AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు అక్టోబరు 2013

క్రీడలు అక్టోబరు 2013
తేజ్ కుమార్‌కు నేషనల్ ఛాలెంజర్స్ చెస్ టైటిల్ట్రిపుల్ గ్రాండ్ మాస్టర్ ఎంఎస్ తేజ్‌కుమార్ నేషనల్ చాలెంజర్స్ చెస్ టైటిల్ గెలుచుకున్నాడు. భోపాల్‌లో అక్టోబర్ 22న ముగిసిన పోటీల్లో తేజ్ కుమార్ టైటిల్ సాధించగా, అశ్విన్ జయరామ్ రెండో స్థానం, అక్షత్ కంపారియా మూడో స్థానం సాధించారు.

విజ్డన్ ఆల్‌టైమ్ టెస్టు జట్టులో సచిన్ప్రముఖ ప్రచురణ సంస్థ ‘విజ్డన్’ ప్రకటించిన ఆల్‌టైమ్ టెస్టు జట్టులో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే చోటు లభించింది. తమ 150వ వార్షికోత్సవం సందర్భంగా విజ్డన్ ఈ జాబితాను వెల్లడించింది. 11 మంది సభ్యుల జట్టుకు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

సెరెనాకు డబ్ల్యూటీఏ టైటిల్ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో నా లీ (చైనా)పై విజయం సాధించింది. 

ఐపీఎల్ నుంచి పుణె వారియర్స్ తొలగింపుఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి పుణే వారియర్స్‌ను తొలగించారు. ఈ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అక్టోబర్ 26న ప్రకటించింది. 2014 సీజన్‌లో ఆడేందుకు అందజేయాల్సిన రూ.170.2 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకపోవడంతో పుణె వారియర్స్‌ను తొలగించామని బీసీసీఐ పేర్కొంది. ఓవరాల్‌గా ఐపీఎల్ నుంచి తప్పుకున్న మూడో జట్టుగా పుణె పేరు తెచ్చుకుంది. గతంలో వివిధ కారణాల రీత్యా కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్‌పై కూడా వేటు పడింది. దీంతో ఐపీఎల్‌లో ఎనిమిది జట్లే మిగిలాయి. 

వెటెల్‌కు ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్ఫార్ములావన్ ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను జర్మనీకి చెందిన రెడ్‌బుల్ డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ (26) గెలుచుకున్నాడు. అక్టోబర్ 27న గ్రేటర్ నోయిడాలో జరిగిన రేసులో వెటెల్ టైటిల్ సాధించాడు. తద్వారా ఇండియన్ గ్రాండ్ ప్రిలో ఇప్పటివరకు జరిగిన మూడు రేసుల్లోనూ వెటెల్ విజేతగా నిలిచాడు. 
అంతేకాకుండా వరుసగా నాలుగు ప్రపంచ టైటిళ్లు (డ్రైవర్‌‌స చాంపియన్‌షిప్) సాధించిన నాలుగో రేసర్‌గా వెటెల్ రికార్డు సృష్టించాడు. గతంలో షూమాకర్, ఫాంగియా, అలైన్ ప్రాస్ట్ వరుసగా నాలుగు టైటిళ్లు సాధించారు. అంతేకాకుండా పిన్న వయసు (26)లోనే వరుసగా నాలుగు ప్రపంచ టైటిళ్లు సాధించిన తొలి రేసర్‌గా కూడా వెటెల్ రికార్డు సాధించాడు. ఇండియన్ గ్రాండ్ ప్రిలో నికో రోస్ బెర్గ్ (మెర్సిడెజ్) రెండో స్థానంలో, గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానంలో నిలిచారు.

హంపి జట్టుకు యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీప్రతిష్టాత్మక యూరోపియన్ క్లబ్ కప్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రాతినిధ్యం వహించిన సర్కిల్ డిచెక్స్ డి మోంటెకార్లో (మొనాకో) జట్టు విజేతగా నిలిచింది. మొనాకో జట్టుకు యూరోపియన్ క్లబ్ కప్ దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం.

వన్డేల్లో కోహ్లి రికార్డువన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 52 బంతుల్లో 100 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో వేగంగా వంద పరుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2009 లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. జైపూర్ వన్డేలో ఆస్ట్రేలియా చేసిన 359 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. తద్వారా వన్డే క్రికెట్‌లో రెండో అతిపెద్ద లక్ష్యా న్ని సాధించినటై ్లంది. 2006లో ఆస్ట్రేలియా చేసిన 434 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి ఛేదించింది. 

డింగ్ జున్ హుయ్‌కి ఇండియన్ ఓపెన్ స్నూకర్ ఇండియన్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్ టైటిల్‌ను డింగ్ జున్ హుయ్ (చైనా) గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో భారత క్రీడాకారుడు ఆదిత్య మెహతాను ఓడించాడు.

దీపికాకు మకావు ఓపెన్ స్క్వాష్ టైటిల్భారత్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్.. మకావు ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. అక్టోబర్ 20న జరిగిన మహిళల ఫైనల్లో రాచెల్ గ్రిన్హామ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. దీంతో తన కెరీర్‌లో ఏడు మహిళల స్క్వాష్ అసోసియేషన్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. 

సిమోనా హలెప్‌కు క్రెమ్లిన్ కప్రుమేనియాకు చెందిన సిమోనా హలెప్ క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టైటిల్ గెలుచుకుంది. అక్టోబర్ 20న జరిగిన ఫైనల్స్‌లో ఆమె ఆస్ట్రేలియాకు చెందిన సమంతా స్టోసుర్‌ను ఓడించింది.

దులీప్ ట్రోఫీ విజేతలుగా నార్త్, సౌత్ జోన్లుదులీప్ ట్రోఫీ విజేతలుగా నార్త్, సౌత్ జోన్‌లను సంయుక్తంగా ప్రకటించారు. కోచిలో జరిగిన ఐదు రోజుల మ్యాచ్ అక్టోబర్ 21న వర్షం వల్ల ఆగిపోవడంతో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లు విజేతలుగా నిలిచాయి. ఇలా సంయుక్త విజేతలను ప్రకటించడం ఇది నాలుగోసారి.

డిమిట్రోవ్‌కు స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను బల్గేరియాకు చెందిన గ్రిగోరో డిమిట్రోవ్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 20న స్టాక్‌హోమ్‌లో జరిగిన ఫైనల్స్‌లో డేవిడ్ ఫైను డిమిట్రోవ్ ఓడించాడు.

భారత హాకీ జట్టు కోచ్‌గా టెర్రీవాల్షభారత హాకీ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్‌ను నియమించినట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. ఆయనకు నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవముంది. 1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.

చెన్ లాంగ్‌కు డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చెన్ లాంగ్ (చైనా) విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చెన్ లాంగ్ ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. 

వార్తల్లో వ్యక్తులుఎంపీ పదవిని కోల్పోయిన రషీద్ మసూద్శిక్షకు గురైన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ తన సభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్ష వల్ల పదవి కోల్పోయిన తొలి ప్రజా ప్రతినిధి రషీద్ మసూద్. ఆయనకు అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 19న నాలుగు ఏళ్ల జైలుశిక్ష విధించింది. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకుపైన శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు (ఎంపీ, ఎంఎల్‌ఏలు) వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ కన్నుమూతప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ (87) అక్టోబర్ 18న హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరులో 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ 17వ ఏట నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. అచ్చు అయిన తొలి కథ విమల. దాదాపు 43 పిల్లల కథలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలను రాశారు. 1968, 1983ల్లో రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు, 1987లో సోవియట్‌ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆయనకు దక్కాయి. ఆయన అనేక రచనలు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రా, జేఎన్‌టీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 2012 సంవత్సరానికి గానూ ఆయన రాసిన నవల పాకుడురాళ్లుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత భరద్వాజ. గతంలో విశ్వనాథ సత్యనారాయణకు, సి.నారాయణరెడ్డిలకు జ్ఞానపీఠ్ లభించింది.

రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్ అక్టోబర్ 9న నియమితులయ్యారు. రైల్వే బోర్డు సభ్యుడిగా ఉన్న అరుణేంద్ర పదవీ విరమణ చేసిన చైర్మన్ వినయ్‌మిట్టల్ స్థానంలో జూన్ 30 నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

టెస్ట్‌ క్రికెట్‌ నుంచి వైదొలగనున్న సచిన్‌ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ (40) తన 200వ టెస్టు తర్వాత క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు అక్టోబర్‌ 10న క్రికెట్‌ బోర్డ్‌కు రాసిన లేఖలో తెలిపారు. 24 ఏళ్లుగా ఆయన క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 198 టెస్టులు ఆడారు. 200వ టెస్టు వెస్టిండీస్‌తో నవంబర్‌ 14 నుంచి 18 వరకు జరుగుతుంది. సచిన్‌ తన తొలి టెస్ట్‌ 1989 నవంబర్‌లో పాకిస్థాన్‌పై ఆడారు. టెండ్కూలర్‌ ఇప్పటికే వన్డే, టి-20ల నుంచి వైదొలిగారు. సచిన్‌ ఇప్పటివరకు ఆడిన 198 టెస్టుల్లో 15,837 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 248 నాటౌట్‌.

వెటెల్‌కు జపాన్‌ గ్రాండ్‌ ప్రిఫార్ములావన్‌ జపాన్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్‌ డ్రై వర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ గెలుచుకున్నాడు. ఇది వెటెల్‌కు వరుసగా నాలుగో టైటిల్‌. అక్టోబర్‌ 13న సుజువా (జపాన్‌)లో జరిగిన పోటీలో వెటెల్‌ మొదటి స్థానంలో నిలవగా, వెబర్‌ రెండు, గ్రోస్యెన్‌ మూడో స్థానం సాధించారు.

జకోవిచ్‌కు షాంఘై మాస్టర్‌‌స సిరీస్‌ టైటిల్‌నొవాక్‌ జకోవిచ్‌ షాంఘై ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ సాధించాడు. అక్టోబర్‌ 13న షాంఘైలో జరిగిన ఫైనల్స్‌లో డెల్‌పొట్రోను ఓడించాడు.

ఆసియా షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌కజకిస్థాన్‌లోని అల్మతిలో జరిగిన ఆసియా షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మానవాదిత్య జూనియర్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుపొందాడు. ఈ టోర్నీలో భారత్‌ రెండు స్వర్ణాలు, పలు రజతాలతోపాటు మూడు కాంస్య పతకాలు గెలుపొందింది.

ముంబై ఇండియన్స్‌కు టీ-20 టైటిల్‌చాంపియన్స్‌లీగ్‌ టీ-20 క్రికెట్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ గెలుచుకుంది. ఢిల్లీలో అక్టోబర్‌ 6న జరిగిన ఫైనల్స్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2011లో మొదటిసారి చాంపియన్స్‌లీగ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా హర్భజన్‌ సింగ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా డ్వేన్‌ స్మిత్‌ ఎంపికయ్యారు. అత్యధిక పరుగులకిచ్చే గోల్డెన్‌ బ్యాట్‌ అజింక్యా రహానే (288 పరుగులు, రాజస్థాన్‌ రాయల్స్‌), అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారుడికిచ్చే గోల్డెన్‌ వికెట్‌ ప్రవీణ్‌ తాంబే (12 వికెట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌)కు దక్కాయి.

జోకోవిచ్‌కు చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌పురుషుల సింగిల్స్‌: ైచె నా ఓపెన్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను సెర్బియాకు చెందిన జోకోవిచ్‌ సాధించాడు. అక్టోబర్‌ 6న బీజింగ్‌లో జరిగిన ఫైనల్‌లో రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. 2009, 2010, 2012లో కూడా ఈ టైటిల్‌ను జోకోవిచ్‌ గెలిచాడు.
మహిళల సింగిల్స్‌: సెరెనా విలియమ్స్‌ (అమెరికా) టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో జంకోవిచ్‌ (సెర్బియా)ను ఓడించింది. ఇది సెరెనాకు 56వ టైటిల్‌.

మహిళల డబుల్స్‌: సానియా మీర్జా (భారత్‌), కారా బ్లాక్‌ (జింబాబ్వే)లు మహిళల డబుల్స్‌ టైటిల్‌ గెలుపొందారు. వీరు ఫైనల్‌లో వెరా దుషెనివా (రష్యా), అరంటా సన్‌టోంజా (స్పెయిన్‌)ల జంటను ఓడించారు.

వెటెల్‌కు కొరియా గ్రాండ్‌ ప్రిఫార్ములావన్‌ కొరియా గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్‌ జట్టు డ్రై వర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ సాధించాడు. అక్టోబర్‌ 6న ముగిసిన రేసులో వెటెల్‌ మొదటి స్థానంలో నిలవగా, లోటస్‌ జట్టు డ్రై వర్‌ రైకోనెన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

బోపన్న జోడికి జపాన్‌ ఓపెన్‌జపాన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ను రోహన్‌ బోపన్న (భారత్‌), రోజర్‌ వాసెలిన్‌ (జపాన్‌) జోడి గెలుచుకుంది. అక్టోబర్‌ 6న జరిగిన ఫైనల్‌లో జెమీ ముర్రే (బ్రిటన్‌), జాన్‌పీర్స్‌ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించింది.

భారత్‌కు అండర్‌-19 నాలుగు దేశాల క్రికెట్‌ టైటిల్‌అండర్‌-19 నాలుగు దేశాల క్రికెట్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది. అక్టోబర్‌ 5న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను.. భారత్‌ ఓడించింది. భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జింబాబ్వే దేశాలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి.

No comments:

Post a Comment