అవార్డులు మార్చి 2013
డా. ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డుసతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ ఎం.వై.ఎస్ ప్రసాద్‌కు 2013 నాయుడమ్మ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని నెల్లూరులో 2013 మార్చి 30న ప్రదానం చేశారు. నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ఆల్టర్నేటివ్స్, తమిళనాడులోని ఆర్.ఎం.కె. ఇంజనీరింగ్ కళాశాల ఈ అవార్డును అందిస్తున్నాయి.
సుగతా కుమారికి సరస్వతీ సమ్మాన్మలయాళ కవయిత్రి సుగతా కుమారికి 2012 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘సరస్వతీ సమ్మాన్’ అవార్డు లభించింది. ఆమె రాసిన కవితా సంపుటి ‘మన వెజుతు’ కు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును కె.కె. బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద రూ. 10లక్షల నగదు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలన చిత్ర అవార్డులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011 సంవత్సరానికిగాను చలన చిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వివరాలు..
ప్రముఖ దర్శకుడు బాసు ఛటర్జీ నేతత్వం లోని జ్యూరీ మా ర్చి 18న 2012 సంవత్సరానికి గాను 60వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల పేర్లు ప్రకటించింది. వివరాలు..
ఉత్తమ చిత్రం: పాన్ సింగ్ తోమర్ (హిందీ-దర్శకుడు: తిగ్మాంషూ ధూలియా)
ఉత్తమ నటుడు:
ఇర్ఫాన్ ఖాన్ (హిందీ చిత్రం ‘పాన్ సింగ్ తోమర్’), విక్రమ్ గోఖలే(మరాఠీ చిత్రం ‘అనుమతి’) లకు సంయుక్తంగా.
ఉత్తమ నటి: ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం ‘ధాగ్’)
ఉత్తమ దర్శకుడు: శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం ‘ధాగ్’)
ఉత్తమ జనరంజక చిత్రాలు: ‘విక్కీ డోనర్’ (హిందీ), ‘ఉస్తాద్ హోటల్’(మలయాళం)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం: ఈగ
తెలుగులో ఉత్తమ చిత్రం: ఈగ
ఉత్తమ సహాయ నటుడు: అనూ కపూర్ (విక్కీ డోనర్)
ఉత్తమ సహాయ నటి: డాలీ అహ్లూవాలియా(విక్కీ డోనర్), కల్పన (మలయాళ ‘తనిచల్లాంజన్’)
ఉత్తమ గాయకుడు: శంకర్ మహదేవన్(హిందీ చిత్రం ‘చిట్టగాంగ్’లోని బోలో నా.. పాట)
ఉత్తమ గాయని: ఆర్తీ అంక్లేకర్ తకేకర్ (మరాఠీ ‘సంహిత’లో పలకేనీ పాట)
ఉత్తమ బాల నటుడు/నటి: వీరేంద్ర ప్రతాప్ (‘దేఖ్ ఇండియన్ సర్కస్’), మైనన్ (‘101 చోడియంగల్’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే (కో:యాద్ చిత్రానికి)
ఉత్తమ సంగీత దర్శకత్వం: శైలేంద్ర బార్వే (మరాఠీ ‘సంహిత’)
ఉత్తమ నేపథ్య సంగీతం: బిజిబాల్(మలయాళ ‘కలియాచన్’)
ఉత్తమ గేయ రచయిత: ప్రసూన్ జోషీ (చిట్టగాంగ్‌లోని ‘బోలో నా’ పాటకు)
రాష్ట్రానికి జాతీయ పర్యాటక అవార్డులు2011-12 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాలను కేంద్ర పర్యాటక శాఖ మార్చి 12న ప్రకటించింది. మొత్తం 36 విభాగాల్లో 87 అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను మార్చి 18న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. అందులో మన రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభించాయి.
వాటి వివరాలు...సమగ్ర పర్యాటకరంగ అభివద్ధి (రెస్ట్ ఆఫ్ ఇండియా విభాగంలో) - ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది; ఉత్తమ వారసత్వ నగరం - వరంగల్; ఉత్తమ విమానాశ్రయం (‘క్లాస్ టెన్ సిటీ’ విభాగంలో)- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్); ఉత్తమ విమానాశ్రయం (రెస్ట్ ఆఫ్ ఇండియా)- విశాఖపట్నం ఎయిర్‌పోర్టు; ‘మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు-అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్; ఉత్తమ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్- హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్; బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డెస్టినేషన్ కేటగిరీ ‘ఎ’ సిటీ - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).
ప్రణబ్‌కు బంగ్లా పురస్కారంభారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 3 నుంచి మూడు రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో మార్చి 4న ప్రణబ్‌ను.. బంగ్లా ప్రభుత్వం ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 1971 నాటి దేశ స్వాతంత్య్రానికి చేసిన కషికిగాను ‘బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట గౌరవ పురస్కారా’న్ని ఆయనకు బహూకరించింది. అదే రోజున ప్రణబ్ ఢాకా యూనివర్సిటీ నుంచి గౌరవ న్యాయ శాస్త్ర పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఢాకా యూనివర్సిటీని ‘ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ (తూర్పు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ)’ గా అభివర్ణించారు.
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు2010, 2011, 2012 సంవత్సరాలకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం మార్చి 6న ప్రకటించింది. వివరాలు..
2010-అరుణ్ జైట్లీ (బీజేపీ)
2011-కరణ్ సింగ్ (కేంద్ర మాజీ మంత్రి)
2012- శరద్ యాదవ్ (జనతాదళ్ -యు)
1995 నుంచి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
నిర్భయకు అమెరికా పురస్కారంఢిల్లీ ధీర వనిత ‘నిర్భయ’ను ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ సాహస వనిత’ పురస్కారంతో అమెరికా ప్రభుత్వం గౌరవించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన మహిళలతోపాటు మహిళా హక్కులు, సాధికారత కోసం సాహసోపేతంగా పోరాడే ధీరవనితలకు అమెరికా ప్రభుత్వం 2007 నుంచి ఏటా ‘అంతర్జాతీయ సాహస వనిత (ఉమెన్ ఆఫ్ కరేజ్)’ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ‘నిర్భయ’తోపాటు మరో తొమ్మిది మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వారిలో మలాలై బహదురి (అఫ్ఘానిస్థాన్), సమీరా ఇబ్రహీం (నో యువర్ రైట్స్ కో ఆర్డినేటర్, ఈజిప్ట్), జులియెటా కాస్టెల్లెనాస్ (రెక్టార్, నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ హొండూరస్, హొండూరస్), డాక్టర్ జోసెఫిన్ ఒబియాజుల ఒడుమాకిన్ (క్యాంపెయిన్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు, నైజీరియా), ఇలేనా మిలాషినా (మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్, రష్యా), ఫర్తున్ అదాన్ (ఇలామ్ శాంతి, మానవ హక్కుల కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సోమాలియా), టిజరింగ్ ఓయిసర్ (టిబెటిన్ రచయిత్రి, బ్లాగర్, చైనా), రజన్ జీతునాహ్ (స్థానిక సమన్వయ కమిటీల వ్యవస్థాపకురాలు, మానవ హక్కుల లాయర్, సిరియా), తా ఫోంగ్ తన్ (బ్లాగర్, వియత్నాం) ఉన్నారు.
స్త్రీశక్తి పురస్కారాలుఢిల్లీ ధీర వనిత ‘నిర్భయ’ను మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) కేంద్ర ప్రభుత్వం ‘రాణి లక్ష్మీ బాయి-స్త్రీ శక్తి’ అవార్డుతో గౌరవించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నిర్భయ తల్లి ఈ అవార్డును స్వీకరించారు. సామాజిక అభివద్ధి రంగంలో మహిళలు సాధించిన విజయానికి గుర్తింపుగా ప్రతి ఏటా మహిళాదినోత్సవం సందర్భంగా ప్రఖ్యాతి చెందిన మహిళల పేరు మీదుగా కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారాలను అందిస్తోంది. ఈ అవార్డు కింద రూ.3 లక్షల నగదు అందిస్తారు. ఈ ఏడాది ఈ పురస్కారాలకు నిర్భయతోపాటు ఎంపికైన వారి వివరాలు.. రాణి రుద్రమ దేవి అవార్డు- ప్రణీత తాలుక్‌దార్ (అసోం); రాణి గైదిన్లీ జీలియంగ్ అవార్డు-ఒమనా టి.కె. (కేరళ); మాతా జిజాబాయ్ అవార్డు-సోనికా అగర్వాల్ (ఢిల్లీ); దేవి అహల్యాబాయ్ హోల్కర్ అవార్డు- ఓల్గా డి.మెల్లో (మహారాష్ట్ర); కన్నగి అవార్డు- గురమ్మా హెచ్.సంకిన (కర్ణాటక).
రవి శంకర్‌కు ఠాగూర్ అవార్డు తొలిసారిగా ప్రదానం చేస్తున్న ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కతిక, సామరస్య పురస్కారం సితార్ విద్వాంసుడు స్వర్గీయ పండిట్ రవిశంకర్‌కు లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 7న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రవిశంకర్ భార్య సుకన్యా శంకర్‌కు ఈ అవార్డును బహూకరించారు.

- ఎన్టీఆర్ జాతీయ అవార్డు - అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు).
- బీఎన్‌రెడ్డి ఆత్మీయ అవార్డు - శ్యాంబెనగల్ (దర్శకుడు)
- నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు - జి.ఆదిశేషగిరిరావు (నిర్మాత, పద్మాలయ స్టూడియో అధినేత)
- రఘపతి వెంకయ్య అవార్డు - కైకాల సత్యనారాయణ (నటుడు)
- ఎన్టీఆర్ అవార్డు కింద రూ. ఐదు లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, మిగిలిన అవార్డుల కింద రూ. రెండు లక్షలు, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తారు.

No comments:
Post a Comment