AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు ఫిబ్రవరి 2015

అవార్డులు ఫిబ్రవరి 2015
2014 నాయుడమ్మ అవార్డు
డీఆర్‌డీవో అడ్వాన్‌‌సడ్ సిస్టమ్స్ లేబొరేటరీ డెరైక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్‌‌సడ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ గీతా వరదన్ 2014 సంవత్సరానికి డాక్టర్ నాయుడమ్మ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును మార్చి 1న నాయుడమ్మ స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలిలో ప్రదానం చేస్తారు. తొలిసారి ఇద్దరు మహిళలకు సంయుక్తంగా ఈ అవార్డు దక్కింది. టెస్సీ థామస్ అగ్ని క్షిపణి ప్రయోగంలో సేవలందించారు. అగ్రశ్రేణి ఉప గ్రహ సమాచార శాస్త్రవేత్తగా గీతా వరదన్ పేరు గడించారు.
అభినవ్ - ఆవిష్కరణ అవార్డు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అభినవ్ - ఆవిష్కరణ అవార్డు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)కు దక్కింది. గ్రామీణాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం దీన్ని అందజేస్తుంది. భూ వనరుల విభాగం, సమగ్ర వాటర్ షెడ్ల నిర్వహణ పథకంలో జియో ఇన్ఫర్మేటిక్స్ వినియోగం అనే అంశంపై పరిశోధనలకు కేంద్రం ఈ అవార్డు అందజేసింది.
పునర్వినియోగ ఇంధన అవార్డు
గత నాలుగేళ్లలో సంప్రదాయేతర/ పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహించడంలో చూపిన ఉత్తమ పనితీరుకు తెలంగాణ రాష్ట్రానికి పునర్వినియోగ ఇంధన అవార్డు లభించింది. తొలి పునర్వినియోగ ఇంధన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో ఫిబ్రవరి 15న ప్రధాని నుంచి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో గత నాలుగేళ్లలో 809 మిలియన్ యూనిట్ల పునర్వినియోగ ఇంధన సామర్థ్యం చేరింది.
ఆస్కార్ ఉత్తమ చిత్రంగా బర్‌‌డమ్యాన్
87వ ఆస్కార్ అవార్డులను లాస్ ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 22న ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘బర్‌‌డమ్యాన్’కు నాలుగు అవార్డులు దక్కాయి. మరో చిత్రం ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’కు కూడా నాలుగు అవార్డులు లభించాయి. బర్‌‌డమ్యాన్ వ్యంగ్య, హాస్య, నాటకీయ అమెరికన్ చిత్రం. ఒక సూపర్ స్టార్ ఇగో, ఆత్మవిశ్వాస లోపం మధ్య నడిచే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.
ఉత్తమ చిత్రం: బర్‌‌డమ్యాన్
ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు (బర్‌‌డమ్యాన్)
ఉత్తమ నటుడు: ఎడ్డి రెడ్‌మేన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
ఉత్తమ నటి: జూలియన్ మూరే (స్టిల్ అలైస్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్): గ్లోరీ... (చిత్రం - సెల్మా)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్): ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (అలెగ్జాండ్రె డెస్‌ప్లాట్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సిటిజన్ ఫోర్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఇదా (పోలండ్)
ఉత్తమ యానిమేటెడ్ లఘుచిత్రం: ఫేస్ట్
క్రిక్‌ఇన్ఫో అవార్డులు
భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంకపై ప్రపంచ వన్డే క్రికెట్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన అద్భుత ప్రదర్శన ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ఉత్తమ వన్డే ఇన్నింగ్స్‌గా ఎంపికైంది. వన్డే, టెస్టు, టి20 ఫార్మాట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. రోహిత్ 2013లో కూడా ఉత్తమ వన్డే ఇన్నింగ్స్ అవార్డు అందుకున్నాడు. అలాగే శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన (పాక్‌పై 5/56)లో విజేతగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ఆసీస్ పేసర్ మిషెల్ జాన్సన్ (దక్షిణాఫ్రికాపై 7/68) ఈ అవార్డును అందుకోనున్నాడు. ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్‌గా బ్రెండన్ మెకల్లమ్ (భారత్‌పై 302) ట్రిపుల్ సెంచరీ నిలిచింది. అలాగే టి20లో ఉత్తమ ప్రదర్శన (శ్రీలంకపై 116 నాటౌట్)తో ఆకట్టుకున్న అలెక్స్ హేల్స్, ఉత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసినందుకు హెరాత్ (కివీస్‌పై 5/3) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

అమర్త్యసేన్‌కు బ్రిటన్ కీన్స్ అవార్డు
బ్రిటన్ తొలిసారిగా అందజేస్తున్న చార్లెస్టన్ ఈఎఫ్‌జీ జాన్ మైనార్‌‌డ కీన్స్ అవార్డును ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు ప్రకటించారు. బ్రిటిష్ ఆర్థిక వేత్త జాన్ మైనార్‌‌డ కీన్స్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. దీని కింద 7,500 బ్రిటిష్ పౌండ్లు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
గురుప్రీత్ సింగ్‌కు నేషనల్ సైన్‌‌స ఫౌండేషన్ అవార్డు
భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త గురుప్రీత్ సింగ్‌కు ప్రతిష్టాత్మక నేషనల్ సైన్‌‌స ఫౌండేషన్ కెరీర్ అవార్డు లభించింది. ఆయన అమెరికాలోని కాన్సస్ స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఉత్తమ రీచార్‌‌జ బ్యాటరీల తయారీకి ఉపయోగపడే అత్యంత పల్చని లోహపు రేకులను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు దక్కింది. దీని కింద 5,00,000 డాలర్లు అందుకున్నారు.
సాక్షి’ కార్టూనిస్ట్‌కు ‘బాపు’ స్మారక అవార్డు
కోనసీమ చిత్రకళా పరిషత్ జాతీయ చిత్ర కళోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ దినపత్రిక చీఫ్ కార్టూనిస్ట్ శంకర్‌కు బొమ్మల బ్రహ్మ ‘బాపు’ స్మారక అవార్డును ప్రదానం చేసింది.తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో పరిషత్ ఫిబ్రవరి 15న నిర్వహించిన జాతీయ చిత్రకళా ప్రదర్శన, చిత్రోత్సవం సందర్భంగా శంకర్‌కు పురస్కారాన్ని అందించి, ఘనంగా సత్కరించింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, పరిషత్ అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి చేతుల మీదుగా శంకర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సృష్టిలో చిత్రకళకు ఎనలేని కీర్తి ఉందన్నారు. ఇలాంటి చిత్రకళను చిత్రకళా పరిషత్‌లు పోషించడాన్ని అభినందించారు.

భారతీయులకు గ్రామీ అవార్డులు
సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డులను ఇద్దరు భారతీయులు సొంతం చేసుకున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో ఫిబ్రవరి 9న 57వ గ్రామీ పురస్కారాలను అందజేశారు. ఇందులో బెంగళూరుకు చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ తన ‘విండ్స్ ఆఫ్ సంసారా’ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డును అందుకున్నాడు. అలాగే నీలా వాస్వాని.. మలాలా యూసఫ్ జాయ్‌పై తీసిన డాక్యుమెంటరీ ‘ఐ యామ్ మలాలా: హౌ వన్ గర్ల్ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చెంజ్‌డ్ ద వరల్డ్’కుగాను ‘గ్రామీ’ అవార్డు గెలుచుకున్నారు. రిక్కీ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డుకు ఎంపికవగా, నీలా బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డు గెలుచుకున్నారు. ఇతర అవార్డుల వివరాలు.. ఉత్తమ రాక్ ఆల్బమ్: మార్నింగ్ ఫేజ్ (గాయకుడు బెక్), ఉత్తమ సాంగ్: స్టే విత్ మీ, ఉత్తమ రాక్ సాంగ్-అయామ్ నాట్ ఇట్ ఫైన్, ఉత్తమ రికార్డ్-స్టే విత్ మీ, ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శన: ఫార్రెల్ విలియమ్స్ (హాపీ).

బాలచంద్ర నెమాడేకు జ్ఞానపీఠ్సాహిత్య రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మక ‘జ్ఞానపీఠ్’ అవార్డు-2014కు మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమాడే(76) ఎంపికయ్యారు. ఈ పురస్కారం కింద 10 లక్షల రూపాయలు, సన్మాన పత్రంతో గౌరవించనున్నారు. బాలచంద్ర నెమాడే 1938లో జన్మించారు. 25 ఏళ్ల వయస్సులో 1963లో ‘కొసాలా’ నవలను 16 రోజుల్లో రచించారు. ఈ నవలతో మరాఠీ సాహిత్య రంగంలో విశిష్ట పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత జరీలా, జూల్, బిడార్, హిందూ-ఏక్ సముద్ర్ర్ నవలలతో పాటు ఎన్నో కవితలను రాశారు. ఈయనకు గతంలో సాహిత్య అకాడమీ పురస్కారం (1991), 2011లో పద్మశ్రీ అవార్డు లభించాయి. మరాఠీ సాహిత్య రంగంలో జ్ఞానపీఠ్ అవార్డు గెల్చుకున్న నాలుగో రచయిత బాలచంద్ర నెమాడే.

‘175 గ్రామ్స్’కు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డుమన దేశానికి చెందిన భరత్ మిర్లే, అరవింద్ అయ్యర్‌లు దర్శకత్వం వహించిన‘175 గ్రామ్స్’, సన్‌డేన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు గెల్చుకుంది. అంతర్జాతీయ సమస్యలైన ఆకలి, పేదరికం నేపథ్యంగా వచ్చిన తొమ్మిది షార్ట్‌ఫిల్మ్ ఎంట్రీల్లో ఐదింటిని సన్‌డేన్ ఇన్‌స్టిట్యూట్ వారు విజేతలుగా ప్రకటించారు. వీరిలో ఒక్కరికీ పదివేల డాలర్లను బహుమతిగా ఇచ్చారు. మిగతా నాలుగు చిత్రాలివే..
1. మ్యాన్ ఇన్ ద మేజ్- ఫిల్ బుచెల్లాటో, జెస్సీ యాష్ (అమెరికా) 2. డ్రాపింగ్ ఇన్ - విలృ్లం వాన్ డెన్ హీవర్ (దక్షిణాఫ్రికా) 3. ఇసబెల్స్ గార్డెన్- జెఫ్రీ పామర్‌ృ(అమెరికా) 4. ఎ విల్ ఆఫ్ ఐరన్- సెవీ ఫాబ్యూమి, మొబోలజీ అదియేల్ (నైజీరియా)

No comments:

Post a Comment