AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2017

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2017
100 గ్రామాలను డిజిటలైజ్ చేసిన ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంకు 100 రోజుల్లో దేశవ్యాప్తంగా 100 గ్రామాలను డిజిటల్‌గా తీర్చిదిద్దింది. ఇందుకోసం నైపుణ్య శిక్షణతోపాటు రుణ సదుపాయం కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. 100 రోజుల్లో 11,300 మందికి వొకేషనల్ శిక్షణ ఇప్పించింది. వీరిలో 70 శాతం మహిళలే ఉన్నారు. 2017 డిసెంబర్ నాటికి మరో 500 గ్రామాలను ఐసీఐసీఐ డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు 50,000 మందికి శిక్షణ ఇప్పిస్తామని బ్యాంకు చీఫ్ చందా కొచర్ పేర్కొన్నారు. 
ఐసీఐసీఐ బ్యాంకు 100 డిజిటల్ గ్రామాల ప్రాజెక్టు 2016 నవంబర్‌లో మొదలైంది. 2015లో గుజరాత్‌లోని అకోదర గ్రామంలో డిజిటల్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టిన ఐసీఐసీఐ అది విజయవంతం కావడంతో 100 గ్రామాలను ఇదే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : 100 గ్రామాల డిజిటలీకరణ
ఎప్పుడు : మే 2 నాటికి
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంక్
ఎక్కడ : గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 17 రాష్ట్రాలు

తొలి రవాణా స్పేస్ క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపిన చైనా  చైనా తన తొలి రవాణా స్పేస్ క్రాఫ్ట్ తియన్జూ - 1ని ఏప్రిల్ 20న ప్రయోగించింది. వెంచాంగ్ సాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మార్చి - 7 వై2 రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోని తియాంగాంగ్ - 2 పరిశోధనశాలతో అనుసంధానమైంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ 6 టన్నుల సరుకులు, 2 టన్నుల ఇంధనాన్ని తీసుకెళ్లగలదు. 
చైనా 2022 నాటికి అంతరిక్షంలో permanent manned space station ను ఏర్పాటు చేయనుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : తియన్జూ - 1 స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం 
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : చైనా 
ఎక్కడ : వెంచాంగ్ సాటిలైట్ లాంచ్ సెంటర్
ఎందుకు : శాశ్వత స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతంసముద్రంపై నుంచి భూ ఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని (ల్యాండ్ అటాక్ మిస్సైల్) భారత నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న బంగాళాఖాతంలోని ఐఎన్‌ఎస్ టెగ్ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించింది. దీంతో ల్యాండ్ అటాక్ మిస్సైల్ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాల సరసన భారత్ నిలిచింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : బ్రోహ్మోస్ ల్యాండ్ అటాక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : భారత నౌకాదళం
ఎక్కడ : బంగాళాఖాతంలో ఐఎన్‌ఎస్ టెగ్ నౌక నుంచి
ఎందుకు : సముద్రంపై నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాల ఛేదనకోసం

సూపర్ బెలూన్‌ను ప్రయోగించిన నాసా దాదాపు ఫుట్‌బాల్ స్టేడియం సైజులో ఉన్న సూపర్ ప్రెజర్ బెలూన్‌ను నాసా ఏప్రిల్ 25న ప్రయోగించింది. మన పాలపుంతకు అవతల ఉన్న కాస్మిక్ కిరణాలపై ప్రయోగాలు చేసేందుకు న్యూజిలాండ్‌లోని వనాకా ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ సూపర్ ప్రెజర్ బెలూన్‌ను నింగిలోకి పంపినట్లు నాసా ప్రకటించింది. దాదాపు 100 రోజులపాటు, 33.5 కిలోమీటర్ల (20.8 మైళ్లు) ఎత్తులో భూమిచుట్టూ తిరిగి కాస్మిక్ కిరణాలు భూవాతావరణంలోకి చొచ్చుకొస్తున్న తీరును ఇది పరిశీలిస్తుంది. 
తొలిసారి 2015 మార్చి 27న నాసా ప్రయోగించిన సూపర్ ప్రెజర్ బెలూన్ ఫ్లయిట్ 32 రోజుల 5 గంటల 51 నిమిషాలు ప్రయాణించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో సూపర్ బెలూన్ ప్రయోగం 
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : నాసా 
ఎక్కడ : న్యూజిలాండ్‌లోని వనాకా ఎయిర్‌పోర్ట్ నుంచి 
ఎందుకు : కాస్మిక్ కిరణాలపై ప్రయోగాలు చేసేందుకు

దక్షిణ కొరియాతో తుపాకుల తయారీ ఒప్పందంసైన్యాలకు అవసరమైన తుపాకుల తయారీకి, షిప్‌బిల్డింగ్‌లో సహకారానికి భారత్, దక్షిణ కొరియాల మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు దక్షిణ కొరియా రక్షణ సేకరణల మంత్రి చాంగ్ మైయాంగ్ జిన్ భారత్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 21న న్యూఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఓడల నిర్మాణ ఒప్పందం (ప్రభుత్వ) ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కుదిరింది. ఓడల నిర్మాణాన్ని విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చేపడుతుంది. తుపాకుల తయారీ ఒప్పందం (ప్రైవేట్) భారత్‌కు చెందిన ఎల్ అండ్ టీ, దక్షిణ కొరియాకు చెందిన హన్వా టెక్‌విన్‌ల మధ్య కుదిరింది.

కోస్టుగార్డు నౌక ‘చార్లీ-423’ ప్రారంభం  ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డు పరిధిలో చేరిన 3వ ‘ఇంటర్ సెప్టార్ చార్లీ-423’ కోస్టుగార్డు నౌకను ఏప్రిల్ 13న ప్రారంభించారు. ఇది తీర ప్రాంతం వెంట గస్తీ నిర్వహిస్తుంది. 
భారత తీర ప్రాంతంలో ప్రస్తుతం ఇండియన్ కోస్టుగార్డుకు చెందిన 109 నౌకలు గస్తీ నిర్వహిస్తున్నాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కోస్టుగార్డు నౌక చార్లీ-423 ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఇండియన్ కోస్ట్‌గార్డ్ 
ఎక్కడ : కృష్టపట్నం, నెల్లూరు జిల్లా
ఎందుకు : తీర ప్రాంత గస్తీ కోసం 

డిసెంబర్‌నాటికి దేశంలో 31 ఎర్త్ అబ్జర్వేటరీలుభూకంపాల సమాచారం పొందేందుకు 2017 డిసెంబర్ నాటికి దేశంలో మరో 31 భూ పరిశీలన కేంద్రాల (అబ్జర్వేటరీల)ను భూ విజ్ఞాన శాఖ ఏర్పాటు చేయనుంది. ఇవి భూ అంతర్భాగ కదలికలను డిజిటల్ సిస్మోగ్రఫీ ద్వారా రికార్డు చేస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 84 అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఇవి భూకంపాలకు సంబంధించిన సమాచారన్ని జాతీయ సిస్మోలాజికల్ కేంద్రానికి పంపిస్తాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : దేశంలో 31 ఎర్త్ అబ్జర్వేటరీల ఏర్పాటు 
ఎప్పుడు : 2017 డిసెంబర్ నాటికి 
ఎవరు : భూ విజ్ఞాన శాఖ
ఎందుకు : భూకంపాల సమాచారాన్ని పొందేందుకు

కొత్త అంశాలతో గూగుల్ ఎర్త్ సర్వీస్టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన మ్యాపింగ్ సర్వీసు ‘గూగుల్ ఎర్త్’ ను ఏప్రిల్ 18న మరిన్ని కొత్త అంశాలతో ఆవిష్కరించింది. దీనిని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్ ఫోన్లలో సైతం వాడుకునేలా తీర్చిదిద్దారు. దీంతో పాటు కొత్త ప్రదేశాల గురించి అనుభవజ్ఞులు తెలిపిన వివరాలను ‘వాయెజర్’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కృత్రిమ మేధతో పనిచేసే వాయెజర్‌లో వివిధ పర్వతాలు, దేశాలు, ప్రముఖ స్థలాలను గుర్తించడానికి వీలుగా నాలెడ్‌‌జ కార్డులను ప్రవేశపెట్టారు. దీని రూపకల్పనలో నాసా, బీబీసీ ఎర్త్, సీసెమ్ స్ట్రీట్, జేన్‌గుడెల్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు పాలుపంచుకున్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : కొత్త అంశాలతో గూగుల్ ఎర్త్ సర్వీస్
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : గూగుల్

షిజియాన్-13 ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనాచైనా ఏప్రిల్ 12న సమాచార ఉపగ్రహం షిజియాన్-13ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహ ప్రయోగంతో అత్యధిక వేగంతో నడిచే రైళ్లలోని వారు సైతం ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలను చూడగలుగుతారు. దీంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సులువుగా సాయం అందించడానికీ వీలవుతుంది.

భారత నావికా దళం నుంచి నిష్ర్కమించిన టీయూ - 142  భారత నావికా దళంలో 29 ఏళ్లపాటు విశేష సేవలందించిన టీయూ-142ఎం రకానికి చెందిన యుద్ధ విమానం విధుల నుంచి నిష్క్రమించనుంది. ఈ మేరకు ఏప్రిల్ 8న విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ డేగా రన్‌వేలో ఈ యుద్ధ విమానం చివరిసారిగా నేలపైకి దిగింది. సుదూర క్షిపణులను ప్రయోగించడం, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ వంటి కార్యక్రమాల్లో టీయూ - 142 సేవలు అందించింది. 
ఈ యుద్ధ విమానాన్ని విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : విధుల నుంచి నిష్ర్కమించిన టీయూ - 142 
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : భారత నావికా దళం 
ఎక్కడ : విశాఖపట్నం 

కవల శుక్ర గ్రహాన్ని కనుగొన్న నాసా భూమికి 219 కాంతి సంవత్సరాల దూరంలో కవల శుక్ర గ్రహాన్ని కనుగొన్నట్లు నాసా శాస్త్రవేత్తలు ఏప్రిల్ 9న ప్రకటించారు. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్‌తో పరిశీలించగా ఇది ఓ ప్రకాశహీనమైన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు గుర్తించారు. భూమికంటే పెద్దగా ఉండే ఈ గ్రహం తొమ్మిది రోజులకొకసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. స్వల్ప ఉష్ణోగ్రత కలిగిన ఈ గ్రహానికి కెప్లర్-1649 అని నామకరణం చేశారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కవల శుక్రగ్రహం గుర్తింపు 
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : నాసా శాస్త్రవేత్తలు

పునర్వినియోగ రాకెట్‌ను ప్రయోగించిన నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (స్పేస్‌ఎక్స్) మొట్టమొదటి సారిగా పునర్వినియోగ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా సమాచార ప్రసార ఉపగ్రహాన్ని మార్చి 30న అంతరిక్షంలోకి పంపించింది. ఈ రాకెట్‌ను ఏడాది క్రితం అంతరిక్షంలోకి పంపి తిరిగి సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. మళ్లీ అదే రాకెట్‌కు తొమ్మిది ఇంజన్లను ఏర్పాటు చేసి స్పేస్ ఎక్స్ దీన్ని ఆధునికీకరించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : పునర్వినియోగ రాకెట్ ప్రయోగం
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : నాసాకు చెందిన స్పేస్‌ఎక్స్

50 వేల ప్రదక్షిణలు చేసిన వ్యోమనౌకనాసాకు చెందిన మార్స్ రికాన్‌సెన్స్ ఆర్బిటర్ (ఎంఆర్‌వో) అంగారకుడి చుట్టూ 50 వేలసార్లు తిరిగింది. దీన్ని 2005లో ప్రయోగించారు. ఇది ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని శాస్త్రవేత్తలు మార్చి 29న తెలిపారు.

ప్రైవేటు భాగస్వామ్యంతో ఇస్రో ఉపగ్రహాలు భారత సమాచార వ్యవస్థకు సంబంధించి రెండు భారీ ఉపగ్రహాల తయారీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్‌తో ఏప్రిల్ 2న ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ. 400 కోట్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల్లో ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు 70 మంది ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. కాగా పూర్తిస్థాయి సమాచార ఉపగ్రహాల తయారీకి ఇస్రో ఓ ప్రైవేటు పరిశ్రమతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రైవేటు సంస్థతో ఆల్ఫా డిజైన్‌తో ఇస్రో ఒప్పందం 
ఎప్పుడు : ఏప్రిల్ 2 
ఎవరు : ఇస్రో - అల్ఫా 
ఎందుకు : సమాచార ఉపగ్రహాల తయారీకి

No comments:

Post a Comment