AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు అక్టోబరు 2017

అవార్డులు అక్టోబరు 2017
ఏపీ ఓబీఎంఎస్‌కు నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డుకంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే ‘నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డ్-2017’కు ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం (ఏపీ ఓబీఎంఎస్) అప్లికేషన్ ఎంపికైంది. ఈ - గవర్నెన్‌‌సలో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు ఈ అవార్డు అందజేస్తారు. ప్రస్తుతం ఓబీఎంఎస్‌కు ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్ల సమాచారాన్ని ఓబీఎంఎస్‌లో పొందుపరుస్తారు. లబ్ధిదారుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. లబ్ధిదారుడు యూనిట్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నాడు, బ్యాంకు లోన్ ప్రతినెలా చెల్లిస్తున్నాడా లేదా అనే వివరాలు కూడా పొందిపరిచే విధంగా యాప్‌ను అప్‌డేట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ ఓబీఎంఎస్‌కు నిహిలెంట్ ఈ గవర్నెన్‌‌స అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా 
ఎందుకు : ఈ - గవర్నెన్‌‌సలో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు గాను 

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఐపీపీఏఐ అవార్డుదక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు ఇన్నోవేషన్ కేటగిరీలో ‘ఐపీపీఏఐ పవర్ అవార్డు- 2017‘ లభించింది. అక్టోబర్ 28న కర్ణాటకలోని బెల్గామ్‌లో 18వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఐపీపీఏఐ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎక్కడ : 18వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ సదస్సు

గిరీష్ కర్నాడ్‌కు టాటా లిట్ లైఫ్‌టైమ్ అవార్డు ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌ను 2017 సంవత్సరానికి గానూ టాటా లిటరేచర్ లైవ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ద ఫెర్ఫార్మింగ్ ఆర్‌‌ట్స (ఎన్‌సీపీఏ)లో నవంబర్ 19న జరగనున్న సాహిత్య వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : టాటా లిట్ లైఫ్ టైమ్ అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గిరీష్ కర్నాడ్

జార్జ్ శాండర్స్‌కు బుకర్ ప్రైజ్ అమెరికా రచయిత జార్జ్ శాండర్స్ (58) ఈ ఏడాది మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. శాండర్స్ రచించిన ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవలకు ఈ అవార్డును ప్రకటించారు. పురస్కారం కింద ఆయన 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందుకుంటారు. దివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కొడుకు విల్లీ 11 ఏళ్లకే టైఫాయిడ్ వ్యాధిబారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. లింకన్ జీవితంలోని ఆ విషాదంనాటి సంఘటనల సమాహారమే ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవల. ఈ నవల కథనం ఆద్యంతం వాస్తవిక కోణంలో ఎంతో అద్భుతంగా ఉందని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల మండలి చైర్మన్ లోలా పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మేన్ బుకర్ ప్రైజ్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : విజేత అమెరికా రచయిత జార్జ్ శాండర్స్ 
ఎందుకు : ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవలకు గాను 

భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డుఅమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్ ప్రాంతంలోని ఫ్లింట్ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత సంతతి బాలిక గీతాంజలిరావుకి యువ శాస్త్రవేత్త అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : అమెరికా
ఎందుకు : డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ పోటీల్లో 

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు ఐపీపీఐ పురస్కారంతెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐపీపీఐ) పురస్కారం లభించింది. సౌరవిద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో యాజమాన్య పద్ధతుల అమలు, ఎల్‌ఈడీ లైట్ల పంపిణీ, పంపిణీ వ్యవస్థలో హెచ్‌వీడీ ఎస్ పద్ధతి అమలు, పంపిణీ నష్టాల తగ్గింపునకు తీసుకున్న చర్యలకు ఈ పురస్కారం లభించినట్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అక్టోబర్ 22న పేర్కొంది.

ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌కు ‘ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్‌షా’ అవార్డు 
ఆహార పదార్థాలపై చేసిన నిరంతర పరిశోధనలకు హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ ఎల్.లోంగోవాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆహార పదార్థాలు, పోషక విలువలపై పరిశోధనలు సాగిస్తున్న వారికి రోమ్‌కు చెందిన ఇన్‌ఫుడ్‌‌స, ఎఫ్‌ఏఓ సంస్థలు ‘ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్‌షా’అవార్డు పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. ఈ ఏడాది ఈ అవార్డుకు లోంగోవా ఎన్నికయ్యారు. ఆహార పదార్థాల భద్రత బయోడైవర్సిటీ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌ఐఎన్ డెరైక్టర్ ఎల్.లోంగోవాకు ‘ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్‌షా’ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 12 
ఎవరు : ఇన్‌ఫుడ్స్, ఎఫ్‌ఐఓ సంస్థలు, రోమ్ 

గ్రామీ అవార్డుల రేసులో ‘అనంత’ ఆల్బమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ విడుదల చేసిన ‘అనంత వాల్యూమ్-1 మెస్ట్రోస్ ఆఫ్ ఇండియా’ శాస్త్రీయ సంగీత ఆల్బమ్ 60వ గ్రామీ అవార్డుల ‘వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్’ పోటీకి ఎంపికైంది. ప్రసిద్ధ ఘటం విద్వాంసుడు పండిట్ విక్కు వినాయక్ రామ్ ఆధ్వర్యంలో మూడు తరాలకు చెందిన విద్వాంసులు పండిట్ విక్కు వినాయక్ రామ్, సెల్వగణేశ్ స్వామినాథన్‌ల సహకారంతో సిద్ధాంత్ భాటియా స్వరపరచిన ‘గురుస్తోత్రం’ అనే పాట గాత్రవాద్య విభాగంలో పోటీకి ఎంపికైనట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆల్బమ్ 30 మంది సంగీత దిగ్గజాల గాత్ర, స్వర సహకారంతో 300 నిమిషాల నిడివితో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ సంగీత సంకలనంగా నిలిచింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బాలల విద్య, సంక్షేమ పథకాలకు వినియోగించనుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 60వ గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన భారతీయ ఆల్బమ్ 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ‘అనంత వాల్యూమ్-1 మెస్ట్రోస్ ఆఫ్ ఇండియా’ 

ఆక్టా ఉత్తమ ఆసియా చిత్రం రేసులో దంగల్, పింక్, కసవ్ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ అకాడమి ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్(ఆక్టా) అందించే ఉత్తమ ఆసియా చిత్రం అవార్డుకు భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘కసవ్-టర్టల్’, హిందీ చిత్రాలు ‘దంగల్’ ‘పింక్’ నామినేట్ అయ్యారుు. చైనా నుంచి ‘అవర్ టైమ్ విల్ కమ్’ ‘ఐయామ్ నాట్ మేడమ్ బోవరీ’ ‘ఉల్ఫ్ వారియర్-2’ ఫిలిప్పైన్‌‌స నుంచి ‘బర్డ్ షాట్’ దక్షిణ కొరియా నుంచి ‘ట్రైన్ టు బుసాన్’ జపాన్‌కు చెందిన ‘యువర్ నేమ్’ చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో డిసెంబర్ 6న జరిగే ఏడవ ఆక్టా ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేతలను ఎంపిక చేసే జ్యూరీకి ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ విజేత రస్సెల్ క్రోవ్ నేతృత్వం వహిస్తుండగా, భారత్‌కు చెందిన అనుపమ్ ఖేర్, షబానా అజ్మీ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిం చనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆక్టా ఆసియా ఉత్తమ చిత్రం నామినేషన్స్ 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత్ నుంచి నామినేట్ అయిన మరాఠీ చిత్రం ‘కసవ్-టర్టల్’, హిందీ చిత్రాలు ‘దంగల్’ ‘పింక్’ 

గంగానది ప్రక్షాళనకు ఎన్‌జేఎస్‌కు బీ ఇన్‌స్పైర్డ్ పురస్కారంగంగానది పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఎన్‌జేఎస్ సంస్థను సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. వారణాసిలోని గంగానదిలో వ్యర్థాలను తొలగిస్తూ, జీవావరణాన్ని కాపాడుతున్న పుణేకు చెందిన ఎన్‌జేఎస్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను బీ ఇన్‌స్పైర్డ్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ఈ సంస్థ ఎన్‌జేస్ కన్సల్‌టెంట్స్ ఆఫ్ జపాన్, ఇండియాకు చెందిన ఐసీఆర్‌ఏ , టాటా కన్సెల్టింగ్ సంస్థలతో కలిసి గంగానది ప్రక్షాళన ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి 400 సంస్థలు పోటీపడగా ఎన్‌జేఎస్ పురస్కారాన్ని గెలుచుకుంది. 
గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.496.90కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో భాగంగా నీటి నాణ్యతను పెంచడం, నదిలోని జీవావరణాన్ని కాపాడడం, నది మరింత కాలుష్యానికి గురికాకుండా చూడడం కోసం ఎన్‌జేఎస్ పనిచేస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌జేస్ సంస్థ బీ ఇన్స్‌పైర్డ్ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : సింగపూర్ 
ఎందుకు : గంగానది ప్రక్షాళనకు కృషి చేస్తున్నందుకు గాను 

టీఎం కృష్ణకు ఇందిరా గాంధీ అవార్డుకర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ 2015-16 సంవత్సరానికి ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్థంతి రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఈ అవార్డును అందజేస్తారు. 2016లో టీఎం కృష్ణ రామన్ మెగ్‌సెసె అవార్డు అందుకున్నారు. కర్ణాటక సంగీత విద్వాంసుడిగానే కాకుండా.. ఒక సామాజిక కార్యకర్తగా సంగీత రంగంలో కులాల అడ్డుగోడల్ని కూల్చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించేందుకు కృషిచేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డు 2015-16 
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : టీఎం కృష్ణ 

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జాతికి అంకితంఅక్టోబర్ 17న రెండవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి జిల్లాలో ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మూడేళ్ల కాలంలో దేశంలో 65కు పైగా ఆయుష్ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని వెల్లడించారు. 
తొలిసారిగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని 2016లో నిర్వహించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జాతికి అంకితం 
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీలో 

సుప్రీం ధర్మాసనానికి ‘యాక్సెస్ నౌ’ అవార్డు డిజిటల్ హక్కుల కోసం పోరాడుతున్న యాక్సెస్ నౌ అనే అంతర్జాతీయ సంస్థ ఏటా ప్రదానం చేసే గౌరవ పురస్కారానికి ఈసారి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎంపికైంది. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆగస్టు 24న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో ధర్మాసనంలోని సభ్యులకు ‘హీరోస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ కమ్యూనికేషన్స్ సర్వైలెన్స్’ అనే గౌరవ పురస్కారం లభించింది.

అణువుల అధ్యయనానికి కెమిస్ట్రీ నోబెల్ అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసే కొత్త పద్ధతిని కనుగొన్నందుకు గాను జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. ఈ మేరకు అవార్డుల కమిటీ అక్టోబర్ 4న స్టాక్‌హోంలో జరిగిన కార్యక్రమంలో 2017 సంవత్సరానికి విజేతలను ప్రకటించింది. వీరు ఎలక్ట్రాన్ కిరణాలతో అణువుల మెరుగైన ఫొటోలు తీసేందుకు ‘క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’ అనే పద్ధతిని కనుగొన్నారు. దీంతో ఎంతో సులువుగా జీవ అణువుల త్రీడీ చిత్రాలను తీయవచ్చు. తద్వారా సూక్ష్మమైన కణ నిర్మాణాలను, వైరస్‌లను, ప్రొటీన్లను అధ్యయనం చేయొచ్చు. ఇటీవల బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన జికా వైరస్‌ను ప్రపంచానికి చూపించేందుకు, అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో సంబంధం ఉన్న ఎంజైమ్‌ను గుర్తించేందుకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానాన్నే ఉపయోగించారు.
జోయాకిమ్ ఫ్రాంక్: జర్మనీకి చెందిన 77 ఏళ్ల ఫ్రాంక్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
రిచర్డ్ హెండర్సన్: స్కాట్‌లాండ్‌కు చెందిన 72 ఏళ్ల హెండర్సన్ కేంబ్రిడ్‌‌జలోని ఎంఆర్‌సీ మాలిక్యులార్ బయాలజీ లేబొరేటరీలో పనిచేస్తున్నారు. 1990లోనే ఓ ప్రోటీన్ త్రీడీ చిత్రాన్ని తయారు చేశారు.
జాక్వెస్ డుబోషే: స్విట్జర్లాండ్‌కు చెందిన 75 ఏళ్ల జాక్వెస్ యూనివర్సిటీ ఆఫ్ లౌసానే బయోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1980లో నీటిని అతి వేగంగా చల్లబర్చడం వల్ల ద్రవస్థితిలో ఉండగానే గడ్డ కట్టేలా ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు.
క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ ఎలా పనిచేస్తుంది?క్రయో అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత. పరిశీలించాల్సిన పదార్థాన్ని శూన్యంలో ఉంచడం.. దానిపైకి శక్తిమంతమైన ఎలక్ట్రాన్ కిరణాలను ప్రసారం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. సాధారణ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా 2డీ చిత్రాలను మాత్రమే తీయవచ్చు. అవి చాలా అస్పష్టంగా ఉంటాయి. కానీ 1990లో రిచర్డ్ హెండర్సన్ ఎలక్ట్రాన్ కిరణాల శక్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా ఏడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ల స్పష్టత ఉన్న చిత్రాలను తీయగలిగారు. పదార్థాలను శీతల నైట్రోజన్‌లో ఉంచడం ద్వారా స్పష్టత మరింత పెరిగింది. దీంతో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌కు కొన్ని మార్పులు చేసి జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్‌లు స్పష్టమైన అణు చిత్రాలు తీయగలిగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017 సంవత్సరానికి రసాయన శాస్త్ర నోబెల్ ప్రకటన
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్
ఎందుకు : అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసేందుకు క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పద్ధతిని కనుగొన్నందుకు

దీపా మాలిక్‌కు ఎంజీ మెహతా అవార్డురియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మాలిక్‌కు ఎంజీ మెహతా హ్యూమన్ స్పిరిట్ అవార్డు దక్కింది. ఈ మేరకు నవంబర్‌లో ఆమెకు ఈ అవార్డుని అందచేస్తామని రత్ననిధి ట్రస్టు చీఫ్ రాజీవ్ మెహతా అక్టోబర్ 4న తెలిపారు. 
మహేంద్రభాయ్ మెహతా జ్ఞాపకార్థం రత్ననిధి ట్రస్టు ఈ అవార్డుని నెలకొల్పింది. అవార్డు కింద రూ.లక్ష నగదు బహుమతితోపాటు ప్రతిమను అందచేస్తారు. ఎవరెస్టును అధిరోహించిన అరుణిమా సిన్హా, పారాలింపిక్ సైక్లిస్టు ఆదిత్య మెహతాలు ఇదివరకే ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎంజీ మెహతా అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : పారా అథ్లెట్ దీపా మాలిక్

కజువో ఇషిగురోకు సాహిత్య నోబెల్బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురో ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యాడు. ‘The Remains of the Day’ నవలకు గాను ఇషిగురోను సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ అక్టోబర్ 5న ప్రకటించింది. ఈ నవలకు 1989లో మాన్ బుకర్ ప్రైజ్ కూడా లభించింది. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో సాహిత్య పురస్కారంతో పాటు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) గ్రహీతకు అందజేయనున్నారు. నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన 114వ రచయిత ఇషిగురో.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాగసాకీలో పరిస్థితులపై ఇషిగురో 1982లో ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ (తొలి నవల), 1986లో ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’ అనే నవలను రచించారు. 2005లో ‘నెవర్ లెట్ మీ గో’అనే సైన్‌‌స ఫిక్షన్, 2015లో ద బరీడ్ జెయింట్ ను రచించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017 నోబెల్ సాహిత్య పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : స్టాక్‌హోం
ఎవరు : కజువో ఇషిగురో
ఎందుకు : The Remains of the Day నవలకు

గౌరీ లంకేశ్‌కు పొలిట్‌కోవస్కయా అవార్డుబెంగళూరుకు చెందిన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేశ్‌కు రష్యా ప్రభుత్వం అన్నా పొలిట్‌కోవస్కయా అవార్డు (మరణానంతరం)ను ప్రకటించింది. తద్వారా ఈ అవార్డు పొందిన తొలి భారతీయురాలిగా లంకేశ్ నిలిచారు. ఈ అవార్డును ఇటీవల హత్యకు గురైన గౌరీ లంకేశ్, పాకిస్తాన్ హక్కుల కార్యకర్త గులాలాయ్ ఇస్మాయిల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు.
చెచెన్యాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై కథనాలు ప్రచురించినందుకు ప్రముఖ జర్నలిస్టు పొలిట్‌కోవస్కయాను 2006లో మాస్కోలో హత్య చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఆమె పేరిటే ఈ అవార్డును నెలకొల్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అన్నా పొలిట్‌కోవస్కయా అవార్డు 2017
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : రష్యా
ఎవరు : గౌరీ లంకేష్ (భారత్), గులాలాయ్ ఇస్మాయిల్ (పాకిస్తాన్)

అణ్వస్త్ర నిర్మూలన ఉద్యమానికి నోబెల్ శాంతి బహుమతిఅణ్వాయుధాలను నిర్మూలించేందుకు విశేష కృషిచేస్తున్న International Campaign to Abolish Nuclear Weapons-ICAN (అణ్వాస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం) కు 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ‘‘ICAN అనేది ఒక ఉద్యమ సంస్థ. ఇది అణ్వాయుధాల నివారణకు ప్రపంచ దేశాలు సహకరించుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తోందని’’ నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌వుమన్ బెరిట్ రీస్-అండర్సన్ అక్టోబర్ 6న ప్రకటించారు. ఈ సంస్థకు 1.1 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించనుంది.
ICAN చరిత్రమందుపాతరలపై నిషేధం కోరుతూ వచ్చిన స్వచ్ఛంద ఉద్యమం మూలంగా 1997లో వాటిని నిషేధిస్తూ అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీని నుంచి స్ఫూర్తి పొందిన అంతర్జాతీయ డాక్టర్ల సంఘం (అణుయుద్ధ నివారణకు పనిచేస్తుంది) అణ్వాయుధ నిర్మూలనను కోరుతూ ఉద్యమాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఫలితంగా 2007 ఏప్రిల్ 30న ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన సమావేశాలతో ICAN ఏర్పాటైంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ICAN లో 101 దేశాల నుంచి 468 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి బీట్రిస్ ఫిన్ 2014 జూలై నుంచి దీనికి కార్యనిర్వాహక డెరైక్టర్‌గా ఉన్నారు. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అనే మూడు సంస్థలు భారత్ నుంచి ICAN లో భాగస్వాములుగా ఉన్నాయి.
ఐ కెన్, రెడ్‌క్రాస్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సంస్థలు అణ్వస్త్ర నిరోధానికి దశాబ్దకాలంగా కృషి చేస్తున్నాయి. దీంతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2016 అక్టోబర్ 27న ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2017లో జూలై ఏడో తేదీన ‘అణ్వాయుధ నిషేధ ఒప్పందం (Treaty on the Prohibition of Nuclear Weapons-TPNW)’ ఐరాస సాధారణ సభ ఆమోదం పొందింది. కనీసం 50 దేశాలు తమ చట్టసభల్లో ఆమోదిస్తే ఒప్పందం అమలులోకి వస్తుంది. అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారుచేయడం, కలిగి ఉండటం, సాంకేతికతను బదలాయించడం, నిల్వచేయడాన్ని TPNW నిషేధిస్తుంది. అణ్వస్త్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్‌‌స, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు TPNW పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొత్తం మీద ఓ ప్రజా ఉద్యమం ద్వారా ఐరాసలో 122 దేశాలతో అనుకూల ఓటు వేయించిన ICAN కృషికి ‘నోబెల్ బహుమతి’తో తగిన గుర్తింపు లభించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : నోబెల్ శాంతి బహుమతి-2017
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : International Campaign to Abolish Nuclear Weapons-ICAN
ఎందుకు : అణ్వాయుధాలను నిర్మూలించేందుకు చేస్తున్న విశేష కృషికి 

నిషా డిసిల్వాకు SOAR అవార్డుక్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనకుగాను భారత సంతతికి చెందిన నిషా డిసిల్వాకు ప్రతిష్టాత్మక సస్టేయినింగ్ అవుట్‌స్టాండింగ్ ఎచివ్‌మెంట్ అవార్డు (SOAR) దక్కింది. ఒక జీవకణం నుంచి మరో జీవకణానికి వ్యాపించే క్యాన్సర్ కణాల రవాణాను నియంత్రించడం ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చని అమె ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అవార్డు కింద 8.1 మిలియన్ డాలర్ల(సుమారు రూ.52 కోట్లు) నగదుతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.
మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తగా కొనసాగుతున్న డిసిల్వా.. కాన్సర్ కణాల నియంత్రణపై పరిశోధనలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సస్టేయినింగ్ అవుట్‌స్టాండింగ్ ఎచివ్‌మెంట్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : న్యూయార్క్
ఎవరు : నిషా డిసిల్వా
ఎందుకు : క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనకు

ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్‌కు ఆర్థిక నోబెల్ ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషి చేసిన ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్(72)ను ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు వరించింది. ఈ అవార్డుతోపాటు 1.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.2 కోట్లు) ప్రైజ్‌మనీని ఆయన అందుకోనున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎప్పుడూ పూర్తిగా హేతుబద్ధతపైననే ఆధారపడవని, మానవ సంబంధాల లోతైన ప్రభావం వాటిపై ఎక్కువగానే ఉంటుందని నిర్ధారించేలా ఆయన పరిశోధనలు సాగాయి. 
అమెరికాకు చెందిన రిచర్డ్ థేలర్.. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తనకిష్టమైన ‘బిహేవియరల్ ఎకనమిక్స్’లో ఆయన విసృ్తత పరిశోధనలు చేశారు. ఆ దృగ్విషయాన్ని ప్రతిపాదించిన తొలివ్యక్తిగా నిలిచారు. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా బృందాలు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారి మనస్తత్వం, వారికి సంబంధించిన సామాజిక, వ్యక్తిగత అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎకనమిక్స్, సైకాలజీల మధ్య దూరాన్ని చెరిపేసి, వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని చూపే ప్రయత్నం చేశారు. అందుకే నోబెల్ జ్యూరీ.. ‘వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు, మనస్తత్వ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించిన తొలి శాస్త్రవేత్త’గా థేలర్‌ను గుర్తించింది. ఆర్థిక శాస్త్రానికి మరింత మానవీయతను సమకూర్చిన వ్యక్తిగా ఆయనను ప్రశంసించింది. 
నడ్జ్ థీయరీ.. 
సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి బిహేవియరల్ ఎకనమిక్స్‌ను సాధనంగా చూపిన థేలర్ సిద్ధాంతం ‘నడ్‌‌జ థీయరీ’గా పాపులర్ అయింది. ‘నడ్‌‌జ’ అనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాన్ని కూడా ఆయన మరొకరితో కలసి రాశారు. థేలర్ ప్రతిపాదించిన మరో సిద్ధాంతం ‘మెంటల్ అకౌంటింగ్’. వినియోగదారులు తమ ఆదాయ, ఖర్చులను మనస్సులోనే లెక్కలేసుకుని, నిర్ణయాలను సులభతరం చేసుకుంటారని వివరించేదే ఆ సిద్ధాంతం. పరిమిత హేతుబద్ధత, స్వీయ నియంత్రణ లేకపోవడం, సామాజిక ప్రాధాన్యతలు.. వ్యక్తుల ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను ఆయన సమగ్రంగా విశ్లేషించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆర్థిక నోబెల్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 9 
ఎవరు : ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ థేలర్ 
ఎందుకు : ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషికిగాను

వైద్యశాస్త్రంలో ముగ్గురు యూఎస్ శాస్త్రవేత్తలకు నోబెల్ 2017 సంవత్సరానికి గాను వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. రోజులో 24 గంటల్లో మారుతున్న సమయానికి అనుగుణంగా మనుషులు, జంతువులు, వృక్షాల కణజాలంలో సంభవిస్తున్న మార్పుల(ఇంటర్నల్ బయాలాజికల్ క్లాక్)ను కనుగొన్నందుకు గాను శాస్త్రవేత్తలు జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్‌బాష్, మైఖేల్ డబ్ల్యూ యంగ్‌లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడన్ స్టాక్‌హోమ్‌లోని కారోలిన్స్‌కా ఇనిస్టిట్యూట్‌లో జరిగిన నోబెల్ కమిటీ సమావేశంలో 108వ నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అవార్డు కింద ప్రకటించిన 9 మిలియన్‌ల స్వీడిష్ క్రోనార్స్‌ను ముగ్గురు శాస్త్రవేత్తలకు పంచుతారు.
శాస్త్రవేత్త జెఫ్రీ సీ హాల్ మసాచ్యుసెట్స్‌లోని బ్రాండీస్ విశ్వవిద్యాలయంలో చాలా కాలం ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేశారు. శాస్త్రవేత్త రోష్‌బాస్ ఇదే విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా ఉన్నారు. శాస్త్రవేత్త మైఖేల్ యంగ్ న్యూయార్క్‌లోని రాఖేఫెల్లర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
ఏమిటీ పరిశోధన ?భూమిపై మానవులతో పాటు వృక్షాలు, అనేక జంతు జాతులు భూ భ్రమణం ఆధారంగా వాటి శరీరాల కణజాలాన్ని నియంత్రిస్తున్నాయన్న విషయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తిండి, నిద్ర, పని వేళలకు అనుగుణంగా శరీరంలో జరిగే మార్పులను గుర్తించారు. ఈ సైకిల్‌కు వ్యతిరేకంగా శరీరం వ్యవహరిస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చారు.
మానవుడి జీవక్రమ రహస్య ఛేదన, వైద్యశాస్త్రంలో వీరి పరిశోధనలను కీలక పురోగతిగా గుర్తించిన నోబెల్ కమిటీ.. ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.
నోబెల్ చరిత్రసైన్స్, లిటరేచర్, పీస్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఏటా నోబెల్ బహుమతులను అందజేస్తారు. డైనమైట్‌ను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట స్వీడిష్ అకాడమీ 1901 నుంచి ఈ అవార్డులను ఇస్తోంది. భారత్ నుంచి తొలిసారిగా 1913లో రవీంద్రనాథ్ ఠాగోర్ లిటరేచర్ విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. 1930లో సీవీ రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరెసా(పీస్), 1998లో అమర్త్యసేన్ (ఎకనామిక్ స్టడీస్), 2014లో కైలాశ్ సత్యర్థి(పీస్) భారత్ నుంచి నోబెల్ బహుమతి పొందారు. 

సీఎన్‌ఆర్ రావుకు వాన్ హిప్పెల్ అవార్డు ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సీ.ఎన్.ఆర్. రావు ప్రతిష్టాత్మక వాన్ హిప్పెల్-2017 పురస్కారానికి ఎంపికయ్యారు. నోవల్ ఫంక్షనల్ మెటీరియల్స్ అభివృద్ధిలో (nanomaterials graphene, superconductivity, 2D materials and colossal magnetoresistance) కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇది.. భౌతిక పరిశోధనలో ప్రపంచంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వాన్ హిప్పెల్ - 2017 పురస్కారం 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : భారతరత్న సీఎన్‌ఆర్ రావు 
ఎందుకు : భౌతిక పరిశోధనలో విశేష కృషికి గుర్తింపుగా 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు స్వచ్ఛత పురస్కారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను స్వచ్ఛత అవార్డు వరించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తాగు నీటి సరఫరా, పరిశుభ్రత కార్యక్రమాలకుగాను ఈ పురస్కారం దక్కింది. స్వఛ్చభారత్ మిషన్ మూడో వార్షికోత్సవంలో భాగంగా అక్టోబర్ 2న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేశారు. ప్రభుత్వ కార్యాలయ్యాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. 
2017 సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1-15 వరకు అన్ని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు , కార్యాలయాల్లో కల్పిస్తున్న సదుపాయాలు పారిశుద్ధ్య సౌకర్యాల వంటి వాటిపై దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిశీలించి పురస్కారాలకు ఎంపిక చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. స్వచ్ఛత గురించి భారిస్థాయిలో ప్రచారం కల్పించడానికి ర్యాలీలు, వీధి ప్రదర్శనలు, పెయింటింగ్ పోటీలు వంటివి నిర్వహించడమేగాక, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల విద్యార్థులతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు స్వచ్ఛత పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ గురుత్వ తరంగాల ఉనికిని గుర్తించినందుకుగాను అమెరికాకు చెందిన ముగ్గురు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలైన రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లను నోబెల్ అవార్డు- 2017 వరించింది. తన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఈ గురుత్వ తరంగాల గురించి వందేళ్ల కిందటే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించారు. కృష్ణ బిలాలు ఒకదానికి మరొకటి ఢీకొనడం వంటి పరిణామాలు జరగడం వల్ల ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లోనే వీటిని తొలిసారిగా గుర్తించినప్పటికీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారు. వీటిని గుర్తించేందుకు యూఎస్‌లోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)ను థోర్న్, వీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బారిష్ ఈ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చారు. దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏర్పడ్డ గురుత్వ తరంగాలను వీరు తొలిసారిగా ప్రత్యక్షంగా గుర్తించగలిగారు. 
‘ఈ తరంగాలు భూమికి చేరేసరికి చాలా బలహీనమైపోతాయి. అయినా వాటిని గుర్తించడం ఖగోళ భౌతిక శాస్త్రంలో ఓ సంచలనం’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ హెడ్ గోరాన్ హన్సన్ అన్నారు. ఈ అంతు చిక్కని తరంగాలను 2015 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు గుర్తించగలిగారు. రెండు సార్లు ‘లిగో’ ను, ఇంకోసారి ఇటలీలో యురోపియన్ గ్రావి టేషనల్ అబ్జర్వేటరీ (విర్గో)ను ఉపయోగించారు. కృష్ణ బిలాలు ఎటువంటి కాంతినీ వెదజల్లవు. వీటిని కేవలం గురుత్వ తరంగాల ఆధారంగానే గుర్తించే వీలు కలుగుతుంది.
గురుత్వ తరంగాలు అంటే ఏంటి..ఈ గురుత్వ తరంగాలు విశ్వంలో ఎక్కడ పుట్టినా ఏ రకమైన పదార్థంతోనూ సంబంధం లేకుండా ప్రవహిస్తుంటాయి. పైగా చాలా సూక్ష్మంగా ఉంటాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని ప్రత్యక్షంగా గుర్తించలేమని ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తే వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణబిలాల జంటను తీసుకుందాం. స్పేస్‌టైమ్‌లో ఇవి సృష్టించే గురుత్వ తరంగాలు.. భూమ్మీద 10 లక్షల కిలోమీటర్ల దూరాన్ని పరమాణు స్థాయికి తగ్గించేంత చిన్నగా ఉంటాయి. అయితే సుమారు 1,380 కోట్ల ఏళ్ల కింద రెండు భారీ కృష్ణబిలాలు ఢీ కొనడంతో అతిపెద్ద గురుత్వ తరంగాలు ఏర్పడ్డాయి. ఈ తరంగాలు విశ్వంలో అన్నివైపులా ప్రయాణిస్తుండగా 2015లో అమెరికాలో ఏర్పాటు చేసిన లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లో శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంత ప్రాముఖ్యం ఎందుకు?గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించగలిగితే ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సుదూర నక్షత్రాలు, పాలపుంతలు, కృష్ణ బిలాల తాలూకు వివరాలను ఆయా ఖగోళ వస్తువులు సృష్టించే గురుత్వ తరంగాల సైజును బట్టి నిర్ధారించవచ్చు. లిగో ద్వారా గుర్తించిన గురుత్వ తరంగాలు విశ్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఏర్పడినవి కాబట్టి.. వీటి ఆధారంగా విశ్వం విస్తరిస్తోందా.. ఎంత వేగంతో విస్తరిస్తోంది.. వంటి విషయాలను అర్థం చేసుకోవచ్చు. 
ఎలా గుర్తించారు?1974లో తొలిసారి ఈ గురుత్వ తరంగాలను పరోక్షంగా గుర్తించారు. ఒక న్యూట్రాన్ స్టార్ జంట ఓ భారీ ద్రవ్యరాశి చుట్టూ తిరుగుతూ.. క్రమేపీ చిన్నగా మారుతుండటం.. గురుత్వ తరంగాల ద్వారా కోల్పోయే శక్తికి తగ్గట్లు వాటి సైజు తగ్గుతుండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. గురుత్వ తరంగాల ఉనికికి ఇది పరోక్ష నిదర్శనమని తెలిపిన ఈ ప్రయోగాలకు 1993లో నోబెల్ అవార్డు దక్కింది. ఆ తర్వాత అమెరికాలో లిగో పేరుతో, ఇటలీలో విర్గో పేరుతో గురుత్వ తరంగాలను గుర్తించేందుకు రెండు ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. సుదూర ప్రయాణంలో గురుత్వ తరంగాల్లో వచ్చే సూక్ష్మమైన మార్పులను గుర్తిస్తుంది. ఒక లేజర్ కిరణాన్ని రెండుగా విడగొట్టి.. రెండు వైపులకు పంపించడం.. ఆ వైపున ఉన్న అద్దాల ద్వారా వీటిని మళ్లీ ఒక చోట(రెండుగా విడగొట్టిన చోటు)కు చేర్చడం ఈ ప్రయోగంలో జరిగే తంతు. రెండు లేజర్ కిరణాలు ఏకమయ్యే చోట ఆ కాంతి తాలూకు తరంగాలను గుర్తిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వ్యతిరేక దిశల్లో ప్రయాణించే లేజర్ కిరణాలు ఏకమై ఎలాంటి సంకేతాలను చూపవు. గురుత్వ తరంగాల సమక్షంలో మాత్రం కొంచెం తేడాలు వస్తాయి. ఈ తేడాల ఆధారంగా గురుత్వ తరంగాల ఉనికిని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా నిర్ధారించారు. 

ప్రయోగాల వెనుక భారతీయులుగురుత్వ తరంగాలను గుర్తించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి కూడా ఉంది. గురుత్వ తరంగాలను గుర్తించేందుకు అధునాతనమైన ప్రయోగాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘ఇండిగో’ ప్రోగ్రాంలో బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సెన్సైస్‌కు చెందిన ప్రొఫెసర్ బాలా అయ్యర్ సాయమందించారు. ఐఐఎస్‌ఈఆర్- కోల్‌కతాకు చెందిన రాజేశ్ నాయక్, పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫ్రిజిక్స్‌కు చెందిన సంజీవ్ దురంధర్ కూడా ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. 

భారతీయ న్యాయవాదికి ‘స్వీడిష్’ అవార్డుప్రాథమిక హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసిన భారతీయ న్యాయవాది కొలిన్ గొన్సాల్వ్స్‌కు ప్రతిష్టాత్మక స్వీడిష్ రైట్ లైవ్లీ హుడ్ అవార్డు లభించింది. నోబెల్ పురస్కారంతో సమానంగా భావించే ఈ అవార్డు కింద 3 లక్షల అమెరికన్ డాలర్ల నగదు అందజేస్తారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కొలిన్ గత మూడు దశాబ్దాలుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా భారత్‌లోని అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణకు పాటుపడుతున్నారు. ఈ అవార్డును ఆయన మరో ఇద్దరితో కలిసి పంచుకోనున్నారు.

No comments:

Post a Comment