AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు అక్టోబరు 2012

క్రీడలు అక్టోబరు 2012
ఈస్ట్ జోన్‌కు దులీప్ ట్రోఫీ
దులీప్ ట్రోఫీ క్రికెట్ టైటిల్‌ను ఈస్ట్ జోన్ జట్టు గెలుచుకుంది. సెంట్రల్ జోన్‌తో చెన్నైలో అక్టోబర్ 25న ముగిసిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతగా నిలించింది. 

గవాస్కర్‌కు బీసీసీఐ లైఫ్ టైం అఛీవ్‌మెంట్సి.కె. నాయుడు లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డుకు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌ను బీసీసీఐ అక్టోబర్ 25న ఎంపిక చేసింది. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గవాస్కర్ చరిత్ర సృష్టించాడు. 

పంకజ్ అద్వానీకి బిలియర్డ్స్ వరల్డ్ టైటిల్ బిలియర్డ్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. 

వెటెల్‌కు ఇండియన్ గ్రాండ్ ప్రిఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను జర్మన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. గ్రేటర్ నోయిడాలో జరిగిన పోటీలో ఫెర్నాండో అలోన్సో రెండో స్థానంలో నిలిచారు.

సచిన్‌కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా
భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ సభ్యత్వ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని భారత పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి జూలియా గిలార్డ్ అక్టోబర్ 16న తెలిపారు. ఆస్ట్రేలియా ప్రజలు, ఇతరులు సమాజానికి అందించిన విశిష్ట సేవలకు, తమ రంగంలో సాధించిన ఉన్నతికి గుర్తింపుగా ఈ అవార్డును బహూకరిస్తారు. సచిన్ ఈ అవార్డును పొందిన రెండో భారతీయుడు. మొదటి భారతీయుడు మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జి. భారత్-ఆస్ట్రేలియా న్యాయ సంబంధాలు పెంపొందించినందుకు ఈయనకు 2006లో ఈ పురస్కారం లభించింది. 

వరల్డ్ స్కేటింగ్‌లో అనూప్ కుమార్‌కు కాంస్యం హైదరాబాద్‌కు చెందిన అనూప్ కుమార్ యమా 2012 వరల్డ్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. న్యూజిలాండ్‌లో ముగిసిన పోటీలో ఇన్‌లూన్ ఆర్టిస్టిక్ విభాగంలో ఈ పతకం గెలిచాడు. ఈ విభాగంలో పతకం పొందిన తొలి భారతీయుడు అనూప్.

సైనాకు డెన్మార్క్ సూపర్ సిరీస్భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ డెన్మార్క్ సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఓడెన్స్‌లో అక్టోబర్ 20న జరిగిన ఫైనల్స్‌లో జూలియస్ షెంక్(జర్మనీ)పై సైనా విజయం సాధించింది. దీంతో ఈ సంవత్సరం ఇండోనేషియా ఓపెన్ తర్వాత రెండో సూపర్ సిరీస్ సైనాకు లభించింది. మొత్తం మీద సైనాకు ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. 

విరాచంట్‌కు హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ థాయ్‌లాండ్‌కు చెందిన థావోర్న్ విరాచంట్ గెలుచుకున్నాడు. బెంగళూరులో అక్టోబర్ 21న జరిగిన ఫైనల్లో విరాచంట్ మొదటి స్థానంలోనూ, రీచీ రామ్‌సే రెండోస్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన శివకుమార్ నాలుగో స్థానం సాధించాడు. 

సైకిలిస్ట్ ఆర్మ్ స్ట్రాంగ్‌పై నిషేధంఅమెరికా సైకిలిస్ట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్(ఐసీఐ) అక్టోబర్ 22న జీవితకాలం నిషేధం విధించింది. డోపింగ్‌కు పాల్పడినట్లు అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా ఆర్‌‌మపై ఐసీఐ నిషేధం ఖరారు చేసింది. 1999-2005 వరకు ఏడు సార్లు టూర్ డి ఫ్రాన్స్ ఛాంపియన్‌గా నిలిచిన ఆర్మ్‌స్ట్రాంగ్ పేరును, రికార్డులను తొలగించి, టైటిల్స్‌ను వెనక్కు తీసుకుంటారు.

షాంఘై మాస్టర్స్ సిరీస్ షాంఘై మాస్టర్ సిరీస్ డబుల్స్ ఫైనల్స్‌లో లియాండర్ పేస్ విజయం సాధించాడు. ఫైనల్‌లో తన భాగస్వామి రాడెక్ స్టెపానెక్‌తో కలిసి మహేష్ భూపతి- రోహన్ బోపన్న జంటను ఓడించాడు. 
పురుషుల సింగిల్స్: ఈ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిచ్(సెర్బియా) విజేతగా నిలిచాడు. అక్టోబర్ 13న జరిగిన ఫైనల్‌లో ఆండీ ముర్రేపై విజయం సాధించాడు. 

ఫైనల్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్ షిప్ఫైనల్స్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్ షిప్‌ను మాగ్నస్ కార్లోసెన్(నార్వే) గెలుచుకున్నాడు. అక్టోబర్ 13న స్పెయిన్‌లో ముగిసిన పోటీలో కార్లోసెన్ మొదటి స్థానం సాధించగా, ఫెబియాన్ కెరుయాన్ (ఇటలీ) రెండో స్థానంలో, భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్ ఐదో స్థానంలో నిలిచారు. 

వెటల్‌కు కొరియా గ్రాండ్ ప్రీకొరియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ విజయం సాధించాడు. దక్షిణ కొరియాలో అక్టోబర్ 13న జరిగిన పోటీలో వెటల్ మొదటి స్థానంలో నిలువగా మార్క్ వెబర్ రెండో స్థానం సాధించాడు. 

ఐసీసీ కమిటీ చైర్మన్‌గా కుంబ్లేఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కమిటీ చైర్మన్‌గా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అక్టోబర్ 11న ఎంపికయ్యారు. కొలంబోలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కుంబ్లేను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. వెస్టిండీస్‌కు చెందిన కై ్లవ్ లాయిడ్ స్థానంలో కుంబ్లే బాధ్యతలు చేపడతారు. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సునీల్ గవాస్కర్ తర్వాత ఈ పదవి చేపట్టిన రెండో భారతీయ క్రికెటర్ కుంబ్లే. 

బుల్లర్‌కు మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను భారత గోల్ఫ్ క్రీడాకారుడు గగన్ జీత్ బుల్లర్ గెలుచుకున్నాడు. మకావ్‌లో అక్టోబర్ 13న జరిగిన పోటీలో అమెరికాకు చెందిన జనాథన్ మోరేపై బుల్లర్ విజయం సాధించాడు.

వాట్సన్‌కు జపాన్ ఓపెన్ టైటిల్హీథర్ వాట్సన్ జపాన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్నాడు. ఒసాకా(జపాన్)లో అక్టోబర్ 13న జరిగిన ఫైనల్స్‌లో చాంగ్ కిచెన్‌ను వాట్సన్ ఓడించాడు. 

ఫెనిస్టా నేషనల్ టెన్నిస్ ఛాంపియన్ జీవన్ఫెనిస్టా నేషనల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను జీవన్ నెదున్‌జెజియన్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో అక్టోబర్ 13న ముగిసిన ఫైనల్స్‌లో అర్జున్ కాదేను జీవన్ ఓడించాడు. మహిళల టైటిల్‌ను ప్రేమాబాంబ్రి గెలుచు కుంది. ఫైనల్‌లో రిషికా సుంకరను ఓడించింది.
పురుషుల సీనియర్ హాకీ చాంప్ పంజాబ్ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌ను పంజాబ్ గెలుచుకుంది. బెంగళూరులో అక్టోబర్ 2న జరిగిన ఫైనల్స్‌లో ఎయిర్ ఇండియాను పంజాబ్ ఓడించింది. హర్యానాను ఓడించి కర్ణాటక మూడోస్థానం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎం.బి. అయ్యప్ప ఎంపికయ్యారు. 

కశ్యప్‌కు నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ నేషనల్ పురుషుల సీనియర్ బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడు. శ్రీనగర్‌లో అక్టోబర్ 3న జరిగిన ఫైనల్స్‌లో అజయ్ జయరామ్‌ను కశ్యప్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సయాలీ గోఖలే గెలుచుకుంది. ఈమె ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.వి. సింధును ఓడించింది. 

వెస్టిండీస్‌కు టి-20 ప్రపంచకప్
టి-20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. కొలంబో(శ్రీలంక)లో అక్టోబర్ 7న జరిగిన ఫైనల్స్‌లో శ్రీలంకను వెస్టిండీస్ 32 పరుగుల తేడాతో ఓడించింది. విజేత వెస్టిండీస్‌కు 10 లక్షల డాలర్లు, రన్నర్‌గా నిలిచిన శ్రీలంకకు 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. వెస్టిండీస్‌కు ఇది మూడో వరల్డ్ కప్. 1975, 79లో వన్డే ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ ఎంపికయ్యాడు. 

ఆస్ట్రేలియాకు మహిళా ప్రపంచకప్: మహిళ టి-20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది, కొలంబోలో అక్టోబర్ 7న జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఈ కప్ గె లుచుకోవడం ఇది రెండోసారి. 

చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్చైనా ఓపెన్ టెన్నిస్ ఫురుషుల సింగిల్స్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. బీజింగ్‌లో అక్టోబర్ 7న జరిగిన ఫైనల్స్‌లో జో విల్‌ఫ్రెండ్ సోంగాపై జకోవిచ్ విజయం సాధించాడు. 
మహిళల సింగిల్స్: ఈ టైటిల్‌ను విక్టోరియా అజరెంకా గెలుచుకుంది, మరియాషరపోవాపై గెలుపుతో ఈ విజయాన్ని సాధించింది. 

మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్)- మరియా లగోఐరా లైమ్స్(స్పెయిన్)జోడిపై మకరోవా-వెస్నినా(రష్యా) నెగ్గి టైటిల్ సాధించారు. 


కీ నిషికోరికి జపాన్ ఓపెన్ జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కీ నిషికోరి గెలుచుకున్నాడు. అక్టోబర్ 7న టోక్యోలో మిలోస్ రాఒనిక్‌పై నిషికోరి విజయం సాధించాడు.
భారత రెజ్లర్ బబితకు కాంస్యంప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత రెజ్లర్ బబిత కుమారి కాంస్య పతకం సాధించింది. కెనడాలో జరుగుతున్న ఈ టోర్నీలో 51 కిలోల విభాగంలో బబిత కాంస్యం నెగ్గడం ద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళగా ఘనత దక్కించుకుంది (తొలి మహిళ అల్కా తోమర్). ఇదే టోర్నమెంట్‌లో బబిత సోదరి గీత ఫోగట్ 55 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ పోటీల చరిత్రలో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలు రావడం ఇదే ప్రథమం. అంతేకాకుండా జపాన్ రెజ్లర్ సవోరి యోషిదా వరుసగా 13వ సారి స్వర్ణ పతకం సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

హంపికి అంకారా గ్రాండ్ ప్రిఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను
భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి గెలుచుకుంది. అంకారా(టర్కీ)లో సెప్టెంబర్ 28న ముగిసిన పోటీలో పోలాండ్‌కు చెందిన మోనికా సాకోను హంపి ఓడించింది. 

నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్నేషనల్ బ్యాడ్మింటన్ పురుషుల టీం చాంపియన్‌షిప్‌ను పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) గెలుచుకుంది. శ్రీనగర్‌లో సెప్టెంబర్ 29న ముగిసిన ఫైనల్లో ఎయిర్ ఇండియా జట్టును ఓడించి రహమతుల్లా కప్‌ను సాధించింది. మహిళల విభాగంలో పీఎస్‌పీబీ జట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టుపై నెగ్గి చద్దా కప్‌ను సొంతం చేసుకుంది. 

సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సందీప్ పాటిల్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్‌‌డ (బీసీసీఐ)కు చెందిన క్రికెట్ సెలక్షన్ కమిటీకి నూతన చైర్మన్‌గా మాజీ టెస్ట్ క్రికెటర్ సందీప్ పాటిల్ నియమితులయ్యారు. కృష్ణమాచారి శ్రీకాంత్ స్థానంలో పాటిల్‌ను సెప్టెంబర్ 27న బీసీసీఐ ఎంపిక చేసింది. చైర్మన్ పదవీ కాలాన్ని ఒక్కో సంవత్సరం పొడిగిస్తూ గరిష్ఠంగా నాలుగేళ్లు కొనసాగించవచ్చు.

No comments:

Post a Comment