AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు ఫిబ్రవరి 2013

అవార్డులు ఫిబ్రవరి 2013
85వ ఆస్కార్ అవార్డులు 85వ ఆస్కార్ అవార్డులను అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 25న ప్రదానం చేశారు. భారతీయ కథా నేపథ్యంలో రూపొందిన ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రం నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది. వివరాలు..
ఉత్తమ చిత్రం-ఆర్గో, ఉత్తమ దర్శకుడు - ఆంగ్ లీ (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు-డేనియల్ డే లూయిస్(లింకన్), ఉత్తమ నటి - జెన్నిఫర్ లారెన్స్ (సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్), ఉత్తమ సహాయనటుడు-క్రిస్టఫో వాల్ట్స్(జాంగో అన్‌చైన్డ్), ఉత్తమ సహాయ నటి - అన్నె హథవే (లెస్ మిసరబుల్స్), ఉత్తమ యానిమేషన్ చిత్రం - (బ్రేవ్), ఉత్తమ ఛాయాగ్రాహకుడు - క్లాడియో మిరండా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - మైఖెల్ డానా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - ఆడ్లె అడ్‌కిన్స్, పాల్ ఎప్‌వర్త్ (స్కైఫాల్), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - క్వెంటిన్ టరాంటినో(జాంగో అన్‌చైన్డ్),ఉత్తమ అడాప్టడ్ స్క్రీన్‌ప్లే - క్రిస్ టెర్రియో (ఆర్గో), ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - సెర్చింగ్ ఫర్ సుగర్‌మ్యాన్, ఉత్తమ లఘుచిత్రం- కర్ఫ్యూ; ఉత్తమ సంక్షిప్త చిత్రం - ఇన్నోసెంట్, ఉత్తమ విదేశీ చిత్రం - ఆమర్; ఉత్తమ ఎడిటింగ్ - విలియమ్ గోల్డెన్ బర్గ్(ఆర్గో), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - లైఫ్ ఆఫ్ పై, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఆండీ నెల్సన్, మార్క్ ప్యాటర్సన్, సైమన్ హేస్ (లెస్ మిసరబుల్స్), ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ - పర్ హాల్‌బర్గ్, కరెన్ బేకర్ ల్యాండర్స్ (స్కైఫాల్ ), పాల్ ఎన్ జె ఓట్టోస్సాన్ (జీరో డార్క్ థర్టీ)

టాటాకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అవార్డుటాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాను ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఫిబ్రవరి 21న ముంబైలో రతన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2012వ సంవత్సరానికి ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ’ అవార్డు గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్‌కు లభించింది. ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసు కంపెనీల్లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఒకటి. 140 దేశాల్లో ఈ సంస్థ విధులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.

బ్రేక్ త్రూ ప్రెజ్ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించనంత భారీ మొత్తంలో రూ.15 కోట్లతో (నోబెల్ బహుమతి కంటే రెండింతలు ఎక్కువ) ‘బ్రేక్ త్రూ ప్రెజ్’ అనే సైన్స్ బహుమతిని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగెర్‌బర్గ్, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్‌లు నెలకొల్పారు. లైఫ్ సెన్సైస్‌లో విశేష కషి చేసిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు. ప్రారంభ సంవత్సరానికిగాను క్యాన్సర్, జెనెటిక్ పరిశోధనల్లో విశేష కషి చేసిన 11 మంది శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద గరిష్టంగా ఒక్కొక్కరికి 3 మిలియన్ డాలర్లు బహూకరిస్తారు. 

నరేంద్ర కోహ్లీకి వ్యాస సమ్మాన్ప్రముఖ హిందీ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ 2012 వ్యాస సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘నభూతో నభవిష్యతీ’ నవలకుగాను ఈ అవార్డు దక్కింది. కె.కె.బిర్లా ఫౌండేషన్ 1991లో వ్యాస సమ్మాన్ అవార్డును ఏర్పాటు చేసింది. పురస్కారం కింద 2.5 లక్షల నగదు అందజేస్తారు.

పండిట్ రవిశంకర్‌కు బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ అవార్డుసితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు మర ణాంతరం బెస్ట్ వరల్డ్ మ్యూ జిక్ అవార్‌‌డ లభించింది. లాస్‌ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 11న 55వ గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన కుమార్తె సితార్ విద్వాంసురాలు అనౌష్క శంకర్ అందుకున్నారు. పండిట్ రవిశంకర్ సంగీత మాలిక ది లివింగ్ రూం సెషన్‌‌స పార్‌‌ట-1కు ప్రపంచ ఉత్తమ సంగీతఆల్బం అవార్‌‌డ దక్కింది.

షార్ డెరైక్టర్ ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డుప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2013 కుగాను షార్ డెరైక్టర్ డా’’ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు లభించింది. పశ్చిమగోదావరికి చెందిన ప్రసాద్ గత 37ఏళ్లుగా ఇస్రోలో అనేక విభాగాల్లో పనిచేశారని నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్‌‌స సంస్థ తెలిపింది.

పాల్ హన్‌సేన్‌కు వరల్డ్ ప్రెస్ ఫొటోగ్రఫీ అవార్డుస్వీడన్ ఫొటో జర్నలిస్ట్ పాల్ హన్‌సేన్ 2012 ఏడాదికిగాను వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రఫీ అవార్‌‌డ గెలుచుకున్నాడు. ఇది ఫొటో జర్నలిస్టులకిచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం. 2012లో గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో చిన్నపిల్లలు మతిచెందిన దశ్యాన్ని చిత్రీకరించిన పాల్‌కు ఈ అవార్‌‌డ దక్కింది.

ఇలాభట్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానంప్రముఖ సంఘసేవకు రాలు ఇలా భట్‌కు 2011 ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ అభివద్ధి బహుమతిని ఫిబ్ర వరి 18న న్యూఢిల్లీ లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్‌‌స అసోసియేషన్ (సెవా) సంస్థను ఆమె స్థాపించారు. భారత ప్రభుత్వం అందచేసే ఈ బహుమతి కింద ఆమెకు ’25 లక్షలు బహూకరించారు. 2012 సంవత్సరానికి ఈ అవార్డుకు సైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ ఎంపికయ్యారు.
2013 ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతిదక్షిణ సూడాన్‌కు చెందిన బిషప్ ఎమిరైటస్ పరైడ్ తబన్‌కు 2013 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి దక్కింది. ఈ బహుమతిని ‘సెర్గియా వియోరా డి మెల్లో’గా పిలుస్తారు. అంతర్గత ఘర్షణలతో దెబ్బతిన్న ప్రాంతంలో జాతుల మధ్య పరస్పర విశ్వాసం నెలకొల్పడానికి చేసిన కషికి గాను తబన్‌కు శాంతి బహుమతి లభించింది. దక్షిణ సూడాన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కురోన్‌లో 2005లో తబన్ ఏర్పాటు చేసిన ‘హోలీ ట్రినిటీ పీస్ విలేజ్’ పలు తెగలు, జాతుల మధ్య సయోధ్య, సామరస్యం నెలకొనేందుకు కషి చేస్తోంది. ఈ బహుమతిని మార్చి 1న జెనీవాలో తబన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ బహూకరిస్తారు. 2003లో ఇరాక్‌లో బాంబు దాడిలో మరణించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అధిపతి సెర్గియో వియోరా డీ మెల్లో (బ్రెజిల్) పేరిట ఈ బహుమతిని అందజేస్తున్నారు. ఈ బహుమతి కింద 5,500 డాలర్లు బహూకరిస్తారు.

భారత సంతతి మహిళకు ఆస్ట్రేలియా మెడల్భారత సంతతికి చెందిన కష్ణ అరోరా (85) అలియాస్ 
ఆంటీజీకి 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్’ లభించింది. ఆస్ట్రేలియాలో ఆమె చేసిన స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. గతేడాది ఈ పురస్కారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు దక్కింది.

నోబెల్‌కు మలాలా నామినేట్తాలిబన్ల కాల్పుల్లో గాయపడిన పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్ పేరు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయింది. ఫ్రాన్స్, కెనడా, నార్వేలకు చెందిన ఎంపీలు ఈమె పేరును ప్రతిపాదించారు. ఫిబ్రవరి 1తో నోబెల్ బహుమతుల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అవార్డులను అక్టోబర్‌లో ప్రకటించనున్నారు. బాలికల విద్యపై తాలిబన్ల ఆంక్షలను వ్యతిరేకించిన కారణంగా గత ఏడాది అక్టోబర్ 9న స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న మలాలాపై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మలాలాతోపాటు బెలారస్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అలెస్ బెల్యాత్‌స్కీ, రష్యాకు చెందిన ల్యుద్‌మిలా అలెక్సీయేవా పేర్లు కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాయి. నోబెల్ శాంతి బహుమతికి అర్హుల పేర్లను వివిధ సంస్థలు, వ్యక్తులు నామినేట్ చేయొచ్చు. ఆయా దేశాల జాతీయ చట్ట సభలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ కోర్టుల జడ్జీలు, యూనివర్సిటీల రెక్టార్లు, సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్లు, గతంలో ఈ అవార్డు పొందిన వ్యక్తులు, సంస్థలు నామినేట్ చేయొచ్చు. అలాగే నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రస్తుత, మాజీ సభ్యులు, మాజీ సలహాదారులు నామినేట్ చేసినా కూడా ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది.

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు అత్యున్నత అవార్డుభారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రంగస్వామి శ్రీనివాసన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మక ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డుతో సత్కరించారు. లేజర్ కిరణాలతో చేసిన పరిశోధనకుగాను శ్రీనివాసన్‌కు ఈ పురస్కారం దక్కింది. శామ్యూల్ బ్లమ్, జేమ్స్ విన్నే అనే మరో ఇద్దరు సహ ఆవిష్కర్తలతో కలిసి శ్రీనివాసన్ ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. 1980లో ఈ అవార్డును ఏర్పాటు చేయగా.. 1985 నుంచి ప్రదానం చేస్తున్నారు.

ఈ-పాలనలో రాష్ట్రానికి రెండు అవార్డులుఆంధ్రప్రదేశ్‌కు ఈ-పాలనలో రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘వినియోగదారుల ప్రయోజనార్థం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)ని ప్రభుత్వ రంగ సంస్థలు సజనాత్మకంగా ఉపయోగించడం’ అనే కేటగిరీలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్‌కు చెందిన ఈపీఐఎంఆర్‌ఎస్ ఐటీ విభాగానికి రజతం, ‘ఎగ్జెంప్లరీ రీ యూజ్ ఆఫ్ ఐసీటీ బేస్డ్ సొల్యూషన్స్’ కేటగిరీలో గురుకుల విద్యాసంస్థల్లో ఐటీ సేవలకుగాను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కాంస్య పతకాలు లభించాయి. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జైపూర్‌లో జరిగే ఈ-పాలన 16వ జాతీయ సదస్సులో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 

విశాఖ జిల్లాకు జాతీయ పురస్కారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై ఎనిమిదో జాతీయ సదస్సును ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సామాజిక సమానత్వాన్ని పెంపొందించినందుకుగాను విశాఖ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అందుకున్నారు.

డాక్టర్ లాల్జీ సింగ్‌కు నాయుడమ్మ అవార్డు2012 నాయుడమ్మ అవార్డుకు ప్రముఖ జీవ శాస్త్రవేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ లాల్జీ సింగ్ ఎంపికయ్యారు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, వన్యప్రాణి సంరక్షణ, బయో ఇన్ఫర్మేటిక్స్ పరిశోధనల్లో చేసిన కషికి గుర్తింపుగా లాల్జీ సింగ్‌కు ఈ పురస్కారం దక్కింది.

తల్లూర్‌కు స్కోడా ఆర్ట్ ప్రెజ్కర్ణాటకకు చెందిన చిత్రకారుడు ఎల్.ఎన్.తల్లూర్‌కు 2012 స్కోడా ఆర్ట్ ప్రెజ్‌ను ఫిబ్రవరి 1న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, స్కోడా ట్రోఫీ బహూకరించారు.

No comments:

Post a Comment