AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

అవార్డులు ఆగష్టు 2012

అవార్డులు ఆగష్టు 2012
గంగాధర్‌కు సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు చిన్న కథల రచయిత వేంపల్లి గంగాధర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘మొలకల పున్నమి’కి ఈ పురస్కారం దక్కింది.
గుంటూరు రైతుకు శాంసంగ్ అవార్డుగుంటూరు జిల్లా రూపెనగుంట్లకు చెందిన తొండెపి గురవయ్య ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే‘హెర్బిస్ప్రేయర్’ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. నిర్వాహకులు ప్రకటించిన మొత్తం మూడు అవార్డుల్లో గురవయ్య రెండో స్థానం పొంది రూ.3 లక్షల ప్రైజ్‌మనీ, ధ్రువీకరణ పత్రం సాధించారు. కాగా ప్రథమ బహుమతిని (5 లక్షలు) అహ్మదాబాద్‌కు చెందిన యువ ఇంజనీర్ లియో మావ్‌లీ సొంతం చేసుకున్నారు.
రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ‘ఆక్సియోస్టాట్’ను ఈయన రూపొందించారు. జీఐబీబీఎస్‌గా పిలిచే జియో థెర్మల్ ఏసీలను కనుగొన్న ముంబైకి చెందిన అరుణ్ షెనోయ్ మూడో ప్రైజ్(2 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టే విభిన్న రంగాలవారికి ఏటా ఇచ్చే ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. గురవయ్య కనుగొన్న ఈ ‘హెర్బిస్ప్రేయర్’ పరికరం వల్ల తక్కువ సమయంలో, కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్‌కు అమర్చుకుని రైతులు విత్తనాలను జల్లుకోవచ్చు.
 
పట్నాయక్‌కు డామైన్ డట్టోన్ అవార్డుప్రతిష్టాత్మక డామైన్-డట్టోన్ అవార్డు-2012 ఒడిశా రాష్ట్ర లెప్రసీ అధికారి డా. పి.బి.కె.పట్నాయక్‌కు లభించింది. కుష్టు వ్యాధి నిర్మూలనకు చేసిన కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. గతంలో ఈ పురస్కారం లభించిన వారిలో మదర్ థెరిస్సా, బాబా ఆమ్టే తదితరులు ఉన్నారు. ఈ అవార్డును డామైన్-డట్టోన్ సొసైటీ ఫర్ లెప్రసీ ఎయిడ్ అందజేస్తుంది. దీన్ని 1944లో అమెరికా సైన్యానికి చెందిన మెడికల్ కోర్ ప్రారంభించింది. కుష్టు వ్యాధి నివారణకు విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు.
మెహతాకు రాజీవ్ సద్భావన అవార్డుజైపూర్ కేంద్రంగా పని చేసే భగవాన్ మహావీర్ వికలాంగ్ సేవా సమితి వ్యవస్థాపకుడు డీఆర్ మెహతా ఈ ఏడాది రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లోని 26 దేశాల పేద ప్రజలకు ఈ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. న్యూఢిల్లీలో ఆగస్ట్ 19న జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మెహతాకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
 
అశోక్ సేన్‌కు యూరీ మిల్నర్ప్రపంచంలో భారీ మొత్తంలో నగదు బహుమతినిచ్చే ‘యూరీ మిల్నర్ ఫండమెంటల్ ఫిజిక్స్’ ప్రైజ్ -2012 సంవత్సరానికి భారతీయ శాస్త్రవేత్త అశోక్ సేన్‌కు లభించింది. ఈ అవార్డు కింద రూ.16.7కోట్ల (30 లక్షల అమెరికన్ డాలర్ల) నగదు బహుమతి ఇస్తారు. సేన్ ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌లోని హరిశ్చంద్ర పరిశోధనా సంస్థలో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సేన్‌తోపాటు ఏడుగురు అమెరికా శాస్త్రవేత్తలకు, పారిస్‌కు చెందిన ఒకరికి ఈ అవార్డును ప్రకటించారు. వీరికీ రూ.16.7కోట్ల చొప్పున పారితోషికం ఇస్తారు. 
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతికి మూడు రెట్లు ఎక్కువ నగదు బహుమతిని ఇచ్చే ఈ అవార్డు ప్రపంచంలోనే అత్యధిక నగదు అవార్డు. ఈ ప్రైజ్‌ను రష్యాకు చెందిన యూరీ మిల్నర్ ప్రారంభించారు. భౌతిక శాస్త్రాన్ని అభ్యసిస్తూ, 1989లో అర్ధంతరంగా చదువు మానేసిన మిల్నర్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డు నెలకొల్పారు. సేన్ పరిశోధనలకు గుర్తింపుగా గతంలో పద్మశ్రీ(2001), శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (1994), భారతీయ సైన్స్ అకాడమీ(1995) అవార్డులు వరించాయి. లండన్ రాయల్ సొసైటీ ఫెలో(1998)గా కూడా సేన్ ఎంపికయ్యారు.
 
మెహతాకు రాజీవ్ సద్భావనా అవార్డుపద్మభూషణ్ డి.ఆర్.మెహతా 20వ ‘రాజీవ్‌గాంధీ సద్భావనా అవార్డు’కు ఎంపికయ్యారు. ఈయన భగవాన్ మహావీర్ వికలాంగ సాహిత్య సమితి (బీఎంవీఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు. 1975లో ఏర్పాటైన ఈ సంస్థ ‘జైపూర్ కాలు’తో వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఈ కృత్రిమ కాలును ఆప్ఘనిస్థాన్, అంగోలా వంటి దేశాల్లో యుద్ధ బాధితులకు కూడా అందజేశారు. మత సామరస్యం, శాంతికి తోడ్పడినందుకు అందజేసే ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుకరిస్తారు.

No comments:

Post a Comment