AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2013

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2013
సౌర కుటుంబం ఆవలికి వెళ్లిన వాయేజర్ - 1అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన వ్యోమ నౌక వాయేజర్-1 సౌర కుటుంబం దాటి నక్షత్రాంతర రోదసీ (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లో ప్రవేశించింది. సౌర కుటుంబం దాటి అవతలికి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత వస్తువు వాయేజర్-1. సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసీని అధ్యయనం చేసేందుకు 1977లో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. 36 ఏళ్లుగా సాగుతున్న యాత్రలో వాయేజర్-1.. 1900 కోట్ల కి.మీ ప్రయాణించింది. ఈ యాత్రకు సంబంధించిన సమాచారాన్ని సెప్టెంబర్ 12 సంచికలో ‘సైన్స్’ పత్రిక ప్రచురించింది.

చవకైన రాకెట్‌ను ప్రయోగించిన జపాన్జపాన్ చవకైన రాకెట్ ‘ఎప్సిలోన్’నూ కైసూ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 14న ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ‘స్ప్రింట్-ఎ’ అనే తొలి స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షానికి పంపింది. గ్రహాల పరిశీలనకు ఈ టెలిస్కోప్ తోడ్పడుతుంది. ‘ఎప్సిలోన్’ రాకెట్‌ను 40 మిలియన్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. ఈ వ్యయం జపాన్ ప్రధాన రాకెట్ ‘హెచ్ 2ఎ’లో మూడో వంతు మాత్రమే. ‘హెచ్ 2ఎ’ రాకెట్‌లో మూడో వంతు సైజులో అంటే 24 మీటర్ల పొడవు గల ‘ఎప్సిలోన్’ను ఒక వారంలో ప్రయాణానికి సిద్ధం చేయొచ్చు. ఇది ‘హెచ్ 2ఎ’ తీసుకునే సమయంలో ఆరో వంతు మాత్రమే.

అగ్ని-5 పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఖండాంతర క్షిపణి అగ్ని-5 పరీక్ష విజయవంతమైంది. 5000 కి.మీ దూరంలో లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి పరీక్షను ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి సెప్టెంబర్ 15న పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని పరీక్షించడం ఇది రెండోసారి. తొలిసారి ఏప్రిల్ 19, 2012న విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి 1000 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. దీని బరువు 50 టన్నులు. పొడవు 17.5 మీటర్లు. వెడల్పు 2 మీటర్లు. ఈ క్షిపణిని 2015 నాటికి సైన్యంలో చేర్చే ముందు మరో మూడు, నాలుగు పరీక్షలు నిర్వహిస్తారు. చైనా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని చాలా భూ భాగం అగ్ని-5 పరిధిలోకి వస్తాయి.

No comments:

Post a Comment