అవార్డులు నవంబరు 2013
అంజోలీ మీనన్‌కు దయావతి మోడీ అవార్డు
ప్రముఖ కళాకారిణి అంజోలీ ఏలా మీనన్ (73)కు దయావతి మోడీ అవార్డు లభించింది. భారత కళలు, సంస్కృతికి ఆమె చేసిన సేవకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును నవంబర్ 18న ఆమెకు ప్రదానం చేశారు. ప్రతి ఏటా దయావతి మోడీ ఫౌండేషన్ కళలు, సంస్కృతి, విద్యా రంగాల్లో కషిచేసినవారికి ఈ అవార్డును అందిస్తోంది. ఈ అవార్డు కింద రూ.2.51 లక్షలు బహూకరిస్తారు.
ఏంజెలా మెర్కల్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్ 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికయ్యారు. ఐరోపాలో, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ జర్మనీని అభివృద్ధి వైపు నడిపించినందుకు మెర్కల్‌ను ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నవంబర్ 19న ప్రకటించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఎంపిక కమిటీ మెర్కల్‌కు బహుమతి అందించాలని నిర్ణయించింది. 2012లో ఈ బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు జాన్సన్ సర్లీఫ్‌కు బహూకరించారు. ఈ అవార్డును 1986లో ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19న దీన్ని ప్రకటిస్తారు. అవార్డు కింద రూ.25 లక్షల నగదు, ప్రశంస పత్రం అందిస్తారు.
సంగీత నాటక అకాడమీ అవార్డులుప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి.రాఘవాచారి, టి.శేషాచారి ఈ ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్ బ్రదర్స్‌గా వీరు సుపరిచితులు. వీరు గత 45 ఏళ్లుగా కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తున్నారు. 2013 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (అకాడమీ రత్న), అకాడమీ అవార్డు (అకాడమీ పురస్కార్)లను నవంబర్ 25న ప్రకటించింది. ఇదే సంవత్సరానికి సంగీతం, నృత్యం, రంగ స్థలం, తోలు బొమ్మలాట విభాగాల్లో 38 మందిని అకాడమీ అవార్డు (పురస్కార్)కు సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసింది. రంగ స్థల కళాకారులు కనక్ రేలె, ఆర్.సత్యనారాయణ, మహేశ్ ఎల్.కుంచార్‌లను అకాడమీ రత్న (ఫెలోషిప్)కు ఎంపిక చేశారు. ఫెలోషిప్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా, అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటివరకు 40 మంది మాత్రమే ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద తామ్ర పత్రం, అంగ వస్త్రంతోపాటు అకాడమీ ఫెలోషిప్‌నకు రూ.3,00,000, అకాడమీ అవార్డుకు రూ.లక్ష బహూకరిస్తారు.
సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న
క్రికెట్ కీడాకారుడు సచిన్ టెండ్కూలర్ (40), ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు (79)లను ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16న ప్రకటించింది. దీన్ని చివరిసారిగా 2009లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఇంతవరకు ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడుగా సచిన్‌కు గుర్తింపు దక్కింది.
సచిన్ టెండూల్కర్: 24 ఏళ్లుగా క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై కరాచీలో 1989, నవంబర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సచిన్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 నాటౌట్. అదేవిధంగా 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లో కాలుమోపారు. వన్డేల్లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి, 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 నాటౌట్.
ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు: పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీఎన్‌ఆర్ రావును కేంద్రం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్త. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తత పరిశోధనలు చేస్తున్నారు. ఆయన దాదాపు 1400 పరిశోధన పత్రాలు, 45 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్‌ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్‌డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రై జ్ లభించింది.
సతీశ్‌రెడ్డికి హోమీ జే బాబా అవార్డు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన క్షిపణి అభివద్ధి కేంద్రం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ డెరైక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. జమ్మూలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 03న జరగనున్న 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్మారకార్థం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి ఏటా ఈ అవార్డును అందిస్తోంది.
స్వామినాథన్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డుప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు 2012 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అక్టోబర్ 31న ప్రదానం చేశారు. వ్యవసాయ శాస్త్రంలోనూ, దేశం ఆహార ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడంలోనూ చేసిన కృషికిగాను స్వామినాథన్‌కు ఈ అవార్డు లభించింది.
మిస్ ఆసియా పసిఫిక్ వరల్డ్‌గా శ్రేష్టి రాణాహర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన శ్రేష్టి రాణా (21) ఆసియా పసిఫిక్ వరల్డ్ - 2013గా ఎంపికైంది. అక్టోబర్ 30న సియోల్‌లో జరిగిన పోటీల్లో మొత్తం 49 మందిలో ఆమె విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో మన దేశానికి చెందిన యువతి కిరీటం దక్కించుకోవడం ఇది రెండోసారి. ఈజిప్ట్‌కు చెందిన మెరియం జార్జి రెండో స్థానం, కజికిస్థాన్‌కు చెందిన ఎవజినియా క్లిషిన మూడో స్థానం సాధించారు.

No comments:
Post a Comment