క్రీడలు ఫిబ్రవరి 2013
సానియా-బెథానీ జోడికి దుబాయ్ టైటిల్దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా (భారత్)- బెథానీ (అమెరికా) ద్వయం గెలుచుకుంది. వీరు ఫిబ్రవరి 23న జరిగిన ఫైనల్లో నాదియా పెత్రోవా (రష్యా)- కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడిపై సానియా, బెథానీ జంట విజయం సాధించారు.
ధోని రికార్డుఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలో ఫిబ్రవరి 26న ముగిసిన మొదటి క్రికెట్‌టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని డబుల్ సెంచరీ (224) చేశాడు. తద్వారా భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్‌గా రికార్డు సష్టించాడు. ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా కూడా ఘనత దక్కించుకున్నాడు.
2020 ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ తొలగింపు2020 రియోడిజనిరో ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ (కుస్తీ) క్రీడను తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐ.ఒ.సి) ఫిబ్రవరి 12న నిర్ణయించింది. దీని స్థానంలో మరో కొత్త క్రీడకు అవకాశం కల్పిస్తారు. టీవీ రేటింగ్‌స, టికెట్ల అమ్మకాలు, యాంటీ డోపింగ్, క్రీడ పట్ల ఉన్న విశ్వవ్యాప్త ఆదరణ వంటి అంశాలను పరిశీలించి, రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్‌ను నిర్వహించి రెజ్లింగ్‌ను తొలగించేందుకు ఐఒసి నిర్ణయించింది. 1896 ఏథెన్‌సలో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొదలైన తర్వాత 1900 ఒలింపిక్స్ మినహా ప్రతి ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ మెడల్ ఈవెంట్‌గా ఉంది. ఈ క్రీడలో భారత్ నాలుగు పతకాలు సాధించింది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన సుశీల్‌కుమార్ 66 కిలోల విభాగంలో రజతం, యోగేశ్వర్ 60 కిలోల విభాగంలో కాంస్యం సాధించారు. బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్యం గెలిచాడు. 1952లో ఖాషాబా జాదవ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలిపతకం రెజ్లింగ్ నుంచే సాధించాడు.
వెల్స్ ఓపెన్ ప్రొ స్నూకర్ సిరీస్ ప్రి క్వార్టర్‌లో అద్వానీభారత్ స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ బెస్ట్ విక్టర్ వెల్ష్ ఓపెన్ ప్రొ స్నూకర్ సిరీస్‌లో ప్రి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. అద్వానీ ప్రపంచ మాజీ ఛాంపియన్ షాన్ మర్ఫీ (ఇంగ్లండ్)ని ఫిబ్రవరి 12న వేల్స్‌లో జరిగిన పోటీలో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఫిబ్రవరి 13న గ్రేమ్ డాట్ (స్కాట్లాండ్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు.
నేషనల్ గ్రాస్ కోర్‌ట టెన్నిస్ ఛాంపియన్‌షిప్రామ్‌కుమార్ రామనాథన్ (తమిళనాడు) అంకితారైనా (గుజరాత్)లు నేషనల్ గ్రాస్‌కోర్‌ట టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. కోల్‌కతాలో ఫిబ్రవరి 16న ముగిసిన పోటీల్లో సౌరవ్ సుకుల్(బెంగాల్)ను ఓడించి రామనాథన్ పురుషుల టైటిల్ సాధించాడు. నటాషా పల్హా (గోవా)ను ఓడించి అంకిత మహిళల టైటిల్‌ను సాధించింది.
పెద్ద వయసులో నెంబర్‌వన్‌గా సెరెనాఅమెరికాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 31 సంవత్సరాల 4 నెలల 24 రోజుల వయసులో నెంబర్‌వన్ ర్యాంకును సాధించింది. దీంతో ఆమె అతిపెద్ద వయసులో నెంబర్‌వన్ స్థానంలో నిలిచిన టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. ఫిబ్రవరి 15న ఖతార్ ఓపెన్‌లో సెరెనా సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడంతో నెంబర్‌వన్ ర్యాంక్ దక్కింది.
నాదల్‌కు బ్రెజిల్ ఓపెన్ టైటిల్స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ బ్రెజిల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రియోడిజనిరోలో ఫిబ్రవరి 18న జరిగిన ఫైనల్స్‌లో డేవిడ్ నల్బందియన్ (అర్జెంటీనా)ను ఓడించి నాదల్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు.
ఆస్ట్రేలియాకు మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మహిళల ప్రపంచకప్ క్రికెట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుం ది. ముంబైలో ఫిబ్రవరి 17న ముగిసిన ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఆస్ట్రేలియాకు ఇది ఆరో ప్రపంచ కప్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కామెరూన్ (ఆస్ట్రేలియా), ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సూజీబేట్స్ (న్యూజిలాండ్) నిలిచారు.
ఆనంద్‌కు గ్రెన్ కె క్లాసిక్ టోర్నమెంట్ టైటిల్భారత్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గ్రెన్‌కె క్లాసిక్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్నాడు. జర్మనీలో ఫిబ్రవరి 17న జరిగిన పోటీలో ఆనంద్ ఈ చెస్ టైటిల్ సాధించాడు. ఆయన ఐదేళ్ల తర్వాత సాధించిన టైటిల్ ఇది.
వరల్డ్ వింటర్ స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 46 పతకాలు10వ వరల్డ్ వింటర్ స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ దక్షిణ కొరియాలో పియాంగ్‌చాంగ్‌లో 2013 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిర్వహించారు. ఈ క్రీడల్లో భారత్‌కు 46 పతకాలు దక్కాయి. ఇందులో 13 స్వర్ణం, 17 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. 112 దేశాల నుంచి 3300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పొల్గొన్నారు. 1968 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ స్పెషల్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఎనిమిది విభాగాల్లో ఈ క్రీడలు నిర్వహించారు. వీటిలో అల్‌ఫైన్‌స్కింగ్, క్రాస్-కంట్రీ స్కింగ్, స్కో బోర్డింగ్, స్కో షూయింగ్, ఫిగర్ స్కేటింగ్, స్టార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్, ఫ్లోర్ హాకీ, ఫ్లోర్ బాల్ ఉన్నాయి.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 81 సెంచరీలు చేసిన సచిన్ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 81 సెంచరీలు చేసి సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. ముంబైలో ఫిబ్రవరి 8న జరిగిన ఇరానీ కప్‌లో సచిన్ 81వ సెంచరీ పూర్తి చేశాడు. రెస్టాఫ్ ఇండియా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ ముంబై జట్టులో ఆడాడు. టెస్టుల్లో 51 సెంచరీలు చేసిన సచిన్‌కిది 30వ దేశవాళీ సెంచరీ. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 25,000 పరుగులు పూర్తి చేశాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇరానీ కప్ఇరానీ కప్ క్రికెట్ టైటిల్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. ముంబైలో ఫిబ్రవరి 10న ముగిసిన ఫైనల్స్‌లో ముంబైని రెస్ట్ ఆఫ్ ఇండియా ఓడించింది. ఈ టోర్నమెంట్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి.
హెచ్.ఐ.ఎల్. చాంపియన్‌గా రాంచీరాంచీ రైనోస్ జట్టు ప్రారంభ హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టైటిల్‌ను గెలుచుకుంది. రాంచీలో ఫిబ్రవరి 10న జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాంచీ రైనోస్ విజయం సాధించింది. విజేత రాంచీ జట్టుకు ’ 2 కోట్ల 50 లక్షలు, రన్నరప్ ఢిల్లీ జట్టుకు ’ 1 కోటి 25 లక్షలు బహూకరించారు.
కెప్టెన్‌గా స్మిత్ రికార్డుజొహెన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో ఫిబ్రవరి 1 నుంచి 4వరకు దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వంద టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సష్టించాడు. స్మిత్ 2003 ఏప్రిల్ నుంచి దక్షిణాఫ్రికా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 107 టెస్టుల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్మిత్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్ అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా-93 మ్యాచ్‌లు). ప్రస్తుత కెప్టెన్లలో స్మిత్ తర్వాత స్థానంలో భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోని (43 మ్యాచ్‌లు) ఉన్నాడు.
ఉడ్స్‌కు యూఎస్ గోల్ఫ్ టైటిల్యూఎస్ పీజీఏ ఫార్మర్స్ ఇన్సూరెన్స్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను టైగర్ ఉడ్స్ గెలుచుకున్నాడు. కెరీర్‌లో ఉడ్స్‌కు ఇది 75వ టైటిల్. జనవరి 29న లోజల్లా(అమెరికా)లో జరిగిన పోటీలో బ్రండిట్ స్నెథెకర్, జోష్ టీటర్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభంమహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ జనవరి 31న భారత్‌లో ప్రారంభమైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగింది. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. తొలిసారిగా 1973లో ఇంగ్లండ్ వేదికగా మహిళల వరల్డ్ కప్ నిర్వహణ ప్రారంభమైంది.

No comments:
Post a Comment