సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2016
స్క్రామ్‌జెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆగస్టు 28న భూవాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోయే స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజిన్ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. దీంతో ఉపగ్రహాల ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించడంతో పాటు అత్యాధునిక ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ రూపకల్పనలో ఇస్రో ముందడుగేసింది. సౌండింగ్ రాకెట్ల ప్రయోగవేదిక నుంచే స్వదేశీ సాంకేతికతతో రూపాందించిన ఏటీవీ(రోహిణి 560 సౌండింగ్ రాకెట్)కి స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అమర్చి నింగిలో 5 సెకన్లు పాటు మండించారు.
కుష్టు వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న భారత్
భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా లెప్రసీ (కుష్టు వ్యాధి)ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ వ్యవస్థాపక డైరె క్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బిహార్, గుజరాత్‌ల్లోని ఐదు జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
2013-14 లెక్కల ప్రకారం మన దేశంలో 1.27 లక్షల మంది లెప్రసీతో బాధపడుతున్నారు.
ఆఫ్రికన్ల కోసం ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్
భారతీయ యువ పారిశ్రామికవేత్త రాహుల్ కాల్రా కేవలం ఆఫ్రికన్ల కోసమే ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2025 నాటికి ఆఫ్రికన్లలో ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ ద్వారానే కొనుగోళ్లు చేస్తారనే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. Africakart.com పేరుతో ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇదవరకే ఘనాలో పర్యటించిన రాహుల్ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వాటికనుగుణంగా ఈ సైటను రూపొందించాడు.
భూమిపై అత్యంత వేడి నెలగా జూలై
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా 2016 జూలై నెల కొత్త రికార్డు సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్‌ఓఏఏ) ప్రకటించింది. నాసా తాజాగా వెల్లడించిన వాతావరణ సమాచారాన్ని విశ్లేషించాక ఎన్‌ఓఏఏ తన నెలవారీ నివేదికను విడుదల చేసింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే 0.11 డిగ్రీలు ఎక్కువ.
‘కూడంకుళం’ జాతికి అంకితం
భారత్, రష్యాలు సంయుక్తంగా తమిళనాడులోని కూడంకుళంలో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్‌ను ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు సీఎం జయలలితలు సంయుక్తంగా ఆగస్టు 10న జాతికి అంకితం చేశారు. మోదీ, పుతిన్, జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ యూనిట్ దేశ విద్యుత్తు రంగంలో అతి పెద్ద యునిట్.
హ్యాక్-ప్రూఫ్ ఉపగ్రహం ప్రయోగించిన చైనా
ప్రపంచంలోనే తొలిసారిగా హ్యాక్ చేయడానికి వీలుపడని ఉపగ్రహాన్ని చైనా ఆగస్టు15నప్రయోగించింది. ‘‘క్వాంటమ్ ఎక్స్‌పెరిమెంట్స్ అట్ స్పేస్ స్కేల్ (క్వెస్)’’ గా పిలిచే ఈ ఉపగ్రహం బరువు 600 కేజీలు. దీని నుంచి సమాచారం తస్కరించాలని ప్రయత్నిస్తే అది వెంటనే నాశనమయ్యేటట్లు దీనిని రూపొందించారు.
గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్
ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీగా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో ఇది పనిచేస్తుంది. విడిగా యూజర్‌నేమ్/అకౌంట్ లాంటివి అక్కర్లేకుండా యూజర్లు తమ ఫోన్ నంబర్‌నే ఉపయోగించి డ్యువో ద్వారా వీడియో కాల్ చేసే సౌకర్యం కల్పించారు.
తుపాన్ల సమాచారాన్ని అందించే రాడార్తుపాన్లు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే సీ బ్యాండ్ పోలరీమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్‌ను ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ ఆగస్టు 4న తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సీలో ప్రారంభించారు. ఈ తరహా రాడార్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ రాడార్ ద్వారా భారత వాతావరణ విభాగానికి సమాచారం అందుతుంది.
భూమి లాంటి మరో 20 గ్రహాల గుర్తింపుఅమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన కెప్లర్ వ్యోమనౌక భూమిని పోలిన, నివాస యోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ఆగస్టు 3న తెలిపారు. ఇప్పటి వరకు కెప్లర్ కనుగొన్న 4,000 గ్రహాల్లో నివాస యోగ్యమైనవిగా ఈ 20 ఉన్నాయి. నక్షత్రాల చుట్టూ ఉన్న 216 గ్రహాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉందని, అందువల్ల అక్కడ ద్రవ రూపంలో నీరు ఉండటం వల్ల మనుగడ సాగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
టాన్సిట్ ఎలివేటెడ్ బస్‌ను పరీక్షించిన చైనారోడ్డు మార్గాల్లో రద్దీని ఎదరుక్కొనేందుకు చైనా చక్కటి పరిష్కారం కనుగొంది. ‘ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్’ (టి.ఇ.బి.) పేరుతో కొత్తరకం లాండ్ ఎయిర్ బస్‌ని చైనా ఆగస్టు 5న పరీక్షించింది. రోడ్ల మీద వెళుతున్న వాహనాల మీదుగా ప్రయాణించడం ఈ బస్సు ప్రత్యేకత. 72 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉండే ఈ బస్సు విద్యుచ్ఛక్తితో నడుస్తుంది. ఒకేసారి 1400 మంది కూర్చోవచ్చు. గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

No comments:
Post a Comment