సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2015
పీఎస్‌ఎల్‌వీ సీ-30 ప్రయోగం విజయవంతం
ఖగోళ పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ-30 ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇస్రో 1,513 కిలోల బరువు గల ఆస్ట్రోశాట్‌ను సెప్టెంబరు 28న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. ఆస్ట్రోశాట్‌తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఇండోనేషియాకు చెందిన లపాన్-2 (76 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (14 కిలోలు), యూఎస్‌కు చెందిన లెమర్-2, 3, 4, 5 (28 కిలోలు) ఉన్నాయి. భారత్ తొలిసారి ఖగోళ పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
చైనా లాంగ్ మార్చ్-11 ప్రయోగం విజయవంతం
లాంగ్ మార్చ్-11 రాకెట్‌ను చైనా సెప్టెంబర్ 25న విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా నాలుగు సూక్ష్మ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. చైనాలో వాయవ్య ప్రాంతంలో ఉన్న గాన్సు ప్రావిన్సులోని జియుక్వాన్ శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ, చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్‌ను అభివృద్ధి చేశాయి. సూక్ష్మ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. లాంగ్‌మార్చ్ రాకెట్ల చరిత్రలో ఇది 211వ మిషన్.
భారీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కొచ్చి జలప్రవేశం
భారతదేశ నౌకాదళంలోకి క్షిపణి సామర్థ్యమున్న అత్యాధునిక విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కొచ్చి చేరింది. భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద నౌక అయిన ఐఎన్‌ఎస్ కొచ్చిని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబర్ 30న ముంబైలోని నేవీ డాక్‌యార్డ్‌లో జలప్రవేశం చేయించారు. వ్యయం: రూ. 4వేల కోట్లు బరువు: 7,500 టన్నులుపొడవు: 164 మీటర్లుబీమ్(నౌక మధ్యభాగం వెడల్పు):17 మీటర్లు
నౌకలోని బహళ నిఘా వ్యవస్థ, ప్రమాద హెచ్చరికల వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్తుంది (ఒక నాటికల్ మైలు 1.852 కిమీకి సమానం). దీనిలో 40 మంది అధికారులు, 350 మంది జవాన్లు ఉంటారు.
అమోఘ-1 క్షిపణి పరీక్ష విజయవంతం
యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్ అమోఘ-1ను సెప్టెంబరు 10న భారత్ విజయవంతంగా పరీక్షించింది. యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్‌ను మధ్యప్రదేశ్‌లోని బాబినా ఆర్మీ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తెలిపింది. ఈ క్షిపణి 2.8 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో దీన్ని అభివృద్ధి చేశారు.
20 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా
ఉపగ్రహ వాహక నౌక లాంగ్ మార్చ్-6 ద్వారా చైనా ఒకేసారి 20 సూక్ష్మ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టింది. సెప్టెంబరు 20న షాంఘై ప్రావిన్సులోని తైయువాన్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌లో ఇంధనంగా కాలుష్య రహిత ఇంధనాలు ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌లను ఉపయోగించారు.
స్పేస్ షాట్‌గన్ అభివృద్ధి చేస్తున్న నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రపంచంలోనే తొలి స్పేస్ షాట్ గన్‌ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్‌ని ఈ షాట్‌గన్‌తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో దీన్ని తయారుచేస్తోంది. ఆస్టరాయిడ్ రీడెరైక్ట్ మిషన్(ఏఆర్‌ఎమ్)లో భాగంగా నాసా షాట్‌గన్ తయారీపై దృష్టిసారించింది. ఆస్టరాయిడ్‌లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడెరైక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం.
ఐఎన్‌ఎస్ వజ్రకోష్ ప్రారంభం
నౌకా స్థావరం ఐఎన్‌ఎస్ వజ్రకోష్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 9న కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరంలో ప్రారంభించారు. పశ్చిమ తీరం నుంచి యుద్ధ నౌకల నిర్వహణకు ఈ స్థావరం ఉపయోగపడుతుంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్మించింది. దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలను స్థావరంలో నిల్వ చేస్తారు. ఇది కార్వార్‌లో ఏర్పాటైన మూడో నౌకా స్థావరం.
దక్షిణాఫ్రికా గుహల్లో కొత్త ‘మానవ జాతి’
మానవ కుటుంబ వృక్షానికి చెందిన కొత్త జాతి ఆనవాళ్లను దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సమీపంలో రైజింగ్ స్టార్ గుహల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరు 10న మగలీస్‌బర్గ్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. శిలాజాలు వెలుగుచూసిన నలెడి గుహ పేరిట ఈ కొత్త జాతికి హోమో నలెడిగా పేరుపెట్టారు. నలెడి గుహలో 15 జీవులకు సంబంధించిన 1500కు పైగా ఎముకలు లభించాయి. ఈ శిలాజాల వయసు 25 లక్షల ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఐఎస్‌ఎస్‌కు చేరిన రష్యా వ్యోమనౌక
ముగ్గురు వ్యోమగాములతో కూడిన రష్యా వ్యోమనౌక సెప్టెంబర్ 4, 2015వ తేదీన విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) చేరింది. కజక్‌స్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సూయజ్-ఎఫ్‌జీ రాకెట్ ద్వారా ప్రయోగించిన సూయజ్ టీఎమ్‌ఏ-18ఎమ్ ఐఎస్‌ఎస్‌కు చేరింది. ప్రయోగించిన ఆరుగంటల్లోపే ఐఎస్‌ఎస్‌కు చేరే లా మొదట ప్రణాళిక రూపొందించినా భద్రతా సమస్యల కారణంగా యాభై గంటలకు చేరేలా తరువాత షెడ్యూల్‌ను మార్పు చేశారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో వ్యోమగాములు సెర్జీ వోల్‌కోవ్, ఆండ్రియాస్ మొగెసెన్, ఎమ్‌బెతోవ్ ఉన్నారు.
పాకిస్తాన్ తొలి స్వదేశీ ద్రోన్
తొలిసారి దేశీయంగా తయారు చేసిన, సాయుధ ద్రోన్ బురాఖ్‌ను సెప్టెంబర్ 7, 2015వ తేదీన పాకిస్తాన్ రంగంలోకి దింపింది. తొలి దాడిలోనే ఆ ద్రోన్ అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని షావల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరంలో దాక్కుని ఉన్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. పైలట్ రహిత చిన్న విమానం ఆ స్థావరంపై బుర్ఖ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. బురాఖ్ రూపకల్పనతో క్షిపణులను ప్రయోగించగల ద్రోన్‌లను కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనాల సరసన పాకిస్తాన్ కూడా చేరింది.
నాసా కొత్త టార్గెట్ఫ్లూటోను దాటి రికార్డు సృష్టించిన ‘నాసా’ న్యూహారిజాన్స్ వ్యోమనౌక... సౌరకుటుంబం అవతల ఆవరించి ఉన్న క్యూపర్ బెల్ట్ ప్రాంతంలోని ‘2014 ఎంయూ69 (పీటీ1)’ అనే గ్రహశకలంపై పరిశోధన చేయనుంది. ఫ్లూటోకు అవతల 30 మైళ్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలాన్ని న్యూహారిజాన్స్ తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నట్లు నాసా ప్రకటించింది. క్యూపర్‌బెల్ట్‌పై సూర్యకిరణాల ప్రభావం అతి తక్కువగా ఉంటుందని.. ఈ ‘పీటీ1’పై పరిశోధన చేస్తే సౌరకుటుంబం ఆవిర్భావం నాటి అంశాలు తెలిసే అవకాశముందని తెలిపింది. సౌరకుటుంబంపై పరిశోధన చేయడానికి 2006, జనవరి 19న న్యూహారిజాన్స్‌ను ప్రయోగించారు.
పర్యావరణ సమాచార కేంద్రం ఏర్పాటుచేసిన నాసా, యూఎస్‌ఏఐడీలోయర్ మెకంగ్ రీజియన్‌లోని ఐదు దేశాల్లో(మైన్మార్, కంబోడియా, లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం) పర్యావరణ పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ) సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించాయి. సెర్ విర్-మెకంగ్ (SERVIR Mekong)గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు ప్రధాన భవనం బ్యాంకాక్‌లో ఏర్పాటుచేశారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, విధానకర్తలు ఈ ప్రాజె క్టులో భాగస్వాములవుతారు. విపత్తు నిర్వహణ, ఆహార భద్రత, ప్రజారోగ్యం, నీటి వనరుల నిర్వహణ తదితర అంశాల్లో ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలకు భూ పరిశీలనలు, భౌగోళిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సహాయ సహకారాలు అందిస్తుంది.
భారతీయ భాషలను బ్రె యిలీ లిపిలోకి మార్చే సాఫ్ట్‌వేర్భారతీయ భాషలను బ్రెయిలీ లిపిలోకి మార్చే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. హిందీ, బెంగాళీ, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కన్నడ తదితర భాషలను బ్రెయిలీ లిపిలోకి మార్చే స్పర్శ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్‌ను ఐఐటీ-ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ అనుపమ్ బసు నేతృత్వంలోని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ ఏ భారతీయ భాషనైనా యూనీకోడ్‌గా తీసుకొని బ్రెయిలీ లిపిగా మారుస్తుంది.

No comments:
Post a Comment