సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2013
అగ్ని -3 క్షిపణి పరీక్ష విజయవంతంవినియోగ పరీక్షల్లో భాగంగా అణు సామర్థ్యం గల అగ్ని-3 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ డిసెంబర్ 23న ఒడిశా తీరంలో వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి 3,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. బరువు 48.3 టన్నులు. ఎత్తు 16.7 మీటర్లు, వ్యాసం 1.8 మీటర్లు. ఇది 1.5 టన్నుల బరువు ఉన్న సంప్రదాయ, సంప్రదాయేతర ఆయుధాలను మోసుకుపోగలదు. 2006, జూలైలో జరిపిన మొదటి పరీక్ష విఫలమైంది. తర్వాత 2007, 2008, 2010 పరీక్షలు విజయవంతమయ్యాయి. 1983లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిసై ్సల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా అగ్ని సిరీస్ క్షిపణులను అభివద్ధి చేస్తున్నారు.
కృత్రిమ గుండెను అమర్చిన ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు75 సంవత్సరాల వ్యక్తికి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా కృత్రిమ గుండెను విజయవంతంగా డిసెంబర్ 20న అమర్చారు. ఫ్రాన్స్‌కు చెందిన బయోమెడికల్ సంస్థ కార్మట్ ఈ కృత్రిమ గుండెను రూపొందించింది. లిథూయం ఐయాన్ బ్యాటరీలు ఉపయోగించిన గుండెను డచ్‌కు చెందిన యూరోపియన్ ఏరోనాటిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ గుండె రోగికి ఐదేళ్ల అదనపు జీవితాన్నిస్తుంది. దీని బరువు దాదాపు కిలోగ్రాము ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన మనిషి గుండెకంటే మూడింతలు ఎక్కువ. ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన డా.అలైన్ కార్పెంటైర్ ఈ గుండె అభివద్ధికి 25 ఏళ్లపాటు కృషి చేశారు. గతంలో రూపొందించిన కృత్రిమ గుండెలను ఆపరేషన్ సమయంలో తాత్కాలిక అవసరాలకు మాత్రమే ఉపయోగించేవారు.
మూన్ రోవర్‌ను ప్రయోగించిన చైనాచంద్రుడిపై పరిశోధనకు చైనా తన మొదటి రోవర్‌ను డిసెంబర్ 1న ప్రయోగించింది. చాంగె-3 రాకెట్ ద్వారా ‘జడే రాబిట్’ అని పిలిచే రోవర్‌ను క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి పంపింది. ఈ రోవర్ డిసెంబర్ మధ్యలో చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడి ఉపరితలం, అక్కడి సహజ వనరులపై సమాచారం సేకరిస్తుంది. ఇది చంద్రుడిపైకి పంపిన మూడో లూనార్ రోవర్. గతంలో అమెరికా, రష్యాలు ఇటువంటి రోవర్లు పంపాయి.

No comments:
Post a Comment