్యత మిషన్ అవార్డులుఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీకి మూడు జాతీయ అవార్డులు లభించాయి. అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిలో ఈ పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు సాక్షర్ భారత్ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జిల్లాస్థాయిలో విజయనగరం, పంచాయతీ కేటగిరీలో అనంతపురం జిల్లాలోని పి. యేలేరు గ్రామం అవార్డులు పొందాయి. అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిలో కృషి చేస్తున్న సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ ఏర్పాటు చేసింది.
సిద్ధార్థ దేవ్‌కు అమెరికా సాహిత్య అవార్డుభారతీయ రచయిత సిద్ధార్థ దేవ్‌కు అమెరికా సాహిత్య పురస్కారం ‘పెన్ ఓపెన్ బుక్’ అవార్డు లభించింది. ‘ద బ్యూటిఫుల్ అండ్ ది డామ్డ్: ఏ పోట్రెయెట్ ఆఫ్ ది న్యూ ఇండియా’ అనే నాన్-ఫిక్షన్ పుస్తకం రాసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అధిక జీతాలు పుచ్చుకునే కాల్ సెంటర్ ఉద్యోగుల నుంచి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల దాకా పలు వర్గాల ప్రజల జీవితాల గురించి ఆయన చక్కగా వివరించారని కొనియాడారు. ‘పెన్’ అవార్డు కింద 5 వేల డాలర్ల నగదు బహుమతి ఇస్తారు.

No comments:

Post a Comment