AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు నవంబరు 2014

అవార్డులు నవంబరు 2014
బిలాల్ తన్వీర్‌కు శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్లాహోర్‌కు చెందిన రచయిత బిలాల్ తన్వీర్‌కు శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్-2014 లభించింది. ఆయన రాసిన నవల ద స్కాటర్ హియర్ ఈజ్ టూ గ్రేట్‌కు ఈ బహుమతి దక్కింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో డిసెంబర్ 2న ఆయన అందుకున్నారు. అవార్డు కింద రూ. 2 లక్షల నగదు బహుకరించారు.
ప్రొ.శ్రీనాథ్‌రెడ్డికి లండన్ యూనివర్సిటీ డాక్టరేట్భారతీయ ప్రజారోగ్య సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డికి లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ డాక్టరేట్‌ను నవంబరు 26న యూనివర్సిటీ ఛాన్స్‌లర్ బ్రిటిష్ యువరాణి ప్రదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనాథ్‌రెడ్డి ప్రజారోగ్యం, గుండె సంబంధ వ్యాధులపై అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. 
లెవియాథన్ చిత్రానికి బంగారు నెమలి అవార్డుగోవా రాజధాని పనాజీలో 11 రోజుల పాటు జరిగిన 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఐఎఫ్‌ఐఎఫ్‌ఐ - ఇఫీ) నవంబరు 30న ముగిశాయి.
అవార్డులు-విజేతలు:
  • ఉత్తమ చిత్రం (బంగారు నెమలి): లెవియాథన్ (రష్యా)
  • ఉత్తమ దర్శకుడు: నదావ్ లాపిడ్ (ఇజ్రాయ్ చిత్రం కిండర్ గార్డెన్ టీచర్ దర్శకత్వానికి)
  • స్పెషల్ జ్యూరీ, సెంటినరీ అవార్డు: శ్రీహరి సాథె (భారతీయ చిత్రం: ఎక్ హజరాచీ నోట్‌కి దర్శకత్వానికి)
  • ఉత్తమ నటుడు: అలెక్సెల్ సెరిబ్రియాకోవ్ (లెవియాథన్ హీరో), దులాల్ సర్కార్ (బెంగాళీ చిత్రం: చోటోదర్ చోబీ) లు సంయుక్తంగా అందుకున్నారు.
  • ఉత్తమ నటి: క్యూబన్ నటి ఎరీనా రోడ్రిగ్ (చిత్రం: బిహేవియర్), సరిత్ లారీ (ఇజ్రాయ్ చిత్రం: కిండర్ గార్డెన్ టీచర్)లు సంయుక్తంగా అందుకున్నారు.
ఏపీ జెన్‌కోకు స్కాచ్ 2014 అవార్డుఏపీ జెన్‌కోకు స్కాచ్ 2014 అవార్డు లభించింది. దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో భాగస్వామి అవుతూనే మెరుగైన పనితీరు కనబరిచినందుకుగాను ఈ అవార్డు ను ప్రకటించారు.

ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతిఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి-2014కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంపికైంది. మార్స్ ఆర్బిట ర్ మిషన్ (మామ్)తో అద్భుతమైన విజయాన్ని సాధించడం, అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వినియో గించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఇస్రోను ఎంపిక చేసినట్లు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన ఏర్పడిన న్యాయ నిర్ణేతల బృందం తెలిపింది. ఈ అవార్డును 2013 సంవత్సరానికి జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అందుకున్నారు. 

నేహా గుప్తాకు అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతిభారత-అమెరికన్ నేహా గుప్తా (18)కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి-2014 లభించింది. భారత్‌లో అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. పిల్లల హక్కుల కోసం కృషి చేసినవారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2012లో పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్ ఈ అవార్డును అందుకున్నారు. 

గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారంనటుడు, సాహితీ వేత్త గొల్లపూడి మారుతీరావు 2014 సంవత్సరానికి లోక్‌నాయక్ పురస్కారానికి ఎంపిక య్యారు. ఈ అవార్డును లోక్‌నాయక్ ఫౌండేషన్ 2005 నుంచి అందిస్తోంది. 

అచ్యుతా సమంతకు గుసి శాంతి బహుమతిసంఘ సంస్కర్త, కిట్,కిస్ విద్యాసంస్థల వ్యవస్థాప కుడు అచ్యుతాసమంత 2014 గుసి శాంతి బహుమతి కి ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన గుసి పీస్ ప్రైజ్ ఇంటర్నేషనల్ దీన్ని అందిస్తోంది. జీవ కారుణ్య వాదం, విద్య ద్వారా పేదరిక నిర్మూలనలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.

రజనీకాంత్‌కు ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుప్రముఖ నటుడు రజనీకాంత్‌కు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఈ సెంటినరీ అవార్డుకు రజనీకాంత్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ నవంబరు 11న ప్రకటించింది. 

ఎస్.ఎల్.గోస్వామికి స్వామినాథన్ అవార్డుప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుందర్‌లాల్ గోస్వామికి 2014 ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డును ప్రకటించారు. డాక్టర్ గోస్వామి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ మాజీ అధ్యక్షుడు. వ్యవసాయం, జంతు, మత్స్య సంబంధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రెండేళ్లకోసారి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 

సెయిల్ చైర్మన్‌కు జె.ఆర్.డి.టాటా అవార్డు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్ సి.ఎస్.వర్మకు 2014 ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డు లభించింది. లోహ పరిశ్రమ కంపెనీ నిర్వహణలో నైపుణ్యం, పనితీరును కనబరిచినందుకు కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. 

ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్ పురస్కారంహైదరాబాద్‌లోని భారత రసాయన పరిశోధన సంస్థ (ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త, ప్రకృతి ఉత్పత్తుల విభాగాధిపతి శ్రీవారి చంద్రశేఖర్ 2014 సంవత్సరానికి ఇన్ఫోసిస్ పురస్కారానికి ఎంపికయ్యారు. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది.

ఉత్తమ కేంద్రీయ వర్సిటీకి రాష్ట్రపతి అవార్డుఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘విజిటర్స్’ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని(విజిటర్)గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ. లక్ష చొప్పున నగదు అందజేస్తారు.

మన్మోహన్‌సింగ్‌కు జపాన్ పురస్కారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్‌కు ఎంపికయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతలో మన్మోహన్ కృషిని ఆ దేశం గుర్తించింది. ఈ గౌరవం లభించిన తొలి భారతీయుడు మన్మోహన్‌సింగ్.

మలాలాకు ప్రపంచ బాలల అవార్డు నోబెల్ శాంతి బహుమతి విజేత, పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ ప్రపంచ బాలల అవార్డు (వరల్డ్ చిల్డ్రన్స్ ప్రైజ్ )ను అక్టోబరు 29న స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో అందుకున్నారు. బాలల నోబెల్‌గా పిలిచే ఈ అవార్డును 2000లో ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment