అవార్డులు మార్చి 2017
6వ జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు6వ జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులను న్యూఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మార్చి 22న ప్రదానం చేశారు. వివిధ కేటగిరీల్లో మొత్తం 13 మందికి అవార్డులు అందజేశారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును రఘురాయ్ అందుకోగా విజయవాడకు చెందిన సీహెచ్.నారాయణరావు ప్రొఫెషనల్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : 6వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : సీహెచ్ నారాయణ, రఘురాయ్
ఎక్కడ : న్యూఢిల్లీలో
హైదరాబాద్ శాస్త్రవేత్తలకు డీఆర్‌డీఓ అవార్డులు 2015కు సంబంధించిన డీఆర్‌డీఓ అవార్డులను మార్చి 24న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ల్యాబ్, బృంద, వ్యక్తిగత విభాగాల్లో అందజేసిన 11 అవార్డుల్లో ఎక్కువ భాగం హైదరాబాద్ డీఆర్‌డీఓలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు దక్కాయి.
అవార్డుల గ్రహీతలు జీవనసాఫల్య పురస్కారం - శ్రీనివాస్ రెడ్డి (డీఆర్‌డీఓ ఇమారత్‌లో ఫెలో)
సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ - డి.లక్ష్మీనారాయణ (ఏఎస్‌ఎల్ ప్రాజెక్టు డెరైక్టర్), ఏపీ వర్దన్ (డీఆర్‌డీఎల్ పరిశోధకుడు)
సిలికాన్ ట్రోఫీ - ఏఎస్‌ఎల్ (ఉత్తమ లేబోరేటరీ వ్యవస్థ)
ఔట్ స్టాండింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ - అస్త్రకార్యక్రమ డెరైక్టర్ ఎస్. వేణుగోపాల్ బృందం
అగ్ని ఎక్సలెన్స్ అవార్డు - మనోజ్‌కుమార్ అండ్ టీమ్ ( అగ్ని మిషన్)
ప్రత్యేక పురస్కారం - ఎం కణ్నన్ అండ్ టీమ్ ( ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఫర్ షిప్ అప్లికేషన్ డిజైన్, డెవలప్‌మెంట్, డెలివరీ)
క్విక్ రివ్యూ:ఏమిటి : డీఆర్‌డీఓ అవార్డులు - 2015
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : కేంద్ర రక్షణ శాఖ
ఎక్కడ : న్యూఢిల్లీలో
గురిందర్ చాడాకు సిక్కు జువెల్ అవార్డు 2017 భారత సంతతికి చెందిన బ్రిటీష్ డెరైక్టర్ గురిందర్ చాడా సిక్కు జువెల్ అవార్డు - 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు మార్చి 26న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ ఆయనకు ఈ అవార్డు బహుకరించింది. భాజీ ఆన్ ద బీచ్, బెండ్ ఇట్ బెక్‌హామ్, బ్రైడ్ అండ్ ప్రిజుడైస్ వంటి చిత్రాలకు గురిందర్ దర్శకత్వం వహించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : సిక్కు జువెల్ అవార్డు 2017
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : గురిందర్ చాడా
ఎక్కడ : లండన్
తెలుగు వైద్యులకు బీసీ రాయ్ పురస్కారం2014, 2015, 2016 సంవత్సరాలకు గాను బీసీ రాయ్ పురస్కారాలను మార్చి 28న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. 2014 ఏడాదికిగానూ రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా.కర్రి రామారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్య అధ్యాపకులు డా. పీవీఎల్‌ఎన్ మూర్తి పురస్కారం అందుకున్నారు. 2016కు గాను హైదరాబాద్‌కు చెందిన కేన్సర్ వైద్యులు డా.రఘురాం, వైద్య రంగంలో ప్రతిభను ప్రోత్సహించే విభాగంలో విశాఖకు చెందిన డా.రఘునాథరావు అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలుగు వైద్యులకు బీసీ రాయ్ పురస్కారాలు
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : 2014- డా.కర్రి రామారెడ్డి, పీవీఎల్‌ఎన్ మూర్తి
2016 - డా.రఘురాం, డా, రఘునాథరావు
ఎందుకు : వైద్య రంగంలో చేసిన సేవలకు గాను
న్యాక్‌కు బంగారు నెమలి పురస్కారం ఉన్నత శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ (ఐఓడీ) బంగారు నెమలి పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ శిక్షణ ప్రమాణాలు పాటించినందుకు గాను 2017 పురస్కారానికి న్యాక్‌ను ఎంపిక చేసినట్లు ఐఓడీ మార్చి 28న ప్రకటించింది. ఏప్రిల్ 19న దుబాయ్‌లో జరిగే కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్ జనరల్ భిక్షపతి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ బంగారు నెమలి పురస్కారం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్
ఎందుకు : ఉత్తమ శిక్షణ ప్రమాణాలు పాటించినందుకు
కన్నడ దర్శకుడు హేమంతరావుకి గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుకన్నడ చిత్ర దర్శకుడు హేమంతరావు గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు- 2016కు ఎంపికయ్యారు. ఈ మేరకు గొల్లపూడి శ్రీనివాస్ మెమోరి యల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు మార్చి 16న ఈ విషయాన్ని ప్రకటించారు. ‘గొంధి బన్నా సాధరణ మైకట్టు’ అనే చిత్రానికి గాను హేమంతరావుని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ 20 ఏళ్లుగా ఈ అవార్డుని అందజేస్తోంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు-2016
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : కన్నడ దర్శకుడు హేమంతరావు
ఎందుకు : గొంధి బన్నా సాధరణ మైకట్టు అనే చిత్రానికి
ఇండో అమెరికన్స్‌కు జూనియర్ నోబెల్ ప్రైజ్ శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ద పబ్లిక్ (ఎస్‌ఎస్‌పీ) పురస్కారం-2017కు ఇండో అమెరికన్‌లు ఇంద్రాణి దాస్, అర్జున్ రమణీలు ఎంపికయ్యారు. మెదడుకు అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాధులను నయం చేసే పరిశోధనకుగాను ఇంద్రాణి దాస్ మొదటిస్థానంలో నిలిచి రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకోగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పరిశోధనకుగాను అర్జున్ రమణీ మూడోస్థానంలో నిలిచి లక్షన్నర డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు.
సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకుగాను 1942లో ఈ అవార్డుని ప్రారంభించారు. 1998 నుంచి ఈ పురస్కారం కింద ఇచ్చే నగదును ఇంటెల్ సంస్థ అందజేస్తోంది. ఈ అవార్డుని జూనియర్ నోబెల్ ప్రైజ్‌గానూ పిలుస్తారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ద పబ్లిక్(ఎస్‌ఎస్‌పీ) పురస్కారం-2017
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : ఇంద్రాణి దాస్, అర్జున్ రమణీ (ఇండో అమెరికన్‌లు)
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలను
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్టార్ పెర్ఫార్మర్ అవార్డు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్టార్ పెర్ఫార్మర్ అవార్డు లభించింది. ఈ మేరకు మార్చి 17న చెన్నైలో జరిగిన 48వ ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ సోర్సింగ్ షో (ఐఈఎస్‌ఎస్) సదస్సులో సంస్థ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 2015-16లో రూ.1,192 కోట్ల టర్నోవర్‌తో 5.68 లక్షల టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా 38 శాతం వృద్ధి సాధించింది. దీంతో ఐరన్ అండ్ స్టీల్ కేటగిరీలో స్టీల్‌ప్లాంట్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్‌ట్స ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏటా ఎగుమతుల్లో వృద్ధి సాధించిన సంస్థలకు ఈ అవార్డులు అందచేస్తారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్టార్ పెర్ఫార్మర్ అవార్డు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ
ఎందుకు : ఎగుమతుల్లో వృద్ధి సాధించినందుకు
అన్షుమాలీకి ఎన్‌సీఎఫ్ కెరీర్ అవార్డు ఇండో అమెరికన్ అన్షుమాలీ శ్రీవాస్తవ నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్‌సీఎఫ్) అందజేసే ప్రతిష్టాత్మక ‘కెరీర్’ అవార్డు 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు మార్చి 19న ఎన్‌సీఎఫ్ ఈ విషయాన్ని ప్రకటించింది. మెషీన్ లెర్నింగ్ ప్రాసెస్‌లో కొత్త విధానాన్ని రూపొందించినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు అమెరికాకు చెందిన ఎన్‌సీఎఫ్ ఏటా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 400 మంది స్కాలర్లను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది.
ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి గణితంలో ఎంఎస్‌ను పూర్తిచేసిన శ్రీవాస్తవ అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎన్‌సీఎఫ్ కెరీర్ అవార్డు 2017
ఎప్పుడు : మార్చి 19
ఎక్కడ : అమెరికా
ఎవరు : అన్షుమాలీ శ్రీవాస్తవ
ఎందుకు : మెషీన్ లెర్నింగ్ ప్రాసెస్‌లో కొత్త విధానాన్ని రూపొందించినందుకు
అక్కినేని అమలకు నారీశక్తి పురస్కారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘నారీశక్తి పురస్కార్’లను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 31 మంది మహిళలు పురస్కారాలు అందుకున్నారు. సమాజ సేవ విభాగంలో నటి అక్కినేని అమలకు ఈ అవార్డు దక్కింది.
అవార్డు గ్రహీతలు
క్విక్ రివ్యూ:ఏమిటి : నారీశక్తి పురస్కార్ 2017
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ :రాష్ట్రపతిభవన్, న్యూఢిల్లీ
ఎవరు : 31 మంది మహిళలకు అవార్డులు
ఎందుకు : వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు
ఏపీజీవీబీకి నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్‌స అవార్డు-2016ని కై వసం చేసుకుంది. రీజినల్ రూరల్ బ్యాంక్స్ అన్నింటిలోకెల్లా అధిక సంఖ్యాక ఏటీఎం లావాదేవీలు ప్రాతిపదికన ఏపీజీవీబీ ఈ అవార్డు దక్కింది. ఎన్‌పీసీఐ ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్.విశ్వనాథన్ చేతుల మీదుగా బ్యాంక్ చీఫ్ మేనేజర్ (ఐటీ) శ్రీధర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఏపీజీవీబీకి ఎన్‌పీసీ అవార్డు
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ :ముంబై
ఎవరు : నేషనల్ పేమెంట్స్కార్పొరేషన్
ఎందుకు : గ్రామీణ స్థాయిలో అత్యధిక ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు
ఏపీజీబీకి ఎన్‌పీసీ ఎక్సలెన్‌స అవార్డుఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు (ఏపీజీబీ) నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్‌స అవార్డు దక్కింది. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను బ్యాంకుకు ఈ అవార్డు లభించింది. ఈ మేరకు మార్చి 8న ముంబైలో జరిగిన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్.విశ్వనాథన్ నుంచి బ్యాంకు చైర్మన్ డి.సంపత్ కుమార్ చారీ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఏపీజీబీకి ఎన్‌పీసీ ఎక్సలెన్‌స అవార్డు
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ :ముంబై
ఎవరు : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్
ఎందుకు : ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో ప్రతిభ క నబరిచినందుకు
అమితాబ్, అలియాభట్‌కు జీ సినీ అవార్డులు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటి అలియా భట్ జీ సినీ అవార్డుల్లో అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్నారు. ఈ మేరకు మార్చి 12న ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వీరు అవార్డులు అందుకున్నారు. ‘పింక్’ చిత్రంలో నటనకు గాను అమితాబ్‌కు ఉత్తమ నటుడి పురస్కారం దక్కగా, ఉడ్‌తా పంజాబ్ సినిమాలో మత్తు పదార్థాలకు బానిసైన యువతిగా కనబర్చిన అద్భుత నటనకుగాను అలియాకు ఉత్తమ నటి పురస్కారం దక్కింది. పింక్ చిత్రానికి ఉత్తమ చిత్రంతోపాటు బెస్ట్ డైలాగ్ అవార్డు కూడా దక్కింది.
ఆమిర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రం అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. నీరజ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ మాధ్వానీ ఉత్తమ దర్శకుడిగా అవార్డునందుకోగా ఈ చిత్రానికి మొత్తం ఆరు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ తెరంగేట్ర నటుడిగా జిమ్ సర్భా, ఉత్తమ సహాయ నటుడిగా షబానా ఆజ్మీ అవార్డులందుకున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీనటులుగా సల్మాన్, అనుష్కలు నిలిచారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : జీ సినీ అవార్డులు 2017
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ఉత్తమ నటుడు-అమితాబ్, ఉత్తమ నటి- అలియా భట్
ఎల్‌జీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ మేరకు మార్చి 14న ఆ సంస్థ ప్రకటించింది. ‘కర్‌సలామ్’ పేరుతో సైనికులకు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టిన ఎల్‌జీకి 1,14,741లకుపైగా లిఖిత పూర్వక సందేశాలు వచ్చాయి. ఇలా వచ్చిన స్టికీ నోట్స్‌తో అతిపెద్ద వరుస సృష్టించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. కార్యక్రమంలో భాగంగా ఎల్‌జీ హోంశాఖకు రూ.కోటి విరాళం అందించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎల్‌జీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్
ఎప్పుడు : మార్చి 14
ఎందుకు : కర్‌సలామ్ కార్యక్రమం ద్వారా లక్షకుపైగా సందేశాలతో అతిపెద్ద వరుస రూపొందించినందుకు
డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డుఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని ధన్వంతరి అవార్డు 2017 వరించింది. ఈ మేరకు మార్చి 14న ధన్వంతరి మెడికల్ ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 26న ముంబైలో జరిగే కార్యక్రమంలో 44వ ధన్వంతరి అవార్డును మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు చేతుల మీదుగా నాగేశ్వర్‌రెడ్డి అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : డా.నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : ధన్వంతరి ఫౌండేషన్
ఎందుకు : వైద్య సేవల్లో చేసిన కృషికి గుర్తింపుగా
శిల్పి హర్షవర్ధన్‌కు ఆస్ట్రేలియా పురస్కారంఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డ ప్రతిష్టాత్మక రియో టింటో స్కల్ప్చర్ అవార్డ్ - 2017ను గెలుచుకున్నారు. ఈ మేరకు మార్చి 3 నుంచి 20 వరకూ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగే పోటీలో ‘విజువల్ డైనమిక్స్ ఆఫ్ యాన్ ఆడియో వేవ్’ అంశంలో హర్షవర్ధన్ తయారుచేసిన కాలమ్ ఆఫ్ సౌండ్ (ధ్వని స్తంభం) శిల్పానికి ఈ అవార్డు లభించింది. అవార్డు కింద ఆయన 50,000 డాలర్లు అందుకున్నారు. ఈ పోటీలను గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : శిల్పి హర్షవర్ధన్ దురుగడకు రియో టింటో స్కల్ప్చర్ అవార్డ్
ఎప్పుడు : మార్చి 3న ప్రారంభమైన పోటీలో
ఎవరు : రియో టింటో గ్రూప్
ఎక్కడ : ఆస్ట్రేలియా
ఎందుకు : కాలమ్ ఆఫ్ సౌండ్ శిల్పానికి
బీసీసీఐ పురస్కారాలు - 2017 2015-16 సీజన్‌కు గాను బీసీసీఐ వార్షిక అవార్డులను మార్చి 1న ప్రకటించింది. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రీగర్ అవార్డుకు భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడోసారి ఎంపికయ్యాడు. దీంతో ఈ అవార్డును మూడుసార్లు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 2011-12, 2014-15లో కూడా కోహ్లీ ఉమ్రీగర్ అవార్డును గెలుచుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడికి ఈ అవార్డును అందజేస్తారు.
అవార్డుల విజేతలు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం : రాజిందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్, శాంతా రంగస్వామి(మహిళా క్రికెటర్)
బీసీసీఐ ప్రత్యేక అవార్డు: వీవీ కుమార్, రమాకాంత్ దేశాయ్ (దివంగత)
పాలీ ఉమ్రీగర్ అవార్డు : విరాట్ కోహ్లీ
దిలీప్ సర్దేశాయ్ అవార్డు : రవిచంద్రన్ అశ్విన్
జగ్మోహన్ దాల్మియా అవార్డు(ఉత్తమ మహిళా క్రికెటర్): మిథాలీ రాజ్
జగ్మోహన్ దాల్మియా అవార్డు(ఉత్తమ మహిళా క్రికెటర్ జూనియర్): దీప్తి శర్మా (ఉత్తరప్రదేశ్)
అమర్‌నాథ్ అవార్డు(రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్‌రౌండర్): జలజ్ సక్సేనా (మధ్యప్రదేశ్)
అమర్‌నాథ్ అవార్డు(దేశవాలీ నిర్ణీత ఓవర్ల క్రికెట్ ఉత్తమ ఆల్‌రౌండర్): అక్షర్ పటేల్ (గుజరాత్)
మాదవరావ్ సిందిన్ అవార్డు(రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు): శ్రేయాస్ అయ్యర్ (ముంబై)
ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ(సీకే నాయుడు U-23 ట్రోఫీలో అత్యధిక పరుగులు): జేయ్. జి. బోస్తా (ముంబై)
ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ(సీకే నాయుడు U-23 ట్రోఫీలో అత్యధిక వికెట్లు): సత్యజీత్ బచాల్ (మహారాష్ట్ర)
ఎన్‌కేపీ సాల్వే అవార్డు ( U-19 కూచ్ బెహర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు): అర్మాన్ జాఫర్ (ముంబై)
ఎన్‌కేపీ సాల్వే అవార్డు ( U-19 కూచ్ బెహర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు): నినద్ రథ్వా (బరోడా)
రాజ్‌సింగ్ దుంగార్పూర్ అవార్డు (U-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగలు): అభిషేక్ శర్మా (పంజాబ్)
రాజ్‌సింగ్ దుంగార్పూర్ అవార్డు (U-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు): అభిషేక్ శర్మా (పంజాబ్)
ఉత్తమ ఎంపైర్ ( దేశవాలీ క్రికెట్): నితిన్ మీనన్
బీసీసీఐ దేశవాలీ టోర్నీల్లో ఉత్తమ ప్రతిభ : ముంబై క్రికెట్ అసోసియేషన్
నంది అవార్డులు 2012, 2013 2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1న నంది అవార్డుల (ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు) ను ప్రకటించింది. పలు కారణాలతో గత ఐదేళ్లుగా ఈ అవార్డులను ప్రకటించలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సింహ పేరుతో చలన చిత్ర అవార్డులు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను కొనసాగించాలని నిర్ణయించింది.
2012 సంవత్సరానికి సీనియర్ నటి జయసుధ, 2013 సంవత్సరానికి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రెండు కమిటీలు ఎంట్రీలను పరిశీలించి, విజేతలను నిర్ణయించాయి. 2012 ఉత్తమ చిత్రంగా ఈగ ఎంపిక కాగా 2013 ఉత్తమ చిత్రం అవార్డు మిర్చి సినిమాకు దక్కింది. 2012లో ఉత్తమ జాతీయ సమైక్యత, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ బాలల చిత్రాల విభాగాల్లో ఎవరికీ అవార్డు దక్కలేదు. 2013లో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో ఎవరికీ అవార్డు రాలేదు.
2012 నంది అవార్డుల విజేతలు
2013 నంది అవార్డుల విజేతలు
క్రిస్టినా గ్రిమ్మీకి టీన్‌స చాయిస్ అవార్డు 2017 టీన్‌స చాయిస్ అవార్డు ప్రముఖ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీకి దక్కింది. 2016 జూన్‌లో ఓర్లాండలోని ఓ నైట్ క్లబ్‌పై సాయుధుడు జరిపిన కాల్పుల్లో క్రిస్టినా మరణించింది. మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో క్రిస్టినా తరపున ఆమె కుటుంబ సభ్యులు టీన్స్ చాయిస్ అవార్డు అందుకున్నారు.
జేఎన్‌యూకు ఉత్తమ వర్సిటీ అవార్డు 2017 విజిటర్స్ అవార్డులను రాష్ట్రపతి భవన్ మార్చి 2న ప్రకటించింది. ఉత్తమ విశ్వవిద్యాలయం పురస్కారం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-JNUకు దక్కింది. ఈ నెల 6న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్రీయ వర్సిటీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2014లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులను ప్రారంభించారు.
అవార్డుల విజేతలు విజిటర్స్ అవార్డు ఫర్ బెస్ట్ యూనివర్సిటీ : జేఎన్‌యూ (న్యూఢిల్లీ)
విజిటర్స్ అవార్డు ఫర్ ఇన్నోవేషన్ : దీపక్ పంత్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్
విజిటర్స్ అవార్డు ఫర్ రీసర్చ్: శ్యాం సుందర్ (బనారస్ హిందూ యూనివర్సిటీ), నిరంజన్ కరక్ (తేజ్‌పూర్ యూనివర్సిటీ)
క్విక్ రివ్యూ:ఏమిటి : విజిటర్స్ అవార్డులు - 2017
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : బెస్ట్ యూనివర్సిటీ అవార్డు : జేఎన్‌యూ (న్యూఢిల్లీ)
ఎందుకు : కేంద్రీయ వర్సిటీల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొల్పడానికి
జీహెచ్‌ఎంసీకి రామచంద్రన్ అవార్డుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC వి.రామచంద్రన్ అవార్డు-2017కు ఎంపికైంది. ఈ మేరకు మార్చి 2న న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో జీహెచ్‌ఎంసీ ప్రతినిధి పురస్కారం అందుకున్నారు.
ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహిస్తున్న ‘ఏరియా సభ’లకుగాను ఈ అవార్డు దక్కింది. జనాగ్రహ్ సెంటర్ ఫర్ సిటిజన్, డెమోక్రసీ సంస్థ ఏటా పలు విభాగాల్లో వి.రామచంద్రన్ అవార్డులను అందజేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : జీహెచ్‌ఎంసీకి రామచంద్రన్ అవార్డు - 2017
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : జనాగ్రహ్ సెంటర్ ఫర్ సిటిజన్, డెమోక్రసీ సంస్థ
ఎందుకు : ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహిస్తున్న ‘ఏరియా సభ’లకు
బాజీరావు మస్తానీకి ర్యాపిడ్ లయన్ అవార్డులు బాలీవుడ్ చిత్రం బాజీరావు మస్తానీ దక్షిణాఫ్రికా చిత్రోత్సవాల్లో ర్యాపిడ్ లయన్ ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపికైంది. దీంతో పాటు మరో నాలుగు విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. ఈ మేరకు మార్చి 2న జోహెన్నస్‌బర్గ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీ, ఉత్తమ నటిగా దీపికా పదుకొనే, ఉత్తమ సినిమా ఎడిటింగ్‌కు రాజేశ్ పాండే, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో సుదీప్ చటర్జీకి అవార్డులు వచ్చాయి.
ఆఫ్రికా దేశాల్లోని సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలనే ఆలోచనతో ర్యాపిడ్ లయన్ అవార్డులను ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ర్యాపిడ్ లయన్ అవార్డు - బాజీరావ్ మస్తానీ
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : జోహెన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
ఎవరు : దక్షిణాఫ్రికా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కమిటీ
సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డుతెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు జైపూర్‌లో మార్చి 3న జరిగిన ‘ఈ - ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్’లో కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సైబరాబాద్ సీపీగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా చేపట్టిన వినూత్న పద్ధతులకు గాను (అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం) ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు - 2017
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎందుకు : విధుల్లో వినూత్న పద్ధతులు చేపట్టినందుకు
ఏపీజీవీబీకి అసోచాం అవార్డుఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు-APGVBకి రెండు అసోచామ్ అవార్డులు దక్కాయి. 2016 సంవత్సరానికి గాను అగ్రికల్చర్ బ్యాంకింగ్ విభాగంలో సోషల్ బ్యాంకింగ్ ఎక్సలెన్‌స అవార్డుతోపాటు బెస్ట్ సోషల్ బ్యాంకు విభాగంలో రన్నరప్ పురస్కారం దక్కింది. ఈ మేరకు మార్చి 3న ముంబైలో జరిగిన అసోచాం 12వ వార్షిక బ్యాంకింగ్ సమ్మిట్‌లో అవార్డులు అందజేశారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : APGVBకి సోషల్ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు-2016
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : అసోచాం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐపీఈ ఎక్స్‌లెన్స్ అవార్డు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ విజిలెన్‌స ఎక్స్‌లెన్‌స అవార్డు లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో మార్చి 3న జరిగిన కాంక్లేవ్ ఆఫ్ విజిలెన్‌స ఆఫీసర్స్ సదస్సులో కేంద్ర విజిలెన్‌స కమిషనర్ కేవీ చౌదరి చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ చీఫ్ విజిలెన్‌స అధికారి బి.సిద్ధార్థ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక నిఘా చర్యల్లో ప్రతిభ చూపే సంస్థలకు ఏటా ఈ అవార్డులను ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ విజిలెన్‌స ఎక్స్‌లెన్‌స అవార్డు - 2017
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-IPE, హైదరాబాద్
ఎందుకు : అవినీతి నిరోధక నిఘా చర్యల్లో ప్రతిభకు
తెలంగాణ మహిళా అవార్డులు - 2017 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2017 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం మహిళా అవార్డులను ప్రకటించింది. 13 రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన 24 మందిని ఉత్తమ మహిళ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
ఉత్తమ మహిళలు - 2017
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలంగాణ మహిళా అవార్డులు - 2017
ఎప్పుడు : మార్చి 8 (మహిళా దినోత్సవం)
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : వివిధ విభాగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా
ముగ్గురు శాస్త్రవేత్తలకు బ్రెయిన్ ప్రైజ్కోరికలు, నిర్ణయాలు తీసుకోవడం, మనోవైకల్యం వంటి అన్ని అంశాల వెనుక మెదడులోని నాడీ నిర్మాణాల పాత్ర (మెదడు రివార్డు వ్యవస్థ)ను విశ్లేషించిన శాస్త్రవేత్తలు పీటర్ డయాన్, రాయ్‌డోలన్, వోల్‌ఫ్రమ్ షల్జ్‌లు సంయుక్తంగా మార్చి 6న ప్రతిష్టాత్మక బ్రెయిన్ ప్రైజ్ అందుకున్నారు. ఈ ముగ్గురు 30 ఏళ్లుగా మెదడు పనితీరుపై పరిశోధనలు జరుపుతున్నారు. డెన్మార్క్‌లోని లండ్‌బెక్ ఫౌండేషన్ నాడీ కణశాస్త్రంలో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును అందిస్తోంది.
హైదరాబాద్ డీఈవో రమేశ్‌కు జాతీయ అవార్డుహైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కు విద్య పరిపాలనలో ఆవిష్కరణల విభాగంలో జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు మార్చి 7న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి ఆయన అవార్డు అందుకున్నారు. గతేడాది రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేసిన రమేశ్.. వాట్సాప్ ద్వారా ఆంగ్ల సంభాషణపై టీచర్లకు శిక్షణ నివ్వడం, సందేహాలను నివృత్తి చేయడం, విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై అవగాహన కల్పించే అంశాలను నిర్దేశించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కమ్యూనిటీ మొబిలై జేషన్ విభాగంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ ఎంఈవో శంకర్ రాథోడ్‌కు కూడా జాతీయ అవార్డు వచ్చింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : హైదరాబాద్ డీఈవో రమేశ్‌కు జాతీయ అవార్డు
ఎప్పుడు : మార్చి 7
ఎక్కడ :న్యూఢిల్లీ
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
ఎందుకు : విద్య బోధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినందుకు

పేరు | రంగం |
బి.కొడనన్యగయ్ | ఇస్రో శాస్త్రవేత్త |
అనట్టా సోనే | ఇస్రో శాస్త్రవేత్త |
సుభా వారియర్ | ఇస్రో శాస్త్రవేత్త |
త్రిపునితుర కథాకళి బృందం | కథాకళి నృత్యం |
అమృత పాటిల్ | తొలి మహిళా గ్రాఫిక్ నావెలిస్ట్ |
ముంతాజ్ ఖాజీ | ఆసియాలో తొలి డీజిల్ రైలు నడిపిన మహిళ |
అక్కినేని అమల | సమాజ సేవ |

ఉత్తమ చిత్రం | : ఈగ |
ద్వితీయ ఉత్తమ చిత్రం | : మిణుగురులు |
తృతీయ ఉత్తమ చిత్రం | :మిథునం |
ఉత్తమ దర్శకుడు | : రాజమౌళి ( ఈగ ) |
ఉత్తమ నటుడు | : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు) |
ఉత్తమ నటి | : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు) |
ఉత్తమ విలన్ | : సుదీప్ (ఈగ) |
ఉత్తమ సహాయ నటుడు | :అజయ్ (ఇష్క్) |
ఉత్తమ సహాయ నటి | :శ్యామలా దేవి (వీరంగం) |
ఉత్తమ హాస్య నటుడు | :రఘుబాబు (ఓనమాలు) |
ఉత్తమ బాలనటుడు | :దీపక్ సరోజ్ (మిణుగురులు) |
ఉత్తమ బాలనటి | : రుషిణి ( మిణుగురులు) |
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు | :అయోద్య కుమార్ ( మిణుగురులు ) |
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ | : రాజమౌళి (ఈగ) |
ఉత్తమ కథా రచయిత | : అయోద్య కుమార్ ( మిణుగురులు) |
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | : సెంథిల్ కుమార్ (ఈగ) |
ఉత్తమ గాయకుడు | : శంకర్ మహదేవన్ ( ఒక్కడే దేవుడు, శిరిడి సాయి) |
ఉత్తమ గాయని | :గీతామాధురి (యదలో నదిలాగ, గుడ్ మార్నింగ్) |
ఉత్తమ కళాదర్శకుడు | :ఎస్ రామకష్ణ ( అందాల రాక్షసి) |
ఉత్తమ కొరియోగ్రాఫర్ | :జానీ ( మీ ఇంటికి ముందో గేటు, జులారుు) |
ఉత్తమ ఆడియో గ్రాఫర్ | :కడియాల దేవీ కష్ణ (ఈగ) |
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | :తిరుమల (కష్ణంవందే జగద్గురుం) |
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | :చిట్టూరి శ్రీనివాస్ ( కష్ణంవందే జగద్గురుం) |
ఉత్తమ మాటల రచయిత | :తనికెళ్ల భరణి (మిథునం) |
ఉత్తమ గేయ రచయిత | :అనంత్ శ్రీరామ్ (కోటికోటి తారల్లోనా-ఎటో వెళ్లిపోరుుంది మనసు) |
ఉత్తమ సంగీత దర్శకుడు | :కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోరుుంది మనసు) |
ఉత్తమ ఎడిటర్ | : కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ) |
ఉత్తమ ఫైట్స్ | : గణేష్ ( ఒక్కడినే) |
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ | :ఆర్ సీ యం రాజు (మిణుగురులు) |
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ | :శిల్ప (వీరంగం) |
ఉత్తమ విజువల్ ఎఫెక్‌టస్ | : మకుట విఎఫ్‌ఎక్స్ ( ఈగ) |
ఎస్వీ రంగారావు పురస్కారం | :ఆశిష్ విద్యార్థి (మిణుగురులు) |
2013 నంది అవార్డుల విజేతలు
ఉత్తమ చిత్రం | :మిర్చి |
రెండో ఉత్తమ చిత్రం | :నా బంగారు తల్లి |
మూడో ఉత్తమ చిత్రం | : ఉయ్యాల జంపాల |
ఉత్తమ కుటుంబ కథా చిత్రం | : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు |
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం | :అత్తారింటికి దారేది |
ఉత్తమ హీరో | :ప్రభాస్ (మిర్చి) |
ఉత్తమ హీరోయిన్ | : అంజలి పాటిల్ (నా బంగారు తల్లి) |
ఉత్తమ దర్శకుడు | :దయా కొడవగంటి (అలియాస్ జానకి) |
ఉత్తమ సంగీత దర్శకుడు | : దేవీ శ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది) |
ఉత్తమ సహాయ నటుడు | : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) |
ఉత్తమ సహాయ నటి | :నదియా (అత్తారింటికి దారేది) |
ఎస్వీ రంగారావు పురస్కారం | |
ఉత్తమ హాస్య నటుడు | :తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) |
ఉత్తమ విలన్ | : సంపత్ రాజ్ (మిర్చి) |
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు | :కొరటాల శివ (మిర్చి) |
ఉత్తమ మాటల రచయిత | :త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అత్తారింటికి దారేది) |
ఉత్తమ గేయ రచయిత | :సిరివెన్నెల సీతారామశాస్త్రీ ( మరీ అంతగా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు) |
ఉత్తమ గాయకుడు | : కై లాష్ ఖేర్ ( పండగలా దిగివచ్చాడు, మిర్చి) |
ఉత్తమ గాయని | : కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య) |
ఉత్తమ ఎడిటర్ | :ప్రవీణ్ పూడి (కాళీచరణ్) |
ఉత్తమ బాల నటుడు | :విజయ సింహారెడ్డి ( భక్త సిరియాల్) |
ఉత్తమ బాల నటి | :ప్రణవి ( ఉయ్యాల జంపాల) |
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | :మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) |
ఉత్తమ కథా రచయిత | : ఇంద్రగంటి మోహనకష్ణ (అంతకు ముందు ఆ తరువాత) |
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | : మురళీమోహన్ రెడ్డి (కమలతో నా ప్రయాణం) |
ఉత్తమ కళాదర్శకుడు | :ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి) |
ఉత్తమ కొరియోగ్రాఫర్ | :శేఖర్ వీజే (గుండెజారి గల్లంతరుు్యందే) |
ఉత్తమ ఆడియోగ్రాఫర్ | :ఇ రాధాకష్ణ ( బసంతి) |
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | :తిరుమల ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య) |
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | : శివ కుమార్ ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య) |
ఉత్తమ ఫైట్ మాస్టర్ | : వెంకట్ నాగ్( కాళీచరణ్ ) |
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ | : పీజే రవి ( బొమన్ ఇరానీ, అత్తారింటికి దారేది) |
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్ | :మిత్రా వరుణ మహి (ఉయ్యాల జంపాల) |
ఉత్తమ విజువల ఎఫెక్ట్స్ | : యతిరాజ్ ( సాహసం ) |
క్రిస్టినా గ్రిమ్మీకి టీన్‌స చాయిస్ అవార్డు 2017 టీన్‌స చాయిస్ అవార్డు ప్రముఖ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీకి దక్కింది. 2016 జూన్‌లో ఓర్లాండలోని ఓ నైట్ క్లబ్‌పై సాయుధుడు జరిపిన కాల్పుల్లో క్రిస్టినా మరణించింది. మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో క్రిస్టినా తరపున ఆమె కుటుంబ సభ్యులు టీన్స్ చాయిస్ అవార్డు అందుకున్నారు.
జేఎన్‌యూకు ఉత్తమ వర్సిటీ అవార్డు 2017 విజిటర్స్ అవార్డులను రాష్ట్రపతి భవన్ మార్చి 2న ప్రకటించింది. ఉత్తమ విశ్వవిద్యాలయం పురస్కారం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-JNUకు దక్కింది. ఈ నెల 6న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్రీయ వర్సిటీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2014లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులను ప్రారంభించారు.
అవార్డుల విజేతలు విజిటర్స్ అవార్డు ఫర్ బెస్ట్ యూనివర్సిటీ : జేఎన్‌యూ (న్యూఢిల్లీ)
విజిటర్స్ అవార్డు ఫర్ ఇన్నోవేషన్ : దీపక్ పంత్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్
విజిటర్స్ అవార్డు ఫర్ రీసర్చ్: శ్యాం సుందర్ (బనారస్ హిందూ యూనివర్సిటీ), నిరంజన్ కరక్ (తేజ్‌పూర్ యూనివర్సిటీ)
క్విక్ రివ్యూ:ఏమిటి : విజిటర్స్ అవార్డులు - 2017
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : బెస్ట్ యూనివర్సిటీ అవార్డు : జేఎన్‌యూ (న్యూఢిల్లీ)
ఎందుకు : కేంద్రీయ వర్సిటీల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొల్పడానికి
జీహెచ్‌ఎంసీకి రామచంద్రన్ అవార్డుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC వి.రామచంద్రన్ అవార్డు-2017కు ఎంపికైంది. ఈ మేరకు మార్చి 2న న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో జీహెచ్‌ఎంసీ ప్రతినిధి పురస్కారం అందుకున్నారు.
ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహిస్తున్న ‘ఏరియా సభ’లకుగాను ఈ అవార్డు దక్కింది. జనాగ్రహ్ సెంటర్ ఫర్ సిటిజన్, డెమోక్రసీ సంస్థ ఏటా పలు విభాగాల్లో వి.రామచంద్రన్ అవార్డులను అందజేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : జీహెచ్‌ఎంసీకి రామచంద్రన్ అవార్డు - 2017
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : జనాగ్రహ్ సెంటర్ ఫర్ సిటిజన్, డెమోక్రసీ సంస్థ
ఎందుకు : ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహిస్తున్న ‘ఏరియా సభ’లకు
బాజీరావు మస్తానీకి ర్యాపిడ్ లయన్ అవార్డులు బాలీవుడ్ చిత్రం బాజీరావు మస్తానీ దక్షిణాఫ్రికా చిత్రోత్సవాల్లో ర్యాపిడ్ లయన్ ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపికైంది. దీంతో పాటు మరో నాలుగు విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. ఈ మేరకు మార్చి 2న జోహెన్నస్‌బర్గ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీ, ఉత్తమ నటిగా దీపికా పదుకొనే, ఉత్తమ సినిమా ఎడిటింగ్‌కు రాజేశ్ పాండే, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో సుదీప్ చటర్జీకి అవార్డులు వచ్చాయి.
ఆఫ్రికా దేశాల్లోని సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలనే ఆలోచనతో ర్యాపిడ్ లయన్ అవార్డులను ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ర్యాపిడ్ లయన్ అవార్డు - బాజీరావ్ మస్తానీ
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : జోహెన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
ఎవరు : దక్షిణాఫ్రికా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కమిటీ
సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డుతెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు జైపూర్‌లో మార్చి 3న జరిగిన ‘ఈ - ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్’లో కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సైబరాబాద్ సీపీగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా చేపట్టిన వినూత్న పద్ధతులకు గాను (అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం) ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు - 2017
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎందుకు : విధుల్లో వినూత్న పద్ధతులు చేపట్టినందుకు
ఏపీజీవీబీకి అసోచాం అవార్డుఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు-APGVBకి రెండు అసోచామ్ అవార్డులు దక్కాయి. 2016 సంవత్సరానికి గాను అగ్రికల్చర్ బ్యాంకింగ్ విభాగంలో సోషల్ బ్యాంకింగ్ ఎక్సలెన్‌స అవార్డుతోపాటు బెస్ట్ సోషల్ బ్యాంకు విభాగంలో రన్నరప్ పురస్కారం దక్కింది. ఈ మేరకు మార్చి 3న ముంబైలో జరిగిన అసోచాం 12వ వార్షిక బ్యాంకింగ్ సమ్మిట్‌లో అవార్డులు అందజేశారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : APGVBకి సోషల్ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు-2016
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : అసోచాం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐపీఈ ఎక్స్‌లెన్స్ అవార్డు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ విజిలెన్‌స ఎక్స్‌లెన్‌స అవార్డు లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో మార్చి 3న జరిగిన కాంక్లేవ్ ఆఫ్ విజిలెన్‌స ఆఫీసర్స్ సదస్సులో కేంద్ర విజిలెన్‌స కమిషనర్ కేవీ చౌదరి చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ చీఫ్ విజిలెన్‌స అధికారి బి.సిద్ధార్థ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక నిఘా చర్యల్లో ప్రతిభ చూపే సంస్థలకు ఏటా ఈ అవార్డులను ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ విజిలెన్‌స ఎక్స్‌లెన్‌స అవార్డు - 2017
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-IPE, హైదరాబాద్
ఎందుకు : అవినీతి నిరోధక నిఘా చర్యల్లో ప్రతిభకు
తెలంగాణ మహిళా అవార్డులు - 2017 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2017 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం మహిళా అవార్డులను ప్రకటించింది. 13 రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన 24 మందిని ఉత్తమ మహిళ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
ఉత్తమ మహిళలు - 2017
విభాగం
|
పేరు
|
విశిష్ట ప్రతిభ
|
విద్య
|
విద్యావతి
|
ప్రథమ మహిళా వీసీ(కేయూ)
|
సామాజిక సేవ
|
జానకి
|
చెవిటి, మూగ విద్యార్థుల కోసం పాఠశాల నిర్వహణ
|
టి. దేవకీదేవి
|
తెలంగాణ ఉద్యమకారిణి
| |
గాయత్రి
|
వికలాంగ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు
| |
కుర్మ లక్ష్మీబాయి
|
భూమి కోసం పోరాడి సాధించుకున్న మహిళ
| |
వ్యవసాయం
|
డి.సుగుణమ్మ
|
సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక దిగుబడి సాధించిన మహిళ
|
నాగమణి
|
మహిళా రైతులకు రోల్ మోడల్
| |
తెలంగాణ ఉద్యమం
|
ఎస్.మీనమ్మ
|
ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మహిళ
|
దాత్రిక స్వప్న
|
ఉద్యమంలో భాగంగా ఓయూలో గాయపడ్డ విద్యార్థిని
| |
మూల విజయారెడ్డి
|
ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మహిళ
| |
ప్రొఫెషనల్ సర్వీస్
|
ప్రమీల
|
ప్రఖ్యాత న్యాయవాది, ఉద్యమకారిణి
|
సాహిత్యం
|
అనిశెట్టి రజిత
|
ప్రఖ్యాత రచయిత్రి
|
షాజహానా
|
ప్రఖ్యాత రచయిత్రి
| |
నృత్యం
|
వనజ ఉదయ్
|
నృత్యకారిణి, తెలుగు విశ్వవిద్యాలయంలో హెచ్‌వోడీ
|
చిత్రకళ
|
అంజనీరెడ్డి
|
ప్రముఖ పెయింటర్
|
మ్యూజిక్
|
పాయల్
|
కోట్గరీకర్ ప్రముఖ తబలా ప్లేయర్
|
గానం
|
చైతన్య
|
తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన మహిళ
|
స్వర్ణ
|
తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన మహిళ
| |
క్రీడలు
|
ప్రియదర్శిని
|
కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన మహిళ
|
జర్నలిజం
|
మాడపాటి సత్యవతి
|
రేడియోలో మొదటి న్యూస్‌రీడర్
|
కట్ట కవిత
|
ప్రముఖ జర్నలిస్టు
| |
జి.మల్లీశ్వరి
|
మొదటి వీడియో జర్నలిస్టు
| |
నగదు రహిత సేవలు
|
ఎం.పద్మ
|
నూరుశాతం నగదు రహిత సేవల్ని తీసుకొచ్చిన సర్పంచ్ (గొల్లపల్లి, కరీంనగర్)
|
కుంబాల లక్ష్మి
|
నూరుశాతం నగదు రహిత సేవల్ని తీసుకొచ్చిన సర్పంచ్ (ఇబ్రహీంనగర్, సిద్ధిపేట్)
|
ఎప్పుడు : మార్చి 8 (మహిళా దినోత్సవం)
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : వివిధ విభాగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా
ముగ్గురు శాస్త్రవేత్తలకు బ్రెయిన్ ప్రైజ్కోరికలు, నిర్ణయాలు తీసుకోవడం, మనోవైకల్యం వంటి అన్ని అంశాల వెనుక మెదడులోని నాడీ నిర్మాణాల పాత్ర (మెదడు రివార్డు వ్యవస్థ)ను విశ్లేషించిన శాస్త్రవేత్తలు పీటర్ డయాన్, రాయ్‌డోలన్, వోల్‌ఫ్రమ్ షల్జ్‌లు సంయుక్తంగా మార్చి 6న ప్రతిష్టాత్మక బ్రెయిన్ ప్రైజ్ అందుకున్నారు. ఈ ముగ్గురు 30 ఏళ్లుగా మెదడు పనితీరుపై పరిశోధనలు జరుపుతున్నారు. డెన్మార్క్‌లోని లండ్‌బెక్ ఫౌండేషన్ నాడీ కణశాస్త్రంలో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును అందిస్తోంది.
హైదరాబాద్ డీఈవో రమేశ్‌కు జాతీయ అవార్డుహైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కు విద్య పరిపాలనలో ఆవిష్కరణల విభాగంలో జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు మార్చి 7న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి ఆయన అవార్డు అందుకున్నారు. గతేడాది రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేసిన రమేశ్.. వాట్సాప్ ద్వారా ఆంగ్ల సంభాషణపై టీచర్లకు శిక్షణ నివ్వడం, సందేహాలను నివృత్తి చేయడం, విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై అవగాహన కల్పించే అంశాలను నిర్దేశించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కమ్యూనిటీ మొబిలై జేషన్ విభాగంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ ఎంఈవో శంకర్ రాథోడ్‌కు కూడా జాతీయ అవార్డు వచ్చింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : హైదరాబాద్ డీఈవో రమేశ్‌కు జాతీయ అవార్డు
ఎప్పుడు : మార్చి 7
ఎక్కడ :న్యూఢిల్లీ
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
ఎందుకు : విద్య బోధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినందుకు
No comments:
Post a Comment