సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2017
భారీ గ్రహంను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న భారీ గ్రహాన్ని బ్రిటన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుగ్రహం పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి ఎన్జీటీఎస్-1బీ అని నామకరణం చేశారు. నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం ఆధారంగా చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని చెబుతున్న అనేక సిద్ధాంతాలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ నక్షత్రానికి, ఎన్జీటీఎస్-1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమే. 2.6 రోజుల్లో తన పరిభ్రమణాన్ని పూర్తి చేసే ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా చాలా అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారీ గ్రహం ఎన్జీటీఎస్-1బీ ని గుర్తించిన శాస్త్రవేత్తలు
ఎప్పుడు : నవంబర్‌లో
ఎవరు : బ్రిటన్ శాస్త్రవేత్తలు
ఎక్కడ : ఒక చిన్న నక్షత్రం చుట్టూ
నిర్భయ్ పరీక్ష విజయవంతంస్వదేశంలో తయారైన అణ్వాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం నుంచి నవంబర్ 7న ఈ పరీక్ష నిర్వహించింది. 2013 నుంచి ఇప్పటి వరకు జరిపిన నాలుగు పరీక్షల్లో నిర్భయ్ విఫలమైంది.
భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్‌సోనిక్ క్షిపణి(ఎల్‌ఏసీఎం) 300 కిలోల బరువు గల అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రత్యర్థుల రాడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణం చేసేలా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారి నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : డీఆర్‌డీవో (భారత ప్రభుత్వం)
ఎక్కడ : చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం, ఒడిశా
గ్లెడ్ బాంబు పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి గ్లెడ్ బాంబును రక్షణ శాఖ నవంబర్ 2న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం (ఐటీఆర్) వద్ద వాయు సేన విమానం నుంచి దీన్ని జారవిడిచింది. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ బాంబును ఇమారత్ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), వాయు సేన సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రు వైమానిక స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది.

No comments:
Post a Comment