AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు మార్చి 2013

క్రీడలు మార్చి 2013
ప్రపంచ నెంబర్ వన్ గోల్ఫర్ ఉడ్స్అమెరికా గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ ఉడ్స్‌కు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు దక్కింది. 2010 అక్టోబర్ తర్వాత ర్యాకింగ్స్‌లో ఉడ్స్ మొదటి స్థానానికి వచ్చాడు. 2013 మార్చి 25న అర్నాల్డ్ పామెర్ ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ టోర్నీని గెలుచుకోవడంతో ఉడ్స్‌కు మొదటి స్థానం దక్కింది. 

సెరీనా విలియమ్స్‌కు మియామి టైటిల్ వరల్డ్ నెంబర్ వన్ సెరీనా విలియమ్స్ డబ్ల్యూటీఏ మియా మీ మహిళల సింగి ల్స్ టైటిల్ గెలుచుకుంది. మియామీలో మార్చి 30న జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 2 మరియా షరపోవాను సెరీనా ఓడించింది. సెరీనా మియామీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది ఆరోసారి.
పురుషుల సింగిల్స్ మియామీ మాస్టర్స్ టైటిల్‌ను ఆండీముర్రె గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో ఫైను ముర్రే ఓడించాడు. 

గుజరాత్‌కు ముస్తాక్ అలీట్రోఫీసయ్యద్ ముస్తాక్ అలీ టి20 ఛాంపియన్ షిప్‌ను గుజరాత్ జట్టు గెలుచుకుంది. ఇండోర్‌లో మార్చి 31న జరిగిన ఫైనల్స్‌లో పంజాబ్‌ను గుజరాత్ ఓడించింది. 

భారత్‌కు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెలుచుకుంది. 81 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం రవిచంద్రన్ అశ్విన్ (భారత్)కు దక్కింది.

నాదల్‌కు ఇండియన్ వెల్స్ టైటిల్ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. ఇండియన్ వెల్స్‌లో మార్చి 18న జరిగిన ఫైనల్లో జువాన్ మార్టిన్ డెల్ పోర్ట్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మరియా షరపోవా గెలుచుకుంది.

వెటల్‌కు మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్మలేసియా గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రెవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సెపాంగ్ (మలేసియా)లో మార్చి 25న జరిగిన పోటీల్లో మార్క్ వెబర్ రెండో స్థానంలో నిలిచాడు.

స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్స్ పురుషుల సింగిల్స్: చైనాకు చెందిన గ్జెంగ్ మింగ్ వాంగ్ గెలుచుకున్నాడు. బాసెల్‌లో మార్చి 18న జరిగిన ఫైనల్లో పెంగూ డూ (చైనా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్: షిక్సియాన్ వాంగ్ (చైనా) గెలుచుకుంది. ఫైనల్లో రాచ్‌నోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) ను ఓడించింది.

వెస్ట్ జోన్‌కు దేవధర్ ట్రోఫీదేశీయంగా నిర్వహించే జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ దేవధర్ ట్రోఫీని వెస్ట్‌జోన్ జట్టు గెలుచుకుంది. మార్చి 13న గువాహటిలో జరిగిన ఫైనల్లో నార్త్‌జోన్‌ను ఓడించింది.

వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంప్ ఉక్రెయిన్వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ను ఉక్రెయిన్ జట్టు గెలుచుకుంది. కోజికోడ్‌లో మార్చి 13న ము గిసిన ఈ టోర్నమెంట్‌లో చైనా రెండో స్థానం, భారత్ ఐదో స్థానం దక్కించుకున్నాయి.

ధావన్ రికార్డుభారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మొహా లీలో జరిగిన మూడో టెస్ట్ మ్యా చ్‌లో సెంచరీ (187 పరుగులు) సాధించాడు. తద్వారా తొలి మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా (85 బంతుల్లో) శతకాన్ని సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సష్టించాడు. అంతేకాకుండా భారత్ తరఫున అడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గుండప్ప విశ్వనాథ్ (137) రికార్డును శిఖర్ అధిగమించాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా ధావన్ (గతంలో ప్రవీణ్ ఆమ్రే, ఆర్పీ సింగ్, అశ్విన్ ఈ ఘనత సాధించారు) నిలిచాడు. 

ఆల్ ఇంగ్లండ్ చాంప్ టిన్ బౌన్ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల టైటిల్‌ను డెన్మార్క్ క్రీడాకారిణి టిన్ బౌన్ గెలుచుకుంది. బర్మింగ్‌హమ్‌లో మార్చి 10న జరిగిన ఫైనల్లో రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. తద్వారా ఈ టైటిల్ సాధించిన అతి పెద్ద వయస్కురాలిగా 33 ఏళ్ల టిన్‌బాన్ రికార్డు సష్టించింది. పురుషుల విభాగంలో చెన్ లాంగ్ (చైనా) విజేతగా నిలిచాడు. ఫైనల్లో లీచోంగ్ లీ (మలేషియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో లీ క్సియోలంగ్-క్వి జిహన్ (చైనా) జోడి విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను వాంగ్ జియోలీ-యు యాంగ్ (చైనా) ద్వయం గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను టోంటవి అహ్మద్- లిల్‌యానక్ష నట్సిల్ (ఇండోనేషియా) జోడి గెలుచుకుంది.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులుఉత్తమ వన్డే ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి (శ్రీలంకపై 133 పరుగులు)
ఉత్తమ వన్డే బౌలింగ్: తిసార పెరీరా (పాక్‌పై 6/44)
ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్: కెవిన్ పీటర్సన్ (భారత్‌పై 186 పరుగులు)
ఉత్తమ టెస్టు బౌలింగ్: వెర్నాన్ ఫిలాండర్ (ఇంగ్లండ్‌పై 5/30)
ఉత్తమ టి20 ఇన్నింగ్స్: మార్లోన్ శామ్యూల్స్ (శ్రీలంకపై 78 పరుగులు)
ఉత్తమ టి20 బౌలింగ్: లసిత్ మలింగ (ఇంగ్లండ్‌పై 5/31)

అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ‘ధోని’అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా ఎం.ఎస్. ధోని నిలిచాడు. హైద రాబాద్‌లో మార్చి 5న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌ను భారత్ గెలుచుకోవడంతో ధోనికి ఈ ఘనత దక్కింది. ధోని సారథ్యంలో భారత జట్టు ఆడిన 45 టెస్ట్‌ల్లో 22 టెస్టుల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు సౌరవ్ గంగూలీ సారథ్యం లో భారతజట్టు ఆడిన 49 టెస్టుల్లో 21 టెస్టులు గెలిచిన రికార్డు ఉంది.

ముష్ఫికర్ రికార్డుగాలె (శ్రీలంక)లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మార్చి 8 నుంచి12 వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ డబుల్ సెంచరీ (200) చేశాడు. తద్వారా ఈ ఘనత దక్కించుకున్న తొలి బంగ్లా ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరును కూడా (638) నమోదు చేసింది.

నేషనల్ టీమ్ చెస్ టోర్నీనేషనల్ టీమ్ చెస్ టోర్నమెంట్ పురుషుల టైటిల్‌ను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు గెలుచుకుంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్లో ఎయిర్ ఇండియాను ఓడించింది. మహిళల విభాగంలో ఎయిర్ ఇండియా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తమిళనాడును ఓడించింది.

దుబాయ్ ఓపెన్ డ్యూటీ ఫ్రీ చాంప్ భూపతి జోడిదుబాయ్ ఓపెన్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహేశ్ భూపతి (భారత్) -మైకేల్ లోద్రా (ఫ్రాన్స్) ద్వయం గెలుచుకుంది. మార్చి 2న జరిగిన ఫైనల్లో లిండ్ స్టెట్ (స్వీడన్)-జిమోనిచ్ (సెర్బియా) జోడిపై గెలిచింది. భూపతి కెరీర్‌లో ఇది 52వ డబుల్స్ టైటిల్. ఈ విజయంతో ఏటీపీ సర్క్యూట్‌లో అత్యధిక డబుల్స్ టైటిల్స్ సాధించిన భారతీయ క్రీడాకారుడిగా భూపతి గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నోవాక్ జోకోవిచ్ విజేతగా నిలిచాడు.

విజయ్ హజారే ట్రోఫీ విజేత ఢిల్లీదేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. మార్చి 3న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్లో అస్సాంపై విజయం సాధించింది. 

సంతోష్ ట్రోఫీ విజేత సర్వీసెస్జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ జట్టు గెలుచుకుంది. మార్చి 3న కొచిలో జరిగిన ఫైనల్లో కేరళ జట్టుపై విజయం సాధించింది.

మెక్సికన్ ఓపెన్ చాంప్ నాదల్మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. మార్చి 3న ఆకాపుల్కో (మెక్సికో)లో జరిగిన ఫైనల్లో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) పై విజయం సాధించాడు. నాదల్ కెరీర్‌లో ఇది 52వ సింగిల్స్ టైటిల్ కాగా క్లే కోర్టులపై 38వది. మహిళల విభాగంలో ఇటలీకి చెందిన సారా ఎర్రానీ విజేతగా నిలిచింది.

No comments:

Post a Comment