AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మే 2017

సైన్స్ & టెక్నాలజీ మే 2017
డీఆర్‌డీవో వైమానిక పరీక్షా క్షేత్రం ప్రారంభం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా కుదాపుర వద్ద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అత్యాధునిక ప్రమాణాలతో నెలకొల్పిన వైమానిక పరీక్షా క్షేత్రాన్ని (ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్- ఏటీఆర్) కేంద్ర రక్షణమంత్రి అరుణ్ జైట్లీ మే 28న ప్రారంభించారు. 
ఏటీఆర్ ప్రత్యేకతలు 
  • ఈ ప్రాజెక్టు కోసం 4290 ఎకరాలు సేకరించిన డీఆర్‌డీవో అందులో 2500 ఎకరాల్లో సుమారు రూ.2500 కోట్లతో ఏటీఆర్ ప్రాజెక్టును రూపొందించింది.
  • తేలికపాటి యుద్ధ విమానాలు, డ్రోన్‌లు, మానవ రహిత విమానాలను, వాయు హెచ్చరిక వ్యవస్థలను ఇక్కడ అభివృద్ధి చేయడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తారు.
  • త్వరలో ఇక్కడ బెంగళూరు ఐఐఎస్‌సీ, ఇస్రో, బాబా అణు పరిశోధన సంస్థలు తమ పరిశోధన శాలలను ఏర్పాటు చేయనున్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఏరోనాటిక్ టెస్ట్ రేంజ్ ప్రారంభం 
ఎప్పుడు : మే 27 
ఎవరు : డీఆర్‌డీవో 
ఎక్కడ : కుదాపుర, చిత్రదుర్గం జిల్లా, కర్ణాటక 
ఎందుకు : అత్యాధునిక ఆయుధాలు, యుద్ధవిమానాల అభివృద్ధికి 

పాలపుంతపైకి ఎక్స్‌రే స్పేస్ టెలిస్కోప్పాలపుంతపై పరిశోధన, అధ్యయనం కోసం చైనా త్వరలో తొలి ఎక్స్‌రే స్పేస్ టెలిస్కోప్‌ని ప్రయోగించనుంది. పాలపుంతలో దాగిన కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాలు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ వస్తువులను పరిశోధించగల సామర్థ్యం దీని సొంతం. ఈ మేరకు హార్డ్ ఎక్స్‌రే మాడ్యూలేషన్ టెలిస్కోప్ (హెచ్‌ఎక్స్‌ఎంటీ)ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైనా అకాడమీ ఆఫ్ సెన్సైస్ ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : పాలపుంతపైకి ఎక్స్‌రే స్పేస్ టెలిస్కోప్
ఎవరు : చైనా అకడామీ ఆఫ్ స్పేస్ సెన్సైస్ 
ఎందుకు : కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాలపై పరిశోధనల కోసం

ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష అమెరికా, ఐరాస హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మే 29న మరో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. 450 కి.మీ. ప్రయాణించిన స్కడ్ తరహా క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో కూలినట్లు దక్షిణ కొరియా పేర్కొంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగంతో కొరియా ద్వీప కల్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 వారాల వ్యవధిలో ఇది మూడో పరీక్ష కాగా.. ఈ ఏడాది 12వది. మరిన్ని ఆంక్షలు విధించడంతో పాటు.. సైనిక చర్య తప్పదన్న అమెరికా హెచ్చరికలకు సమాధానంగానే తాజా పరీక్ష నిర్వహించినట్లు భావిస్తున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : మరో క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా 
ఎప్పుడు : మే 29 
ఎవరు : ఉత్తర కొరియా ప్రభుత్వం 

‘జలాంతర్గామి నుంచి టోర్పెడో పరీక్ష’ విజయవంతందేశీయంగా తయారుచేసిన స్కార్పీన్ తరగతి జలాంతర్గామి నుంచి టోర్పెడోను మే 26న విజయవంతంగా ప్రయోగించారు. ఇది జలాంతర్గామిని నేవీకి అప్పగించే ముందు చేపట్టిన చివరి పరీక్షగా రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగాన్ని తొలి స్కార్పీన్ జలాంతర్గామి కల్వరి నుంచి చేపట్టారు.

భారత్ చేరుకున్న రెండు శత ఘు్నలు 1980వ దశకంలో బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత.. తొలిసారి భారత్‌కు శతఘు్నలు వచ్చాయి. ఈ మేరకు అత్యంత తేలిగ్గా ఉండే రెండు శతఘు్నలు మే 17న అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. అమెరికాతో చేసుకున్న 145 శతఘు్నల కొనుగోళ్ల ఒప్పందంలో భాగంలో తొలివిడతగా ఇవి భారత్‌కు వచ్చాయి. ఈ ఎం-777 గన్నులను బీఏఈ సిస్టమ్స్ అనే సంస్థ తయారు చేసింది. ప్రస్తుతం భారత్ చేరుకున్న వాటిని రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌కు పరీక్ష కోసం తరలించారు. 30 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఈ శతఘు్నలు ఛేదించగలవు. 155 ఎంఎం క్యాలిబర్‌తో ఉండే ఈ తేలికపాటి శతఘు్నలను చైనా సరిహద్దులో మోహరించే అవకాశం ఉంది. మరో 25 శతఘు్నలను విమానాల్లో తీసుకువస్తారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్‌కు చేరుకున్న రెండు శతఘు్నలు 
ఎప్పుడు : మే 18
ఎందుకు : అమెరికాతో 145 శతఘు్నల ఒప్పందంలో భాగంగా 

రక్షణలో ప్రైవేటు భాగస్వామ్యంభారత్‌లోని ప్రైవేట్ కంపెనీలు విదేశీ సంస్థల సహకారంతో యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనిక వాహనాలను దేశీయంగా తయారుచేసే విషయమై కేంద్రం రూపొందించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా(ఎస్పీఎం)కు రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) మే 20న ఈ ఒప్పందాన్ని ఖరారుచేసింది. ఆర్థిక శాఖ సమీక్షించాక ఎస్పీఎం కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎస్పీఎంకు రక్షణశాఖ ఆమోదం 
ఎప్పుడు : మే 20
ఎవరు : రక్షణ కొనుగోళ్ల మండలి
ఎందుకు : రక్షణలో ప్రైవేటు భాగస్వామ్యం కోసం 

అంతరిక్ష సూక్ష్మజీవికి అబ్దుల్ కలాం పేరు
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను గౌరవిస్తూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ కొత్త జీవికి ఆయన పేరుతో నామకరణం చేసింది. ఇది ఒక రకం సూక్ష్మజీవి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో తప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ భూమిపై కనిపించలేదు. కొత్త జీవికి శాస్త్రవేత్తలు సొలిబెసిల్లస్ కలామీ అని పేరు పెట్టారు. నాసాలో సీనియర్ శా్రస్త్రవేత్త అయిన కస్తూరీ వెంకటేశ్వరన్ ఈ విషయం వెల్లడించారు. 1963లో కలాం నాసాలో శిక్షణ తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : అంతరిక్ష సూక్ష్మజీవికి అబ్దుల్ కలాం పేరు 
ఎప్పుడు : మే 20
ఎవరు : నాసా 
ఎందుకు : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనిపించిన కొత్త జీవికి సొలిబెసిల్లస్ కలామీ పేరు. 

అత్యంత ఘాటైన మిరప వంగడంగా డ్రాగన్ బ్రీత్ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరప వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ మిరపకు డ్రాగన్ బ్రీత్‌గా నామకరణం చేశారు. వేల్స్‌కు చెందిన మైక్ స్మిత్ అనే రైతు నాట్టింగమ్ ట్రెంట్ వర్సిటీ శాస్త్రవేత్తల సహకారంతో దీన్ని పండించాడు.

భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించిన స్పేస్‌ఎక్స్అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ మే 16న భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 6,100 కిలోల ఇన్మార్‌శాట్-5ఎఫ్4 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

వంద దేశాల్లో వనా క్రై సైబర్ దాడి 
వనా క్రై ర్యాన్‌సమ్ వేర్ వైరస్‌తో కంప్యూటర్ హ్యాకర్లు వందకు పైగా దేశాల్లో దాడులు చేశారు. లక్షలాది కంప్యూటర్లను హ్యాక్ చేసి వాటిల్లోని 
డేటా మొత్తానికి తాళం (ఎన్‌క్రిప్ట్) వేశారు. దానిని తీయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వైరస్‌ను వాస్తవంగా సృష్టించినది అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ). సైబర్ దొంగలు ఆ వైరస్‌ను తస్కరించి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లపై దాడి చేశారు.
ఈ సైబర్ దాడితో బ్రిటన్, జర్మనీ, చైనా, ఉత్తర కొరియా, రష్యా తదితర దేశాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. సైబర్ భద్రత చరిత్రలో ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : వనా క్రై సైబర్ దాడి 
ఎప్పుడు : మే 12
ఎవరు : హ్యాకర్స్ 
ఎక్కడ : వందకు పైగా దేశాల్లో

కొత్తగా న్యూమోకోకల్ వ్యాక్సిన్చిన్నారుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు న్యుమోనియాను ఆరికట్టడానికి వీలుగా కేంద్రం సరికొత్త టీకాను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో(యూఐపీ) భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మే 13న న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని 21 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్‌ను అందిస్తారు. 2018లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో..అనంతరం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఆవిష్కరణ
ఎప్పుడు : మే 13
ఎవరు : కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా
ఎందుకు : సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా

ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా అణు బాంబు వేస్తామంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా మే 14న ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి 800 కి.మీ. ప్రయాణించి జపాన్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా మిలటరీ బృందం ధ్రువీకరించాయి.
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షపై స్పందించిన జపాన్ అధ్యక్షుడు షింజో అబే దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని చెప్పారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఖండాంతర క్షిపణి పరీక్ష
ఎప్పుడు : మే 14
ఎవరు : ఉత్తర కొరియా 

డెర్బీ క్షిపణి పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం(తేజస్) ద్వారా గగనతలం నంచి గగనతలంలో కంటిచూపు పరిధికి ఆవల(బీవీఆర్) లక్ష్యాలను ఛేదించే డెర్బీ క్షిపణిని భారత్ మే 11న విజయవంతంగా పరీక్షించింది. చాందీపూర్ (ఒడిశా)లోని మధ్యంతర పరీక్ష వేదిక (ఐటీఆర్)లో దీన్ని నిర్వహించారు.

19వ జాతీయ సాంకేతిక దినోత్సవం19వ జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 11న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాలను మరింత సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధనిక-పేద, పట్టణ-గ్రామీణ ప్రజల మధ్య పెరుగుతున్న అంతరాలు, అభివృద్ధికి కొన్ని వర్గాలు దూరం కావడం లాంటివి సామాజిక అశాంతికి దారితీస్తాయని హెచ్చరించారు.

జన్యు మార్పిడి ఆవాల పంట సాగుకు ఆమోదం
వాణిజ్య పరంగా జన్యు మార్పిడి (జీఎం) ఆవాల పంట విత్తనాలను సాగుచేసేందుకు జాతీయ జెనెటిక్ ఇంజనీరింగ్ సాధికార కమిటీ (జేఈఏసీ) మే 11న ఆమోదం తెలిపింది. ఈ విత్తనాల సాగువల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని, వీటిని సాగుచేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని పైరు మొక్కల జన్యుమార్పిడి కేంద్రం.. డీఎంహెచ్-11 పేరుతో జన్యుమార్పిడి వంగడాన్ని రూపొందించింది.

దక్షిణాసియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 
 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనత సాధించింది. సార్క్ దేశాలకు సమాచార, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించే జీశాట్-9 (దక్షిణాసియా ఉపగ్రహం) ఉపగ్రహాన్ని మే 5న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. పూర్తిగా భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ ఉపగ్రహం సార్క్ సభ్య దేశాలైన భారత్, శ్రీలంక, భూటాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు.
17 నిమిషాల్లో ప్రయోగం విజయవంతం ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో నిర్మించిన జీశాట్-9ని మే 5న సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్09 వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 28 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే శ్రీహరికోటలో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. అనంతరం మూడు దశలను విజయవంతంగా అధిగమించి నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-9ను ప్రవేశపెట్టింది. భూమి నుంచి బయల్దేరిన 17 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో..జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 09 రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన జీశాట్-9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్‌‌సఫార్మర్స్‌ను అమర్చారు. వీటి ద్వారా దక్షిణాసియా దేశాలకు టెలి కమ్యునికేషన్‌‌స, టెలివిజన్, డీ2హెచ్, వీశాట్స్, టెలి-ఎడ్యుకేషన్, టెలిమెడిసన్ వంటి రంగాల్లో పూర్తి స్థాయి సేవలు అందుతాయి. ఇక భూకంపాలు, తుపాన్‌లు, వరదలు, సునామీలు వంటి సమయంలో దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం కోసం హాట్‌లైన్ సంభాషణలకు వీలు కల్పిస్తుంది. 
జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహించిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా 7 విజయవంతమయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. 
ప్రాజెక్టు కోసం రూ.450 కోట్ల ఖర్చుజీశాట్-9 తయారీకి భారత ప్రభుత్వం మొత్తం రూ. 235 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం ప్రాజెక్టుకు రూ.450 కోట్లు వెచ్చించారు. క్రయోజనిక్ ఇంజిన్‌తో వరుసగా నాలుగోసారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమవడంతో ఇక జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకు తిరుగు ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో రెండు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగేళ్లు శ్రమించి క్రయోజనిక్ ఇంజిన్లను మరింత అభివృద్ధి చేశారు. అనంతరం 2014 జనవరి, 2015 ఆగస్టు, 2016 సెప్టెంబర్‌లో చేసిన మూడు ప్రయోగాలతో హ్యాట్రిక్ సాధించింది.
జీశాట్-9కు 2014లోనే నాంది2014లో తన ప్రమాణ స్వీకారానికి సార్క్ కూటమి దేశాధినేతల్ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అనంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించారు. ప్రధాని ఆకాంక్షను ఇస్రో విజయవంతంగా నిజం చేసింది. మొదట దీనికి సార్క్ ఉపగ్రహం అని పేరు పెట్టినా.. ఈ ఉపగ్రహం ద్వారా తమ రహస్య సమాచారాన్ని భారత్ తస్కరిస్తుందని ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో దక్షిణాసియా ఉపగ్రహంగా పేరు మార్చారు.
ప్రాజెక్టు విశిష్టతలు 
  • పొరుగు దేశాల్లో కమ్యూనికేషన్లు, ప్రసారాలు, విపత్తు నిర్వహణ, వాతావరణ హెచ్చరికలకు ఉపయోగపడే ఈ ఉపగ్రహ తయారీకి, ప్రయోగానికి అయ్యే ఖర్చునంతా మనదేశమే భరిస్తుంది.
  • దీని సేవలను వినియోగించుకోవడం కోసం ప్రతి దేశమూ సొంతంగా భూ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు భారత్ సాంకేతిక తోడ్పాటు అందిస్తుంది.
  • పొరుగు దేశాలకు ఉచితంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇచ్చిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేవు. ప్రస్తుతమున్న అన్ని ప్రాంతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహాలన్నీ లాభార్జన కోసం చేపట్టినవే.
క్విక్ రివ్యూ:ఏమిటి : జీశాట్ - 9 ప్రయోగం విజయవంతం 
ఎప్పుడు : మే 5
ఎవరు : ఇస్రో
ఎక్కడ : శ్రీహరికోట 
ఎందుకు : సార్క్ దేశాలకు (పాకిస్తాన్ తప్ప) సమాచార, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించేందుకు 

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల బ్లాక్-3 వెర్షన్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు సైన్యంలోని ‘స్ట్రైక్ వన్ కార్ప్స్’ మే 3న అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన పరీక్ష అన్ని కోణాల్లో విజయవంతమైందని ఆర్మీ తెలిపింది. ఈ క్షిపణిని ఇప్పటి వరకు అయిదుసార్లు ప్రయోగించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : మే 3 
ఎవరు : భారత సైన్యం 
ఎక్కడ : అండమాన్ అండ్ నికోబార్ దీవులు

కొత్త సీతాకోక చిలుకలను గుర్తించిన రష్యా శాస్త్రవేత్తలుసీతాకోక చిలుకల్లో సరికొత్త జాతిని రష్యా శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్‌లో గుర్తించారు. రష్యాకు చెందిన జియోలాజికల్ ఇన్‌సిట్యూట్ మే 8న ఈ విషయాన్ని ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో గుర్తించిన ఈ కొత్తరకం సీతాకోక చిలుకలకు " ఎసెంట్రియా ఫ్రిటిల్లరీ " అని పేరుపెట్టారు. చూడ్డానికి మిగతా సీతాకోక చిలుకల్లాగే సాధారణంగా కనిపిస్తున్నా వీటి డీఎన్‌ఏ మిగతావాటి కంటే భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి ఉత్తర ఇజ్రాయెల్‌తోపాటు సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయని తెలిపారు. 
2012 నుంచి రష్యాకు చెందిన రష్యా శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్‌లో సీతాకోక చిలుకలపై పరిశోధన చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : సీతాకోక చిలుకల్లో కొత్త జాతి గుర్తింపు 
ఎప్పుడు : మే 8
ఎవరు : రష్యా శాస్త్రవేత్తలు 
ఎక్కడ : ఇజ్రాయెల్‌లో 

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన అమెరికాప్రపంచంలో ఎక్కడికైనా అణుబాంబును మోసుకెళ్లగల మినిట్‌మ్యాన్ 3 అనే బాలిస్టిక్ క్షిపణిని అమెరికా మే 3న పరీక్షించింది. ఈ క్షిపణిని కాలిఫోర్నియా తీరంలోని వాండన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి ప్రయోగించగా.. దాదాపు 4,200 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలోనిలక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment