AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు ఏప్రిల్ 2013

అవార్డులు ఏప్రిల్ 2013
ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి దక్షిణాఫ్రికా ‘నేషనల్ ఆర్థర్’ సత్కారందక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత జాతీయ పురస్కారం ‘నేషనల్ ఆర్థర్’ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి లభించింది. మరో ఆరుగురు భారత సంతతి వ్యక్తులతో కలుపుకొని 38 మంది దేశ, విదేశీయులకు కూడా ఈ అవార్డును బహూకరించారు. ఈ సత్కారాన్ని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం ఏప్రిల్ 27న ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ ప్రదానం చేసారు. దౌత్యవేత్త అయిన శ్రీనివాసులు రెడ్డి 1963 నుంచి జాతివివక్ష వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 

సైనా నెహ్వాల్‌కు ‘యుధ్‌వీర్’ అవార్డుబ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు 2013 సంవత్సరానికి గానూ ‘యుధ్‌వీర్’ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సాధించిన ఘనతకు సైనాకు ఈ అవార్డు దక్కింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు యుధ్‌వీర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. 1992 నుంచి ప్రతి ఏటా వివిధ రంగాల్లో కషి చేసిన వారికి ‘యుధ్‌వీర్’ స్మారక ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు కింద ’ 50,000 నగదు అందజేస్తారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, డాక్టర్ అంజిరెడ్డి, శ్యామ్ బెనగల్, శాంతా సిన్హా తదితరులకు గతంలో ఈ అవార్డును బహూకరించారు.

రావూరికి జ్ఞానపీఠ్ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు (48వ) దక్కింది. ఆయన రాసిన ‘పాకుడురాళ్లు’ నవలకుగాను ఈ పురస్కారం లభించింది. తొలిసారి తెలుగు వచన రచనకు ఈ అవార్డు దక్కింది. తెలుగులో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని దక్కించుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఇంతకు ముందు 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో సి.నారాయణ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రావూరి 1968, 1983లో రాష్ర్టసాహిత్య అకాడమీ అవార్డు, 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1987లో రాజాలక్ష్మీ అవార్డులను అందుకున్నారు. 37 కథా సంపుటాలు, 17 నవలలు, బాలల కోసం 6 నవలలు, 5 కథా సంకలనాలు, 3 వ్యాసాలు, 8 నాటకాలు రాశారు. కాదంబరి, పాకుడు రాళ్లు, జీవన సమరం, ఇనుపతెర వెనుక, కౌముది వంటి రచనలు భరద్వాజకు మంచి పేరు తెచ్చాయి. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్. ఈ అవార్డు కింద ప్రశంసపత్రం, రూ.7 లక్షల నగదు బహూకరిస్తారు. 2011 సంవత్సరానికి ఒడిశా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్‌కు ఈ పురస్కారం లభించింది.

న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ అవార్డులున్యూయార్క్ టైమ్స్ పత్రికకు నాలుగు పులిట్జర్ అవార్డులు లభించాయి. పులిట్జర్ ఫిక్షన్ పురస్కారం రచయిత అడమ్ జాన్సన్‌కు దక్కింది. ‘ది ఆర్ఫాన్ మాస్టర్స్ సన్’ నవలకుగాను ఈ అవార్డు దక్కింది.

ఈక్రోలినీకి గోల్డ్‌మ్యాన్ ప్రెజ్పర్యావరణవేత్త రోసానో ఈక్రోలినీ 2013 గోల్డ్‌మ్యాన్ ప్రెజ్‌కు ఎంపికయ్యాడు. ఇటలీలో జీరో వేస్ట్ మూవ్‌మెంట్ దిశగా చేసిన కషికిగాను ఈక్రోలినీకి ఈ అవార్డు దక్కింది. పర్యావరణ రంగంలో గోల్డ్‌మ్యాన్ ప్రెజ్‌ను ఆస్కార్స్‌తో సమానంగా భావిస్తారు. 

సిక్కింకు ప్రధాని గ్రామీణాభివద్ధి అవార్డుప్రతిష్టాత్మక ప్రధానమంత్రి గ్రామీణాభివద్ధి అవార్డు 2011-12 సంవత్సరానికి సిక్కిం గ్రామీణాభివద్ధి నిర్వహణ, అభివద్ధి శాఖకు లభించింది. ఈ అవార్డును ఏప్రిల్ 21న ‘సివిల్ సర్వీస్ డే’ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బహూకరించారు. ప్రజాపాలనకు సంబంధించి వివిధ అంశాల్లో కషి చేసిన అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి పుర స్కారాలు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతెవాడ జిల్లాలో విద్యావ్యాప్తికి చేసిన కషికిగానూ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి ప్రధానమంత్రి పురస్కారం అందుకున్నారు. 

రాజ్ చెట్టికి జాన్ బేట్స్ క్లార్క్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఆర్థికవేత్త రాజ్‌చెట్టి (33)కి ప్రతిష్టాత్మక ‘జాన్‌బేట్స్ క్లార్క్’ పురస్కారం లభించింది. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి తర్వాత అత్యంత విశిష్ట పురస్కారం ఇదే. ఈ అవార్డు పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరికి నోబెల్ బహుమతి లభిస్తుందని భావిస్తారు. అందువల్ల ఈ అవార్డును ‘బేబీ నోబెల్’గా పిలుస్తారు. ఆర్థిక రంగంలో విశేష కషి చేసిన 40 ఏళ్లలోపు అమెరికన్లకు అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఈ బహుమతి అందజేస్తుంది. 

గోపాల్ గురుకు మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డుజవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ గోపాల్ గురుకు 2013-14 సంవత్సరానికి మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు దక్కింది. డవలప్‌మెంట్ స్టడీస్‌లో ఆయన చేసిన కషికిగాను ఈ పురస్కారాన్ని చెన్నైలోని మాల్కోమ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఏప్రిల్ 18న ప్రకటించింది. 

ప్రాణ్‌కు ఫాల్కే అవార్డు
ఒకనాటి బాలీవుడ్ నటుడు ప్రాణ్ కిషన్ సికంద్(93)కు 2012 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఇది దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు బహూకరిస్తారు. ఈ అవార్డు అందుకున్నవారిలో ప్రాణ్ 44వ పురస్కారగ్రిహీత. మే 3వ తేదీన జరిగే ఒక కార్యక్రమంలో ప్రాణ్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఈ అవార్డును 1969లో ఏర్పాటు చేశారు. తొలి అవార్డును నటి దేవికా రాణికి బహూకరించారు. ప్రాణ్ తన 60 ఏళ్ల చలన చిత్ర జీవితంలో 400పైగా చిత్రాల్లో నటించారు. విలన్, సహాయనటుడు పాత్రలు పోషించారు.‘ఆజాద్’ ‘దేవదాస్’, ‘మధుమతి’, ‘జంజీర్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

డెస్మండ్ టూటుకు టెంపుల్టన్ ప్రెజ్దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, కేప్‌టౌన్ మాజీ ఆర్చ్ బిషప్ డెస్మండ్ టూటుకు (81) 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక టెంపుల్టన్ ప్రెజ్ లభించింది. ప్రేమను పంచడం, తప్పులను మన్నించడం అనే క్రెస్తవ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందుకు, దీనికోసం జీవితాన్ని అంకితం చేసినందుకు ఆయన్ను ఈ ప్రెజ్‌కు ఎంపిక చేసినట్లు టెంపుల్టన్ ఫౌండేషన్ తెలిపింది. లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో మే 21న జరిగే కార్యక్రమంలో టూటుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

టెమ్స్ ఆఫ్ ఇండియా సినీ అవార్డులుటైమ్స్ ఆఫ్ ఇండియా తొలిసారిగా సినీ అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఏప్రిల్ 6న వాంకోవర్ (కెనడా)లో జరిగింది. వివరాలు.. ఉత్తమ చిత్రం- బర్ఫీ; ఉత్తమ దర్శకుడు- అనురాగ్ బసు(బర్ఫీ) ; ఉత్తమ నటుడు-రణబీర్ కపూర్(బర్ఫీ); ఉత్తమ నటి - ప్రియాంక చోప్రా(బర్ఫీ); ఉత్తమ నూతన నటీ- ఇలియానా (బర్ఫీ) ; ఉత్తమ నూతన నటుడు -ఆయుష్మాన్ ఖురానా (వికీ డోనర్) ; ఉత్తమ విలన్ - రిషికపూర్ (అగ్నిపథ్); ఉత్తమ హస్యనటుడు - అభిషేక్ బచ్చన్ (బోల్ బచ్చన్); ఉత్తమ సంగీత దర్శకుడు - అజయ్ అతుల్ (అగ్నిపథ్). 

No comments:

Post a Comment