AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients జ్ఞాన్ పీఠ్ అవార్డు

జ్ఞాన్ పీఠ్ అవార్డు

జ్ఞాన్‌పీఠ్ అవార్డును ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారంగా పరిగణిస్తారు. ఈ అవార్డును 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రిక ప్రచురణకర్తలైన సాహూజైన్ కుటుంబం వారి 'భారతీయ జ్ఞాన్‌పీఠ్' ట్రస్టు నిర్వహిస్తోంది. మొదటి అవార్డును 1965లో మళయాళ రచయత జి.శంకర్ కురుప్‌కు ప్రదానం చేశారు. ఈ బహుమతి కింద రూ.7 లక్షల నగదు, ప్రశంసా పత్రం, సరస్వతీ దేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. గుర్తింపు పొందిన భారతీయ భాషలో రచనలు చేసినవారుఈ పురస్కారానికి అర్హులు. తొలుత ఈ పురస్కారాన్ని ఓ పుస్తకానికి గుర్తింపుగా ఇచ్చేవారు. 1982 తర్వాత సాహిత్యంలో జీవిత కాల సాఫల్య పురస్కారంగా ఇస్తున్నారు. సంస్కృతంలో తొలిసారిగా 2006లో సత్యవత్ శాస్త్రికి ఈ పురస్కారం అందజేశారు.

అవార్డు గ్రహీతలు
సంవత్సరంరచయితరచనభాష
1965జి.శంకర కురుప్ఉడక్కుళైమలయాళం
1966తారా శంకర్ బంద్యోపాధ్యాయజ్ఞానదేవతబెంగాలీ
1967డాక్టర్ కె.వి.పుట్టప్పశ్రీ రామాయణ దర్శనంకన్నడం
1967ఉమాశంకర్ జోషినిషితగుజరాతీ
1968సుమిత్రానంద్ పంత్చిదంబరహిందీ
1969ఫిరాక్ గోరఖ్‌పురిగుల్ - ఎ - నాగ్మాఉర్దూ
1970డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణకల్పవృక్షంతెలుగు
1971బిష్ణు డేస్మృతి సత్తా భవిష్యత్బెంగాలీ
1972డాక్టర్ రాంధారి సింగ్ దినకర్ఊర్వశిహిందీ
1973దత్తాత్రేయ రామచంద్ర బింద్రేనకుతంతికన్నడం
1973గోపీనాథ్ మొహంతిమతిమాతల్ఒడియా
1974విష్ణు శాఖరం ఖండేకర్యయాతిమరాఠీ
1975పి.వి. అఖిలన్చిత్రప్పవైతమిళం
1976ఆశాపూర్ణా దేవిప్రథమ్ ప్రతిసృతిబెంగాలీ
1977కె.శివరామ్ కారంత్మూకజ్జియ కనసుగళుకన్నడం
1978ఎస్.హెచ్. వాత్సాయన్కిత్నీ నావోం మే కిత్ని బార్హిందీ
1979బీరేంద్ర కుమార్ భట్టాచార్యమృత్యుంజయఅస్సామీ
1980ఎస్.కె.పొట్టిక్కాట్ఒరు దేశాదిందే కథమలయాళం
1981అమృతా ప్రీతంకాగజ్ తే కాన్వాస్పంజాబీ
1982మహాదేవి వర్మయమహిందీ
1983మస్తి వెంకటేశ అయ్యంగార్చిక్కవీర రాజేంద్రకన్నడం
1984టి.శివశంకర పిళ్లయ్కాయర్మలయాళం
1985పన్నాలాల్ పటేల్మానవి నీ భావీగుజరాతీ
1986సచ్చితానంద్ రౌత్రాయ్ఒరియా
1987వి.వి. షిర్వాద్కర్మరాఠీ
1988డాక్టర్ సి.నారాయణ రెడ్డివిశ్వంభరతెలుగు
1989ఖుర్రాతులియన్ హైదర్అఖిరే షాబ్‌కీ హమ్‌సఫర్ఉర్దూ
1990వి. కె. గోఖక్భారత సింధు రష్మీకన్నడం
1991సుభాష్ ముఖోపాధ్యాయ్పదాతిక్బెంగాలీ
1992నరేష్ మెహతాహిందీ
1993సీతాకాంత్ మహాపాత్రఒడియా
1994యు.ఆర్ అనంతమూర్తికన్నడం
1995ఎం.టి.వాసుదేవన్ నాయర్రండమూళంమలయాళం
1996మహాశ్వేతా దేవిహజర్ చురాషిర్ మాబెంగాలీ
1997అలీ సర్దార్ జాఫ్రీఉర్దూ
1998గిరీష్ కర్నాడ్కన్నడం
1999నిర్మల్ వర్మహిందీ
1999గురుదయాల్ సింగ్పంజాబీ
2000ఇందిరా గోస్వామిదతల్ హతిర్ ఉన్యే కువా హౌదాఅస్సామీ
2001రాజేంద్ర కేశవలాల్ షాధ్వనిగుజరాతీ
2002డి.జయకాంతన్తమిళం
2003వింద కరందీకర్మరాఠీ
2004ర హ్మాన్ రాహికాశ్మీరీ
2005కున్వర్ నారాయణ్హిందీ
2006సత్యవ్రత్ శాస్త్రిసంస్కృతం
2006రవీంద్ర కెలేకర్కొంకణీ
2007ఒ.ఎన్.వి. కురూప్మలయాళం
2008అక్లక్ మహ్మద్ ఖాన్ఉర్దూ
2009అమర్‌కాంత్, శ్రీలాల్ శుక్లాహిందీ
2010చంద్రశేఖర్ కంబారకన్నడం
2011ప్రతిభా రేయజ్ఞసేనిఒడియా
2012డా. రావూరి భరద్వాజపాకుడురాళ్లుతెలుగు
2013కేదార్‌నాథ్ సింగ్అకల్ మే సరస్హిందీ
2014బాలచంద్ర నెమాడేహిందూ: జగన్యాచి సమృద్ధ అడ్గల్మరాఠీ
2015ర‌ఘువీర్ చౌధ‌రిఅమృత (న‌వ‌ల‌)గుజ‌రాతీ
2016శంఖా ఘోష్బెంగాలీ



No comments:

Post a Comment