AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2013

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2013
ఆరుగంటల్లో అంతరిక్ష కేంద్రానికిఅమెరికా, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు మార్చి 29న సోయిజ్ టీఎంఏ అంతరిక్ష నౌక ద్వారా ఆరుగంటల్లోపే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) చేరారు. వీరు కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అతి తక్కువ సమయంలో చేరుకున్నారు. సాధారణంగా ఐఎస్‌ఎస్ చేరడానికి 45 గంటలు పడుతుంది. 

చైనాలో హెచ్7ఎన్9హెచ్7ఎన్9 వ్యాధితో తొలిసారిగా చైనాలోని షాంఘైలో మార్చి 31న ఇద్దరు వ్యక్తులు మతి చెందారు. ఇది బర్డ్‌ఫ్లూ వ్యాధిలో తక్కువ ప్రమాదకరమైంది. ఇప్పటి వరకు హెచ్7 ఎన్9 వల్ల ఎవరూ మరణించలేదు. ఇది అంత త్వరగా మనుషులకు సోకదు. అయితే బర్డ్‌ఫ్లూకు చెందిన హెచ్ 5 ఎన్1 వైరస్ వల్ల 2003లో ఆసియాలో అనేక మంది మరణించారు. ఈ వ్యాధి పౌల్ట్రీ కోళ్ల నుంచి మానవులకు వ్యాపించింది. 

దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను 2013 మార్చి 27న విజయవంతంగా నిర్వహించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(ఎల్‌ిపీఎస్‌ిసీ)లో కొత్తగా ఏర్పాటు చేసిన హై ఆల్టీట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ(హెచ్‌ఏటీ)లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇస్రో జూలైలో చేపట్టే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ-డి5) ప్రయోగానికి ఈ పరీక్ష మరింత ఊతమిచ్చింది. జీఎస్‌ఎల్‌వీ -డి5 దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. జీశాట్-14ను కక్ష్యలో ప్రవేశపెడుతుంది. 2010 ఏప్రిల్‌లో దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌తో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ డి3 ప్రయోగం విఫలమైంది. 

యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్ ప్రారంభంమూడో యాంటీ- సబ్‌మెరైన్ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ కిల్తాన్’ను కోల్‌కతాలో 2013 మార్చి 26న జలప్రవేశం చేయించారు. నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానం, స్వయంశక్తి సాధించడంలో ‘కిల్తాన్’ ప్రారంభం ప్రధాన ఘట్టం. ప్రాజెక్ట్ -28(పి-28)లో భాగంగా నావీస్ డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ నౌకను రూపొందించింది. లక్షద్వీప్‌లోని దీవి కిల్తాన్’ పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. ఈ నౌక సముద్ర జలాల లోపల నౌకాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనికి అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, టార్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు వంటివి అమర్చుతారు.

‘తేజస్’ పరీక్ష విజయవంతందేశీయంగా అభివద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ను బెంగళూరులో మార్చి 31న విజయవంతంగా పరీక్షించారు. ఈ లిమిటెడ్ సీరీస్ ప్రొడక్షన్(ఎల్‌ఎస్‌ిపీ-8) తేజస్ యుద్ధ విమానం సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తెలిపింది. 

జలాంతర్గామి నుంచి బ్రహ్మోస్ పరీక్ష
జలాంతర్గామి నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మార్చి 20న విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం సమీపంలోని సముద్ర జలాల లోపలి పాంటూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. దీంతో ప్రపంచంలో ఇలాంటి సామర్థ్యం కలిగిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఈ క్షిపణి 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. భారత్-రష్యాలు సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణిని భూమి, నౌకపై నుంచి విజయవంతంగా పరీక్షించి ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో చేర్చారు. 

లక్ష్యఛేదనలో ‘నిర్భయ్’ విఫలం
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి సబ్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ‘నిర్భయ్’ లక్ష్య ఛేదనలో విఫలమైంది. ధ్వనివేగం కంటే తక్కువగా, ఒకే వేగంతో వెళుతూ లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మార్చి 12న తొలిసారిగా ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రంలో పరీక్షించింది. ఓ మొబైల్ లాంఛర్ నుంచి నింగికి ఎగిరిన నిర్భయ్ 25 నిమిషాల ప్రయాణం అనంతరం నిర్దేశిత మార్గం నుంచి దారితప్పింది. దీంతో సముద్రంలో ఏర్పాటుచేసిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన నిర్భయ్‌ని శాస్త్రవేత్తలు మధ్యలోనే రద్దుచేశారు. సుమారు 1,000 కి.మీ. దూరంలో గల లక్ష్యాలను ఛేదించే నిర్భయ్ దీర్ఘశ్రేణి క్షిపణిని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) రూపొందించింది. దీన్ని భూ, గగన, సముద్రతలాల నుంచీ ప్రయోగించవచ్చు. రష్యా సహకారంతో తయారుచేసిన ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ (ధ్వని కంటే వేగంగా ప్రయాణించే)క్రూయిజ్ క్షిప ణులు ఇది వరకే సైన్యం అమ్ములపొదిలో చేరాయి.

విశ్వ శోధనకు అతిపెద్ద వేధశాల విశ్వంలోని సుదూర ప్రాంత నక్షత్రాలు, గెలాక్సీలను కూడా లోతుగా పరిశోధించడానికి ఉపయోగపడే శక్తిమంతమైన వేధశాల (అబ్జర్వేటరీ)ను చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెర అటకామా ఎడారిలో మార్చి 13న ప్రారంభించారు. మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) అనంతరం జరిగిన విశ్వ పరిణామం, నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటి వాటిపై కూడా ఈ వేధశాలతో కొత్త వివరాలు తెలుసు కోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

యూఏఈలో పెద్ద సౌర విద్యుత్ కేంద్రంయునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభమైంది. సుమారు రూ.3200 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘షామ్స్-1’ సౌర విద్యుత్ కేంద్రాన్ని మార్చి 17న యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ ప్రారంభించారు. ఇది 20 వేల గహాలకు విద్యుత్‌ను అందిస్తుంది. ప్రపంచ పునరుత్పాదక ఇంధన సంపదలో 10 శాతాన్ని షామ్స్-1 ఉత్పత్తి చేస్తుంది. దీని నిర్మాణం 2010లో ప్రారంభమైంది. ఈ కేంద్రం 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుంది.

పినాక’ పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘పినాక’ రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ సముద్రతీరం వద్ద ఉన్న స్థావరం నుంచి మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ద్వారా ఫిబ్రవరి 28, మార్చి1న రెండు సార్లు పినాక పరీక్ష నిర్వహించారు. 

No comments:

Post a Comment