సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2014
2070 నాటికి ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస
ప్రమాదకర స్థాయికి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచదేశాలు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. 2100 నాటికి మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ , ఓజోన్, కార్బన్ డయాక్సైడ్‌లను శూన్యస్థితికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్య క్రమం (యునెప్) నవంబరు 19న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు
గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని బెర్లిన్‌లో సమావేశమైన 30 దేశాలునవంబరు 20న హామీనిచ్చాయి. ఉద్గారాల తగ్గింపు, భూతాపం ఎదుర్కొనేందుకు పేదదేశాలకు సాయంగా ఈ నిధులను అందజేస్తారు. స్వచ్ఛమైన ఇంధన అవసరాలు, గ్రీన్‌టెక్నాలజీ సమకూర్చడం, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కరవు బారినుంచి కాపాడుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ నిధుల్ని సమకూరుస్తున్నాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్ కేంద్రం దక్షిణ కొరియా.
ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని నవంబరు 17న ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత వైమానిక దళం ప్రయోగించింది. ఇది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు. నవంబరు 20న రెండు ఆకాశ్ క్షిపణులను ఒకేసారి ఎగురుతున్న లక్ష్యాలను నిర్దేశించి పరీక్షించారు. ఇందులో ఒకటి వేగంగా కదులుతున్న మానవ రహిత వాహనం బన్‌షీని నాశనం చేసింది. రెండున్నర కిలోమీటర్ల ఎత్తులో 11 కి.మీల దూరంలో ఎగురుతున్న ఆ లక్ష్యాన్ని 2.5 మాక్‌వేగంతో ఆకాశ్ ఢీకొంది. రెండో క్షిపణిని 24 కి.మీ పరిధిలో 5.5 కి.మీ ఎత్తులో కదులుతున్న లక్ష్యంపై ప్రయోగించారు.
బిగ్ బ్యాంగ్ ప్రాజెక్టులో చేరిన మద్రాస్ ఐఐటీ
విశ్వం ప్రాథమిక నిర్మాణం గురించి పరిశోధన జరుపు తున్న ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్)ప్రాజెక్టులో ఐఐటీ మద్రాస్ చేతులు కలిపింది. బిగ్ బ్యాంగ్ యంత్రంగా పేరొందిన లార్డ్ హాడ్రన్ కొలై డర్‌లోని కంపాక్ట్ మ్యువాన్ సోలినాయిడ్‌లో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని తీసుకుంది. ఈ ప్రత్యేకతను సాధించిన తొలి ఐఐటీగా గుర్తింపు పొందింది.
జలాంతర్గామి సింధుకీర్తి జల ప్రవేశం
భారత నౌకాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్‌లో నవంబరు 4న జలప్రవేశం చేసింది. దీన్ని ఐదారునెలల్లో నౌకాదళానికి అప్ప గిస్తారు. ఇది సింధూ ఘోష్‌కు చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి.
బంగాళాఖాతంలో మునిగిన నౌకాదళ నౌక
తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్ -72 (టీఆర్‌వీ) నవంబరు 6న బంగాళాఖాతంలో ము నిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దీన్ని యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడో లను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు.
అగ్ని-2 పరీక్ష సక్సెస్
మధ్యశ్రేణి అణ్వస్త్ర క్షిపణి అగ్ని-2ని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. నవంబర్ 9న ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు.
విజయవంతంగా షార్ ఎయిర్ డ్రాప్ పరీక్షశ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అక్టోబరు 31న ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మానవ రహిత ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, తర్వాత భూ వాతావరణంలోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు.
భూమికి చేరిన చైనా లూనార్ ఆర్బిటర్చంద్రుడి కక్ష్యను చేరిన చైనా వ్యోమనౌక జియావోఫియ్ వారం రోజుల తర్వాత తిరిగి నవంబరు 1న భూమికి చేరింది. ఈ నౌకను అక్టోబరు 24న లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. 8.40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ ఆర్బిటర్ భూమి, చంద్రుడి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడి కక్ష్యలోకి వ్యోమ నౌకను పంపి తిరిగి భూమికి తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యాలు ఈ ఘనత సాధించాయి.
కూలిన వ్యోమనౌక స్పేస్ షిప్- 2రోదసీలోకి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక స్పేస్‌షిప్-2 అక్టోబరు 31న కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో కూలిపోయింది. వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ నౌకను రూపొందించి, పరీక్షిస్తున్నప్పుడు అది 45 వేల అడుగుల ఎత్తులో పేలిపోయింది. 2015లో ఇది సిద్ధం కావాల్సి ఉంది.

No comments:
Post a Comment