సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2017
ఇజ్రాయెల్‌తో భారీ క్షిపణి ఒప్పందంఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే మధ్యంతర శ్రేణి క్షిపణి (ఎంఆర్-శామ్)ని ఇజ్రాయెల్‌తో కలిసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన భారీ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 22న ఆమోదం తెలిపింది. రూ.17,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ); ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)లు సంయుక్తంగా అమలుచేస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత సైన్యానికి క్షిపణులు సరఫరా చేస్తారు. ఈ క్షిపణి నౌకాదళం కోసం రూపొందిస్తున్న దీర్ఘశ్రేణి ఎల్‌ఆర్-శామ్‌కు భూతల వెర్షన్. దీని పరిధి దాదాపు 70 కిలోమీటర్లు. 2023లో క్షిపణుల తయారీ పూర్తవుతుంది.
ఏడు గ్రహాల సౌర కుటుంబాన్ని గుర్తించిన నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు మరో సౌర కుటుంబాన్ని గుర్తించారు. ఇందులో ఏడు గ్రహాలు కొంచెం అటు ఇటుగా భూమి సైజులోనే ఉన్నాయని నాసా ఫిబ్రవరి 21న తెలిపింది. వీటిలో కనీసం 6 గ్రహాలపై భూమిపై ఉన్నట్లే రాళ్లు, రప్పలు ఉన్నాయి. మొత్తం 7 గ్రహాల్లో మూడు గోల్డిలాక్ జోన్‌లో ఉన్నాయి. అంటే ఈ మూడు గ్రహాలు సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా (చల్లగా ఉండకుండా) మరీ దగ్గరగా లేకుండా (ఎండ వేడికి కరిగిపోకుండా) ఉన్నాయి. దీంతో ఈ మూడు గ్రహాలపై భారీ మహా సముద్రాలు ఉండే అవకాశం ఉంది.
సౌర కుటుంబ స్వరూపం
ఇస్రో 104 ఉపగ్రహాల ప్రయోగంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్ర, సాంకేతిక రంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లోనే తొలిసారిగా ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 15న (ఉదయం 9.28 గంటలకు) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా గతంలో ఒకే ప్రయోగంలో 37 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన రష్యా రికార్డును అధిగమించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కేవలం 29 ఉపగ్రహాలను మాత్రమే పంపింది. 2016లో ఇస్రో 20 ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో రోదసిలోకి పంపింది.
ఫిబ్రవరి 15న జరిపిన ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహక నౌక మోసుకెళ్లిన 104 ఉప్రగహ్రాల మొత్తం బరువు 1,378 కిలోలు. ఇందులో మూడు స్వదేశీ ఉపగ్రహాలు (కార్టోశాట్-2డీ, ఐఎన్‌ఎస్-1ఏ, ఐఎన్‌ఎస్-1బీ) కాగా మిగతా 101 విదేశీ ఉపగ్రహాలు. వీటిలో 96 శాటిలైట్స్ అమెరికావి. మిగిలిన 5 ఉపగ్రహాలు నెదర్లాండ్స్, కజకిస్తాన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), స్విట్జర్లాండ్‌లకు చెందినవి.
పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో 39వ ప్రయోగం ద్వారా ఈ ఉపగ్రహాలను భూమికి 505 కి.మీ. ఎత్తు నుంచి 524 కి.మీ.లోని సూర్యానువర్తన ధృవ కక్ష్య ( sun synchronous orbit - SSO)లోకి ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానమైన కార్టోశాట్-2డీ ఉపగ్రహం 510 కి.మీ. ఎత్తు నుంచి భూమి మీద జరిగే మార్పులను ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. ఇక ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్‌ఎస్-1ఏ, ఐఎన్‌ఎస్-1బీ) 6 నెలలు మాత్రమే ఉపయోగపడతాయి.
ఉపగ్రహాల ఉపయోగాలు
కార్టోశాట్-2డీ
భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. కార్టోశాట్-1, 2, 2ఏ, 2బీ, 2సీ శాటిలైట్స్‌ను పీఎఎల్‌వీ ద్వారానే పంపారు. తాజాగా కార్టోశాట్-2డీ ఫిబ్రవరి 15న రోదసిలో ప్రవేశించింది. 714 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్ల ఎత్తులో SSOలో పరిభ్రమిస్తూ భౌగోళిక సమాచారాన్ని అందిస్తుంది.
ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాలను పంపిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూములు, మ్యాప్‌లు తయారు చేయడం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్ల సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు పనిచేస్తుంది.
నానో శాటిలైట్స్
ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్‌ఎస్-1ఏ, ఐఎన్‌ఎస్-1బీ) ఉపగ్రహాలను అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ తయారు చేసింది. రెండు ఉపగ్రహాలు కలిపి 18.1 కేజీలు బరువు ఉన్నాయి.
8.4 కేజీల బరువు కలిగిన ఐఎన్‌ఎస్-1ఏలో 5 కేజీల బరువు కలిగిన పేలోడ్‌సను అమర్చారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్టిబ్య్రూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎప్), సింగల్ ఈవెంట్ అప్‌సెట్ మానిటర్ (ఎస్‌ఈయూఎం) పేలోడ్‌స అమర్చారు. రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ శాటిలైట్ భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది.
9.7 కేజీలు బరువు కలిగి ఐఎన్‌ఎస్-1బీ ఉపగ్రహంలో ఎర్త్ ఎక్సోస్పియర్ లేమాన్ ఆల్ఫా అనాలసిసర్ (ఈఈఎల్‌ఏ), ఆర్గామీ కెమెరా పేలోడ్‌స అమర్చారు. ఇందులో ఉన్న రిమోట్ సెన్సింగ్ కలర్ కెమెరా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది.
విదేశీ ఉపగ్రహాల వివరాలు
ఆమెరికాకు చెందిన డౌవ్ ఫ్లోక్-3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహాలుంటాయి. వీటన్నింటినీ ఒక బాక్స్‌లో అమర్చి ఉంచారు. అమెరికా అంతరిక్ష సంస్థ భూ కేంద్రంతో అనుసంధనామై పనిచేసే ఈ ఉపగ్రహాలు వాణిజ్య, వాతావరణ సంబంధిత సమాచారాన్ని ప్రతి రోజు తెలియజేస్తాయి. లీమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలుంటాయి. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్నే అందిస్తాయి.
నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో-2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్-ఫరాబి-1, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమానుస్ట్రేషన్‌కు ఉపయోగించారు. చిన్న చిన్న అప్లికేషన్‌స తయారు చేసేందుకు ఈ తరహా ఉపగ్రహాలు సహాయపడతాయి.
ఇస్రో ప్రయాణం
దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు క్రయోజనిక్ ఇంజిన్ (సీ-25) పరీక్షను ఫిబ్రవరి 17న విజయవంతంగా నిర్వహించారు. దీనిని తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్‌లో రూపొందించి పరీక్షించారు.
క్రయోజెనిక్ ఇంజిన్‌ను 2017 ఏప్రిల్‌లో ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3లో ఉపయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా 4 టన్నుల బరువు కలిగిన జీశాట్-19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.
అంతరిక్షంలో కోతకొచ్చిన క్యాబేజీ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) లో పండించిన తొలి క్యాబేజీ పంట కోతకొచ్చింది. నాటిన నెల రోజుల తరువాత పచ్చని ఆకులతో చైనీస్ క్యాబేజీ కోతకు సిద్ధమైనట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. వ్యోమగామి పెగ్గీ విట్సన్ కోస్తున్న ఈ చైనీస్ క్యాబేజీ పంటలో కొంత భాగాన్ని ఐఎస్‌ఎస్ సిబ్బంది తినడానికి ఉపయోగించగా మిగిలిన దాన్ని పరిశోధనల నిమిత్తం నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌కు తీసుకొస్తారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగైన ఐదో పంట.
నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగం విజయవంతం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ఆహార పదార్థాలు మోసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్‌ను స్పేస్ ఎక్స్ నౌక ద్వారా నాసా ఫిబ్రవరి 19న విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ కేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి దీనిని ప్రయోగించారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచే వ్యోమగాములను చంద్రుడిపైకి పంపారు.

- ఈ గ్రహ వ్యవస్థ ఆక్వేరియస్ అనే తారామండలంలో ఉంది.
- మన సౌర కుటుంబానికి 40 కాంతి సంవత్సరాలు అంటే 235 లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉంది.
- దీనికి ద ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ అండ్ ప్లానెస్టిమాల్స్ స్మాల్ టెలిస్కోప్ (ట్రాపిస్ట్)-1 గా నామకరణం చేశారు.
- ట్రాపిస్ట్ అనేది చిలీలోని ఒక టెలిస్కోప్. ఈ గ్రహ వ్యవస్థలోని మొదటి మూడు గ్రహాలను ఈ టెలిస్కోపే గుర్తించింది. తాజాగా స్విట్జర్ టెలిస్కోప్ ద్వారా మరో ఐదు గ్రహాలను నాసా గుర్తించింది.
- ట్రాపిస్ట్-1లోని 7 గ్రహాలకు ట్రాపిస్ట్-1బీ, ట్రాపిస్ట్-1సీ, ట్రాపిస్ట్-1డీ, ట్రాపిస్ట్-1ఈ, ట్రాపిస్ట్-1ఎఫ్, ట్రాపిస్ట్-1హెచ్ అని పేరు పెట్టారు.
ఇస్రో 104 ఉపగ్రహాల ప్రయోగంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్ర, సాంకేతిక రంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లోనే తొలిసారిగా ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 15న (ఉదయం 9.28 గంటలకు) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా గతంలో ఒకే ప్రయోగంలో 37 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన రష్యా రికార్డును అధిగమించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కేవలం 29 ఉపగ్రహాలను మాత్రమే పంపింది. 2016లో ఇస్రో 20 ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో రోదసిలోకి పంపింది.
ఫిబ్రవరి 15న జరిపిన ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహక నౌక మోసుకెళ్లిన 104 ఉప్రగహ్రాల మొత్తం బరువు 1,378 కిలోలు. ఇందులో మూడు స్వదేశీ ఉపగ్రహాలు (కార్టోశాట్-2డీ, ఐఎన్‌ఎస్-1ఏ, ఐఎన్‌ఎస్-1బీ) కాగా మిగతా 101 విదేశీ ఉపగ్రహాలు. వీటిలో 96 శాటిలైట్స్ అమెరికావి. మిగిలిన 5 ఉపగ్రహాలు నెదర్లాండ్స్, కజకిస్తాన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), స్విట్జర్లాండ్‌లకు చెందినవి.
పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో 39వ ప్రయోగం ద్వారా ఈ ఉపగ్రహాలను భూమికి 505 కి.మీ. ఎత్తు నుంచి 524 కి.మీ.లోని సూర్యానువర్తన ధృవ కక్ష్య ( sun synchronous orbit - SSO)లోకి ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానమైన కార్టోశాట్-2డీ ఉపగ్రహం 510 కి.మీ. ఎత్తు నుంచి భూమి మీద జరిగే మార్పులను ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. ఇక ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్‌ఎస్-1ఏ, ఐఎన్‌ఎస్-1బీ) 6 నెలలు మాత్రమే ఉపయోగపడతాయి.
ఉపగ్రహాల ఉపయోగాలు
కార్టోశాట్-2డీ
భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. కార్టోశాట్-1, 2, 2ఏ, 2బీ, 2సీ శాటిలైట్స్‌ను పీఎఎల్‌వీ ద్వారానే పంపారు. తాజాగా కార్టోశాట్-2డీ ఫిబ్రవరి 15న రోదసిలో ప్రవేశించింది. 714 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్ల ఎత్తులో SSOలో పరిభ్రమిస్తూ భౌగోళిక సమాచారాన్ని అందిస్తుంది.
ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాలను పంపిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూములు, మ్యాప్‌లు తయారు చేయడం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్ల సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు పనిచేస్తుంది.
నానో శాటిలైట్స్
ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్‌ఎస్-1ఏ, ఐఎన్‌ఎస్-1బీ) ఉపగ్రహాలను అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ తయారు చేసింది. రెండు ఉపగ్రహాలు కలిపి 18.1 కేజీలు బరువు ఉన్నాయి.
8.4 కేజీల బరువు కలిగిన ఐఎన్‌ఎస్-1ఏలో 5 కేజీల బరువు కలిగిన పేలోడ్‌సను అమర్చారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్టిబ్య్రూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎప్), సింగల్ ఈవెంట్ అప్‌సెట్ మానిటర్ (ఎస్‌ఈయూఎం) పేలోడ్‌స అమర్చారు. రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ శాటిలైట్ భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది.
9.7 కేజీలు బరువు కలిగి ఐఎన్‌ఎస్-1బీ ఉపగ్రహంలో ఎర్త్ ఎక్సోస్పియర్ లేమాన్ ఆల్ఫా అనాలసిసర్ (ఈఈఎల్‌ఏ), ఆర్గామీ కెమెరా పేలోడ్‌స అమర్చారు. ఇందులో ఉన్న రిమోట్ సెన్సింగ్ కలర్ కెమెరా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది.
విదేశీ ఉపగ్రహాల వివరాలు
ఆమెరికాకు చెందిన డౌవ్ ఫ్లోక్-3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహాలుంటాయి. వీటన్నింటినీ ఒక బాక్స్‌లో అమర్చి ఉంచారు. అమెరికా అంతరిక్ష సంస్థ భూ కేంద్రంతో అనుసంధనామై పనిచేసే ఈ ఉపగ్రహాలు వాణిజ్య, వాతావరణ సంబంధిత సమాచారాన్ని ప్రతి రోజు తెలియజేస్తాయి. లీమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలుంటాయి. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్నే అందిస్తాయి.
నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో-2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్-ఫరాబి-1, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమానుస్ట్రేషన్‌కు ఉపయోగించారు. చిన్న చిన్న అప్లికేషన్‌స తయారు చేసేందుకు ఈ తరహా ఉపగ్రహాలు సహాయపడతాయి.
ఇస్రో ప్రయాణం
- 1962లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తొలి అడుగు. అప్పటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రు చేతుల మీదుగా Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పాటు.
- 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా ఏర్పాటు. సంస్థ తొలి ఛైర్మన్ విక్రమ్ సారాబాయ్
- 1971లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఏర్పాటు.
- 1975లో రష్యా సాయంతో భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం.
- 1979లో శ్రీహరికోట నుంచి ఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం. ఇది విఫలమైంది.
- 1980లో ఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా రోదసిలోకి రోహిణి ఉపగ్రహం
- 1979-81 మధ్యలో భాస్కర ప్రయోగం. సామాన్యులకు శాస్త్ర, సాంకేతిక ఫలితాలను చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహ ప్రయోగాలు.
- వాణిజ్యపరమైన సేవల కోసం 1992లో ఇస్రో యాంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు.
- 1999లో తొలిసారి విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ(కొరియా, జర్మనీ ఉపగ్రహాలు)
- చంద్రుడిపై నీటి జాడలు కనుగొనేందుకు 2008లో చంద్రయాన్-1 ప్రయోగం
- అరుణ గ్రహంపై మీథేన్ ఆనవాళ్లు కనుగొనేందుకు 2013 నవంబర్ 5న మంగళయాన్ ప్రయోగం. ఇది 2014 సెప్టెంబర్ 24న అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది.
- ఇస్రో ఇప్పటి వరకూ 87 స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్, 60 లాంచ్ మిషన్స్, 2 రీ ఎంట్రీ మిషన్స్ చేపట్టింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 8 ఉపగ్రహాలు పంపింది. 23 దేశాలకు చెందిన 180 ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టింది. తద్వారా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది.
దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు క్రయోజనిక్ ఇంజిన్ (సీ-25) పరీక్షను ఫిబ్రవరి 17న విజయవంతంగా నిర్వహించారు. దీనిని తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్‌లో రూపొందించి పరీక్షించారు.
క్రయోజెనిక్ ఇంజిన్‌ను 2017 ఏప్రిల్‌లో ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3లో ఉపయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా 4 టన్నుల బరువు కలిగిన జీశాట్-19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.
అంతరిక్షంలో కోతకొచ్చిన క్యాబేజీ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) లో పండించిన తొలి క్యాబేజీ పంట కోతకొచ్చింది. నాటిన నెల రోజుల తరువాత పచ్చని ఆకులతో చైనీస్ క్యాబేజీ కోతకు సిద్ధమైనట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. వ్యోమగామి పెగ్గీ విట్సన్ కోస్తున్న ఈ చైనీస్ క్యాబేజీ పంటలో కొంత భాగాన్ని ఐఎస్‌ఎస్ సిబ్బంది తినడానికి ఉపయోగించగా మిగిలిన దాన్ని పరిశోధనల నిమిత్తం నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌కు తీసుకొస్తారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగైన ఐదో పంట.
నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగం విజయవంతం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ఆహార పదార్థాలు మోసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్‌ను స్పేస్ ఎక్స్ నౌక ద్వారా నాసా ఫిబ్రవరి 19న విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ కేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి దీనిని ప్రయోగించారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచే వ్యోమగాములను చంద్రుడిపైకి పంపారు.
ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 12న ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్‌సలోని బాంగ్యోన్ ఎయిర్‌బేస్ నుంచి పరీక్షించిన ఈ క్షిపణి 500 కి.మీ. దూరంలో జపాన్ సముద్రంలో పడింది.
నిరోధక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
రెండంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో భాగంగా నిరోధక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. బాలాసోర్‌లోని ఐలాండ్ నుంచి ఫిబ్రవరి 11న జరిపిన ఈ ప్రయోగం లక్ష్యాన్ని ఛేదించింది. శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు రూపొందించిన ఈ వ్యవస్థను పృథ్వీ డిఫెన్‌స మిసైల్-PDP మిషన్ పేరుతో పిలుస్తారు. ఇది భూమికి 50 కి.మీ. ఎత్తులోని లక్ష్యాలను ఛేదించగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- DRDO ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.
శక్తిమంతమైన క్షిపణిని పరీక్షించిన చైనా ఒకేసారి పది అణ్వాయుధాలను ప్రయోగించే క్షిపణిని చైనా ఫిబ్రవరి 2న పరీక్షించింది. డాంగ్‌ఫెంగ్-5సీ పేరుతో ఈ క్షిపణి పరీక్షను చేపట్టింది. దీన్ని పది వేర్వేరు లక్ష్యాలపై ఏకకాలంలో ప్రయోగించవచ్చు. షానిక్స్ ప్రావిన్స్‌లోని ది టెయూన్ స్పేస్ లాంచ్‌ప్యాడ్‌పై నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా.. ఇది డమ్మీ వార్‌హెడ్‌లను పశ్చిమ చైనాలోని నిర్దేశిత లక్ష్యాలపై పడేసింది.

No comments:
Post a Comment