AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2013

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2013
రష్యాలో భారీ ఉల్కాపాతంరష్యాలో ఫిబ్రవరి 15న సంభవించిన భారీ ఉల్కాపాతం తాకిడికి 1000 మంది గాయపడ్డారు. 10 టన్నుల బరువైన ఓ ఉల్క రష్యా గగనతలంలో భూవాతావరణంలో ప్రవేశించి, యూరల్ పర్వతాల మీదుగా ప్రయాణించి ముక్కలైంది. దీంతో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వెలుగులు, భారీ శబ్దాలు సంభవించాయి. ఆ ఉల్కసెకనుకు 30 కి.మీ. వేగంతో ప్రయాణించి భూమికి 30-50కి.మీ. ఎత్తులో ముక్కలైంది. బెల్సా బిన్‌‌క్స పట్నంలో అనేక భవనాలు ధ్వంస మయ్యాయి. గ్రహశకలాలు పరస్పరం ఢీ కొన్నపుడు వాటి నుంచి విడిపోయే చిన్న రాతి ముక్కలనే ఉల్కలు అంటారు.

భూమికి సమీపంలోకి డిఎ 14 గ్రహశకలంఫిబ్రవరి 15న, 2012 డిఎ 14 అనే గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. 45 మీటర్ల వెడల్పున్న ఈ శకలం భూమికి 27,700 కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. వాతా వరణం, కమ్యూనికేషన్‌‌స సేవలందించే ఉప గ్రహాల (శాటిలైట్లు)

గస్తీ నౌక ఐసీజీఎస్ రాజ్ రతన్గస్తీనౌక ఐసీజీఎస్ రాజ్ రతన్ ను ఫిబ్రవరి 11న కోల్‌కతాలో భారత తీరగస్తీ (ఐసీజీ) దళాలకు అప్పగించారు. దీన్ని గుజరాత్ తీరంలో వినియోగిస్తారు. ఈ ఇన్‌షోర్ పెట్రోల్ వెస్సెల్ (ఐపిఒ) సముద్రదళాల సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఈ తరహాకు చెందిన ఎనిమిది గస్తీ నౌకల్లో ఇది ఐదోది. దేశీయంగా అభివద్ధి చేసిన ఈ నౌక 50 మీటర్ల పొడవుంటుంది. 34 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది.

పినాక ప్రయోగం విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్ (ఎంబీఆర్‌ఎల్) ఆయుధ వ్యవస్థ ‘పినాక’ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ రక్షణ స్థావరం నుంచి జనవరి 30న డీఆర్‌డీఓ ఈ పరీక్షను నిర్వహించింది. 

No comments:

Post a Comment