AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

అవార్డులు మే 2013

అవార్డులు మే 2013
లిడియా డేవిస్‌కు బుకర్‌ప్రై జ్ప్రతిష్టాత్మక బుకర్ ప్రై జ్ అమెరికా రచయిత్రి లిడియా డేవిస్‌ను వరించింది. ఈ పోటీలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత యూఆర్.అనంతమూర్తి తుదివరకు పోటీలో ఉన్నా బహుమతి మాత్రం డేవిస్‌కే దక్కింది. సృజనాత్మకతతో కూడిన రచనలు చేయడంలో తనకుతానే సాటిగా పేరొందిన ఆమె బుకర్ ప్రైజ్ కింద 60 వేల పౌండ్లను (సుమారు రూ. 50 లక్షలు) సొంతం చేసుకున్నారు.

అబ్దుల్ కలాంకు అమెరికా వాన్‌బ్రాన్ అవార్డుభారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రతిష్టాత్మకమైన వెర్నర్‌వాన్ బ్రాన్ మెమోరియల్ అవార్డును మే 25న ప్రదానం చేశారు. ఈ అవార్డును రోదసీ సంబంధ పరిశోధనల్లో కృషి చేసిన వారికి అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ అందిస్తుంది.

కేరళ ముఖ్యమంత్రి చాందీకి యూఎన్ అవార్డుకేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఐక్యరాజ్యసమితి ప్రజా సేవ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్తూ వారి సమస్యలను పరిష్కరిస్తుండటంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 2003 నుంచి ప్రజా సేవా దినం (జూన్ 23) సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదుగురికి ఈ అవార్డులు ఇస్తోంది. వీటిలో ఈ ఏడాది ఆసియా - పసిఫిక్ జోన్ కింద ఊమెన్ చాందీకి అవార్డు దక్కింది. చాందీ ప్రజలను కలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 5.5 లక్షల ప్రజల వినతులను అందుకోగా వాటిలో మూడు లక్షల వినతులను పరిష్కరించారు. ఇందుకోసం 22.68 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 

మలాలాకు గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుపాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్.. 2013కుగాను గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలికల విద్య, సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది. యూఎన్ ఫౌండేషన్, యునెటైడ్ నేషన్స్ అసోషియేషన్ ఆఫ్ ది యూఎస్‌ఏ.. ఈ అవార్డును నవంబరు 6న మలాలాకు ప్రదానం చేస్తుంది. బాలికల విద్యపై ప్రచారం చేస్తున్న మలాలాపై గతేడాది తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.

మిస్ ఇండియా వరల్డ్‌వైడ్‌గా నేహాల్భారత సంతతికి చెందిన బ్రిటన్ వనిత నేహాల్ బొగైటా ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్’గా ఎంపికైంది. ఈ టైటిల్‌ను సాధించిన మొదటి బధిర యువతిగా ఆమె రికార్డు సష్టించింది. ఏప్రిల్ 27న మలేిషియా రాజధాని కౌలాలంపూర్‌లో ముగిసిన ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా జస్వీర్‌కౌర్ సంధు (మలేసియా), రెండో రన్నరప్‌గా సుర్బీ సచ్‌దేవ్ (ఒమన్) నిలిచారు. కిరీటం కోసం ఒక బధిర అభ్యర్థిని పోటీలో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి.

అపరాజితా దత్తాకు వైట్‌లీ అవార్డుగ్రీన్ అస్కార్‌గా వ్యవహరించే ‘వైట్ లీ అవార్డు’ పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు దక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న హార్‌‌నబిల్ పక్షులను కాపాడేందుకు చేసిన విశేష కషికి గుర్తింపుగా దత్తాకు ఈ పురస్కారం లభించింది. లండన్ రాయల్ జియోగ్రఫికల్ సొసైటీలో మే 3న ఈ అవార్డును ప్రదానం చేశారు. తూర్పు హిమాలయాల్లో హార్న్‌బిల్ పక్షుల సంరక్షణ కార్యక్రమానికి దత్తా నాయకత్వం వహించారు. 

భారతీయ వైద్యుడికి అవార్డుపొగాకు పదార్థాల నియంత్రణకు కషి చేసినందుకుగాను ముంబైలోని టాటా స్మారక ఆసుపత్రి క్సాన్సర్ వైద్య నిపుణుడు పంకజ్ చతుర్వేది ప్రతిష్టాత్మక ‘జ్యూడీ వికెన్‌ఫెల్డ్’ పురస్కార్నాన్ని మే 2న వాషింగ్టన్‌లో అందుకున్నారు.

వంశీ వకులాభరణంకు అమర్త్యసేన్ అవార్డు హైదరాబాద్ యూనివర్సిటీ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ వంశీ వకులాభరణం ప్రొఫెసర్ అమర్త్య సేన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది నుంచి అందించే ఈ అవార్డును ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఏర్పాటు చేసింది. 10 విభాగాల్లో సామాజిక శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు.

No comments:

Post a Comment