AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు అక్టోబరు 2014

అవార్డులు అక్టోబరు 2014
మలాలాకు లిబర్టీ మెడల్
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్ బాలికల విద్యా హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్‌కి అమెరికా లిబర్టీ మెడల్-2014 దక్కింది. దీన్ని ఆమె ఫిలడెల్ఫియాలో అక్టోబరు 21న జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 1988లో నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన వ్యక్తులకు ఇచ్చే ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలు మలాలా. 
పాలగుమ్మికి వరల్డ్ మీడియా సమ్మిట్ అవార్డు
ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ 2014 వరల్డ్ మీడియా సమ్మిట్ గ్లోబల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు అల్ జజీరా ఇంగ్లిష్, యు.ఎస్.ఎ టుడే, గ్లోబల్ పోస్ట్ సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి. 
భారతీయ అమెరికన్ సాహిల్‌కు యంగ్ సైంటిస్ట్ అవార్డు
భారతీయ-అమెరికన్ విద్యార్థి సాహిల్ దోషికి 2014 అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. పిట్స్‌బర్గ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సాహిల్ కార్బన్ డయాక్సైడ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పొల్యూసెల్ అనే పరికరాన్ని రూపొందించాడు. ఇది గృహ వినియోగం కోసం విద్యుత్తును అందించడంతోపాటు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 
అశ్వికా కపూర్‌కు పండా అవార్డు 
కోల్‌కతాకు చెందిన అశ్వికా కపూర్‌కు ప్రతిష్టాత్మక పండా అవార్డు లభించింది. యూకేలోని బ్రిస్టల్‌లో జరిగిన వైల్డ్ స్క్రీన్ చిత్రోత్సవాల్లో అక్టోబరు 24న ఈ అవార్డును ఆమె అందుకున్నారు. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే కకాపో చిలుక (గుడ్లగూబ చిలుక) జీవితం ఆధారంగా సిరొక్కో అనే లఘు చిత్రాన్ని నిర్మించినందుకు ఈ పురస్కారం లభించింది. గ్రీన్ ఆస్కార్‌గా పిలిచే ఈ అవార్డును పొందిన తొలి భారతీయ మహిళా అశ్వికా కపూర్. 
కాన్డే యెమ్‌కెల్లాకు నాయుడమ్మ అవార్డు
ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కాన్డే యెమ్‌కెల్లా డాక్టర్ నాయుడమ్మ-2014 అవార్డుకు ఎంపికయ్యారు. దీన్ని నవంబర్ 13న చెన్నైలో బహుకరిస్తామని నాయుడమ్మ ఫౌండేషన్ తెలిపింది. 
కిరణ్‌కు గ్లోరియా బ్యారన్ బహుమతి
గ్లోరియా బ్యార న్ ప్రైజ్ ఫర్ యంగ్ హీరోస్ బహుమతికి భారత-అమెరికన్ కిరణ్ (16) ఎంపికయ్యాడు. ‘వేస్ట్ నో ఫుడ్’ అనే వెబ్ ఆధారిత సర్వీసును ప్రారంభించినందుకు అతడికి ఈ బహుమతి లభించింది.

ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్
ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మ్యాన్ బుకర్ ప్రైజ్ -2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ప్లనగన్ (53) ను వరించింది. ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్‌‘ అనే నవల రచనకు ఈ పురస్కారం దక్కింది. బర్మా-థాయ్‌లాండ్ రైల్వే నిర్మాణం నేపథ్యమే ఈ నవల ఇతివృత్తం. రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలు, బానిసలతో ఈ రైల్వే లైన్ నిర్మించిన సమయంలో నాటి దారుణమైన పరిస్థితులు, కార్మికుల మధ్య ఉన్న అనుబంధాలను ఈ నవలలో రిచర్‌‌డ వివరించారని బుకర్ కమిటీ తెలిపింది. 
ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రాజన్
యూరోమనీ మ్యాగజైన్ ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డును వాషింగ్టన్‌లో అక్టోబరు 10న భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అందుకున్నారు. భారీ లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు రాజన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని యూరోమనీ రాజన్‌ను కొనియాడింది. 
జమ్మూకాశ్మీర్ పోలీసు శక్తిదేవికి ఐరాస అవార్డు
జమ్మూకాశ్మీర్‌కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవి (38)కి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014 అవార్డు లభించింది. కెనడాలోని విన్నిపెగ్‌లో అక్టోబరు మొదటివారంలో జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఐరాస తరపున అఫ్గానిస్థాన్‌లో ఆమె పనిచేస్తున్నారు. శక్తిదేవి మహిళా కౌన్సిళ్లు ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపు బాధితులకు సేవలు అందించారు. ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి పోలీసు డివిజన్ ఏర్పాటు చేసింది. 
భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార బహుమతి
ప్రముఖ భారత శాస్త్రవేత్త సంజయ రాజారాం ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్)-2014కు ఎంపికయ్యారు. అమెరికాలో డెస్ మోయిన్స్‌లో అక్టోబరు 16న జరిగిన 2014 బోర్లాగ్ డైలాగ్ సదస్సులో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గోధుమ దిగుబడులు పెంచడంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ అవార్డు వరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పొడినేలల, వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్‌డీఏ) సీనియర్ శాస్త్రీయ సలహాదారుగా రాజారాం వ్యవహరిస్తున్నారు. 
దాదాభాయ్ నౌరోజీ అవార్డులు
భారత్-బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేసిన వారికి గుర్తింపుగా బ్రిటన్ ప్రభుత్వం దాదాభాయ్ నౌరోజీ పేరుతో ఏర్పాటుచేసిన అవార్డులను అక్టోబరు 10న ప్రదానం చేసింది. వాణిజ్య రంగంలో యునెటైడ్ కింగ్‌డమ్ ఇండియా కౌన్సిల్ చైర్మన్ పాట్రికా హెవిట్, విద్యారంగంలో ఆశా ఖేమ్కా, కళారంగంలో నటుడు మాధవ్ శర్మలను అవార్డులు వరించాయి. బ్రిటన్ పార్లమెంట్‌లో తొలి ఆసియా సభ్యుడు, భారత వాణిజ్యాన్ని బ్రిటన్‌కు తీసుకువచ్చిన తొలి భారతీయునిగా నిలిచిన నౌరోజీకి అంకితం ఇస్తూ బ్రిటన్ ఈ అవార్డులను ప్రకటించింది.

నోబెల్ బహుమతులు: 
కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతిభారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ బాలికమలాలా యూసుఫ్ జాయ్‌లు నోబెల్ శాంతి బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. కైలాశ్ సత్యార్థి: వెట్టి చాకిరి నుంచి బాలల విముక్తికి 1980లో బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా పిల్లల హక్కుల కోసం కైలాశ్ సత్యార్థి పోరాడుతున్నారు. ఇప్పటి వరకూ 80 వేల మంది పిల్లల్ని వెట్టి చాకిరి, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు. ఆయన చేపట్టిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం పలు దేశాల్లో కొనసాగుతోంది. కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1978, శాంతి), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు.మలాలా యూసుఫ్ జాయ్: పాకిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల మలాలా యూసుఫ్ జాయ్ బాలికల విద్యకోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. బాలికలు చదువుకోరాదంటూ తాలిబన్లు పాఠశాలల్ని పేల్చేశారు. తాలిబన్‌ల చర్యలకు ఎదురు తిరగడంతో 2012లో పాఠశాలకు వెళ్తున్న ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మలాలా లండన్‌లో చికిత్సపొందింది. ప్రస్తుతం ఆమె బర్మింగ్‌హమ్ స్కూల్లో చదువుకుంటోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విద్యా హక్కుల కోసం కృషి చేస్తోంది. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా మలాలా రికార్డులకెక్కింది. రసాయన శాస్త్రంఆప్టికల్ మైక్రోస్కోపును నానో స్కోపుగా మార్చే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది. అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్ (61), జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్ (51)్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది. అర్థశాస్త్రంఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్ (61) కు నోబెల్ బహుమతి దక్కింది. మార్కెట్ శక్తి సామర్థ్యాలు, నియంత్రణ గురించి ఆయన చేసిన పరిశోధనను గుర్తిస్తూ అకాడ మీ ఎంపిక చేసింది. సాహిత్యంనాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మోడియానో (69)కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితాలను, నాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, అస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. మోడియానో ఫ్రెంచిలో 40కు పైగా నవలలు రాశారు. వాటిలో మిస్సింగ్ పర్సన్ నవలకు 1978లో ప్రతిష్ఠాత్మక ప్రిక్స్‌గాన్ కోర్టు అవార్డు లభించింది. ఆయన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల్లో 11వ ఫ్రెంచ్ రచయిత. 
మైఖేల్ బ్లూమ్ బర్గ్‌కు బ్రిటన్ గౌరవ నైట్‌హుడ్
న్యూయార్క్ మాజీ మేయర్, సంఘ సేవకుడు మైఖేల్ బ్లూమ్‌బర్గ్‌కు అక్టోబర్ 6న బ్రిటన్ గౌరవ నైట్‌హుడ్‌ను అందించింది. 
శివథాను పిళ్లైకి లాల్ బహ దూర్ శాస్త్రి అవార్డు
బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు ఎ.శివథాను పిళ్లైకి 15వ లాల్‌బహదూర్ శాస్త్రి అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో అక్టోబర్ 7న అందజేశారు. అగ్ని, పృథ్వి, నాగ్, ఆకాశ్ క్షిపణుల రూపకల్పనలో పిళ్లై పాత్ర ఎంతో ఉంది. 
అనూప్ జైన్‌కు ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటిజన్’ అవార్డు
ప్రతిష్టాత్మక ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటి జన్ అవార్డుకు అనూప్ జైన్ ఎంపిక య్యాడు. పారిశుధ్య వసతులు కల్పనలో కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అవార్డుతోపాటు లక్ష డాలర్ల నగదును ఆయన అందుకున్నాడు. 2011 లో అనూప్ జైన్ బీహార్‌లో హుమనుర్ పవర్(హెచ్‌పీ) అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాడు.
సుద్దాలకు ‘కొమురం భీం’ జాతీయ పురస్కారం
2014 కొమురం భీం జాతీయ పురస్కారానికి ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సమితి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నాయి. దీనికింద రూ.50,116 నగదుతోపాటు, ప్రశంసాపత్రం అందజేస్తారు.


షారుక్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డు
2014 సంవత్సరానికి గ్లోబల్ డైవర్సిటీ అవార్డు బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌కు లభించింది. భారతీయ సినీ రంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ అక్టోబర్ 4న బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో చేతుల మీదుగా షారుక్ ఈ అవార్డును అందుకున్నారు. 

మెదడులో దిక్సూచి ఆవిష్కర్తలకు నోబెల్మెదడులో దిశానిర్దేశం జరిగే తీరును వెలుగులోకి తెచ్చిన బ్రిటన్ అమెరికన్ జాన్ ఓ కీఫ్, నార్వే జంట ఎడ్వర్డ్ మోసర్, మే-బ్రిట్ మోసర్‌లు వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే పొజిషనింగ్ వ్యవస్థను కనుగొన్నందుకు అవార్డు కమిటీ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పటిదాకా ఐదు జంటలు నోబెల్ గెలుచుకోగా వీరిలో నాలుగు జంటలు సంయుక్తంగా అందుకున్నారు. అలాగే ఫిజిక్స్‌లో జపాన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుజి నకమురాలను అకాడమీ ఎంపిక చేసింది.

No comments:

Post a Comment