AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2017

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2017
కృత్రిమ సూర్యుడిని పరీక్షించిన జర్మన్ శాస్త్రజ్ఞులు పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీలోని జ్యూలిచ్‌లో ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు మార్చి 23న చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్‌లైట్లను అమర్చి వాటిని పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరింపచేయగా ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేషన్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కృత్రిమ సూర్యుడి పరీక్ష
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు
ఎక్కడ : జర్మనీ
ఎందుకు : కొత్త మార్గాల్లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి 

నాసా మార్స్ ప్రాజెక్టుకి రూ.1.30 లక్షల కోట్లు అరుణ గ్రహం మీదకు మనుషులను పంపే నాసా ప్రాజెక్టు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూ. 1.30 లక్షల కోట్లు కేటాయించారు. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై మార్చి 22న ఆయన సంతకం చేశారు. 2018 సంవత్సరానికి గాను నాసా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్ కింద ఈ నిధులు కేటాయించారు. 2030 నాటికి అంగారకుడి మీదకు మనిషిని పంపాలన్నది నాసా లక్ష్యం. 
క్విక్ రివ్యూ:ఏమిటి : నాసా మార్స్ ప్రాజెక్టుకి రూ.1.30 లక్షల కోట్లు 
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
ఎందుకు : అంగారకుడి మీదకు మనిషిని పంపేందుకు 

బరాక్ క్షిపణి పరీక్ష విజయవంతంఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే బరాక్ క్షిపణిని మార్చి 24న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్ సహకారంతో అభివృద్ధి చేసిన దీన్ని అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌక నుంచి నౌకాదళం పరీక్షించింది. తక్కువ ఎత్తులో శరవేగంగా ప్రయాణిస్తున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. 44,500 టన్నుల బరువు గల ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను 2013 నవంబర్‌లో నౌకాదళంలో చేర్చారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : బరాక్ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ఇండియన్ నేవీ 
ఎక్కడ : ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నుంచి

వంద రెట్ల వేగంతో వైఫైప్రస్తుత వైఫై వేగం కంటే వంద రెట్ల వేగం ఉన్న సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం ఎలాంటి ప్రమాదంలేని పరారుణ కిరణాలను ఉపయోగించారు. దీనితో ఇప్పటికంటే ఎక్కువ పరికరాలకు నిరంతరాయంగా అత్యధిక వేగంతో వైఫై సౌకర్యం కల్పించవచ్చని పరిశోధకులు 2017 మార్చి 19న తెలిపారు. ఈ వ్యవస్థను నెదర్లాండ్‌‌సలోని ఇండ్హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

భూమిని చేరిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌకఅంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ సురక్షితంగా తిరిగి భూమిని చేరినట్లు స్పేస్ ఎక్స్ కంపెనీ 2017 మార్చి 20న వెల్లడించింది. గతంలో అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌ను భూమిపైకి దింపడంలో పలుమార్లు విఫలమైన స్పేస్ ఎక్స్ కొంత కాలంగా వరసగా సఫలీకృతమవుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫిబ్రవరి 23న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక అక్కడి వ్యోమగాములకు అవసరమైన వస్తువులను తీసుకెళ్లడమే కాకుండా అంతరిక్షం నుంచి దాదాపు 4 వేల పౌండ్ల బరువైన పరిశోధన నమూనాలను, అంతరిక్ష వ్యర్థాలను తీసుకొచ్చింది.

110 ఏళ్లలో 0.60 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలుగత 110 ఏళ్లలో దేశంలో ఉష్ణోగ్రత 0.60 డిగ్రీలు పెరిగింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన వివరాలను కేంద్రం మార్చి 27న రాజ్యసభకు వెల్లడించింది.
వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఇంటర్ గవర్న్‌మెంటల్ పానెల్ (ఐపీసీసీ) 2014లో ప్రచురించిన ఐదో మదింపు నివేదిక ప్రకారం 1880 నుంచి 2012 మధ్య భూమి, సముద్ర ఉపరితలంపై 0.85 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్‌లో గత 110 ఏళ్లలో 0.60 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : భారత వాతావరణ శాఖ

చంద్రయాన్-1 జాడ కనుగొన్న నాసా చంద్రుడిపై పరిశోధనకు ఇస్రో పంపిన ఏడాది లోపలే ఆచూకీ లేకుండా పోయిన చంద్రయాన్-1 అంతరిక్షనౌకను నాసా కనుగొంది. ఈ మేరకు మార్చి 10న ఆ సంస్థకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరెటరీ (జేపీఎల్) శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూ ఆధారిత రాడార్ వ్యవస్థతో నాసాకు చెందిన లూనార్ రీకానయ్‌సెన్‌‌స ఆర్బిటార్ (ఎల్‌ఆర్‌వో)తో పాటు ఇస్రోకు చెందిన చంద్రయాన్-1ను కనుగొన్నట్లు వారు వివరించారు. చంద్రుడి ఉపరితలానికి 200 కిలో మీటర్ల పైన అది ఇంకా పరిభ్రమిస్తోందని చెప్పారు. 
చంద్రయాన్-1ను 2008, అక్టోబర్ 22న ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. అయితే 2009, ఆగస్టు 29 తర్వాత దాని సమాచారం లేదు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : చంద్రయాన్ -1 నౌకను కనుగొన్న నాసా
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరెటరీ శాస్త్రవేత్తలు

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతంసూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మార్చి 11న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని అధీకృత పరీక్ష కేంద్రం నుంచి డీఆర్‌డీవో ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 300 కిలోల బరువును మోసుకెళ్తుంది.

2022 నాటికి డిజిటల్ మీడియా ఆధిపత్యం 2021-22 నాటికి దేశంలో డిజిటల్ మీడియా ఇతర సంప్రదాయ మాధ్యమాలను అధిగమిస్తుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (E&Y) ఇండియా అంచనా వేసింది. ఈ మేరకు మార్చి 13న ఓ నివేదిక విడుదల చేసింది. గణనీయంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం రూ. 8,490 కోట్లుగా ఉన్న దేశీ డిజిటల్ మార్కెట్ (డిజిటల్ అడ్వర్టైజింగ్, మ్యూజిక్, వీడియోలు, గేమింగ్ మొదలైనవి) వచ్చే మూడేళ్లలో రూ. 20,000 కోట్లకు చేరనుందని అంచనా.
క్విక్ రివ్యూ:ఏమిటి : 2022 నాటికి డిజిటల్ మీడియా ఆధిపత్యం 
ఎవరు : ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : స్మార్ట్ ఫోన్లు, నెట్ వినియోగం పెరుగుతున్నందుకు

సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతంపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ ఇంటర్ సెప్టార్ (అడ్వాన్‌‌సడ్ ఎయిర్ డిఫెన్‌‌స) క్షిపణిని భారత్ మార్చి 1న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన పృథ్వి క్షిపణిని బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో మొహరించిన సూపర్‌సోనిక్ క్షిపణి విజయవంతంగా అడ్డుకుంది.ఈ క్షిపణిపై అంతకుముందు 2017 ఫిబ్రవరి 11, 2016 మే 15 న జరిపిన పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి.

నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం భారత నావికాదళం నౌకా విధ్వంసక క్షిపణిని మార్చి 2న విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అరేబియా సముద్రంలో కల్వరీ జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఇది ఉపరితలంపై ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారు చేసిన ఆరు స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములన్నింటికీ ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అమర్చుతారు.

భారత్‌లో స్కార్పియో తరగితిలో నిర్మితమైన తొలి జలాంతర్గామి కల్వరి. దీన్ని ఫ్రెంచ్ నావికా రక్షణ, ఇంధన సంస్థ-DCNS ముంబైలోని మజ్‌గావ్‌డక్‌లో నిర్మించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష 
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : అరేబియా సముద్రం 
ఎవరు : భారత నావికా దళం
ఎందుకు : సుదూర ప్రాంతాల్లోని ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు 

ఐఎన్‌ఎస్ విరాట్‌కు వీడ్కోలు  మూడు దశాబ్దాల పాటు భారత నావిక దళానికి సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌కు నావికదళ అధికారులు వీడ్కోలు పలికారు. ఈ మేరకు మార్చి 6న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ ఎస్ విరాట్‌ను అధికారికంగా విధుల నుంచి తప్పించారు. దీంతో నేవీ నుంచి పదవీ విరమణ పొందిన రెండో నౌక ఐఎన్‌ఎస్ విరాట్ చరిత్రలోకెక్కింది. ఇప్పటికే ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నావికాదళం నుంచి ఉపసంహరించారు.

ఐఎన్‌ఎస్ విరాట్ విశేషాలు 
  • 1987 మే 12న భారత నేవీలో చేరిన ఐఎన్‌ఎస్ విరాట్ (అంతకుముందు 1959 నుంచి 1984 వరకు బ్రిటీష్ రాయల్ నేవిలో సేవలు)
  • ఇప్పటి వరకూ 11 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన విరాట్.
  • 1989 శ్రీలంక శాంతి ప్రక్రియలో, 2001 పార్లమెంట్‌పై దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్‌లో కీలక పాత్ర
  • విరాట్ పొడవు 743 అడుగులు. వెడల్పు 160 అడుగులు, ఎత్తు 29 అడుగులు. దీనిపై 16 సీ హ్యారియస్ జెట్స్, 4సీ కింగ్ కాప్టర్స్, 2 చేతక్ చాపర్స్, 4 ధృవ చాపర్స్‌ను నిలపవచ్చు
క్విక్ రివ్యూ:ఏమిటి : నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్ విరాట్ ఉపసంహరణ
ఎప్పుడు : మార్చి 6
ఎక్కడ :ముంబై
ఎవరు : భారత నావికాదళం

గస్తీ నౌక ఆయుష్ ప్రారంభంతీర ప్రాంత రక్షణ బలోపేతానికి తోడ్పడే గస్తీ నౌక ఆయుష్ మార్చి 6న కోస్ట్‌గార్డ్‌లో చేరింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ఓడరేవులో కోస్ట్‌గార్డ్ డీఐజీ అనిల్ కుమార్ హర్‌బోల ప్రారంభించారు.

No comments:

Post a Comment