క్రీడలు నవంబరు 2012
ఏటీపీ టూర్ విజేత జకోవిచ్ఏటీపీ ప్రపంచ టూర్ టెన్నిస్ టోర్నమెంట్‌ను సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. లండన్‌లో జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో గ్రానొలర్స్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడి విజేతగా నిలిచింది. ఫైనల్లో మహేష్ భూపతి-రోహన్ బోపన్న జంటపై విజయం సాధించింది.
అండర్-10 ప్రపంచ చెస్ చాంప్ ప్రియాంకఅండర్-10 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రియాంక గెలుచుకుంది. స్లొవేనియాలోని మారిబోర్‌లో ముగిసిన టోర్నమెంట్‌లో ప్రియాంక ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కోనేరు హంపి (1997, 1998, 2000, 2001), హరికృష్ణ (1996, 2004), ద్రోణవల్లి హారిక (2004, 2006, 2008), సహజశ్రీ (2006) జూనియర్, యూత్ విభాగాలలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సాధించారు.
చెక్ రిపబ్లిక్‌కు డేవిస్ కప్డేవిస్‌కప్ వందో ఎడిషన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను చెక్ రిపబ్లిక్ గెలుచుకుంది. ప్రేగ్‌లో నవంబర్ 19న ముగిసిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. ఈ విజయంతో ఒకే సంవత్సరం డేవిస్ కప్, ఫెడ్ కప్, హాఫ్‌మాన్ కప్ గెలుచుకున్న తొలి దేశంగా చెక్ అవతరించింది. స్వతంత్ర దేశంగా డేవిస్‌కప్‌ను అందుకోవడం చెక్‌కు ఇదే తొలిసారి. 32 ఏళ్ల క్రితం (1980లో) చెక్‌స్లోవేకియా ఈ టైటిల్ నెగ్గింది. 1993లో చెక్‌స్లోవేకియా.. చెక్, స్లోవేకియా అనే రెండు దేశాలుగా విడిపోయింది.
అజహరుద్దీన్‌పై నిషేధం ఎత్తివేతభారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 8న రద్దు చేసింది. ఫిక్సింగ్ ఆరోపణలతో అజహరుద్దీన్‌పై వేటు వేసిన బీసీసీఐ... అందుకు అవసరమైన ఆధారాలను మాత్రం చూపలేకపోయిందని హైకోర్టు స్పష్టం చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ 2000 సంవత్సరం డిసెంబర్ 5న అజహరుద్దీన్‌పై జీవిత కాల నిషేధం విధించింది. ఇదే కేసులో క్రికెటర్లు అజయ్‌శర్మలపై జీవిత కాలం నిషేధం, అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్, ఫిజియో అలీ ఇరానీలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
2019 ఆసియా క్రీడలకు హనోయ్ ఆతిథ్యంవియత్నాం రాజధాని హనోయ్ నగరం 2019 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈమేరకు నవంబర్ 8న మకావు (హంకాంగ్)లో జరిగిన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ క్రీడలు 2018లో జరగాల్సి ఉన్నా.. 2020 సమ్మర్ ఒలింపిక్స్ దృష్ట్యా వాటికి సంవత్సరం ముందు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆసియా క్రీడలను 2019 సంవత్సరానికి మార్చారు. 2014లో జరిగే తదుపరి ఆసియా క్రీడలకు దక్షిణ కొరియాలోని ఇంచియోన్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
సైనా ఆటోబయోగ్రఫీభారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ టు విన్- మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్’ పుస్తకాన్ని నవంబర్ 7న హైదరాబాద్‌లో డబుల్ ఒలింపియన్, షూటర్ గగన్ నారంగ్ ఆవిష్కరించాడు.
‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ స్వీకరించిన సచిన్ముంబైలో నవంబర్ 6న జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అందుకున్నా డు. ఆస్ట్రేలియా కళల మంత్రి సైమన్ క్రీన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. క్లైవ్ లాయిడ్, గ్యారీ సోబర్స్, బ్రియాన్ లారా తర్వాత ఈ పురస్కారం అందుకున్న నాలుగో విదేశీ క్రికెటర్ సచిన్. ఈ అవార్డు పొందిన రెండో భారతీయుడు సచిన్. మొదటి భారతీయుడు మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జి. ఈయనకు 2006లో ఈ పురస్కారం దక్కింది.
భారత మహిళలకు ఆసియా కప్ ట్వంటీ-20ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. గ్వాంగ్ జౌ(చైనా) లో అక్టోబర్ 31న ముగిసిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌ను తొలిసారి నిర్వహించారు. బిస్మో మరూఫ్ (పాకిస్థాన్) ‘ఉమెన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైంది.
భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా దినేష్‌రెడ్డిభారత హాకీ సమాఖ్య(ఐ.హెచ్.ఎఫ్) అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ హాకీ సంఘం అధ్యక్షుడు వి.దినేష్‌రెడ్డి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో నవంబర్ 5న జరిగిన సమాఖ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. 2014 వరకూ ఈయన ఈ పదవిలో ఉంటారు. దక్షిణ భారతదేశం నుంచి.. రామస్వామి, ఆర్‌కే శెట్టి తర్వాత ఈ పదవి చేపట్టిన మూడో వ్యక్తి దినేష్ రెడ్డి.
ఆసియా కప్ కబడ్డీ విజేత పాకిస్థాన్ఆసియా కప్ కబడ్డీ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారు. లాహోర్‌లో నవంబన్ 5న జరిగిన ఫైనల్లోంచి.. అధికారుల తీరుకు నిరసనగా భార త్ తప్పుకోవడంతో పాక్ జట్టు విజేతగా నిలిచింది.
చెక్ రిపబ్లిక్‌కు ఫెడ్‌కప్ టైటిల్ఫెడ్‌కప్ టెన్నిస్ టైటిల్ చెక్ రిపబ్లిక్ గెలుచుకుంది. ప్రేగ్‌లో నవ ంబర్ 4న జరిగిన ఫైనల్లో సెర్బియాను చెక్ ఓడించింది.
రైకోనెన్‌కు అబుదాబి గ్రాండ్ ప్రిఫార్ములా ఒన్ అబుదాబి గ్రాండ్ ప్రి రేసులో లోటస్ జట్టు డ్రైవర్ రైకోనెన్ విజయం సాధించాడు. అబుదాబిలో నవంబర్ 4న ముగిసిన పోటీలో అలోన్సో రెండో స్థానంలో, వెటెల్ మూడోస్థానంలో నిలిచారు.
పారిస్ మాస్టర్ టెన్నిస్ టోర్నీపారిస్ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహేష్ భూపతి-రోహన్ బోపన్న జోడీ గెలుచుకుంది. పారిస్‌లో నవంబర్ 4న జరిగిన ఫైనల్లో ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ-జీన్ జూలియన్ రోజర్ జోడీపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డేవిడ్ ఫై గెలుచుకున్నాడు.
ఒలింపిక్ విజేతలకు డాక్టరేట్లులండన్ ఒలింపిక్స్ పతక విజేతలు సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, విజయ్ కుమార్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, మేరీకామ్‌లకు ఉత్తరప్రదేశ్‌లోని మంగళయతన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది
కోహ్లికి పాలి ఉమ్రిగర్ పురస్కారంభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అందజేసే ప్రతిష్టాత్మక పాలి ఉమ్రిగర్ అవార్డుకు యువ క్రికెటర్ విరాట్ కోహ్లి ఎంపికయ్యారు. నవంబర్ 21న ముంబైలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 5 లక్షల చెక్‌ను ఇవ్వనున్నారు.

No comments:
Post a Comment