AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2013

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2013
బయోశాటిలైట్‌ను ప్రయోగించిన రష్యాబయోలాజికల్ రీసెర్చ్ క్యాప్సుల్ బియోన్ (బీఐఒఎన్)-ఎం 1ను రష్యా ఏప్రిల్ 19న ప్రయోగించింది. కజకిస్థాన్‌లోని బైకనూర్ నుంచి సోయెజ్ -2 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి బీఐఒఎన్‌ను పంపారు. ఈ బయోశాటిలైట్‌లో 45 ఎలుకలతోపాటు, నత్తలు, పలు సూక్ష్మ జీవరాసులను పంపారు. ఈ ఉపగ్రహం తిరిగి మే 18న భూమికి చేరుతుంది. ఈ అంతరిక్ష యానంలో సూక్ష్మ జంతువులపై వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇవి వివిధ గ్రహాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడతాయి. రష్యా 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత బయోలాజికల్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించింది.

కష్ణ పదార్థంపై కొత్త వెలుగుశాస్త్రవేత్తల టెలిస్కోప్ పరిశోధనలకు అందకుండా ఉన్న కష్ణ పదార్థం గురించి విశేషాలను ఒక పరిశోధన వెలుగులోకి తీసుకువచ్చింది. విశ్వంలో దాదాపుగా 84.5 శాతాన్ని కష్ణపదార్థమే ఆవరించి ఉండవచ్చని అంతరిక్ష పరిశోదకులు అంచనావేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కు అమర్చిన ఒక డిటెక్టర్ ద్వారా ఈ అంచనాకు వచ్చామని అల్ఫామ్యాగ్నటిక్ స్పెక్ట్రోమీటర్(ఏఎంఎస్) పరిశోధనలోని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగ వివరాలను నోబెల్ అవార్డు గ్రహీత శామ్యూల్‌టింగ్ ప్రకటించారు. కష్ణపదార్థ వెల్లువ, ద్రవ్యరాశి గురించి ఇప్పటివరకు పరోక్ష పద్ధతిలోనే అంచనాలున్నాయి. విశ్వంలోని కాంతి కిరణాలతో, కష్ణ పదార్థానికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ఇంతవరకూ పరిశోధనలు జరిగాయి. ఏఎమ్‌ఎస్ అధ్యయనంలో విశ్వంలోని పాజిట్రాన్‌లనే కణాల ఉనికిని బట్టి పరిశోధకులు దీన్ని అంచనా వేశారు.

అగ్ని- 2 సక్సెస్అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న మధ్యశ్రేణి క్షిపణి అగ్ని-2 పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను ఏప్రిల్7న ఒడిశాలోని వీలార్ ద్వీపం మొబైల్ లాంచర్ నుంచి నిర్వహించారు. 2 వేల కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని ఇప్పటికే రక్షణశాఖలో ప్రవేశ పెట్టారు. రెండు మీటర్లు పొడవు, 17 టన్నుల బరువుండే అగ్ని-2, 1000 కిలోలకు పైగా పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 

No comments:

Post a Comment