అవార్డులు జూన్ 2013
రామన్ మెగసెసే అవార్డులు -2013వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఇచ్చే రామన్ మెగసెసే అవార్డులను జూలై 24న ప్రకటించారు. ఈ అవార్డు పొందినవారిలో ఆప్ఘన్ మహిళ హబిబా సరాబీ (55)తోపాటు మయన్మార్కు చెందిన లాహ్పేయ్ సెంగ్ రా, ఫిలిప్పైన్స్కు చెందిన ఎర్నెస్టో డొమింగో (76), నేపాల్కు చెందిన మనుషుల అక్రమ రవాణా నిరోధక సంస్థ, ఇండోనేషియాకు చెందిన అవినీతి వ్యతిరేక సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి.
హబిబా సరాబీ: ఈమె ఆప్ఘన్ రాష్ట్రం బయేయాన్ గవర్నర్. ఆప్ఘన్లో తొలి ఒకే ఒక మహిళా గవర్నర్. సరాబీ మహిళా హక్కులు, విద్య కోసం పోరాటం చేస్తున్నారు.
లాహ్పాయ్ సెంగ్ రా: మయన్మార్కు చెందిన సామాజిక కార్యకర్త. మయన్మార్లోని అతిపెద్ద పౌర సమాజ గ్రూప్ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, శాంతి కార్యక్రమాలు చేపడుతుంది. 64 ఏళ్ల సెంగ్రా సేవలను ప్రభుత్వం, తిరుగుబాటుదారులు కొనియాడుతున్నారు.
ఎర్నెస్టో డొమింగో: వైద్య పరిశోధకుడు. ఫిలిప్పైన్స్లో అందరికీ ఆరోగ్యం అందించడానికి కృషి చేస్తున్నారు. ఆ దేశంలో ఆరోగ్యానికి ప్రభుత్వ నిధులు చాలా తక్కువగా అందుతున్నాయి.
శక్తి సమూహ: నేపాల్కు చెందిన ఈ సంస్థను మానవుల అక్రమ రవాణాలో బయటపడ్డవారు నెలకొల్పారు. ఈ సంస్థ సహచర బాధితులకు గృహాలు, అత్యవసర ఆవాసాలు కల్పించి సహాయం చేస్తోంది.
కరెప్షన్ ఎరాడికేషన్ కమిషన్: ఇండోనేషియాకు చెందిన అవినీతి నిర్మూలన కమిషన్. ఈ సంస్థ 2004-10 మధ్యలో 169 అవినీతి కేసుల్లో 100 శాతం శిక్ష పడేందుకు పోరాడింది.
మనీలా (ఫిలిప్పైన్స్)లోని రామన్ మెగసెసే ఫౌండేషన్ ఈ అవార్డులను అందిస్తోంది. విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు మెగసెసే పేరుతో ఈ అవార్డును 1957లో ఏర్పాటు చేశారు. ఆసియాలో సామాజిక మార్పుకు కృషి చేస్తున్న వ్యక్తులు, గ్రూపులకు ఈ అవార్డును బహూకరిస్తారు.
అజీమ్ ప్రేమ్జీకి ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డ్ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ (68)కి ఈ ఏడాది ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏషియా హౌస్ ఈ అవార్డును అందజేస్తోంది. ఆయన వ్యాపార కృషి, సమాజ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. గతంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాకు ఈ అవార్డు లభించింది.
కిరణ్‌బేడీకి నోమురా అవార్డ్‌మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ మానవతా సేవలకు గుర్తింపుగా సింగపూర్‌లో ఆమెకు నోమురా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డ్ కింద 10 వేల యూఎస్ డాలర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ మాట్లాడుతూ అవార్డు కిందొచ్చిన మొత్తం సొమ్మును ఖైదీల పిల్లల విద్యాభివద్ధికి అందజేస్తానని తెలిపారు. భవిష్యత్ తరాల మెరుగు కోసం కషి చేస్తున్న వారికోసం జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నోమురా గ్రూప్ ఈ అవార్డులను ఇస్తుంది.

No comments:
Post a Comment