AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2013

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2013
 లై-ఫైని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలుఇంటర్నెట్‌ను అనుసంధానం చేసే కొత్త విధానం లై-ఫైని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వై-ఫైకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కొత్త విధానంలో కాంతి కోసం ఉపయోగించే బల్బుల ద్వారా ఇంటర్నెట్ సంకేతాలను చేరుస్తారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వై-ఫైలో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా సంకేతాలను పంపిస్తారు. లై-ఫైగా పిలిచే కొత్త విధానం సమర్థవంతమైంది. చవకైంది. ఈ విధానం ద్వారా కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. నాలుగు కంప్యూటర్లను ఒక వాట్ ఎల్‌ఈడీ బల్బుతో ఇంటర్నెట్‌కు అనుసంధానం చేయొచ్చు. ఈ బల్బు మైక్రోచిప్‌ను కలిగి ఉంటుంది. సెకనుకు 150 మెగాబిట్ల డేటాను చేరవేస్తుంది. ఇది చైనాలో అందుబాటులో ఉన్న సగటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే వేగవంతమైంది.

పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని అక్టోబర్‌ 7న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌) నుంచి దీన్ని ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 500 కిలోల నుంచి వెయ్యి కిలోల బరువు ఉన్న వార్‌హెడ్లను మోసుకెళ్తుంది. దీన్ని 2003లో సైన్యంలో ప్రవేశపెట్టారు.

No comments:

Post a Comment