అవార్డులు సెప్టెంబరు 2013
కత్వారీకి కవనాగ్ కవితా పురస్కారం
భారతీయ అమెరికన్ కవి రఫీక్ కత్వారీ ప్రతిష్టాత్మక ఐరిష్ అంతర్జాతీయ ప్యాట్రిక్ కవనాగ్ పొయెట్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన కవితా సంపుటి ‘ఇన్ అనదర్ కంట్రీ’కి 2013 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రకటించారు. 41 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ఐరిష్ జాతీయేతర వ్యక్తికి ప్రకటించడం ఇదే తొలిసారి.
‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు’
భారత పర్యావరణ వేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్ విద్యా హక్కుల కార్యకర్త మలాలాలు 2013 సంవత్సరానికి క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు అందుకున్నారు. వీరికి న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న ఈ అవార్డులు ప్రదానం చేశారు. బంకర్ రాయ్ బేర్‌పుట్ కళాశాల వ్యవస్థాపకుడు. ఆయన గత 40 ఏళ్లుగా గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థ ద్వారా కషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా ప్రాంతాల్లో 2.39 లక్షల మందికిపైగా విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకుగాను 10 లక్షల లీటర్ల వర్షపు నీటిని వాడకంలోకి తెస్తున్నారు. పాకిస్థాన్‌లో విద్యాహక్కులకు పోరాడుతున్న మలాలా (16) తాలిబన్ల దాడికి గురైంది. ఆమె మలాల నిధి పేరిట తన కషిని కొనసాగిస్తోంది.
సర్లీఫ్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి (2011) గ్రహీతైన సర్లీఫ్ ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి ప్రజాయుతంగా ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు కావడం విశేషం. ఈ అవార్డును భారత ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి, అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తోంది. ఈ అవార్డు కింద * 25 లక్షలు బహూకరిస్తారు. ఈ అవార్డు 2011లో ఇలాభట్‌కు లభించింది. ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సేవా) అనే సంస్థను నిర్వహిస్తున్నారు.
అమితాబ్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 2013 గ్లోబల్ డైవర్సిటీ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 12న లండన్‌లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అమితాబ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. తన నాలుగు దశాబ్దాల నట జీవితంలో 180కు పైగా భారతీయ చిత్రాల్లో నటించిన అమితాబ్ భారతీయ చలనచిత్ర రంగాన్ని అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తి అని ప్రశంసపత్రంలో పేర్కొన్నారు. కాగా అమితాబ్‌కు ఇంతకుముందు కూడా పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బీబీసీ 1999లో నిర్వహించిన పోల్‌లో ‘మిలీనియంలోనే గొప్ప నటుడు’గా అమితాబ్ ఎంపికయ్యారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే నుంచి గౌరవ పౌరసత్వం పొందారు. ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్’తో కూడా ఆ దేశ ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది.
యూరోపియన్ పార్లమెంట్ ప్రైజ్‌కు స్నోడెన్ ఎంపికఅమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ 2013 సంవత్సరానికి యూరోపియన్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు ‘సఖరోవ్ మానవ హక్కుల బహుమతి’కి ఎంపికయ్యాడు. ఆయన అమెరికా ప్రభుత్వ గ్లోబల్ ఎలక్ట్రానిక్ నిఘా కార్యక్రమాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. స్నోడెన్ అమెరికా విడిచి రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.

No comments:
Post a Comment