AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు జనవరి 2013

క్రీడలు జనవరి 2013
ఆస్ట్రేలియన్ ఓపెన్-2013విజేతల వివరాలు:
పురుషుల సింగిల్స్:
 నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు. 
మహిళల సింగిల్స్: విక్టోరియా అజరెంకా (బెలారస్). ఫైనల్లో నా లీ (చైనా)పై నెగ్గింది.
పురుషుల డబుల్స్: బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జోడీ. ఫైనల్లో రాబిన్ హాస్-ఇగోర్ సిస్లింగ్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించారు. 
మహిళల డబుల్స్: సారా ఎరాని-రాబెర్టా విన్సి (ఇటలీ). ఫైనల్లో వీరు అష్లే బర్టీ-కాసీ డెల్లాకా (అమెరికా) జంటపై గెలుపొందారు.
మిక్స్‌డ్ డబుల్స్: జర్మిల్ గదసోవా-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి. ఫైనల్లో వీరు లూసీ హర్దెకా- ఫ్రాంటిసెక్ సెర్మక్ (చెక్) జంటపై గెలుపొందారు.

రంజీ విజేత ముంబైరంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను ముంబై జట్టు గెలుచుకుంది. ముంబైలో జనవరి 28న ముగిసిన ఫైనల్లో సౌరాష్ట్రపై విజయం సాధించి రికార్డు స్థాయిలో 40వసారి ఈ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. ఇదే మ్యాచ్‌లో ముంబై ఆటగాడు వసీమ్ జాఫర్ సెంచరీ సాధించడం (జనవరి 27న రెండో రోజు ఆటలో) ద్వారా రంజీ చరిత్రలో అత్యధిక 
శతకాలు (32) చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సష్టించాడు. అలాగే ఇదే టోర్నీలో అత్యధిక పరుగులు (9155) చేసిన రికార్డునూ సొంతం చేసుకున్నాడు. 

సిరీస్ విజేత భారత్ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది. సురే ష్ రైనా (భారత్) మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

నేషనల్ వాలీబాల్ చాంప్ కేరళ61వ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌ను కేరళ గెలుచుకుంది. జైపూర్‌లో జనవరి 16న జరిగిన ఫైనల్లో తమిళనాడును ఓడించింది. హర్యానాను ఓడించి ఉత్తరాఖండ్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగం టైటిల్‌ను రైల్వే జట్టు గెలుచుకుంది. ఫైనల్లో కేరళను ఓడించింది. తమిళనాడును ఓడించి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.

సిరీస్ విజేత దక్షిణాఫ్రికాన్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల క్రికెట్ టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. 

ఫెడరర్ రికార్డుఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడం ద్వారా (జనవరి 19న మ్యాచ్ జరిగింది) గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో 250వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సష్టించాడు. 17 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్లను సాధించిన రికార్డు కూడా ఫెడరర్ పేరిట ఉంది.

జాతీయ మహిళల హాకీ విజేత హర్యానాజాతీయ మహిళల (అండర్-20) హాకీ టోర్నీలో హర్యానా చాంపియన్‌గా నిలిచింది. జనవరి 16న హైదరబాద్‌లో జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై గెలుపొందింది. కర్ణాటకను ఓడించి ముంబై మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్ మెస్సీప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు అందజేసే ‘గోల్డెన్ బాల్’ (ఫిఫా-బాలాన్ డిఓర్) పురస్కారాన్ని వరుసగా నాలుగో సంవత్సరం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గెల్చుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా చరిత్ర సష్టించాడు. ఇంతకుముందు మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1983, 84, 85) వరుసగా మూడుసార్లు ఈ అవార్డును సాధించాడు. వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, బాలాన్ డి ఓర్ పురస్కారాలను విలీనం చేసి 2009 నుంచి ‘ఫిఫా బాలాన్ డి ఓర్’ అవార్డును అందజేస్తున్నారు. ‘కోచ్ ఆఫ్ ది ఇయర్’గా విసెంటే డెల్ బోస్కు (స్పెయిన్) ఎంపికయ్యారు. మహిళా ‘ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అబ్బే వాంబాచ్ (అమెరికా)కు దక్కింది.

డేవిడ్‌కు వరల్డ్ స్క్వాష్ ఫైనల్స్ టైటిల్వరల్డ్ సిరీస్ స్క్వాష్ ఫైనల్స్ మహిళల టైటిల్‌ను నికోల్ డేవిడ్ (మలేషియా) గెలుచుకుంది. జనవరి 6న లండన్‌లో జరిగిన ఫైనల్లో లారా మస్సార్ (ఇంగ్లండ్)ను ఓడించింది. పురుషుల టైటిల్‌ను అమర్ షబానా (ఈజిప్టు) గెలుచుకున్నాడు. ఫైనల్లో నిక్ మ్యాథ్యూ (ఇంగ్లండ్)ను ఓడించాడు.

జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం స్ఫూర్తి-నిఖత్ బాను జంట జాతీయ టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. జనవరి 12న రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో మధురిక పాట్కర్-పూజ సహస్రబుధే (పీఎస్‌పీబీ) జంటపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ (పీఎస్‌పీబీ) విజేతగా నిలిచాడు. తద్వారా పిన్న వయసులోనే (19 ఏళ్ల ) ఈ టైటిల్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో కెక్కాడు. ఫైనల్లో ఆచంట శరత్ కమల్‌ను ఓడించి ‘మహారాజ పీతంపుర కప్’ను, రూ. 2.30 లక్షల ప్రెజ్‌మనీని సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను శామిని (పీఎస్‌పీబీ) గెలుచుకుంది.

నేషన్స్ కప్‌లో జరీన్‌కు రజతం‘నేషన్స్ కప్’ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్ 54 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ రజత పతకం సాధించింది. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అలిసియా హోల్స్‌కన్ (నెదర్లాండ్స్) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

సిరీస్ విజేత ఆసీస్శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంతో గెలుచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్‌‌కకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు .సిరీస్ విజేత పాక్భారత్‌తో ముగిసిన మూడు వన్డే మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను పాకిస్థాన్ జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం జంషేద్ (పాకిస్థాన్)కు దక్కింది. జనవరి 6న ఢిల్లీలో జరిగిన చివరి మ్యాచ్‌తో భారత కెప్టెన్ ధోనీ వన్డేల్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత కీపర్‌గా నిలిచాడు. 

నేషనల్ బాస్కెట్ బాల్ చాంప్ ఉత్తరాఖండ్63వ నేషనల్ బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను ఉత్తరాఖండ్ గెలుచుకుంది. లూథియాన (పంజాబ్) లో జనవరి 4న ముగిసిన టోర్నీలో పంజాబ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో తమిళనాడును ఓడించి రైల్వేస్ విజేతగా నిలిచింది.

చెన్నై ఓపెన్ విజేత టిప్సరెవిచ్చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో యాంకో టిప్సరెవిచ్ (సెర్బియా) విజేతగా నిలిచాడు. జనవరి 6న ఫైనల్లో రాబెర్టో బటిస్టా అగుట్ (స్పెయిన్)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను వావ్రింకా (స్విట్జర్లాండ్)-పెయిర్ (ఫ్రాన్స్) జోడి దక్కించుకుంది.

సియట్ 2011-12 క్రికెట్ అవార్డులుఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్: విరాట్ కోహ్లి (భారత్)
ఉత్తమ అంతర్జాతీయ జట్టు: పాకిస్థాన్
భారత ఉత్తమ వర్థమాన 
క్రికెటర్: ఉన్ముక్త్ చంద్ 

బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. ఫైనల్లో గ్రీగోర్ డిమిట్రోవ్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరీనా విలియమ్స్ గెలుచుకుంది. పురుషుల డబుల్స్ విభాగంలో మార్సిలో మెలో-టోమీ రొబ్రెడో జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో వీరు ఎరిక్ బుటోరాక్-పౌల్ హాన్లే జంటపై విజయం సాధించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా-బెథానీ మాటెక్ జంట గెలుచుకున్నారు. ఫైనల్లో వీరు అనాలెనా గ్రొనెఫీల్డ్, క్వెటా పశ్‌కె జంటపై విజయం సాధించారు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ఆస్ట్రేలియా పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఈ గౌరవం పొందిన 70వ క్రికెటర్ మెక్‌గ్రాత్. 2012-13 సీజన్‌లో బ్రియాన్ లారా, బేక్‌వెల్‌లకు కూడా ఈ గౌరవం దక్కింది.

No comments:

Post a Comment