AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు సెప్టెంబరు 2013

క్రీడలు సెప్టెంబరు 2013
లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీపై బీసీసీఐ సెప్టెంబర్ 25న జీవితకాల నిషేధం విధించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇకపై బీసీసీఐకి చెందిన కమిటీల్లో, ఆఫీసుల్లో ఎటువంటి బాధ్యతలు చేపట్టే హక్కు మోడీకి ఉండదు.
ఆసియా మహిళల హాకీలో భారత్‌కు కాంస్యం
8వ ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. కౌలాలంపూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో చైనాను ఓడించింది. దక్షిణ కొరియాను ఓడించి జపాన్ ఆసియా కప్‌ను గెలుచుకుంది.
ఆసియా రోయింగ్‌లో స్వరణ్ సింగ్‌కు స్వర్ణం
చైనాలోని లువాన్ నగరంలో సెప్టెంబర్ 29న ముగిసిన ఆసియా రోయింగ్ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ ఈవెంట్‌లో స్వరణ్ సింగ్ పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తం మీద భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి.
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీనివాసన్ తిరిగి 2014 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఐపీఎల్ చైర్మన్‌గా ఒరిస్సా క్రికెట్ సంఘం అధ్యక్షుడు రంజిబ్ బిశ్వాల్ ఎన్నికయ్యారు.
సానియాకు పాన్ పసిఫిక్ డబుల్స్ టైటిల్
జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్, సానియా మీర్జా (భారత్) జంట పాన్ పసిఫిక్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
హంపికి తాష్కెంట్ గ్రాండ్ ప్రి టైటిల్
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తాష్కెంట్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మరో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదోస్థానంలో నిలిచింది.

ప్రపంచ రెజ్లింగ్‌లో యాదవ్‌కు కాంస్యం
బుడాపెస్ట్‌లో సెప్టెంబర్ 22న ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన సందీప్ యాదవ్‌కు పురుషుల గ్రీకో రోమన్ 66 కిలోల విభాగంలో కాంస్య పతకం లభించింది. ఈ క్రమంలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సందీప్ చరిత్ర సష్టించాడు.
ప్రపంచ ఆర్చరీ టోర్నీలో దీపికకు రజతం
ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ దీపిక కుమారికి రజత పతకం లభించింది. సెప్టెంబర్ 22న జరిగిన వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దీపిక యున్ ఓక్ హీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది.
సింగపూర్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్
సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 22న జరిగిన రేసులో ఫెరారీ డ్రై వర్ అలోన్సోకు రెండో స్థానం దక్కింది.
డ్యురాండ్ కప్ విజేత మహ్మదీన్ స్పోర్టింగ్
డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను మహ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్ గెలుచుకుంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 19న జరిగిన ఫైనల్లో ఓఎన్‌జీసీ జట్టుపై విజయం సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో డ్యురాండ్ కప్ ఒకటి. ఈ టోర్నమెంట్‌ను 1888లో సిమ్లాలో సర్ హెన్రీ మార్టిమర్ డ్యురాండ్ ప్రారంభించారు. డ్యురాండ్ భారత విదేశాంగ కార్యదర్శిగా సేవలు అందించారు.

ప్రపంచ సీనియర్ రెజ్లింగ్‌లో అమిత్‌కు రజతం
హంగేరిలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమిత్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 16న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కిలోల విభాగం ఫైనల్లో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 

తమిళనాడుకు మెయినుద్దౌలా కప్మెయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టైటిల్‌ను తమిళనాడు గెలుచుకుంది. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ జట్టును తమిళనాడు ఓడించింది.

అఫ్ఘానిస్థాన్‌కు శాఫ్ ఫుట్‌బాల్ కప్దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)ను తొలిసారిగా అఫ్ఘానిస్థాన్ గెలుచుకుంది. ఖాట్మండులో సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించింది. దీంతో భారత్ హ్యాట్రిక్ సాధించే అవకాశం కోల్పోయింది.

శ్రీశాంత్, చవాన్‌లపై జీవిత కాల నిషేధంఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెట్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెప్టెంబర్13న జీవితకాలం నిషేధం విధించింది. గతేడాది జరిగిన ఐపీఎల్ ఆరో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వీరు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి జట్టుకు అధిక పరుగులిచ్చారు. బుకీగా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు అమిత్‌సింగ్‌పై ఐదేళ్ల నిషేధం విధించారు. స్పాట్ ఫిక్సింగ్ గురించి తెలిసినా బీసీసీఐకి సమాచారం ఇవ్వని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ త్రివేదిపై ఒక ఏడాదిపాటు బీసీసీఐ నిషేధం విధించింది.

ఐఓసీ కొత్త అధ్యక్షుడిగా బాచ్జాక్వస్ రోగే స్థానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త అధ్యక్షుడిగా జర్మనీకి చెందిన 59 ఏళ్ల థామస్ బాచ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో కనీసం ఎనిమిదేళ్లు కొనసాగే అవకాశముంది. 
ఒలింపిక్స్‌లో స్థానం నిలుపుకున్న రెజ్లింగ్ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2020, 2024 ఒలింపిక్స్‌లో 26వ క్రీడగా రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సెప్టెంబర్ 8న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. పోటీలో నిలిచిన బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, స్క్వాష్‌లను ఓటింగ్‌లో వెనక్కి నెట్టి రెజ్లింగ్ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొత్తం 95 ఓట్లలో రెజ్లింగ్‌కు అనుకూలంగా 49 ఓట్లు వచ్చాయి. స్క్వాష్‌కు 22 ఓట్లు మాత్రమే రాగా, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు 24 ఓట్లు పడ్డాయి. రెజ్లింగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రీడల జాబితా నుంచి ఐఓసీ తొలగించింది. కొత్తగా చేరిన రగ్బీ సెవెన్, గోల్ఫ్‌లతో కలిసి 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 

2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యో ఖరారుఒలింపిక్స్ క్రీడలు-2020ను నిర్వహించే అవకాశం జ పాన్ రాజధాని టోక్యో నగరానికి దక్కింది. సెప్టెంబర్ 8న బ్యూనస్‌ఎయిర్స్‌లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో టోక్యో 24 ఓట్ల తేడాతో ఇస్తాంబుల్ (టర్కీ)పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఒలింపిక్స్-2020 నిర్వహణ కోసం మొత్తం మూడు నగరాలు.. ఇస్తాంబుల్ (టర్కీ), మాడ్రిడ్ (స్పెయిన్), టోక్యో (జపాన్) పోటీపడ్డాయి. రాబోయే తరానికి ఒలింపిక్ విలువలు, క్రీడల ఫలితాలు అందించే క్రమంలో అద్భుతమైన, సురక్షితమైన క్రీడలను నిర్వహిస్తామంటూ (డిస్కవర్ టుమారో) పేరుతో జపాన్ ఇచ్చిన పిలుపు టోక్యోకు అవకాశం కల్పించింది. కాగా 1964లో కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించింది. రెండోసారి అవకాశం దక్కించుకున్న తొలి ఆసియా నగరం కూడా టోక్యోనే కావడం విశేషం. ఈ క్రీడల నిర్వహణకు రూ.54,087 కోట్లు ఖర్చు కాగలవని అంచనా.

ఇటలీ గ్రాండ్ ప్రి విజేత వెటెల్ఇటలీ గ్రాండ్ ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 8న జరిగిన ఈ రేసులో ఫెరారీ డ్రై వర్ ఆలోన్సో రెండో స్థానంలో, వెబెర్ మూడో స్థానంలో నిలిచారు.

నాదల్, సెరెనాలకు యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్అమెరికాలో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్ విజేతల వివరాలు..
పురుషుల సింగిల్స్: సెప్టెంబర్ 9న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించి రఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో నాదల్‌కు 3.6 మిలియన్ డాలర్ల ప్రై జ్‌మనీ ద క్కింది. ఇది నాదల్‌కు 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 

అదేవిధంగా రెండో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్.మహిళల సింగిల్స్: ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించి సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఇది సెరెనాకు ఐదో యూఎస్ ఓపెన్ టైటిల్. దీనితో సెరెనా తన కెరీర్‌లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించింది.

పురుషుల డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రేలియా), బ్రూనో సోరెస్ (బ్రెజిల్)లను ఓడించి పేస్ జంట విజేతగా నిలిచింది. పేస్‌కు ఇది కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో ఎనిమిది డబుల్స్ టైటిళ్లు కాగా, ఆరు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లు.

మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను ఆండ్రియా హవకోవా, లూసీ రడెకా (చెక్)లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో ఆస్టీగ్ బార్టీ, కాస్ డెల్లాక్వా (ఆస్ట్రేలియా)లను ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: ఆండ్రియా హవకోవా, మాక్స్‌మిర్నీ (చెక్ రిపబ్లిక్/బెలారస్)లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో అబిగెయిల్ స్పియర్స్, సాంటియాగో గోంజాలెజ్ (అమెరికా/మెక్సికో)లను ఓడించారు.

ఈతలో రికార్డు నెలకొల్పిన దియానా నయర్అమెరికాకు చెందిన స్విమ్మర్ దియానా నయర్ (64) ఫ్లోరిడా జలసంధిలో క్యూబా నుంచి ఫ్లోరిడా కీస్ వరకు 177 కి.మీ ఈది రికార్డు నెలకొల్పింది. 53 గంటలపాటు సాగిన ఆమె సాహస కత్యం సెప్టెంబర్ 2న ముగిసింది. షార్క్ కేజ్ లేకుండా చాలా దూరం సముద్రంలో ఈదిన తొలి వ్యక్తిగా దియానా రికార్డులకెక్కింది.

టి-20ల్లో అరోన్ ఫించ్ రికార్డుటీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రీడాకారుడిగా ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్ రికార్డు సష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో 63 బంతుల్లో 156 పరుగులు చేసి ఫించ్ ఈ ఘనత సాధించాడు. టీ-20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మాత్రం రిచర్డ్ లెవీ (45 బంతుల్లో) పేరిట ఉంది.

ఆసియా కప్ హాకీ విజేత దక్షిణ కొరియాఆసియా కప్ హాకీలో దక్షిణ కొరియాతో సెప్టెంబర్ 1న జరిగిన ఫైనల్లో భారత్ ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. దీంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత్‌కు సాంకేతికంగా ప్రపంచ కప్ బెర్త్ ఖాయమైంది. కాగా ఆసియా కప్‌లో శ్రీజేష్ (బెస్ట్ గోల్ కీపర్), రఘునాథ్ (బెస్ట్ అవుట్‌స్టాండింగ్ ప్లేయర్)లకు అవార్డులు లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్.. మలేసియాపై గెలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

సెపక్‌తక్రాలో భారత్‌కు కాంస్యంసొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ప్రపంచ సూపర్ సిరీస్ సెపక్‌తక్రా టోర్నమెంట్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగిన పురుషుల సెమీఫైనల్లో భారత జట్టు.. మలేసియా చేతిలో ఓడిపోయింది. మహిళల విభాగంలో భారత బందం ఏడో స్థానంలో నిలిచింది.

ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ విజేత హైదరాబాద్ హాట్‌షాట్స్ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తొలి విజేతగా పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది. ఆగస్టు 31న ముంబైలో జరిగిన ఫైనల్‌లో హాట్‌షాట్స్ 3-1తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.

పురుషుల సింగిల్స్‌ను శ్రీకాంత్ (అవధ్ వారియర్స్) గెలుచుకున్నాడు. ఫైనల్‌లో టనోంగ్‌సక్ (హైదరాబాద్)ను ఓడించాడు. రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (హైదరాబాద్), గురు సాయిదత్ (అవధ్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధూ (అవధ్ వారియర్స్)పై సైనా నెహ్వాల్ (హైదరాబాద్) గెలిచింది. పురుషుల డబుల్స్‌లో హాట్‌షాట్స్ జోడి విషెమ్‌గో - లిమ్‌కిమ్ వా, వారియర్స్‌కు చెందిన మార్కస్ కిడో - మథియాస్ బోలను ఓడించారు. టైటిల్ గెలిచిన హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు ’ 3 కోట్ల 25 ల క్షల ప్రై జ్‌మనీ దక్కింది. అవధ్ వారియర్స్‌కు ఒక కోటి 75 లక్షలు ప్రై జ్‌మనీగా లభించాయి. 

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: సైనా నెహ్వాల్
స్మాషర్ ఆఫ్ ద టోర్నమెంట్: వ్లాదిమిర్ ఇవనోవ్

డైమండ్ లీగ్‌లో బోల్ట్‌కు స్వర్ణంజ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 30న జరిగిన ఈ పోటీలో నికెల్ (జమైకా), జస్టిన్ గాట్లిన్ (అమెరికా) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

ఖేల్త్న్ర అవార్డు అందుకున్న సోధిఆయా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి వన్నె తెచ్చిన ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 31న జరిగిన కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేశారు. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్రను షూటర్ రంజన్ సింగ్ సోధి దక్కించుకున్నాడు. సోధికి ఈ అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు, పతకం, మెమొంటో అందజేశారు. వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అర్జున అవార్డుల తో సత్కరించారు. అర్జున దక్కించుకున్న వారికి రూ.5 లక్షల చొప్పున నగదు, మెమొంటో, విగ్రహం అందజేశారు.

No comments:

Post a Comment