AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు జూలై 2012

క్రీడలు జూలై 2012
అలోన్సోకు జర్మనీ గ్రాండ్ ప్రిఫార్ములా వన్ జర్మనీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో గెలుచుకున్నాడు. జర్మనీలోని హాకెన్ హీమ్‌లో జూలై 21న జరిగిన పోటీలో అలోన్సో మొదటి స్థానంలో నిలవగా, రెడ్‌బుల్ డ్రైవర్ వెబర్ రెండో స్థానంలో నిలిచాడు. రెండేళ్ల విరామం తర్వాత వరసగా రెండోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు.
ఈజిప్టుకు వరల్డ్ జూనియర్ స్క్వాష్ టైటిల్‌
ప్రపంచ పురుషుల జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్‌ను ఈజిప్టు దక్కించుకోగా, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ఖతార్ రాజధాని దోహాలో జూలై 19న ముగిసిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై ఈజిప్టు విజయం సాధించింది. భారత్‌కు మూడోస్థానం: ఈ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మొదటిసారి పతకం సాధించింది. దోహాలో జూలై 18న ముగిసిన పోటీలో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకుంది.
హషీమ్ ఆమ్లా ‘ట్రిపుల్ సెంచరీ’దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా జూలై 21న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసాడు. ఆమ్లా టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్.
ఎర్నీ ఎల్స్‌కు బ్రిటిష్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్దక్షిణాఫ్రికా క్రీడాకారుడు ఎర్నీ ఎల్స్ బ్రిటిష్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూలై 21న జరిగిన పోటీలో ఆడమ్‌స్కాట్‌పై ఎల్స్ విజయం సాధించాడు.

04 -11 జూలై 2012 క్రీడలు

ఆసియా అండర్- 19 చాంప్ సింధుఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు ఆసియా అండర్-19 మహిళా సింగిల్స్ చాంపియన్‌షిప్‌ను సాధించింది. దక్షిణ కొరియాలోని గిమ్‌చియోన్‌లో జూలై 7న జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహోరాను సింధు ఓడించింది. ఈ విజయంతో ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి గా సింధు గుర్తింపు పొందింది.
వింబుల్డన్-12మహిళల సింగిల్స్: వింబుల్డన్ మహిళ సింగిల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. లండన్‌లో జూలై 7న జరిగిన ఫైనల్లో పోలాండ్‌కు చెందిన అగ్నెస్కా రద్వాన్‌స్కాను ఓడించింది. సెరెనాకిది ఐదో వింబుల్డన్ టైటిల్. మొత్తం మీద కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 
పురుషుల సింగిల్స్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు.
జూలై 8న జరిగిన ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రేను ఓడించాడు ఇది ఫెదరర్‌కు ఏడో వింబుల్డన్ టైటిల్. మొత్తం మీద కెరీర్‌లో 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో పీట్ సంప్రాస్(అమెరికా) పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక వారాల(286) టాప్ ర్యాంక్ రికార్డును ఫెదరర్ సమం చేశాడు. అంతేకాకుండా ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరడం ద్వారా ఓపెన్ శకంలో(1968 తర్వాత)అత్యధిక సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో సెమీఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుడిగా ఫెదరర్ ఘనత దక్కించుకున్నాడు.
మహిళల డబుల్స్: సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ జంట మహిళ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. వీరు ఫైనల్లో చె క్ రిపబ్లిక్‌కు చెందిన ఆండ్రియా హ్లావకోవా, లూసీ హ్రదేవాలను ఓడించారు. ఇది విలియమ్స్ సిస్టర్స్‌కు 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.
పురుషుల డబుల్స్: జనాథన్ మర్రీ(బ్రిటన్), ఫ్రెడరిక్ నీల్సన్(డెన్మార్క్) జంట పురుషుల డబుల్స్ టైటిల్ సాధించింది. వీరు ఫైనల్లో రాబర్ట్ లిండ్ స్టేట్(స్వీడన్), హోమారియా టెకా(రుమేనియా)లను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్: ఈ టైటిల్‌ను మైక్ బ్రియాన్, లిసా రేమండ్(అమెరికా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రష్యాకు చెందిన ఎలెనా వెస్నెవా జంటపై విజయం సాధించారు.
వెబర్‌కు బ్రిటిష్ గ్రాండ్ ప్రిఫార్ములా వన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి ని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెబర్ గెలుచుకున్నాడు. లండన్‌లో జూలై 8న ముగిసిన రేస్‌లో వెబర్ మొదటి స్థానం సాధించగా, ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు.
ఆసియా మహిళల చాంప్ చైనాఆసియా మహిళల జూనియర్ కప్ హాకీ చాంపియన్‌షిప్‌ను చైనా గెలుచుకుంది. బ్యాంకాక్‌లో జూలై 7న జరిగిన ఫైనల్లో భారత్‌పై విజయం సాధించింది.ఫైనల్‌కు చేరడం ద్వారా భారత జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.

No comments:

Post a Comment