AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2017

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2017
ఏరోసాల్ రూపొందించిన వారికి నాసా నజరానా 
అతి తక్కువ ఖర్చుతో, తేలికై న ఏరోసాల్ సెన్సార్‌ను రూపొందించిన వారికి లక్ష డాలర్లను నజరానాగా అందజేస్తామని నాసా ప్రకటించింది. ఈ మేరకు రాబర్ట్ వుడ్ జాన్సన్‌‌స ఫౌండేషన్‌తో కలిసి ఎర్త అండ్ స్పేస్ ఎయిర్ ప్రైజ్ కాంపిటీషన్‌ను ప్రకటించింది.
గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన ఎయిర్ పార్టికల్స్‌ను గుర్తించి, అడ్డుకునే సెన్సార్లే.. ఏరోసాల్స్. వీటిని రూపొందించినట్లయితే భూమిపైన జీవించేవారితోపాటు అంతరిక్షంలో ప్రయోగాలు చేసే వ్యోమగాములకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ సెన్సార్ల రూపకల్పనకు నాసా అత్యంత ప్రాధాన్యమిస్తోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏరోసాల్ రూపొందించిన వారికి లక్ష డాలర్లు నజరానా 
ఎప్పుడు : సెప్టెంబర్ 20 
ఎవరు : నాసా 
ఎందుకు : గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన ఎయిర్ పార్టికల్స్‌ను గుర్తించి, అడ్డుకునే సెన్సార్ల రూపకల్పనకు

హిమాచల్‌ప్రదేశ్‌లో దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ ప్రారంభం పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్‌ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న ప్రారంభించింది. మనాలి - రోహ్‌తంగ్ మధ్య ఉన్న 51 కిలోమీటర్ల మార్గంలో ఈ బస్సు సేవలను ప్రారంభించింది. అలాగే.. త్వరలో కులు ప్రాంతంలో 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను ఈ తరహా బస్సులను అందుబాటులోకి తేనుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : మనాలి - రోహ్‌తంగ్ మధ్య
ఎందుకు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా 

ఇరాన్ ఖోరంషాహ్ర్ క్షిపణి పరీక్ష సక్సెస్అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ సెప్టెంబర్ 23న మధ్య శ్రేణి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఖోరంషాహ్ర్ అనే ఈ క్షిపణిని ఇరాన్ సైనిక కవాతులో ప్రదర్శించింది. 2,000 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదనీ, బహుళ సంఖ్యలో వార్‌హెడ్లను మోసుకెళ్లగలదని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. 
ఇరాన్ శత్రుదేశాలైన ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. 2015లో ఇరాన్‌కు, ఇతర ప్రధాన దేశాలకు అణు పరీక్షల నిషేధంపై ఒప్పందం కుదిరింది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనా, రష్యా, యూరోపియన్ కూటమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2025 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర పరీక్షలు జరపకుండా ఇరాన్‌పై ఆంక్షలున్నాయి. క్షిపణి పరీక్షలను జరిపితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖోరంషాహ్ర్ క్షిపణి పరీక్ష సక్సెస్
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఇరాన్

పాక్ యాంటి - షిప్ క్షిపణి పరీక్ష విజయవంతంగగనతలం నుంచి సముద్ర ఉపరితలంపైకి ప్రయోగించే యాంటి-షిప్ క్షిపణిని పాకిస్తాన్ నౌకాదళం సెప్టెంబర్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఇందుకోసం సీ కింగ్ హెలికాప్టర్లను పాక్ వినియోగించింది. పాకిస్తాన్ గతేడాది బ్రిటన్ నుంచి ఏడు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయగా అవి ఈ సంవత్సరం మేలో దాయాది దేశానికి అందుబాటులోకి వచ్చాయి. హెలికాప్టర్ నుంచి ప్రయోగించే ఈ క్షిపణితో సముద్ర జలాల్లో ఉన్న నౌకలు, ఇతర లక్ష్యాలను చేదించవచ్చు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యాంటి - షిప్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : పాకిస్తాన్

నాసా ఉపగ్రహంతో మలేరియా నివారణ చర్యలు 
 ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ప్రాణాంతక మలేరియా వ్యాధిని అరికట్టడానికి అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నూతన విధానాన్ని కనుగొన్నారు. నాసా అభివృద్ధి పరిచిన భూపర్యవేక్షక ఉపగ్రహాన్ని ఉపయోగించి ఏ ఏ ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందో తెలుసుకొని ముందుగానే నివారణ చర్యలు చేపట్టవచ్చని వెల్లడించారు. 
మలేరియా ప్రభావిత ప్రాంతాల గణాంకాలను సేకరించి.. తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు దోమల మందు చల్లడం, దోమ తెరలు అందజేయడం, ప్రజల్లో అవగాహనా తేవడానికి ఈ ఉపగ్రహ విధానం ఉపయోగపడుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నాసా ఉపగ్రహంతో మలేరియాను నివారించే విధానం 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 
ఎక్కడ : అమెరికాలో 

మరోసారి జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ప్యాంగ్‌యాంగ్ నుంచి సెప్టెంబర్ 15న ఈ క్షిపణిని ప్రయోగించింది. సుమారు 770 కిలోమీటర్ల ఎత్తులో.. 3,700 కిలోమీటర్లు ప్రయాణించి క్షిపణి సముద్రంలో పడిందని దక్షిణకొరియా రక్షణ శాఖ వెల్లడించింది. మూడు వారాల క్రితం జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టింది. అలాగే ఈ నెలలో మరోసారి అణుపరీక్షలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కొత్తగా ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. 

శనిగ్రహంపై ముగిసిన స్పేస్‌క్రాఫ్ట్ కస్సీని ప్రస్థానం శనిగ్రహానికి(సాటర్న్) సంబంధించిన వివరాలను, విశేషాలను అద్భుత చిత్రాల రూపంలో అందించిన కస్సీని అంతరిక్ష నౌక 20 ఏళ్ల ప్రస్థానం సెప్టెంబర్ 15తో ముగిసింది. ఈ మేరకు కస్సీని ప్రస్థానానికి ముగింపునిచ్చేందుకు నాసా శాస్త్రవేత్తలు దానిని శనిగ్రహ వాతావరణంలోకి పంపించి, దానికదే మండిపోయేలా చేశారు. 
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శనిగ్రహ సమాచార సేకరణ కోసం ఈ నౌకను 1997 అక్టోబర్‌లో ప్రయోగించింది. జూలై 2004 నుంచి 2017 సెప్టెంబర్ వరకు కస్సీని 4.5 లక్షల చిత్రాలను, 635 గిగాబైట్ల సమాచారాన్ని పంపించింది. ఆ వివరాలు ముఖ్యంగా శనిగ్రహానికి, ఆ గ్రహానికి చెందిన 62 ఉపగ్రహాలకు సంబంధించినవి. 

‘అస్త్ర’ క్షిపణి పరీక్ష విజయవంతం 
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే-బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజుల పాటు జరిగిన ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ సెప్టెంబర్ 15న ప్రకటించింది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి. ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అస్త్ర క్షిపణి పరీక్షలు విజయవంతం 
ఎప్పుడు : సెప్టెంబర్ 11 - 14 
ఎవరు : రక్షణ శాఖ 
ఎక్కడ : చాందీపూర్ తీరం, ఒడిశా 
ఎందుకు : గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే-బీవీఆర్‌ఏఏఎమ్ 

మూడో శతాబ్దంలోనే భారత్‌లో సున్నా గణితంలో ఎంతో కీలకమైన సున్నాను భారతీయులు మూడో శతాబ్దంలోనే విరివిగా వినియోగించారని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. అవిభక్త భారత్‌లోని బక్షాలి గ్రామంలో(ఇప్పటి పాకిస్తాన్‌లో ఉంది) 1881లో ఓ పొలంలో దొరికిన రాతప్రతిని కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. 
ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 9వ శతాబ్దానికి చెందిన ఓ దేవాలయం గోడలపై ఉన్న సున్నాయే ప్రాచీనమని భావించినట్లు పరిశోధనలో పాల్గొన్న ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మార్కస్ డు సౌటోయ్ వెల్లడించారు. గతంలో పరిశోధకులు బక్షాలి రాతప్రతిని 8 నుంచి 12వ శతాబ్ద కాలానికి చెందినదిగా భావించినట్లు పేర్కొన్నారు. 

గూగుల్ ‘తేజ్’ సేవలు ప్రారంభం 
డిజిటల్ చెల్లింపుల కోసం టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సంస్థ రూపొందించిన ‘తేజ్’ యాప్‌ని సెప్టెంబర్ 18న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఇది కేవలం భారత మార్కెట్ కోసమే తీసుకొచ్చిన యాప్ అని, ఎలక్ట్రానిక్ చెల్లింపులను మరింత భద్రంగా సులభంగా నిర్వహించడమే తేజ్ లక్ష్యమని గూగుల్ పేర్కొంది. 
కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. యాప్‌లోకి బ్యాలన్స్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా.. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. 
తేజ్ సేవలకు గాను గూగుల్ యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే.. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న 50 బ్యాంకుల కస్టమర్లు తేజ్ సేవలు వినియోగించుకోవచ్చు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డిజిటల్ చెల్లింపుల యాప్ తేజ్ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : గూగుల్ 
ఎక్కడ : భారత్‌లో

డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన మహీంద్రా ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎంఅండ్ఎం) దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని వచ్చే ఏడాది దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. ఇక 20 హెచ్‌పీ- 100 హెచ్‌పీ శ్రేణిలోని ట్రాక్టర్లలోనూ డ్రైవర్‌లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : మహింద్రా అండ్ మహింద్రా

నాగ్ క్షిపణి పరీక్ష విజయవంతం దేశీయంగా తయారైన మూడో తరం ఏటీజీఎం(యాంటీ-ట్యాంక్ గెడైడ్ మిసైల్) నాగ్ పరీక్ష విజయవంతమైంది. ఈ మేరకు సెప్టెంబర్ 8న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నాగ్ క్షిపణిని రాజస్తాన్ ఎడారిలో రెండు సార్లు పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. 
ఈ ఏడాది జూన్‌లోనూ ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 నాగ్ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 
ఎక్కడ : రాజస్తాన్‌లోని ఎడారిలో 
ఎందుకు : 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు 

అతి భారీ కృష్ణ బిలం గుర్తింపు
మన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణ బిలాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సూర్యుని కన్నా దాదాపు లక్ష రెట్లు ఎక్కువ సైజులో ఉంటుందని, పాల పుంత కేంద్ర భాగంలోని విష వాయువుల సమూహం వెనక (కేంద్ర భాగానికి 200 కాంతి సంవత్సరాల దూరంలో 150 ట్రిలియన్ కిలోమీటర్ల మేర) ఉందని తెలిపారు. మన గెలాక్సీలోని సాజిటేరియస్-ఏ అనే కృష్ట బిలమే ఇప్పటివరకు అత్యంత పెద్దది. ప్రస్తుతం కనుగొన్న కృష్ణ బిలం రెండో అతి పెద్దదై ఉండొచ్చని భావిస్తున్నారు. కృష్ణ బిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయని పేర్కొన్నారు.

పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆగస్టు 31న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ- సీ 39 రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. భారత్‌కు సొంత దిక్సూచి వ్యవస్థను సమకూర్చడంలో భాగంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మోసుకెళ్లిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరలేకపోయింది. ఉష్ణకవచం (హీట్ షీల్డ్) రాకెట్ నుంచి వేరుపడకపోవడంతో దానిలో ఉన్న ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లలేదనీ, నాలుగో దశలోనే ఇరుక్కుపోయిందని ఇస్రో వెల్లడించింది. 
కాగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు సంక్షిప్త రూపమైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం వైఫల్యం చెందడం గత 24 ఏళ్లలో ఇదే తొలిసారి. పీఎస్‌ఎల్‌వీ చరిత్రలోనే రెండోసారి. 1993 సెప్టెంబరు 20న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-డీ1 అనే రాకెట్ ఐఆర్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని నింగికి మోసుకెళ్లడంలో తొలిసారి విఫలమైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ - 39 ప్రయోగం విఫలం 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ఇస్రో 
ఎక్కడ : శ్రీహరికోట, నెల్లూరు

ఆరోసారి అణు పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు ఆరో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని, ఈసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా సెప్టెంబర్ 3న ప్రకటించింది. ఈ అణు పరీక్ష వాస్తవిక సామర్థ్యం ఎంత అనేదానిపై స్పష్టత రాలేదు. దక్షిణకొరియా వాతావరణ ఏజెన్సీ మాత్రం ప్రస్తుత ప్రయోగం వల్ల వచ్చిన ప్రకంపనలు గత ప్రయోగాల కంటే ఐదారురెట్లు ఎక్కువని వెల్లడించింది. దీని వల్ల చైనా, రష్యాలో పలు భవనాలు కంపించినట్టు పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హైడ్రోజన్ బాంబుని పరీక్షించిన ఉత్తర కొరియా 
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎక్కడ : ఉత్తర కొరియాలో 

అతి భారీ కృష్ణబిలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలుమన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణబిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి కంటే దాదాపు లక్ష రెట్లు ఎక్కువ పరిమాణాన్ని ఇది కలిగి ఉంటుందని తెలిపారు. ఇది మన పాలపుంత కేంద్ర భాగంలో ఉన్న విష వాయువుల సమూహం వెనుక దాక్కుని ఉందన్నారు. మన గెలాక్సీలోని ‘సాజిటేరియస్ ఏ’ అనే కృష్ణ బిలం ఇప్పటివరకు అత్యంత పెద్దది. అయితే, ప్రస్తుతం కనుగొన్న ఈ కృష్ణబిలం రెండో అతిపెద్దది అయి్య ఉండవచ్చని భావిస్తున్నారు. మన పాలపుంత కేంద్ర భాగానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కృష్ణబిలం ఉంది. ఇది దాదాపు 150 ట్రిలియన్ కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణబిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయి.

No comments:

Post a Comment