AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2013

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2013
మావెన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా
అంగారక గ్రహంపై వాతావరణ పరిశోధన చేపట్టేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. మార్స్ అట్మాస్పియర్ అండ్ ఓలటైల్ ఎవల్యూషన్ (మావెన్) అనే ఉపగ్రహాన్ని నవంబర్ 18న ప్రయోగించింది. అట్లాస్ - 5 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఇది పది నెలలపాటు రోదసీలో ప్రయాణించి 2014, సెప్టెంబర్ 22న అంగారకుడి కక్ష్యలో చేరుతుంది. నాసా 2.5 మీటర్ల పొడవు, 2453 కిలోల బరువు గల మావెన్ కోసం 67.1 కోట్ల డాలర్ల వ్యయం చేసింది. 2030 నాటికి అంగారక గ్రహంపైకి మానవ సహిత యాత్ర చేపట్టేందుకు మావెన్ తోడ్పడుతుంది.

ధనుష్ క్షిపణి ప్రయోగం విజయవంతం
సైనిక దళాలకు చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) ధనుష్ క్షిపణిని నవంబర్ 23న ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఇది నావికాదళం కోసం రూపొందించిన క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ధనుష్ అణ్వాయుధాలను మోసుకుపోగలదు. 500 కిలోల ఆయుధాలతో 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

రోహిణి (ఆర్‌హెచ్) 200 రాకెట్ ప్రయోగం
తిరువనంతపురంలోని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి నవంబర్ 21న రోహిణి (ఆర్‌హెచ్) 200 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దీని బరువు 114 కిలోలు. ఇటువంటి రాకెట్లను ప్రత్యేకంగా మెటియోరాలజీ అధ్యయనానికి ఉపయోగిస్తారు. తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రం స్వర్ణోత్సవాల సంద్భరంగా ఈ ప్రయోగం చేపట్టారు. 1963, నవంబర్ 21న అమెరికా నిర్మించిన ‘నైకి అపాచీ’ అనే చిన్న రాకెట్‌ను తుంబా నుంచి ప్రయోగించారు. భారత భూభాగం నుంచి రాకెట్ ప్రయోగానికి అనువైన ప్రాంతంగా విక్రమ్ సారాబాయ్, ఆయన శాస్త్రవేత్తల బందం తుంబాను ఎంపిక చేసింది.

ఆధునిక బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత సైన్యం నవంబర్ 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించింది. బ్లాక్-3 రకానికి చెందిన ఈ క్షిపణి 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 300 కిలోల సంప్రదాయ ఆయుధాలను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం వంటి బహుళ వేదికల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు.

హతాఫ్-9 క్షిపణిని పరీక్షించిన పాక్

హతాఫ్-9 క్షిపణిని పాకిస్థాన్ నవంబర్ 5న విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

నౌకాదళానికి ఆధునిక జెట్ ట్రై నర్ ‘హక్-132’
ఆధునిక జెట్ ట్రై నర్ (ఏజేటీ) ‘హక్ - 132’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నౌకాదళంలో చేర్చారు. నాలుగు ఏజేటీలను విశాఖపట్నంలోని తూర్పు నావల్ కమాండ్ బేస్ ఐఎన్‌ఎస్ డేగ వద్ద నౌకాదళాధిపతి డి.కె.జోషి నౌకాదళంలో ప్రవేశపెట్టారు. నాలుగో తరానికి చెందిన ఏజేటీ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. దీనికి ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, క్షిపణులు, రాకెట్లు, బాంబులు, తుపాకులు వంటి వాటిని చేర్చగల సామర్థ్యం ఉంది.

అగ్ని-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ప్రయోగ కేంద్రం నుంచి న వంబర్ 8న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 1000 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు.

No comments:

Post a Comment